
సాక్షి, విశాఖపట్నం: ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇంట్లో దాక్కుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా?
తన నియోజకవర్గానికి అయ్యన్నపాత్రుడు ఏం చేశాడు?. మీరెప్పుడు ఊహించని రీతిన సీఎం జగన్ నర్సీపట్నం సమీపంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో అయ్యన్న చంద్రబాబుకు సహకరించారు. అయ్యన్న సైకో. ఆయన ప్రవర్తన నర్సీపట్నం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని ముత్యాలనాయుడు అన్నారు.