Ayyanna patrudu
-
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్‌లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు
సాక్షి, అమరావతి : తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరికను పరిశీలించడం సాధ్యం కాదని శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై ఆయన రూలింగ్ ఇచ్చారు. ‘శాసనసభ అనేది ప్రజలు అనే దేవుళ్లు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. స్పీకర్‌గా నా బాధ్యత ఈ దేవాలయానికి పూజారిగా పని చేయడం మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వజాలడు’ అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది జూన్ 24 తేదీన రాసిన లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం అన్నాడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ద వాదనలు చేస్తున్నారని, లేఖలో ఎక్కడా ప్రత్యేక అభ్యర్థన లేదని తెలిపారు. లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉందని చెప్పారు. అయితే ఇటీవల ఈ అంశంపై జగన్మోహన్రెడ్డి, వారి పార్టీ నాయకులు.. ఉత్తర్వులు జారీ చేయాలంటూ స్పీకర్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసిందని ప్రచారం చేస్తున్నట్టు వార్తలు రావడంతో తప్పుడు ప్రచారానికి రూలింగ్ ద్వారా తెరదించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఈ రూలింగ్‌లో స్పీకర్ ఇంకా ఏమన్నారంటే.. కనీసం 18 మంది సభ్యులుండాలి‘జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు జూన్ 26 తేదీ వరకు మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు, జూన్ 26 కంటే ముందు, అందునా స్పీకర్ ఎన్నిక జరక్కముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? జగన్మోహన్రెడ్డి తన లేఖలో పేర్కొన్న ఎన్నో అంశాలు సత్యదూరాలు. వాస్తవాలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే, 175 మంది సభ్యులున్న నేటి రాష్ట్ర శాసనసభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు. ఈ విషయమై స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు. -
బారువడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.. అయ్యన్నకు మాస్ వార్నింగ్
-
నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది. ⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న గిరిజనులు
-
అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన.. ఏజెన్సీ బంద్
సాక్షి, అల్లూరి జిల్లా: పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్‌ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనలకు దిగాయి. అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్‌లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్‌ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. -
మా ప్రాంతంలో అయ్యన్న పాత్రుడు అడుగు పెడితే..
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
-
అయ్యన్న వ్యాఖ్యలతో విస్మయానికి గురైన టీడీపీ నేతలు
-
పింఛన్ లబ్ధిదారులను దొంగలతో పోల్చిన స్పీకర్
-
అయ్యన్న పాత్రుడు పై అంబటి రాంబాబు ఫైర్
-
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్ మందలింపు
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..ఇవాళ నాలుగో రోజు సెషన్లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు. అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్లో కూర్చున్నారు. ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు. -
కూటమి ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న అసహనం
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. -
అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
-
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం. -
ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి గణేష్ అదిరిపోయే కౌంటర్
-
"నేను స్పీకర్..మీ అంతు చూస్తా.." అధికారులపై అయ్యన్న ఫైర్
-
అరుపులు.. కేకలు.. మరోసారి రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు దిగారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుపోయాయా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బూతు పదం వాడుతూ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో నేను స్పీకర్‌ను అవుతున్నాను. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకొద్దీ నిలబెడతానంటూ హెచ్చరించారు. అయ్యన్న తీరుతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. -
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
సీఎం రమేష్ రౌడీయిజం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ మాజీ నేత, బీజేపీ ప్రస్తుత నేత సీఎం రమేష్ తన మార్క్ రౌడీ రాజకీయాలకు తెరతీశారు. అనకాపల్లి జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు నిర్వహించకుండా ముందస్తుగానే అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల వద్దకు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ ప్రశి్నస్తున్నారు. ఎదురుదాడికి మించిన ఆత్మరక్షణ లేదనే ధోరణితో ఎన్నికల్లో తాము చేసే అక్రమాలకు అడ్డురాకూడదనే ఆలోచనతో ఈ తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనకాపల్లిలోని లాడ్జీల్లో కడప నుంచి వచ్చిన అనుచరులు మకాం వేసి హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుతో తనకున్న పాత పరిచయాలతో ఇద్దరూ కలిసి నోటికి పనిచెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నకు భారీ ప్యాకేజీని సీఎం రమేష్ అందించారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో తాము చేసే విచ్చలవిడి అరాచకాలకు అడ్డులేకుండా చూసుకునేందుకే.. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకట్ట వేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రమేష్ రాకతో అలజడి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన నర్సీపట్నంలో చీరల పంపిణీని అడ్డుకున్న పోలీసులపై చిందులేస్తున్న కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ కోతికి కొబ్బరి చిప్ప! అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇష్టారీతిలో చెలరేగి అధికారులపై మాటల దాడికి దిగుతున్నారు. ఇప్పుడు కల్లు తాగిన కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా... ఈయనకు కాస్తా సీఎం రమేష్ జతకలిశారు. దీంతో నోటికి అదుపులేకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం చోడవరంలోని ఒక షాపులో పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు వస్తే.. వెంటనే సీఎం రమేష్ రంగంలోకి దిగారు. అధికారులు తనిఖీలు చేయవద్దంటూ అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు దిగారు. తాజాగా నర్సీపట్నంలో నోట్లు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచేందుకు కూటమి చేసే ప్రయత్నాలపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. వెంటనే ఒకవైపు సీఎం రమేష్... మరోవైపు అయ్యన్నపాత్రుడులు అధికారులపై మాటల దాడికి దిగారు. తనిఖీలు ఎలా చేస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీపై పరుష వ్యాఖ్యలు ఇక అయ్యన్న ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలు వెధవలు అంటూ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులు తనిఖీలకు వస్తే అభ్యర్థులు సహకరించడం సహజం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఇద్దరూ అడ్డగోలుగా అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే బెదిరింపుల ద్వారా లబ్ధి పొందేందుకు ఆ ఇద్దరూ ప్రయతి్నస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడ్జీల్లో మకాం! స్థానికంగా కనీసం ఒక్క ఓటరూతోనూ పరిచయం లేని సీఎం రమే‹Ù... కేవలం రౌడీయిజం ద్వారానే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలోని లాడ్జీల్లో ఇప్పటికే 200 మందికిపైగా తన అనుచరులు మకాం వేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకూ అనకాపల్లిలోని లాడ్జీలను బుకింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ వరకూ ఇక్కడే మకాం వేసి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మరోవైపు మొదటగా సీఎం రమేష్ నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ, జనసేన నాయకులను కలిసి తమకు సహకరించాలంటూ భారీగానే ప్యాకేజీని ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీఎం రమేష్ రాక సందర్భంగా హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయ్యన్నకు నోట్ల కట్టలు? ఇన్నాళ్లూ అనకాపల్లి ఎంపీ సీటు స్థానికుడికి ఇవ్వాలని హడావుడి చేసిన అయ్యన్న.. సీఎం రమేష్ విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడడంలేదు. పైగా అయ్యన్ననే వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే అయ్యన్నకు ప్యాకేజీ ముట్టిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు రౌడీయిజం.. మరోవైపు నోట్ల కట్టల ద్వారా ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలపై అనకాపల్లి జిల్లాలో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో వీరి రాకతో రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న ఓటర్లు అందరివాడు, సౌమ్యుడు బూడి ముత్యాలనాయుడుతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోడవరంలో కేసు నమోదు జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) అధికారుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసినందుకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమే‹Ù, టీడీపీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చోడవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పాటు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ధిక్కరించడం, విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. -
జనసేన...వేసెయ్ టీడీపీ కండువా
నర్సీపట్నం : ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కండువాల రాజకీయానికి తెరలేపారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇరుపార్టీలు వలసలు ప్రోత్సహించుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. కానీ అయ్యన్నపాత్రుడు మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులను టీడీపీలో చేర్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న జనసేన క్యాడర్‌కు అయ్యన్నపాత్రుడు వ్యవహారశైలి మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అయ్యన్నపాత్రుడు చోటామోటా నాయకులకు కండువాలు వేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ప్రోత్సహిస్తున్న వలసలతో నియోజకవర్గంలో జనసేన కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి గ్రామానికి చెందిన గజాల నాగరత్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర, పూడి చక్రవర్తి, అద్దేపల్లి గణేష్ నాగరత్నంను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ దంపతులు గజాల నాగరత్నం, సూరిబాబుతో పాటు నలుగురు వార్డు మెంబర్లు మంగళవారం అయ్యన్నపాత్రుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మిత్ర ధర్మానికి అయ్యన్నపాత్రుడు తూట్లు పొడవడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. అయ్యన్నపాత్రుడు కండువా రాజకీయంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని చెబుతున్నారు. -
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
-
హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది...
అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు. బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు. ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు. -
రూటు మార్చిన నాగబాబు?
జనసేన లో పవన్ కళ్యాణ్ .. నాదెండ్ల మనోహర్ తరువాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా.. వాటిని సరిగా అమలు చేయలేకపోవడం .. స్థిరత్వం లేకపోవడం.. సరైన ప్రణాళిక... వ్యూహాలు కొరవడడంతో చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు.. గతంలో 2019 లో నరసాపురం నుంచి జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు.. అక్కడ రఘురామా కృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు.. ఈసారైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నది అయన ఆశగా కనిపిస్తోంది.. చిన్నా చితకా యాక్టర్లు.. ఛోటామోటాగాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేనూ గెలుస్తా అనే ధీమా ఆయనలో ఉన్నా.. తన కోరికను నెరవేర్చుకునే కృషి.. పట్టుదల.. అవేమి లేవు.. దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు.. ఈసారైనా గెలవాలన్న అయన లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.. అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చారని అంటున్నారు.. ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు . అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు అయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. అయన ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. దానికితోడు కాపు నాయకులూ.. వ్యాపారాలు.. పారిశ్రామికవేత్తలతోను సైతం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ... ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో అయన యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి.. యలమంచిలి నియోజకవర్గాల్లో అయన పర్యటిస్తున్నారు.. ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు... రాజీనామా చేసి జనసేనలో చేరారు.. అయన పెందుర్తిలో పోటీ చేస్తారని .. ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు. అయితే ఇదే పెందుర్తి టిక్కెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారు.. తన కొడుక్కి ఎంతమాత్రం టిక్కెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి బైరా దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్లో ఉన్నారు. తన కొడుక్కు టిక్కెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే అయ్యన్న ఊరుకుంటారా ? మరి ఆయన్ను ఎలా శాంత పరుస్తారన్నది తెలియడం లేదు. ఈసారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి.. - సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: ఢిల్లీలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్‌తో కొత్త రాయబారం! -
ఈ 420 గాడు మందు ఎక్కువై మాట్లాడుతున్నాడు: ఉమా శంకర్ ఫైర్
-
గాదిరాజు ప్యాలెస్ కేంద్రంగా పచ్చ మీడియా కుతంత్రం
-
మరోసారి బయటపడ్డ అయ్యన్నపాత్రుడి నోటి దురద
-
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీహెచ్ అయ్యన్నపాత్రుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులను అసభ్యంగా దూషించినందుకు ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నమో దు చేసిన ఐపీసీ సెక్షన్లు 505(2), 153ఏలు పిటి షనర్లకు వర్తించవన్నారు. అయ్యన్నవర్గ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, అసభ్య పదజాలం వాడలేదని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై మాత్రమే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అలాంటి భాషా ప్రయోగం మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులను దూషించడం అయ్యన్నకు అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి వారి విషయంలో కోర్టులు తగిన విధంగా స్పందించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్ అయ్యన్నకి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే! -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
వాడుకుని వదిలేశాడా? ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండ్
చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలో మరో నేత చేరారా? ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండిస్తున్నారా? నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్‌గా వాడుకుని ఇప్పుడు సీటు లేదంటున్నారా? చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం కలిగిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏంటి? అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు. గడచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు. అయ్యన్నను అడ్డుపెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు. తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు. చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు, తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు. అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు. కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు. అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేదిలేదని చెప్పడమే గాకుండా..ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరిచి ఇష్టానుసారంగా రెచ్చి పోయిన అయ్యన్నకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతోంది. చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలి పశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది. తన రాజకీయ ప్రత్యార్థులైన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని.. అదే తన ఇంట్లో తనకూ తన కుమారునికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు.. సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? గత ఎన్నికల్లో ఎంతోమంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని..చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారునికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు మాటలు విని నాలుగేళ్లపాటు ఇస్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బరితెగించి అయ్యన్న బూతు పురాణం
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్‌గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
ఈ సభా సాక్షిగా..అయ్యన్న పని అయిపాయె
-
అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..?
టీడీపీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతోందా? అయ్యన్నకు అడుగడుగానే అవమానాలేనా? కొడుకును ఎంపీగా చూసుకోవాలనే ఆశ అయ్యన్నకు నెరవేరదా? చంద్రబాబు నుంచి అయ్యన్న కుమారుడికి సీటు విషయంలో క్లారిటీ ఎందుకు రాలేదు. దీనికి అడ్డు పడుతున్నదెవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికత తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకుంటున్న అయ్యన్న.. తాను యాక్టివ్‌గా ఉండగానే కొడుకును ఎంపీగా చూడాలని కలలు కంటున్నారు. కాని ఆ కలలు కల్లలవుతాయేమోనని ఆయన ఆందోళన చెందుతున్నట్లు పచ్చ పార్టీలో టాక్ నడుస్తోంది. అనకాపల్లి నుంచి కొడుకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చంద్రబాబు పరిశీలిస్తున్న పేర్లంటూ రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో అయ్యన్న తన కొడుకు భవిష్యత్ గురించి బెంగ పడుతున్నారని టాక్. అచ్యుతాపురం సెజ్ లోని ఒక కంపెనీ అధిపతి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. అదేవిధంగా అనకాపల్లిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి పేరు కూడా టీడీపీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మధ్య పొత్తు కుదిరితే జనసేన కచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతుంది. ఎందుకంటే ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఒక వేళ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోయినా..ఆ సీటు కాపు సామాజికవర్గ నేతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమీకరణాల మధ్య తన కొడుక్కు సీటు రాకుండా పోతుందేమోనన్న బాధ అయ్యన్నను వేధిస్తోంది. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! తన సమకాలీకుడైన ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు కూడా టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకున్న తనకు మాత్రం రెండో సీటు సాధించుకోవడం అనేది కలగానే మిగులుతోందని అయ్యన వాపోతున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. తన తండ్రి రాజకీయ అనుభవం తన రాజకీయ ప్రవేశానికి సరిపోలేదని గ్రహించిన చింతకాయల విజయ్.. నారా లోకేష్ టీమ్‌లో చేరి ఐటీడీపీ పేరుతో టీడీపీ సోషల్ మీడియా నిర్వహిస్తూ.. రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసి వైఎస్ఆర్సీ నాయకత్వం, పోలీసులు దృష్టి తనపై పడేటట్లు చూసుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనకాపల్లి ఎంపీ సీటుపై మాత్రం తనకి క్లారిటీ రాకపోవడంపై తండ్రీ కొడుకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎంపీ సీటు మీద ఆశ పెట్టుకుని, చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు పరిస్థితులు ఆయనకు సానుకూలంగా కనిపించడంలేదు. చింతకాయల విజయ్ కు ఎంపీ సీటు ఇవ్వకపోతే నోటు దురుసు ఎక్కువున్న అయ్యన్న పార్టీలో రచ్చలేపుతారనే చర్చ తెలుగుదేశం పార్టీ నేతల్లోనే సాగుతోంది. చదవండి: మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు -
సుప్రీంకోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి చుక్కెదురు
-
ఫోర్జరీ కేసు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశ్చిమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. -
అయ్యన్నపాత్రుడుకి మతి భ్రమించింది: నారాయణ స్వామి కౌంటర్
సాక్షి, చిత్తూరు: టీడీపీ అయ్యన్నపాత్రుడిపై డిప్యూటీ నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సంస్కారం లేని వ్యక్తి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాగా, నారాయణ స్వామి మాట్లాడుతూ..‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. అయ్యన్నపాత్రుడు సంస్కారం లేని వ్యక్తి. ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తాను కాబోయే హోం మంత్రిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'అయ్యన్న పాత్రుడు సైకో, శాడిస్టు.. ఆయన చరిత్ర అందరికీ తెలుసు'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడును ఏకి పారేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు. జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లలా కాకుండా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుంది. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఓడిపోతామనే భయంతో అన్ని పార్టీల నేతల ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. రూ.470 కోట్లతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారు' అని ఉమా శంకర్ గణేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్‌గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో పదవులు అనుభవించిన కొంత మంది కోల్డ్ స్టోరేజీ, డార్క్ రూం లీడర్లు కలిసి ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట టీడీపీ వాయిస్ వినిపించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ చర్చా వేదికలో ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారన్నారు. విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా తీర్మానం చేసి, మిగతా అంశాలన్నీ చర్చించాల్సింది పోయి, అవేమీ లేకుండా తెలుగుదేశం టార్గెట్ చేసిన విధంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారని చెప్పారు. శనివారం ఆయన సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. తటస్థుల ముసుగులో టీడీపీ నాయకులే ఈ చర్చా వేదికలో ఉన్నారని, రాజకీయ విమర్శలు చేయడానికే ఉత్తరాంధ్ర చర్చ నిర్వహించారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన కొణతాల రామకృష్ణ ఈ చర్చా వేదికకు అధ్యక్షత వహించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. సీపీఐ రామకృష్ణ ‘చంద్రబాబు ఆఫ్ ఇండియా’గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వీరితో సహజీవనం సాగిస్తున్న నాదెండ్ల మనోహర్, ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు రాజకీయ మేధావులా? అని ప్రశ్నించారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుకి వయసు మీద పడిన దశలో అరగంట మాట్లాడిన తర్వాత కంట నీరు వస్తే అది భావోద్వేగానికి గురైనట్టు కొన్ని పచ్చ చా నళ్లు చూపించడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. మార్చి 31 తర్వాత విశాఖ నుంచే పరిపాలన ►మార్చి 31 తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములు దోచుకున్నది టీడీపీ నేతలే. గీతం యూనివర్సిటీ టీడీపీ నాయకులది కాదా? 45 వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ సెజ్.. మెడికల్ కళాశాలలు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? బాక్సై ట్ కోసం జీవో ఇచ్చింది ఎవరు? చింతపల్లిలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఆందోళనలో పాల్గొనడం మరిచిపోయారా? రూ.4 వేల కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడి, ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చాం. ►ఈనెల 6న గ్లోబల్ హెల్త్ సదస్సు జరిగింది. మార్చి 28, 29న, ఏప్రిల్ 24న జీ–20 సదస్సులున్నాయి. జనవరి 20, 21న ఐటీ సదస్సు ఏర్పాటు చేయనున్నాం. ఏపీలో బీఆర్ఎస్, కేఏ పాల్ గురించి మాట్లాడడం అనవసరం. టీడీపీ, ఎల్లో మీడియా జీవో నం.1ను వక్రీకరిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. చదవండి: (చరిత్ర అంటే ఏంటో తెలుసా బాలయ్య..?) -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు: డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చదవండి: అది రాజకీయ యాత్రే -
నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్
-
‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇంట్లో దాక్కుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా? తన నియోజకవర్గానికి అయ్యన్నపాత్రుడు ఏం చేశాడు?. మీరెప్పుడు ఊహించని రీతిన సీఎం జగన్ నర్సీపట్నం సమీపంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో అయ్యన్న చంద్రబాబుకు సహకరించారు. అయ్యన్న సైకో. ఆయన ప్రవర్తన నర్సీపట్నం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని ముత్యాలనాయుడు అన్నారు. -
అమాయక గిరిజనుడిని బలిగొన్న అయ్యన్న పాత్రుడి కుటుంబం !
-
‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో నక్కిన నర్సీపట్నం పిల్లి బయటకు రావాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. ‘మీ నాయకుడు లోకేశ్ నర్సీపట్నం పులిగా అభివర్ణిస్తున్నాడే. ఇంతకీ నువ్వు నర్సీపట్నం పులివా.. పిల్లివా లేదా ఊరకుక్కవా?. నీ మాటలు చూస్తే ఊరకుక్కలాగే ఉన్నాయి’ అని అయ్యన్నపాత్రుడిపై విరుచుకుపడ్డారు. శనివారం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. , గంజాయి మత్తులో అయ్యన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెన్ని భూకబ్జాలు చేశారో సిట్ త్వరలోనే తేలుస్తుందన్నారు. విశాఖలో భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
అయ్యన్న పాత్రుడు ఇంటికి మరోసారి పోలీసులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై ఏయూ జేఏసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జేఏసీ ఫిర్యాదు మేరకు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి త్రీటౌన్ పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంటిదగ్గర అయ్యన్న లేకపోవడంతో అయ్యన్న కుటుంబసభ్యులకు నోటీస్ విషయాన్ని పోలీసులు తెలియపర్చారు. చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న -
అయ్యన్న పాత్రుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణ స్వామి
-
అయ్యన్న లాంటి బఫూన్ ని పట్టించుకోనవసరం లేదు
-
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు టీడీపీ నాయకుల డ్రామా
-
అయ్యన్న బాగోతం.. మంత్రి అమర్నాథ్ ఏమన్నారంటే?
