
వేమూరు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దగ్ధం చేయటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.
సాక్షి, గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దగ్ధం చేయటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించి పక్కనే ఉన్న జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ నాయకులు.. మా కార్యకర్తలపై కేసు పెట్టడానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు.
ఇదేనా మీ పాలన అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను దుయ్యబట్టారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలపైన దాడులు చేయడానికా...? మహా నాయకుల విగ్రహాలు తగలబెట్టడానికా...? ప్రజలు మీపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ మేరుగ నాగార్జున హెచ్చరించారు.
బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు.