
కనకదుర్గ వారధిపై సీఎం జగన్ బస్సు యాత్ర
విజయవాడలోకి ప్రవేశించనున్న బస్సు యాత్ర
సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధం
మేమంతా సిద్ధం అంటోన్న బెజవాడ వాసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. దీనిలో భాగంగా కనకదుర్గ వారధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది.
సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి వైఎస్సార్‌సిపి ఘనంగా సిద్ధమయింది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వారధి వద్దకు వైఎస్సార్‌సీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. విజయవాడలో జోరుగా వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా సీఎం జగన్ కోసం వర్షంలోనూ ఎదురుచూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
మరో వైపు ఇన్నాళ్లు బ్లేజ్‌వాడగా కనిపించిన బెజవాడ.. కాస్తా మేఘావృతమయింది. సీఎం జగన్ బస్సు యాత్ర తీసుకొస్తున్న సంతోషం వర్షం రూపంలో వచ్చిందంటున్నారు స్థానికులు.
విజయవాడ నగరంలోని వైఎస్సార్‌సిపి శ్రేణులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు తరలివచ్చారు జనం. రాష్ట్ర చరిత్రలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.
వారధి దగ్గర ఇప్పటికే భారీగా జన సందోహం నెలకొంది. సీఎం జగన్‌ను నేరుగా కలుసుకునేందుకు భారీగా జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.