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈవో సాగర్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. మంత్రిని కలంకారి వస్త్రంతో సత్కరించి వినాయక ప్రతిమను బహుకరించారు. చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్న భూమినే ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అక్రమ మార్గంలో సాగే వారిని, సక్రమమైన మార్గంలో నడిచే వారు కాదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు చేపట్టిందన్నారు. ఆక్రమణలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఐనగలూరు రూ.700 కోట్లు పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే తిరుపతిలో ఐఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపన ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏపీని అగ్రగామి తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారన్నారు. -
ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన ఏయూ ప్రతిష్టను దిగజార్చేవిధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్విట్టర్లో పోస్టుచేసిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వారు నగర పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ – 1 గరుడ సుమిత్‌సునీల్‌కు ఫిర్యాదు లేఖ అందజేశారు. చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు గత 40 ఏళ్లగా ఏయూ పరిసర ప్రాంతాల్లో దట్టంగా తుప్పలు, చెట్లు, పొదలు ఉండడంతో అక్కడ ఆకతాయులు, అల్లరిమూకలు చేరి గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సేవించడానికి అనువైన ప్రదేశంగా మార్చుకుంటున్నారని.., అందుకే ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆ ప్రాంతాన్ని ‘నాడు – నేడు’ కార్యక్రమంలో భాగంగా నెల రోజులుగా శుభ్రం చేయిస్తున్నారని పేర్కొన్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు అవకాశమిచ్చేలా ఉన్న పొదలు, తుప్పలను తొలగించి క్రీడా మైదానంగా తయారుచేస్తుంటే దానిపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏయూపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు, ఉద్యోగుల్లో గ్రూప్‌లను సృష్టించి విధ్వంసకర వాతావరణాన్ని తీసుకొస్తున్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ జీఎల్ఎస్ రవికుమార్, ప్రొఫెసర్లు షారోన్‌రాజు, పుల్లారావు, సుబ్బారావు, ప్రేమానంద్, ఎన్ఏడీ పాల్, గెస్ట్ ఫ్యాకెల్టీ తుల్లి చంద్రశేఖర్ యాదవ్, విద్యార్థి నాయకులు బి.కాంతారావు, చరణ్, పీతాన్ ప్రసాద్, పవన్, రాజుగౌడ్, ఆనంద్రత్నకుమార్, శ్యాంసుందర్‌రావు, కళ్యాణ్, ఎంప్లాయిస్ నాయకులు త్రినాథరెడ్డి, రమాణారెడ్డి, లక్ష్మణరెడ్డి, రాంబాబు, లా కాలేజ్ విద్యార్థులు తదితరులు ఫిర్యాదు అందజేశారు. -
బురదపాములు బయటకొస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సొంత పార్టీలోని నేతలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడేళ్లుగా పుట్టలో దాక్కున్న బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబును హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మూడేళ్లుగా ఈ బురదపాములు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరుగుతున్న తెలుగునాడు స్టూడెంట్ ఫ్రంట్ (టీఎన్ఎస్ఎఫ్) శిక్షణ తరగతుల సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి బయటకు రాగా చర్చనీయాంశమయ్యాయి. -
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు
సాక్షి, అనకాపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. 304, 305, 188, 204 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. జాతర పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని పోలీసులు కోరడంతో రెచ్చిపోయిన అయ్యన్న నానా హంగామా సృష్టించారు. ఎస్సైని తోసేయడంతోపాటు, అసభ్యకరంగా మాట్లాడారు. మరో రెండేళ్లు అంటూ పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు. కాగా, అయ్యన్న పాత్రుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రజల్లోకి వెళ్లమని నా కుమారుడు చెబుతున్నాడు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నర్సీపట్నం: ‘పార్టీ అనుబంధ సంస్థలకు ఇన్చార్జిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంటి దగ్గరే కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని నా కుమారుడు దేవాన్ష్ అడుగుతున్నాడు. వాళ్ల తాతకు కూడా ఫిర్యాదు చేస్తున్నాడు’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కేసుల గురించి భయపడొద్దనీ.. తనపై కేసులున్నా భయపడటం లేదని అన్నారు. తన జీవితంలో జైలు మినహా అన్నీ చూశాననీ, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పారు. వచ్చే రెండేళ్లు ప్రజల్లో తిరుగుతాననీ, ఇంటికి అంతగా రానని భార్య బ్రాహ్మణికి కూడా చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లోకేశ్ నర్సీపట్నం వచ్చి పోలీసులపై తీవ్రంగా విమర్శలు చేశారు. అయ్యన్నపాత్రుడిపై 9 కేసులు పెట్టి పోలీసులు ఏం పీకారని ప్రశ్నించారు. తనపై 11 కేసులు పెట్టి ఏం పీకారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు. -
అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఆ బిల్లులన్నీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం: మంత్రి సురేశ్
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఆదివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంబందించిన బిల్లులను వంట వారికి, కాంట్రాక్టర్లకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. ‘బిల్లులను అప్లోడ్ చేసిన వెంటనే ఆటో డెబిట్ సిస్టం ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా సింగిల్ నోడల్ ఖాతాకు వచ్చిన బిల్లులన్నీ వంటవారి ఖాతాలకు బదిలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గోరుముద్దకు సంబంధించిన లావాదేవీలన్నీ సింగిల్ నోడల్ ఖాతాకు బదలాయించి ప్రతినెలా 7వ తేదీలోగా వంటవారికి, కాంట్రాక్టర్లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వారానికి 5 రోజులు కోడిగుడ్లతో పాటు చిక్కీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని మంత్రి సురేష్ వివరించారు. జగనన్న గోరుముద్ద పథకంలో పూర్తిగా మార్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని 15 రకాల వంటలతో 6 రోజులపాటు మెనూను తయారు చేశామని తెలిపారు.ఇవేమీ తెలియని అయ్యన్నపాత్రుడు భోజన పథకం బిల్లులు చెల్లించటం లేదని ఆరోపించటం సిగ్గు చేటని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
‘అయ్యన్న పోలీసులకు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు విజ్ఞతతో మాట్లాడాలని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షడు సత్యమూర్తి, కార్యదర్శి వైఆర్కే శ్రీనివాస్ అన్నారు. వారిద్దరూ గురువారం మీడియతో మాట్లాడుతూ.. అయ్యన్న మాటలు వీధి రౌడీలు ఉపయోగించే భాష కంటే నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన పిల్లలకు మాత్రమే అయ్యన్న తండ్రి అని.. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. అయ్యన్న పాత్రుడు అధికారంలో ఉండగా పోలీసు సేవలను ఎంతగానో ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. తన రాజకీయ ఉనికి కోసం పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు దుర్భషలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని.. అరాచకవాదిలా మాట్లాడొద్దని హితవు పలికారు. సరైన భాషలో మాట్లాడకపోతే ప్రజలే అయ్యన్నను పరుగెత్తించి కొడతారని హెచ్చరించారు. అయ్యన్నను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని తెలిపారు. పోలీసులకు అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసరమైతే అయ్యన్న పాత్రుడుపై ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు. -
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాగానే 90 శాతం హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటేనే చంద్రబాబు భయపడ్డారన్నారు. (చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు) ‘కరోనా పేరుతో ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై చంద్రబాబు ఎన్నో అడ్డంకులు యత్నించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇచ్చింది చంద్రబాబే. వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి వార్తలు రాస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే విజయం. పంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు వైఎస్సార్సీపీదే గెలుపు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని’’ గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘అయ్యన్న పాత్రుడు ఒక గంజాయి డాన్. ఎన్నికల ఫలితాలు పక్కదారి పట్టించేందుకు అయ్యన్నపాత్రుడుతో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేయించారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్న ఎందుకు నోరు మెదపడం లేదని’’ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చదవండి: టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదు: బొత్స -
ప్రజలు టీడీపీ జెండాను పీకిపడేశారు
-
వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లడం దండయాత్రా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్, మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దుర్భాషలాడుతూ చేసిన వ్యాఖ్యలను వివరించి.. పార్టీ పరంగా ఆయనపై చర్య తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం తాను చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పునరుద్ఘాటించారు. కానీ.. రెండు పచ్చ పత్రికలు ఒకే గొంతుకతో కూడబలుక్కుని ‘చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అనే శీర్షికతో నీచపు రాతలను అచ్చేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని.. కనీసం పచ్చ పత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారని తప్పుపట్టారు. వీటిని పరిశీలిస్తే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అది చంద్రబాబు స్క్రిప్టు ► రాజకీయ చరిత్రలో 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, చలించిపోయి అధికారంలోకి వచ్చాక.. వారికి అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌ను అయిదున్నర కోట్లమంది రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా గౌరవిస్తున్నారు. ► జనం మెచ్చేలా పాలన చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను, హోం మంత్రి అయిన దళిత మహిళను, మంత్రులను పచ్చ ప్రతికలు కూడా రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా అయ్యన్న పాత్రుడు అమ్మనా బూతులు తిట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే.. అయ్యన్న నోరు పారేసుకున్నారు. ► భాష మార్చుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం చంద్రబాబు నివాసం వద్దకు వెళితే నా కారు మీద రాళ్లు వేశారు. కారు దిగకముందే కారు అద్దాలు పగులగొట్టారు. టీడీపీ గుండాలు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన నా మీద దాడి చేశారు. ► చంద్రబాబే తన నివాసం వద్ద నాపై దాడి చేయించారు. బుద్ధా వెంకన్నలాంటి కాల్‌మనీ సెక్స్ రాకెట్ గాళ్లని, పట్టాభి లాంటి పందికొక్కులను, గన్నే నారాయణప్రసాద్ లాంటి రౌడీ షీటర్లను గద్దె రామ్మోహన్, మీరావలీ, నాగూల్ మీరా, బ్రహ్మంలాంటి వాళ్లను పెట్టుకుని రాళ్లతో దాడి చేయించారు. తనపై దాడి చేసిన దృశ్యాలను అన్ని టీవీ ఛానల్స్ చూపించాయి. టీడీపీపై ఎప్పుడైనా దాడి చేశామా? టీడీపీ నేతలు ఎన్నిసార్లు నిరసన చేయలేదు.. సీఎం నివాసం, సచివాలయం ‘ముట్టడి‘ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు? మీరు ముట్టడికి వెళ్లినప్పుడు వైఎస్సారీసీపీ తరఫున మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ప్రతిఘటించామా? మీపై దౌర్జన్యం చేసి కొట్టామా? వ్యవస్థ ఉంది.. పోలీసులు ఉన్నారు.. నన్ను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లారు. నిరసన తెలియ చేయడానికి వెళితే నామీద, మా కార్యకర్తలపై దాడి చేస్తారా? చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మళ్లీ మాపైనే ఎదురు దాడి చేస్తారా? కొంచమైనా మానవత్వం ఉందా? ప్రతిపక్షం కాదు.. పనికి మాలిన పక్షం ► నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? మీరు కడుపుకు ఏం తింటున్నారు? ప్రతిపక్షం పనికిమాలిన పక్షంగా తయారైంది. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇళ్లు.. ఇలాంటి పథకాలకు ఎవరికైనా అర్హత ఉండీ అందకపోతే ఇవ్వాలని అడగండి. ► రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో మీ గూబ గుయ్యిమనేలా ప్రజలు తీర్పు ఉంటుంది. ► మీ భాష మార్చుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే, అక్కడ నిరసన తెలుపుతాం. అయ్యన్నపాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా.. లేక బాగా బూతులు తిట్టారని మీ జాతీయ అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెడతారా.. అన్నది మీ ఇష్టం. -
మహిళలను గౌరవిస్తే 23 సీట్లేనా?
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్ల పాలనలో మహిళలను మీరు గౌరవించి ఉంటే.. మీకు 23 సీట్లు మాత్రమే వచ్చేవా?’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్.. దళిత మహిళనైన నన్ను హోం మంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట? అని నిలదీశారు. ‘హోంమంత్రినైన నన్నే మనుషులు పలకకూడని మాటలతో, సభ్యసమాజం తల దించుకునేలా దూషించే మీరు ఇక సాధారణ మహిళలను ఎలా గౌరవిస్తారో అర్థమవుతోంది’ అంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళను ‘బట్టలిప్పి కొడతా’ అని దూషించిన అయ్యన్నపాత్రుడు వంటి సంస్కారహీనుడి నుంచి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని ఆశించలేమన్నారు. ఇతని వ్యాఖ్యలపై స్పందించడమంటే అశుద్ధంపై రాయి వేయడమేనన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టడం వల్లే ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారని.. అలాంటి సీఎంను దూషించడమంటే ప్రజాతీర్పును అగౌరవ పరిచినట్లేనని చెప్పారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే.. దళిత జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా ► వాస్తవానికి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ స్పందించాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అని స్వయంగా చంద్రబాబు దళితజాతిని అవమాన పరిచారు. ► రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేడ్కర్ జన్మించిన, ఆత్మాభిమాం ఉన్న జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీరు మాట్లాడిన భాషను, మేము ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. గొప్పతనం అనేది మన ప్రవర్తనను బట్టి వస్తుంది కానీ.. కులం, జాతి వల్ల రాదు. చంద్రబాబు, అయ్యన్నల సంస్కారం ఏమిటన్నది అందరికీ తెలిసింది. ఐదేళ్లు బాగు చేసి ఉంటే ఎలా ఓడారు? ► మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఎందుకు ఓడిపోయారు? టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను జైలుకు పంపేలా కుట్ర చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే.. 151 సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం ప్రజాతీర్పును అవమానించడమే. ► వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. శాంతిభద్రతలపై మీరా మాకు చెప్పేది? ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయనపై హత్యాయత్నం జరిగితే.. అప్పుడు విపక్షనేతగా ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి ఆయన్ను పరామర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చవకబారు విమర్శలు చేశారు. ఇదీ.. మీకూ మాకు మధ్య ఉన్న తేడా. రాజీనామా చేయమనడానికి మీరెవరు? సామాజిక న్యాయాన్ని చేతల్తో చూపిస్తూ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నారు. వైఎస్ జగన్ నన్ను రాజీనామా చేయాలని కోరితే.. ఒక్క క్షణంలో చేస్తా.. నన్ను రాజీనామా చేయాలని కోరడానికి మీరెవరు? ► ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి అయ్యన్న పాత్రుడు ఇలా మాట్లాడటం సభ్య సమాజం ఇష్టపడుతుందని అనుకుంటున్నారా? మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా? ► మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. ► చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టిన చంద్రబాబు ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తారని ఆశించలేం. విన్నవించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? ► అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని.. బాష మార్చుకోవాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై రౌడీలతో దాడి చేయిస్తారా? జోగి రమేష్ సింగిల్‌గానే వెళ్లారు.. కానీ అప్పటికే కరకట్టపై టీడీపీ నేతలు భారీ ఎత్తున పోగయ్యారు. జోగి రమేష్ కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు. ఆయనపై దాడి చేశారు. ఇదీ వాస్తవం. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది అవాస్తవం. ► నాడు మీరు (చంద్రబాబు) అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. ► రాష్ట్రంలో 15 శాతం నేరాలు తగ్గాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుండటం దారుణం. -
గంజాయి తాగి, మందు కొట్టినవా?
రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణ కవి మోస్ట్ పాపులర్. ఆయనకు వికటకవిగా పేరు. తెనాలి రామలింగడు అనే పేరుతో ఆయన మీద అనేకానేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి సందర్భానికి కూడా పనికివచ్చే ఒక చిన్న కథను ఒకసారి గుర్తు చేసు కుందాము. కృష్ణదేవరాయల వారు హాస్యప్రియుడు. సమయస్ఫూర్తి, సరస సంభాషణా చతురత కలిగిన రామకృష్ణుడంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మిగిలిన కవులకు, కొలువులోని ఉన్నతోద్యోగులకు ఇది కంటగింపుగా ఉండేది. రామకృష్ణ కవి మీద అడపాదడపా చాడీలు చెబుతుండేవారు. కుట్రలు చేస్తుండే వారు. తన తెలివితేటలతో వాటి నుంచి ఎప్పటికప్పుడు రామకృష్ణుడు బయటపడేవారు. ఒక రోజు రాజుగారిని కలవడానికి తెనాలి రామకృష్ణుడు బయల్దేరాడు. రాజాశ్రయంలో అతని ప్రభ వెలుగుతున్న రోజు లవి. అపాయింట్మెంట్ లేకపోయినా సరే భటులు అతడిని ఆపేవారు కాదు. వినయంగా నమస్కరించి లోపలికి పంపించే వారు. ఈసారి ఎందుకనో తేడా కొట్టింది. భటుడు నిర్లక్ష్యపు చూపు విసిరాడు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు కున్నాడు. మొదట ఖంగుతిన్న రామకృష్ణ కవి వెంటనే తేరుకొని తనకు అపాయింట్మెంట్ ఉన్నదని చెప్పాడు. అయితే నేనొక సమస్యనిస్తాను, దాన్ని పూరించి పద్యం చెప్పమన్నాడు భటుడు. ఇప్పుడు మనం చూస్తున్న అవధాన ప్రక్రియల్లో ఈ సమస్యాపూరణం కూడా ఒకటి. భటుడు సమస్యాపూరణం అడగటమేమిటని సందేహిస్తూనే సరే, అడగ మంటాడు రామకృష్ణ కవి. ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే సమస్య నిస్తాడు భటుడు. ఒక ఏనుగుల గుంపు దోమ గొంతులోకి దూరిందట. ఆ వాక్యాన్ని అలాగే ఉంచి మిగతా పద్యం చెప్పాలి. ఆ సమస్య ఎక్కడి నుంచి భటుడికి చేరి వుంటుందో రామకృష్ణ కవికి అర్థమైంది. దాని వెనుక ఉన్న కుట్ర కథ కూడా అర్థమైంది. భటుడికి భారీగా లంచం ఎరవేసిందెవరో కూడా కనిపెట్టగలి గాడు. బాగా కోపమొచ్చింది. భటుణ్ణి బండ బూతులు తిడు తూనే సమస్యను పూరించి వెళ్లిపోయాడు. ‘గంజాయి తాగి దుష్టుల సంజాతము చేత, కల్లు చవి గొన్నావా .......కొడక, ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్’ అని పూరణ రూపంలోనే కవి ప్రశ్నించాడు. ‘ఏనుగులు దోమ గొంతులోకి పోవడమేమిట్రా! గంజాయి దమ్ముకొట్టి, మద్యం సేవించి డ్యూటీ కొచ్చినావా’ అని కళ్లెర్ర జేశాడన్నమాట. విషయం తెలుసుకున్న రాయలవారు ఇదే సమస్య మీద మహాభారత కథతో పద్యం చెప్పమని కోరగా ఒక అందమైన పద్యం చెబుతాడు. అదంతా వేరేకథ. రాజుల దగ్గరనే కాదు, రాజకీయ నాయకుల దగ్గర కూడా భటులుంటారు. హీరోల దగ్గరే కాదు కాదు, విలన్ల దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్లను బంటులని పిలుస్తున్నాము. ఉచ్చనీచాలెంచకుండా స్వామి కార్యం నెరవేర్చడమే ఈ బంటుల తక్షణ కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర కూడా కొందరు బంట్లున్నారు. ఆంబోతుల్ని ఊరిమీద వదిలేసే చందంగా అధికారంలో ఉన్నప్పుడు వీరిని జిల్లాల మీద వదిలేసే వారు. ఈ ఆంబోతులు ఎవరి చేన్లోనైనా దూరవచ్చు. మేత మేయవచ్చు. తొక్కేయవచ్చు. సర్వాధికారాలుంటాయి. బదులుగా బాస్ ఎవరిపేరు చెబితే వారి మీదకు కాలుదువ్వడం, కొమ్ము విసరడం లాంటి విద్యల్ని ఆంబోతులు ప్రయోగించాలి. బంట్లు కూడా అంతే. అయ్యన్న పాత్రుడు అనే బంటు రెండు రోజుల కింద కాలు దువ్వాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీదనే చిల్లర కామెంట్లు విసిరాడు, మంత్రులను, పోలీసు అధికారులను, ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. ఆ వేదిక మీద చంద్రబాబు కూడా ఉన్నారు. ఆ సమయంలో బంటును ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన హావ భావాలున్నాయని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. నర్సరావు పేటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్న వాడిన భాష పత్రికల్లో రాయడానికి అభ్యంతరకరమైనది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన ఒక్క కామెంట్ చేసినందుకే ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేంద్రమంత్రిని సైతం జైలుకు పంపించారు. అటువంటప్పుడు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే యథేచ్ఛగా తిట్లవర్షం ఎలా కురిపించగలిగాడు? బాస్ కట్టిన తావీజు మహిమ. తెనాలి రామలింగడి కథలో ఉన్నట్టే, ఇక్కడ కూడా కుట్ర నేపథ్యం ఉన్నది. గంజాయి దమ్ము ఉన్నది. మద్యం దందా ఉన్నది. లంచాలు మేయడం ఉన్నది. ఒక్కొక్కటే బయటకొస్తున్న అయ్యన్న ఘనకార్యాల చిట్టాను చూస్తుంటే ఔరా అనిపిస్తున్నది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో ఉన్న లేటరైట్ ఖనిజ నిక్షేపాలను అయ్యన్న కొడుకు తవ్విపోసి వందల కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నాడని ఆధారాలతో కూడిన ఆరోపణలున్నాయి. అయ్యన్న కొడుకు నిర్వాకంలో లోకేశ్‌బాబు కూడా భాగస్వామేనని నర్సీపట్నం ప్రాంతంలో చెప్పుకుంటారు. ఈ మైనింగ్ కోసం రెండు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి వందలాది అత్యంత విలువైన అటవీ వృక్షాలను కొట్టి వేయిం చారనీ, ఎటువంటి అనుమతుల్లేకుండానే సుందరకోట నుంచి అక్రమ రోడ్డును వేసుకొని ఖనిజాన్ని తరలించారన్న ఆరో పణలకు ఆధారాలున్నాయి. మన్యంలోని దట్టమైన అడవుల్లో వందల ఎకరాల్లో గంజాయి పండించి స్మగ్లింగ్ చేయించడంలో అయ్యన్న దిట్ట అని ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడే చెప్పారు. గతంలో ఒకసారి తన మాట వినలేదని ఒక మహిళా అధికారిని బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే అయ్యన్న బెదిరించారు. చంద్రబాబు జమానాలో విశాఖ మన్యం ఇలాఖా అయ్యన్న ఇష్టారాజ్యంగా మారింది. ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిపోయింది. అందుకు కృతజ్ఞతగానే నర్సరావుపేట సభలో అయ్యన్న పూనకాన్ని ప్రదర్శించారని అనుకోవచ్చు. ఇది సహజమైన పూనకం కూడా కాదు. ఇందులో ఎమోషనల్ ఎలి మెంట్ కనిపించలేదు. బాబు ఇషారా అందగానే అయ్యన్న విషం కక్కడం మొదలుపెట్టాడని సాక్షుల కథనం. ఈ సభ జరగడానికి కేవలం రెండు గంటల ముందే స్థానిక సంస్థల కౌంటింగ్‌కు సంబంధించిన తీర్పు వెలువడింది. ఆదివారం కౌంటింగ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయ బోతున్నది. మీడియా స్థలాన్ని, సమయాన్ని ఈ వార్త రోజంతా ఆక్రమించకూడదు. తెలుగుదేశంలో మిగిలిన శ్రేణుల నైతిక బలం దెబ్బతినకూడదు. ఇదీ లక్ష్యం. అప్పటికప్పుడు సిద్ధమైన వ్యూహం ప్రకారమే అయ్యన్న పూనక ప్రదర్శన జరిగింది. ముఖ్యమంత్రిపైనే తిట్ల వర్షం కురిపించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చోవు కదా! వాళ్లూ కౌంటర్ విమర్శలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటిముందు నిరసన తెలపడానికి వెళ్లాడు. వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాన్ని ముందే ఊహించింది. బాబు ఇంట్లో ఉన్న పార్టీ మందను ఉసిగొల్పింది. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. కార్యకర్తలకు గాయాల య్యాయి. ఎల్లో మీడియా అండతో ఈ ఎపిసోడ్‌కు తాము కోరు కున్న ట్విస్టును తెలుగుదేశం పార్టీ ఇచ్చుకున్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై దాడి చేయడానికే జోగి రమేశ్ బృందం వచ్చిందనే ప్రచారాన్ని లేవ దీశారు. ఎల్లో మీడియా, అనుంగు సోషల్ మీడియా శోకాలు పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే. నిరసన తెలపడానికి వచ్చినవారిపై దాడిచేసి కొట్టింది తెలుగుదేశం వారే. ఇప్పుడు లబలబలాడుతున్నదీ తెలుగుదేశం వారే. ఆదివారం నాడు ఎల్లో మీడియాలో ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంటుంది. సాయం త్రానికైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి. తమ పార్టీకి మింగుడుపడని సన్నివేశాలు ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలుగు దేశం పార్టీ చేస్తున్నది. గత రెండేళ్లలో కనీసం డజన్ సంద ర్భాలను ఉదాహరణగా చూపెట్టవచ్చును. 2019 నవంబర్ 14 రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనబడి నాడు – నేడు కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన గావించే విప్లవాత్మక కార్యక్రమం ఇది. ఒకపక్క ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగానే గుంటూరులో దుర్గ గుడిని కూల్చివేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. అక్కడ జరిగిందేమి టంటే రోడ్డు విస్తరణ కోసం ప్రజల సమ్మతితో, పోలీసుల అనుమతితో గుడిని కొంచెం పక్కకు జరిపి నిర్మించారు. గడిచిన సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే పిఠాపురంలోని ఓ ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయని బీభత్సమైన ప్రచారం జరిగింది. విచారణలో అది తప్పుడు వార్తని తేలింది. ‘దిశ’ పోలీస్ స్టే్టషన్లను ప్రారంభించిన తర్వాత వరసగా నాలుగు రోజులపాటు ఆలయాల మీద దాడులు జరిగాయని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజున, జగనన్న విద్యాకానుక ప్రారంభానికి రెండు రోజుల ముందు బీసీలకు, 56 కార్పొరేషన్లు ప్రకటించిన మరునాడు ఇటువంటి వార్తల్నే వ్యాప్తిలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల నాలుగు నెలలైంది. ఎన్నికల ముందు జనం ముందుంచిన మేనిఫెస్టోను దాదాపుగా అమలు చేసింది. మరో రెండున్నరేళ్లలో జరగబోయే ఎన్నికల కోసం జనంలోకి వెళ్లేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతున్నది. ఈ పద్ధతిలో ముఖాముఖి పోటీపడగల స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. మబ్బుల చాటు నుంచి యుద్ధం చేసే ఇంద్రజిత్తు వ్యూహాన్ని ఆశ్రయించబోతున్నది. అది వ్యవస్థల మాటున దాక్కొని దాడులు చేయాలని చూస్తున్నది. మీడియా భుజాలపై తుపాకులు పెట్టి కాల్పులు జరపాలని ఆలోచిస్తున్నది. విషప్రచారాలతో కూడిన ఒక కృత్రిమ సుడిగాలిని సృష్టించే సన్నాహాల్లో ఉన్నది. కవ్వింపులకు, రెచ్చగొట్టే చర్యలకు దిగబోతున్నది. ఈ రెండున్నరేళ్లు అరాచక – అప్రజాస్వామిక చర్యలకే అది బరితెగించబోతున్నది. చైతన్యవంతులైన ప్రజలు ఆ పార్టీ పోకడలను అర్థం చేసుకుంటున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సంస్కారం లేని వ్యక్తి అయ్యన్న పాత్రుడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి హేయమైన చర్య అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయ్యన్న పాత్రుడికి పిచ్చి మరింత ముదిరిందని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి ప్రజలే గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తిరుపతి: దళితులను కించపరచటం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని.. నిన్నటి ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ పెయిడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. అనంతపురం: మైనారిటీల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ అని.. ఆయన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. కోడెల శివ ప్రసాద్‌రావు మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాస్వామ్యం గురించి మట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం -
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న వ్యాఖ్యలపై నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ నిరసన తెలిపింది. అయ్యన్న తీరును నిరసిస్తూ అబిద్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. చంద్రబాబు, అయ్యన్న దిష్టిబొమ్మలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దహనం చేశారు. అయ్యన్న పాత్రుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. అయ్యన్నపై ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, ‘‘సీఎంపై అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు హేయమన్నారు. గత ప్రభుత్వంలో అయ్యన్న భూ దోపిడీకి పాల్పడ్డాడు. అయ్యన్న తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని’’ ఉమాశంకర్ గణేష్ అన్నారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై దాడి చేస్తారా?
-
అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
-
అయ్యన్నపాత్రుడు పిచ్చితుగ్లక్‌లా మాట్లాడుతున్నాడు: సన్యాసిపాత్రుడు
-
అయ్యన్న పాత్రుడికి ఇంకా సిగ్గు రాలేదు: ఆర్కే రోజా
-
అయ్యన్నపాత్రుడు సప్త వ్యసనపరుడు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలనే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.(చదవండి: ‘పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా?’) ‘‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సప్త వ్యసన పరుడు. సీఎంపై మాట్లాడిన తీరు అమానుషం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీకి ఏకపక్ష విజయం వస్తుందని అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ విజయం ఖాయమని భావించి టీడీపీ కుట్రలు చేస్తోంది. అయ్యన్న పాత్రుడిని బేషరతుగా అరెస్ట్ చేయాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చదవండి: కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్! -
పిచ్చి ముదిరి అయ్యన్న బూతులు మాట్లాడుతున్నారు
నర్సీపట్నం: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్యంతోపాటు గంజాయి కూడా సేవించి ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నాడని ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ఘాటుగా విమర్శించారు. తన సతీమణి, డీసీసీబీ చైర్పర్సన్ అనితతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి పిచ్చి మరింత ముదిరిందని.. బూతులు తప్ప ఆయన నోటి నుంచి మంచి మాటలు రావటంలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా మనసారా ప్రేమించే ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు ఆయనకు ఎవడిచ్చాడన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు, లోకేశ్ ఇచి్చన స్క్రిప్ట్‌తో అయ్యన్నపాత్రుడు నోటికి వచి్చనట్లు మాట్లాడుతున్నాడన్నారు. గంజాయి వ్యాపారం, దోపిడి, భూకబ్జాలు, రౌడీయిజం చేసే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయ్యన్నపాత్రుడిని సన్యాసిపాత్రుడు హెచ్చరించారు. -
అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు. చంద్రబాబు హస్తం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు. అత్యంత దారుణం.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారన్నారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని జోగి రమేష్ అన్నారు. చదవండి: వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన -
అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు
సాక్షి, విశాఖపట్నం: మరోసారి అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటి దురుసుతో ప్రవర్తించారు. మహిళా తహశీల్ధార్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. అధికారులను కించపరిచేలా దొంగలతో కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యానించారు. అధికారుల పట్ల హేళనగా మాట్లాడారు. అయ్యన్న వ్యాఖ్యలపై తహశీల్ధార్ కలత చెందారు. గిరిజన మహిళా తహశీల్ధార్‌పై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కూడా దురుసుగా మాట్లాడారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఓ సీనియర్ ప్రజా ప్రతినిధిగా చెప్పుకునే అయ్యన్న తీరు మారకపోవడం దారుణం అంటున్నారు. చదవండి: కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్.. విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం -
టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ..
విశాఖపట్నం: వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీడీపీ నేతలకు కాళ్లు చేతులు ఆడట్లేదు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నర్సీపట్నం ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.విజయ్ ఆదివారం మార్చి నెలకు సంబంధించి నిత్యావసరాల పంపిణీని అడ్డుకున్నారు. దురుద్దేశంతో ఆటంకం కలిగించారు. 26వ వార్డులో ఎప్పటి మాదిరిగానే వాహనదారుడు సరకులు పంపిణీ చేస్తుండగా విజయ్ అనుచరులు వ్యాన్ దగ్గరకు వెళ్ళి పంపిణీని అడ్డుకుని వ్యాన్‌ను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ వద్ద ఉన్న రూ.10 వేల గురించి గొడవ చేశారు. అది నాలుగు రోజుల నుంచి నిత్యావసర సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మని వ్యాన్ డ్రైవర్ పోలీసులకు వివరించారు. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పినప్పటికీ సంతృప్తి చెందని విజయ్ మున్సిపల్ కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలకు తెర తీశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా 26వ వార్డులో తన తల్లి పద్మావతి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులు, మున్సిపల్ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రోడ్డు మీద పడుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఉపన్యసించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్లో ఎవరి వ్యూహాలు వారివి.. దీన్ని ఇంత రచ్చ చేయడం అనవసరమని పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. పట్టణ సీఐ హామీతో ఆందోళన విరమించిన అయ్యన్న పట్టణ సీఐ స్వామినాయుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ హామీ ఇచ్చినా చాలని అయ్యన్నపాత్రుడు పేర్కొనడంతో సీఐ స్వామినాయుడు మైక్ తీసుకుని మాట్లాడారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో పట్టణ ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు వేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో అయ్యన్నపాత్రుడు ఆందోళన విరమించారు. చదవండి: ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు.. పాచి పనులకు పోతారా? -
బుద్ధుందా.. గాడిద కొడుకుల్లారా..
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది (భీమిలి): మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్డీవో, ఆ నా..... సస్పెండ్ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్.. ఆ నా..... సస్పెండ్ చెయ్యాలి’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్ మూర్తి కోరితే కేటాయించారని అయ్యన్న చెప్పడం గమనార్హం. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి కక్షపూరిత చర్య అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గీతం కళాశాలపై ప్రభుత్వ కక్ష సాధింపును అంతా ఖండించాలన్నారు. దమ్ముంటే విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’ విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
‘అయ్యన్నపాత్రుడికి మతి భ్రమించింది’
సాక్షి, కర్నూలు: పదవిని కోల్పోయిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.(చదవండి: డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు: జయరాం) ‘‘15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమి కొనుగోలు చేశారు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములిద్దరికి విభేదాలు వచ్చాయి. నేను అన్నీ చెక్ చేయించి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశా. ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. దీంట్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఈ అంశంపై ఆస్పిరి పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు కూడా పెట్టానని’’ ఆయన వివరించారు. ఒక రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా.. మరి 2 ఎకరాల చంద్రబాబు ఇప్పుడు ఇలా ఎలా ఎదిగాడో అయ్యన్నపాత్రుడు అడగాలి. ఒక బీసీ మంత్రిని అణగదొక్కాలని చూస్తున్నారు. ఆ రోజు 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తా అని చంద్రబాబు నాకు ఎర వేసాడు. అచ్చెన్నాయుడిలా అవినీతికి పాల్పడలేదని జయరామ్ అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొన్ని డిస్పెన్సరీలను తనిఖీ చేశానని, వాటిలో మెడిసిన్స్ లేవని తేలింది. బాకీలు మాత్రం కట్టాల్సి వచ్చింది. దీంతో విచారణకు అదేశించా. వాస్తవాలు బయటకు వచ్చాయని ఆయన తెలిపారు. (చదవండి: ఏపీ: చెరకు రైతులతో మంత్రుల కమిటీ భేటీ) -
డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు: జయరాం
సాక్షి, కర్నూలు: తాను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీలోకి వస్తే రూ.50 కోట్లు ఇస్తామని తనకు చంద్రబాబే ఆఫర్ చేశారని తెలిపారు. ఆ పదవి వద్దు, నాకు డబ్బు వద్దని వదిలేశానని ఆయన వివరించారు. అమరావతిలో భూ కబ్జాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్ జనంలోకి రావాలన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు. (చదవండి: ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయ్యన్న పాత్రుడిలా అమ్మాయిలతో స్టేజీలపై డ్యాన్స్‌లు చేసే వ్యక్తిని కాదని, తనపై సీబీఐకి ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను తప్పు చేయనని, విమర్శలకు భయపడనని తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని మంత్రి జయరాం వివరించారు. -
ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం) చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది. -
చంద్రబాబుపై అయ్యన్న తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: ‘పార్టీ ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోతే ఎలా? ప్రజలు ఏమనుకుంటారు? కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరు’ అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు 4 రోజులక్రితం ఉండవల్లి చేరుకుని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అయ్యన్నపార్టీ కార్యకలాపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ► చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండిపోవడం, ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోవడం సరికాదని అయ్యన్న్న కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కొందరు ప్రచారం కోసం పనిచేస్తున్నారని, వారివల్ల ఉపయోగం లేదని అయ్యన్న పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్‌లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని అయ్యన్న ప్రశ్నించినట్లు సమాచారం. ► ఇలాగైతే పార్టీని ఎవరూ రక్షించలేరని అయ్యన్న వ్యాఖ్యానించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కంగుతిన్న చంద్రబాబు హైదరాబాద్ వెళ్లాక లోకేష్‌ని ఏపీకి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.\ చదవండి: రథం చుట్టూ రాజకీయం! -
ఆ ఘనత జగన్‌దే.. గర్వంగా చెబుతున్నా..
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతిగా చూపి టీడీపీ నేతలు అక్కడ భూములను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 కూడా నెరవేర్చని చేతగాని ప్రభుత్వం టీడీపీ అని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నామన్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. -
ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్న దొరికారు
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. నిర్భయ చట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ► విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా దొరికారు. ► అలాంటి వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు పెడితే వెనుకేసుకొస్తారా? ► మహిళా ఉద్యోగులంటే టీడీపీకి అంత చులకనా? మహిళా అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు? ► మా వాళ్లపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ వద్దకు నిస్సిగ్గుగా వెళ్లారు. ► మరమ్మతు పనులు పూర్తయ్యాక అనకాపల్లి మున్సిపల్ కార్యాలయం గోడపై అయ్యన్న పాత్రుడు తాతగారి ఫొటో యథాస్థానంలో పెడతామని కమిషనర్ చెప్పినా, అయ్యన్న బహిరంగంగా బూతులు తిట్టారు. ► మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఆయ్యన్నను అరెస్టు చేయిస్తాం. ► రాజకీయ మదంతో ఎవరైనా మాట్లాడితే ఇలానే కేసులు ఉంటాయి. ► బాధితులకు అండగా ఉంటాం. ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం. -
‘దమ్ముంటే అయ్యన్నను తొలగించండి’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సవాల్ చేశారు. నిర్భయచట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మహిళా అధికారిణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్నపాత్రుడు దొరికారు. అలాంటి వ్యక్తిపై కేసు పెడితే వెనుకేసుకొస్తారా? మహిళా ఉద్యోగులంటే టీడీపీకి చులకనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో?మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు’అని ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: కరోనా: ఆంధ్రప్రదేశ్‌లో 8 వేలు దాటిన కేసులు) -
‘బాబులిద్దరికి అధికార దర్పం దిగలేదు’
సాక్షి, తాడేపల్లి: పెద్దబాబు, చిన్నబాబుకు ఇంకా అధికార దర్పం దిగలేదని.. ప్రతిపక్షంలోనూ అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడులు చేసిన వ్యక్తులను వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని, దళిత మహిళను వివస్త్రను చేసిన వారిపై ఆయన ఏ చర్యలు తీసుకున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. (కుట్రకు టీడీపీ పక్కా ప్లాన్: మంత్రి బొత్స) ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి.. ‘‘అయ్యన్నపాత్రుడు మీద తప్పుడు కేసులు పెట్టారని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆయన మహిళ ఉద్యోగిపై ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోండి. బట్టలు ఊడదీస్తానని మహిళ ఉద్యోగిని బెదిరించారు. మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన అయ్యన్నపై కేసులు పెట్టకపోతే ముద్దులు పెడతారా..? నాలుగు సార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్న.. ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా.. మహిళలు పట్ల చంద్రబాబు నేర్పిన సంస్కారం ఇదేనా’’ అంటూ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎంతో మంది మహిళలను వేధించారన్నారు. ‘‘మహిళా ఉద్యోగిని జట్టు పట్టుకుని లాక్కొచ్చిన తీరు చూశాం. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ వ్యక్తులపై చర్యలు శూన్యం. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోని టీడీపీ నేతలపై చర్యలు చేపట్టారా’’ అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజాపై అక్రమంగా కేసులు పెట్టారని, కోర్టు అనుమతించిన కానీ అసెంబ్లీలో ఆమెను అడుగు పెట్టనివ్వలేదన్నారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం) ఆయనకు బీసీలు అండగా ఉండాలా.. చంద్రబాబు చేసిన అరాచకాలతో టీడీపీ 23 సీట్లకు పరిమితమయ్యిందని విమర్శించారు. మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని సీఎం జగన్ వదలి పెట్టరని అమర్నాథ్ స్పష్టం చేశారు. మహిళల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. వారి రక్షణ కోసం దిశ చట్టం తెచ్చారన్నారు. మహిళలకు అండగా, అన్నగా వైఎస్ జగన్ నిలుస్తున్నారని తెలిపారు. ‘‘రూ.150 కోట్లు ప్రజాధనం పందికొక్కులా మింగేసిన అచ్చెన్నాయుడికి అండగా బీసీలు ఉండాలా..ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ని లోకేష్ పరామర్శిస్తారు. గవర్నర్ వ్యవస్థ వద్దని వాదించిన చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని గవర్నర్ ను కలుస్తున్నారంటూ’’ అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో పాటు మున్సిపల్ సిబ్బందిని అయ్యన్న దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. -
యాంకర్స్‌తో టీడీపీ నేత డాన్స్.. వీడియో వైరల్
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఎల్లు వచ్చి గోదారమ్మ’ అనే పాటకు ఆయన లయబద్ధంగా స్టెప్పులు వేశారు. అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది. కొడుకు పెళ్లి రిసెప్షన్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డాన్స్ చేశారు. ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు మాదిరి ఇద్దరు యాంకర్లతో కలిసి అయ్యన్నపాత్రుడు స్టెప్పులేశారు. వ్యాఖ్యాతల చేతులు పట్టుకొని పాటకు తగిన స్టెప్పులేసి అలరించారు. అంతేకాకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క మాస్ ఆడియన్స్‌ని ఇటీవల ఉర్రూత లూగించిన ‘ గున్న గున్న మామిడి’ పాటకి బంధువులతో కలిసి చిందులేశారు. ప్రసుత్తం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
మాజీ మంత్రిపై మరో కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, విధులకు ఆటంకం కలించారనే అభియోగాలపై ఆయనపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిలు పత్రాలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించేందుకు వెళ్లేక్రమంలో అయ్యన్నతన అనుచరులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అబీద్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎటువంటి అనుమవతి లేకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అనుమతి లేకుండా సభ నిర్వహించడం.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన కారణంగా పోలీసులు ఆయనపై మరోసారి కేసు నమోదు చేశారు. (చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు) అంబేద్కర్‌ను అవమానించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు ఆరుగుల్ల రాజుబాబు డిమాండ్ చేశారు. అయ్యన్న, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సోమవారం అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేటప్పుడు చెప్పులు తీయకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఇందుకు టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మట్లాడినందుకు అయ్యన్నపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్) రౌడీషీట్ ఓపెన్ చేయాలి.. సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి అనే కనీసం గౌరవం ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ తీశారు. అయ్యన్న నోటి దురద తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు పలికారు. చట్టంపై గౌరవంలేని అయ్యన్నకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఆయన కోర్టుకు విఙ్ఞప్తికి చేశారు. ఏడు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి బాట పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
అన్నతో పొసగక పార్టీ మారిన సోదరుడు..
విశాఖపట్నం,నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు వైఎస్సార్సీపీలో చేరడంతో నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో పట్టుఉన్న సన్యాసిపాత్రుడు పార్టీ మారడంతో మున్సిపాలిటీలో టీడీపీ కోటకు బీటలు వారినట్లైంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి టీపీపీలో కొనసాగుతూ అన్నయ్య అయ్యన్నపాత్రుడు కుడిభుజంగా ఉంటూ వచ్చిన ఈయన కొంత కాలంగా బాబాయ్–అబ్బాయి విజయ్ మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా టీడీపీకి, అయ్యన్నపాత్రుడుకి దూరంగా ఉన్నారు. కుటుంబ కలహాలు తారస్థాయికి చేరడం, వీటిని పరిష్కరించడంలో అయ్యన్నపాత్రుడు విఫలం కావడంతో టీడీపీని వీడాలని సన్యాసిపాత్రుడు, అతని అనుచరులు నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్ నాలుగో తేదీన సన్యాసిపాత్రుడు జన్మదినోత్సవం రోజున అతనితోపాటు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనిత, పలువురు మాజీ కౌన్సిలర్లు, కొంతమంది నాయకులు టీడీపీకి రాజీనామాలు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలతో చర్చించి తేదీని ఖరారు చేశారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి సన్యాసిపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడున్నర దశబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సన్యాసిపాత్రుడు పలు కీలక పదువులను నిర్వహించారు. మూడు దపాలు నర్సీపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా, ఒక దఫా ఆయన సతీమణి అనిత మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, ఆయన వైస్‌చైర్మన్‌గా పదవులు చేపట్టారు. నియోజకవర్గంలో గట్టి అనుచరగణం కలిగిన సన్యాసిపాత్రుడు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ పార్టీకి ఇక్కడ మరింత బలం చేకూరింది. మాజీ మంత్రి అయ్యన్నకు అండదండగా ఉంటూ ప్రధానంగా మున్సిపాలిటీలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే సన్యాసిపాత్రుడు టీడీపీకి, అయ్యన్నకు దూరం కావడం భారీ నష్టంగా పలువురు పేర్కొంటున్నారు. -
‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ల భూ కబ్జాలను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రానున్న కాలంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న సర్కారు భూములు స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఐదేళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని వెల్లడించారు. వంద రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పలుకుతున్నారని ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి : దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు.. -
అయ్యన్న తీరుపై టీడీపీలోనే అభ్యంతరం
సాక్షి , విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి రేపుతున్నాయి. సహజంగానే నోటిదూకుడు ఉన్న అయ్యన్న ఇప్పుడు శృతిమించి.. ఇంకా చెప్పాలంటే పూర్తిగా స్థాయి దిగజారి చేస్తున్న వ్యాఖ్యలు, వాడుతున్న భాషను టీడీపీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ అర్బన్ కమిటీ అధ్యక్షుడు రెహమాన్, ఇతర నేతలతో కలిసి అయ్యన్న మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి కులాలను ఆపాదిస్తూ విమర్శలు చేశారు. రౌడీ రాజ్యం.. కడపరెడ్లు.. అంటూ కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అన్ని వర్గాల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. డీసీపీ రంగారెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు నగరంలో జూదం, వ్యభిచారం నియంత్రణలో భాగంగా నగర డిఫ్యూటీ పోలీస్ కమిషనర్ రంగారెడ్డి తనదైన శైలిలో కాస్త కరకుగానే చర్యలు చేపట్టారు. చిన్నాచితకా లాడ్జీలతో పాటు పేరుమోసిన క్లబ్‌లపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలోనే వాల్తేరు క్లబ్లో కూడా సోదాలు నిర్వహించారు. నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేశారు. దీనిపైనే అయ్యన్న రాద్ధాంతం చేస్తూ డీసీపీని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడారు. క్లబ్ సభ్యులను డీసీపీ దూషించారంటూ పత్రికల్లో రాయలేని భాష వాడారు. బూతులు వల్లించడమే కాకుండా.. తిరిగి మేం ఆయన్ను కొట్ట లేమా.. అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అని కూడా చూడకుండా డీసీపీపై నోరు పారేసుకోవడం వివాదా స్పదమవుతోంది. పోలీసువర్గాల్లో అయ్యన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వాకౌట్ చేసిన సిటీ అధ్యక్షుడు రెహమాన్ అయ్యన్న దారుణమైన భాషను భరించలేక టీడీపీ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయ్యన్న మాట్లాడుతుండగానే వేదిక దిగి వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలుంటే నిరసన గళం విప్పొచ్చు.. కానీ ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదంటూ రెహమాన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో రెహమాన్‌కు పొసగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ సిటీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలంగా పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనని శపథం పూనిన వాసుపల్లి అప్పటి నుంచి పార్టీ ఆఫీసుకు రాని విష యం కూడా బహిరంగ రహస్యమే.. వీటిపై విలేకరులు అయ్యన్నను ప్రశ్నించగా వారిద్దరిదీ భార్యాభర్తల గొడవలాంటిదని తేలిగ్గా తీసిపారేయడాన్ని రెహమాన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయ్యన్నకు ఎందుకింత అసహనం పుట్టిన రోజు నాడు లోకేష్‌ను నర్సీపట్నం పిలిచి.. ఘనంగా కార్యక్రమం చేసుకోవాలనుకోవాలని ఉవ్విళ్లూరిన అయ్యన్నకు.. సరిగ్గా అదే రోజు సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు టీడీపీని వీడి ఊహించని షాక్ ఇచ్చారు. అయ్యన్న కంటే కూడా ఆయన కుమారుడి అరాచకాలను తట్టుకోలేక పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. ఈ పరిణామాన్ని తీవ్ర అవమానంగా అయ్యన్న భావిస్తూ జీర్ణించుకోలేకున్నారు. అప్పటి నుంచి అసహనంతో ఊగిపోతున్న అయ్యన్న మంగళవారం అదుపు తప్పి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నగర, జిల్లావ్యాప్తంగా పార్టీకి మరింత చేటుచేస్తాయని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. -
అయ్యన్న పాత్రుడి బూతు పురాణం
సాక్షి, విశాఖ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాష ఉపయోగించారు. జగన్మోహన్రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పాత కేసులు బయటికి తీస్తున్నారని ఆరోపించారు. కేసులకు ఎవరూ భయపడబోరని అన్నారు. పనికిమాలిన పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కోడెల శివప్రసాదరావుపై వేధించి కేసు పెట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మంత్రి బొత్స నీతిమంతుడు, పతివ్రతలాగా మాట్లాడుతున్నాడని, వోక్స్ వ్యాగన్ కంపెనీ వెళ్లిపోవడానికి ఆయనే కారణమని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీడీపీకి అయ్యన్న సోదరుడు రాజీనామా
-
బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్!
సాక్షి, విశాఖ : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి పుట్టినరోజు నాడే ఆయన సోదరుడు ఝలక్ ఇచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన విషయం విదితమే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. అది కూడా విశాఖ జిల్లాలో నారా లోకష్ పర్యటన వేళ టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. కాగా కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చిన విషయం విదితమే. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పడంతో ఇద్దరి మధ్య చాలాకాలంగా మాటలు కూడా లేవు. -
తొందరెందుకు.. వేచిచూద్దాం!
సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాకముందే ఆందోళనల పేరుతో ప్రజల్లోకి వెళ్లడం సరికాదని పలువురు టీడీపీ సీనియర్ నేతలు మాజీ సీఎం చంద్రబాబు ఎదుటే స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించి కొద్దిరోజులు మౌనంగా ఉంటే మంచిదని సూచించారు. విజయవాడలోని ఒక ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్తు కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు సమక్షంలోనే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అయితే నేరుగా చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలనడం సరికాదంటూ ప్రజలు తీర్పు ఇచ్చిన స్వల్ప వ్యవధిలోనే తొందరపాటుతో జనంలోకి వెళ్లొద్దని సూచించారు. తెల్ల ఏనుగుల్లాంటి వారికి పదవులా!? అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. పార్టీలో స్వార్థపరులకు పదవులిస్తున్నారని, తెల్ల ఏనుగుల్లాంటి వారిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదుసార్లు ఓడిపోయిన వారికి మళ్లీ పదవులిచ్చి అందలమెక్కించారని ఇలాంటి చర్యలవల్లే దెబ్బతిన్నామని కుండబద్దలు కొట్టారు. పార్టీలో యువకులు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని.. అవసరమైతే తన డిప్యూటీ లీడర్ పదవిని బీసీ నేత ఎవరికైనా ఇవ్వాలన్నారు. కీలక నేతల డుమ్మా కాగా, ఈ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల నుంచి పార్టీని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని సమావేశాన్ని అస్సలు పట్టించుకోలేదు. గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్‌రెడ్డి, అశోక్‌గజపతిరాజు వంటి ముఖ్యులతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమితో అధైర్యపడాల్సిన అవసరంలేదని, ధైర్యంగా పనిచేయాలన్నారు. ఇకపై పూర్తికాలం కార్యకర్తలకే సమయం కేటాయిస్తానన్నారు. -
ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..
-
లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చంద్రబాబు తీరుపై అయ్యన్న తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం టీడీపీలో తీవ్ర కలకలం చోటుచేసుంది. టీడీపీలోకి కొత్తగా వచ్చే వారికి ఎంపీ సీట్లు కేటాయిస్తామని చెప్పడంపై మంత్రి అయ్యనపాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతున్న సమయంలోనే అయ్యన్న బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం నుంచి ఫోన్ వచ్చిన అయ్యన్న లిఫ్ట్ చేయలేదు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మార్చి వచ్చిన వారికే పదవులు ఇస్తే.. పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఎంటని టీడీపీ అధిష్టానాన్ని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలు మరి వచ్చిన వారు పదవులు అనుభవించి వెళ్లిపోతే.. పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఎమిటని నిలదీశారు. కొత్తగా వచ్చినవారి కోసం గతంలో ఎంపీ సీటు వదిలేసుకున్నామని గుర్తుచేశారు. ఈ సారి కూడా అలాంటి వారికే ఎంపీ సీటు ఇస్తామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అయ్యన్నపాత్రుడి ఇంట్లో దొంగ ఓట్లు’
సాక్షి, విశాఖపట్నం : మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంట్లోనే బోలేడు దొంగ ఓట్లు ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ కన్వీనర్ పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే మంత్రి అయ్యన్నపాత్రుడు ఓట్ల తొలగింపు అంశంలో వైసీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగించడం లేదని ఆరోపించారు. తన ఇంట్లోనే దొంగ ఓట్లు పెట్టుకుని.. వైసీపీని విమర్శించడం.. హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అయ్యన్న వ్యవహారం చూస్తే ‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లు ఉందని ధ్వజమెత్తారు. నర్సీపట్నాన్ని రౌడీ రాజ్యంగా మార్చిన ఘనత మంత్రి అయ్యన్నదేనని ఆరోపించారు. -
విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు తగదు
విశాఖపట్నం , నర్సీపట్నం: వాస్తవాలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము పేర్కొన్నారు. సాక్షి పత్రిక విలేకరిపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎమ్‌జే, నర్సీపట్నం ప్రెస్‌క్లబ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అబిద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయం పరిపాలన అ«ధికారి పి.రామునాయుడుకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలపైన, విలేకరులపైనా ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు దాడులు చేయడం, దూషించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై మంత్రి సదరు విలేకరిని దూషించడం ఆయన స్థాయికి తగదన్నారు. ఏరియా ఆస్పత్రిలో జరిగిన కోట్ల అవినీతిని వెలుగులోకి తెచ్చిన సాక్షి విలేకరిని అభినందించాల్సింది పోయి విలేకరిని దూషించడం మంచిది కాదని హితవు పలికారు. వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. పత్రికలు, విలేకరులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఇక నుంచైనా మానుకోవాలన్నారు. ఐజేయూ మాజీ కౌన్సిల్ సభ్యుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలపై స్పందించే మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తరచూ సభల్లో విలేకరుల పట్ల చులకన భావంతో మాట్లాడటం సరికాదన్నారు. ఈ ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌బీఎల్ స్వామి, ఏపీఈఎమ్‌జే జిల్లా కన్వీనర్ కిషోర్, ఏపీఈఎమ్‌జే ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, రాజు, నర్సీపట్నం ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఏడీబాబు, రాజుతో పాటు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. ♦ ఎన్నడూలేని విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలు సమస్యలపై గతంలో అనేక ఆందోళనలు నిర్వహించిన సమయాల్లో ఎక్కడా కనిపించని పోలీసులు శుక్రవారం జరిగిన ఆందోళనకు పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుచిత వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): నర్సీపట్నం సాక్షి విలేకరిపై మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇటీవల ‘సాక్షి’లో రాసిని ఒక వార్తకు సంబంధించి మంత్రి అయ్యన్న నర్సీపట్నం సాక్షి విలేకరిని దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్న ఒక జర్నలిస్ట్‌ను కించపరిచేలా మాట్లాడడం తగదని ఏపీయూడబ్లు్యజే నగర అధ్యక్షుడు రామచంద్రరావు, ఏపీయూడబ్లు్యజేఎఫ్ అధ్యక్షుడు నారాయణ తదితరులు పేర్కొన్నారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కితీసుకొని విలేకరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే జర్నలిస్టుల నుంచి మంత్రి అయ్యన్న వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు. దళిత విలేకరిని దూషించడం తగదు నర్సీపట్నం : మంత్రి అయ్యన్నపాత్రుడు దళిత విలేకరిని దూషించడం దారుణమని దళిత సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి అయ్యన్నపాత్రుడు విలేకరులపై పరుష పదజాలం మాట్లాడటం మానుకోవాలన్నారు. మంత్రి సహనం కోల్పోయి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు నిరసిస్తూ శనివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో దళిత సంఘాలన్నీ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు చిట్ల చలపతిరావు, ఆరుగొల్లు రాజబాబు, మారితి అప్పలరాజు, నేతల నాగేశ్వరరావు,రాజు, బెల్లాల రాజు తదతరులు పాల్గొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్రకమిటీ çసభ్యుడు అప్పారావు డిమాండ్ నర్సీపట్నం : స్థాయి దిగజారి పాత్రికేయులపై దుర్భాషలాడటం మంత్రి అయ్యన్నపాత్రుడికి తగదని ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్రకమిటీ సభ్యులు వి.అప్పారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు రాసిన సాక్షి విలేకరిపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. మంత్రి అయ్యన్న విలేకరులపై చిందులు వేయడం, పదే పదే దూషించడం తగదన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. -
అయ్యన్న చిందులు
విశాఖపట్నం, నర్సీపట్నం: రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు విచక్షణ కోల్పోయారు. తాను అమాత్యుడిని అనే విషయాన్ని మరిచిపోయారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై దుర్భాషలకు దిగారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఎన్నడూ లేని విధంగా పరుష పదజాలంతో సాక్షి విలేకరిపై విరుచుకుపడ్డారు. గురువారం ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసినా అప్‌గ్రేడ్ రాలేదని వచ్చిన వార్తకు, తన చేతకాని తననాన్ని కప్పించుకునేందుకు వార్త రాసిన విలేకరిపై దుర్భాషలాడారు. తరచూ మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గంలో జరిగే అభివృధ్ధి విషయంలో కానీ...పనులు చేపట్టే అంశంలోనూ వాస్తవానికి విరుద్ధంగా వార్తలు వస్తే మంత్రి తట్టుకోలేకపోతున్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు సదరు మంత్రి సమావేశాలు, బహిరంగ సభల్లోనూ విలేకరులపై రుసరుసలాడం ఆనవాయితీగా మారింది. మొదట విడతగా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల హోదాపెంచుతూ ప్ర భుత్వం ఈ నెల 15న జీవోను జారీ చేసింది. ఈ జాబితాలో నర్సీపట్నం ఏరి యా ఆస్పత్రికి చోటు దక్కలేదు. ఇదే విషయాన్ని ఈ నెల 16న సాక్షిలో ‘అయ్యన్నా..ఆస్పత్రికి ఏదీ గుర్తింపు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఈ నెల 20న ప్రభుత్వం విడుదల చేసిన రెండో జాబితాలో ఏరియా ఆస్పత్రికి హోదా కల్పిస్తూ జీవో జారీ అయింది. ఈ విషయం తెలుసుకోని మంత్రి హోదా ఉత్తర్వులు వచ్చినా రాలేదంటూ వార్త రాశారంటూ సాక్షి దినపత్రిక విలేకరిపై దుర్భాషలకు దిగారు. జీవో వచ్చాక వార్త రాశారో...రాకముందు రాశారో అన్నది సీనియర్ మంత్రిగా చెప్పుకునే ఈయనకు కనీస అవగాహన లేకపోవటం దురదృష్టకరం. మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన పాత్రికేయల పట్ల దూషణలకు దిగడం మంత్రి అయ్యన్నపాత్రుడు స్థాయికి తగిన పని కాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌బీఎల్ స్వామి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు కె.రామకృష్ణ పేర్కొన్నారు. తరుచూ పత్రికలు, వ్యతిరేక వార్తలు రాసిన విలేకరుల పట్ల తీవ్రస్థాయిలో దూషణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. మంత్రి పట్ల గౌరవంతో భరిస్తూ వస్తున్నామన్నారు. దళితుడైన సాక్షి విలేకరిని పదే పదే దూషించడం అవమానకరంగా భావిస్తున్నామన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. -
మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో నిధులు గోల్మాల్
-
నితిన్ గడ్కరీపై మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశంసలు
-
‘దుక్కలా ఉండి పెన్షన్ అడుగుతారా’
సాక్షి, విశాఖ : ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడారు. విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వితుంతు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భర్త చనిపోయినవారికి పెన్షన్ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు (వితంతువులు) రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడుతారా అని తిట్టిపోస్తున్నారు. -
దిక్కుమాలిన వ్యాఖ్యలు
-
గాంధీ గురించి మనకెందుకు: మంత్రి వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : జాతిపిత మహాత్మా గాంధీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా మంది రాజకీయ నేతలు గాంధీ, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్ వంటి నేతలు తమకు ఆదర్శమని అంటుంటారని, అసలు గాంధీ గురించి మనకెందుకు? అంటూ నోరుజారారు. ఆదర్శం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని, యడ్లపాటి వెంకట్రావే మనందరికీ అదర్శమని ఆయన అన్నారు. ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై సభలో ఉన్నవారంతా ఒక్కింత విస్మయానికి గురైయ్యారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గాంధీని చులకనగా చేసి మాట్లాడటం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. -
సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు
విశాఖపట్నం, నర్సీపట్నం: మంత్రి సోదరుడు సన్యాసిపాత్రుడుతో కలిసి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అంకంరెడ్డి జమీలు మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్రపన్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. తప్పుడు వీడియోల ద్వారా సోషల్ మీడియా, టీవీల్లో ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎస్పీ కార్యాలయానికి పార్టీ నాయకులంతా ర్యాలీగా వెళ్లారు. ఏఎస్పీ లేకపోవడంతో కార్యాలయం సీసీ సత్యనారాయణకు మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో పెదబొడ్డేపల్లి సత్య కాంప్లెక్స్‌లో జరిగిన వివాహా కార్యక్రమానికి అంకంరెడ్డి జమీలు వెళ్ళారు. అదే కార్యక్రమానికి వచ్చిన సన్యాసిపాత్రుడిని పలకరించారన్నారు. సీసీ కెమేరాల్లో రికార్డు అయిన పుటేజ్‌ను సేకరించి తప్పుడుగా క్రియేట్చేసి మంత్రి అయ్యన్నపాత్రుడుపై హత్యకు కుట్ర చేశారని టీవీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫంక్షన్‌హాల్ యజమానిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసారం చేసిన చానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంకంరెడ్డి జమీలు మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతియ్యడానికే తప్పుడు ప్రచారం చేశారన్నారు. తన కుటుంబానికి ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు. సన్యాసిపాత్రుడు కుటుంబంతో మాకుటుంబానికి బంధుత్వం ఉందన్నారు. ఎక్కడైనా ఒకరి ఒకరం ఎదురుపడినప్పుడు పలకరించుకుంటామన్నారు. వీడియోను సృష్టించినవారే అయ్యన్నపాత్రుడును హతమార్చాలని, తద్వారా వారి రాజకీయ భవిష్యత్‌ను పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో లేని మాజీ మావోయిస్టు బత్తుల కృష్ణను సైతం వీడియోలో ఉన్నట్లు చూపటం దురదృష్టకరమన్నారు. అనంతరం షేక్ రజాక్ మాట్లాడుతూ సన్యాసిపాత్రుడు, జమీలు, బత్తుల కృష్ణ, తాను హత్యకు కుట్ర పన్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం హేయమైన చర్య అన్నారు. లేటరైట్ విషయంలో మావోయిస్టులు ఇప్పటికే మంత్రి అయ్యన్న, తనయుడు విజయ్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిన్నింటి నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడుని టీడీపీ వారే హత్య చేసి తమపై నెట్టడానికి చేసిన పనేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తమరాన అప్పలనాయుడు, నర్సీపట్నం, నాతవరం మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, శెట్టి నూకరాజు, పార్టీ నాయకులు సుర్లగిరిబాబు, పైల పోతురాజు, బయపురెడ్డి చినబాబు, శెట్టి మోహన్, పెట్ల అప్పలనాయుడు, ఆరుగుల్ల రాజుబాబు పాల్గొన్నారు -
టీడీపీలో ‘కాంగ్రెస్ పొత్తు’ ముసలం
సాక్షి, అమరావతి/నర్సీపట్నం/సాక్షి ప్రతినిధి, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సర్వ నాశనం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించబోరని ఆ పార్టీ సీనియర్ నేతలు మండిప డుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లలేమని, ప్రజలు తరిమితరిమి కొడతారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ సభ్యులైన చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తిలు ఈ వ్యవహారంపై గురువారం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుడ్డలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఉప ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలిస్తే అంతకుమించిన దుర్మార్గం ఉండదు: అయ్యన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి తంతారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని తాను అనుకోవట్లేదన్నారు. అలా జరిగితే వ్యతిరేకించే మొదట వ్యక్తిని తానేనని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేయటమే కాకుండా దోచుకుంది. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఉండకూడదనే భావనతో ఎన్టీఆర్ పగలనక, రాత్రనక కష్టపడి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి పార్టీతో కలిస్తే అంతకుమించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తంతారు. అదే జరిగితే ప్రజలే కాదు మనం కూడా క్షమించలేం. నేను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని. నాకు తెలిసి పార్టీలో ఇటువంటి చర్చ జరగలేదు. అటువంటి పరిస్థితి రాదు.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి వస్తే మొదట నేనే వ్యతిరేకిస్తా.. నిలదీస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలిసే పరిస్థితి వస్తే తమలాంటి వాళ్లం ఉండలేమని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోం: డిప్యూటీ సీఎం కేఈ మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం కాంగ్రెస్‌తో పొత్తుపై తన వ్యతిరేకతను బహిర్గతం చేశారు. ఆయన గురువారం కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ, జగన్.. ముగ్గురూ తమకు శత్రువులేనన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈ జాబితాలో చేరుతాడన్నారు. ప్రజలకేం సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కుదుర్చుకోవాలన్న పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిపై తెలుగుదేశం శ్రేణుల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను, రాష్ట్ర నేతలపట్ల అవమానకరమైన రీతిలో వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీరామారావు ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న ఆలోచన చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్రప్రజల ఆత్మగౌరవాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధినేత వైఖరిని అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు కారణంగా పార్టీని పణంగా పెట్టడమేగాక రాష్ట్ర ప్రయోజనాలను సైతం అక్కడి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తాకట్టు పెట్టడంపై టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదాను వదులుకోవడమేగాక రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలు అమలుకాకున్నా నోరెత్తలేని పరిస్థితికి తెలుగుదేశాన్ని దిగజార్చారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారని, అక్కడ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అవుతూ ఏపీలోనూ ఆ పార్టీతో పొత్తులకు పార్టీ అధినేత ముందుకు కదులుతుండడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో తెరవెనుక లాలూచీలు నడిపించిన చంద్రబాబు ఎన్నికలప్పుడు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను టీడీపీలో చేర్చుకోవడమేగాక వారికి టిక్కెట్లిచ్చి పార్టీని నమ్ముకున్న వారికి మొండిచేయి చూపారని అప్పట్లో అవకాశాలు కోల్పోయిన నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ టీడీపీలోకి తీసుకోవడమేగాక వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని, వాటన్నింటినీ దిగమింగుకుంటూ ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చామని వారు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులంటే తామే కాకుండా రాష్ట్ర ప్రజలెవ్వరూ సహించబోరని కరాఖండీగా పేర్కొంటున్నారు. అదే జరిగితే ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడగలేని పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేమన్నారు. గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లను పార్టీలోకి తీసుకొని తమకు పోటీకి అవకాశాలు లేకుండా చేసిన అధినేత ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌తో పొత్తులంటూ సీట్లు లేకుండా చేస్తే తాము చూస్తూ ఉండాలా? అని మండిపడుతున్నారు. -
‘కాంగ్రెస్‌తో పొత్తంటే బట్టలూడదీసి కొడతారు’
సాక్షి, విశాఖపట్నం : వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో జత కట్టనున్నాయనే వార్తల నేపధ్యంలో టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ మంత్రి అయ్యన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగింది కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికేనన్నారు. అలాంటిది కాంగ్రెస్‌తో చేతులు కలిపే పరిస్థితి వస్తే, అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ప్రజలు క్షమించడం కాదు కదా.. మనల్ని మనమే క్షమించుకోలేమని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు అంటే జనాలు గుడ్డలూడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారని తాను అనుకోవటం లేదని, ఒకవేళ నిజంగా ఆయనే కాంగ్రెస్‌తో పొత్తు అంటే అంతకంటే భయంకరమైన తప్పు మరొకటి ఉండదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే, మొట్టమొదట దాన్ని వ్యతిరేకించేది తానేనని ప్రకటించారు. -
కాంగ్రెస్‌తో బాబు పోత్తుపై అయ్యన్న ఆగ్రహం
-
మీ అత్యాశకు బాధ్యత చంద్రబాబుదా?
కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ‘‘అత్యాశకు పోయింది మీరు. రూ.1,000 చెల్లిస్తే రూ.50,000 వచ్చేస్తాయని ఆశపడి అగ్రిగోల్డ్‌లో ప్రీమియంలు చెల్లించారు. దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది?’’ అని రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘ది ఆర్యాపురం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్’ ప్రధాన కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడారు. ‘‘అగ్రిగోల్డ్‌కు సొమ్ము చెల్లించిన వారంతా మమ్మల్ని అడిగి చెల్లించారా? ఆ సంస్థలో సొమ్ము చెల్లించిన వారంతా అత్యాశకు పోయినవారే. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి దండిగా సొమ్ము వసూలు చేసి, చివరకు బోర్డు తిప్పేసింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా బాధ్యత వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని అన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల సీపీఐ నేతలు యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ... అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని సర్ది చెప్పారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) గురించి మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... మహిళలు చీరలు, జాకెట్లు, ఆఖరికి లో దుస్తులు కూడా కొనుగోలు చేయలేని విధంగా జీఎస్టీ ఉందని ఎద్దేవా చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్న ఆగ్రహం
సాక్షి, తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు శనివారం మంత్రులు అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పలను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ బాధలను మంత్రులకు చెప్పుకున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడు వారిపై విరుచుకుపడ్డారు. అంతేకాక మమ్మల్ని అడిగి డబ్బులు కట్టారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ డబ్బు మొత్తం చంద్రబాబు ఇవాలా అని ఆయన అన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేవారు. వెంటనే అక్కడే ఉన్న హోంమంత్రి చిన్నరాజప్ప జోక్యం చేసుకున్నారు. అంతేకాక బాధితులు ఆగ్రహించడంతో వారికి చినరాజప్ప సర్ది చెప్పారు. దీంతో సమస్య కొంత వరకూ తగ్గుముఖం పట్టంది. గత కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని అధికార పార్టీని కోరుతున్న విషయం తెలిసిందే. -
డ్యాన్సర్లతో టీడీపీ మంత్రి చిందులు.. వీడియో వైరల్
సాక్షి, విశాఖ: రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిందులేశారు. ఆయన చిందులేసింది అధికారులపై కాదు.. డ్యాన్లర్లతో కలిసి రోడ్డుపై అదిరేటి స్టెప్పులంటూ కాలుకదిపారు. ప్రజాప్రతినిధి అని మర్చిపోయిన మంత్రి ఇటీవల విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్లతో చిందులేసి ఇరగదీశారు. అంతటితో ఆగకుండా డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరారు. డప్పు దరువుకు అనుగుణంగా లయబద్దంగా ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాటపడితే.. రాష్ట్ర మంత్రి అయుండి ఇలా చిందులు వేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా గతంలో టీడీపీ మంత్రులు కొందరు మహిళా ఉద్యోగినులపై దౌర్జన్యం చేసి పరువు తీస్తే, ఇపుడు మంత్రి అయ్యన్న రోడ్లపై డ్యాన్సర్లతో చిందులేసి ఉన్న కాస్త పరువు తీశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. -
ఏ మలుపు తిరిగేనో..!
సాక్షి, విశాఖపట్నం:ఆబోతుల కుమ్ములాటలో లేగదూడలు బలైనట్టుంది జిల్లా అధికారుల పరిస్థితి ఉంది. జిల్లా పశుగణాభివృద్ధి సంఘం (డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ)నూతన పాలకవర్గ నియామక విషయంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు నిజంగానే ప్రాణసంకటంగా మారింది. తనకు చెప్పకుండా ఎన్నికలు నిర్వహించిన ఈవో సూర్యప్రకాశరావుతో పాటు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావులపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం పశుసంవర్థక శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. మరో వైపు ఈ వ్యవహారంలో తమకేపాపం తెలియదంటూ ఆ శాఖాధికారులు వాపోతున్నారు. కావాలనే గంటా ఒత్తిళ్ల మేరకే తన సిఫార్సులను పక్కన పెట్టేశారని భావిస్తున్న అయ్యన్న కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కలెక్టర్‌కు తెలిసే అంతా.. ఏప్రిల్ 5వ తేదీతో గడువు ముగియనున్న డీఎల్‌డీఏకు కొత్త పాలకవర్గం ఏర్పాటుకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జనవరిలోనే స్వయంగా ఆదేశాలు జారీ చేశారని పశుసంవర్థక శాఖ అధికారులంటున్నారు. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు 17మందిని నామినేట్ చేశాం. ఆయన సూచనల మేరకే ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం. చివరకు ఎన్నికల నిర్వహణ కోసం 21వ తేదీన సభ్యులకు కలెక్టర్ రిఫరెన్స్ నోట్‌తోనే నోటీసులు కూడా జారీ చేశాం. 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం కూడా కలెక్టర్‌కు తెలుసు’నని ఆ శాఖాధికారులు వాదిస్తున్నారు. ఈ విషయంలో తాము చేసిన తప్పేంటో అర్థం కావడం లేదంటున్నారు. అయ్యన్న లేఖపై చర్చించనందునే చర్యలు డీఎల్‌డీఏ కమిటీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, పాత పాలక వర్గాన్నే మరోవిడత కొనసాగించాలంటూ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తనకు రాసిన లేఖపై తనతో చర్చించాలని పశు సంవర్థక శాఖ జేడీ కోటేశ్వరరావుకు పంపానని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెబుతున్నారు. ఆ లేఖపై తనతో చర్చించాలని స్పష్టంగా రాసినా పట్టించుకోకుండా, తనకు చెప్పకుండా అత్యుత్సాహంతో ఎన్నికలు నిర్వహించేశారన్నది కలెక్టర్ వాదన. మంత్రుల మధ్య వైరంలో తమను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమని పశుసంవర్థక శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొ త్తం వ్యవహారంలో తమకే పాపం తెలియదని పశుసంవర్థక శాఖాధికారులు వాదిస్తుంటే... తనతో చర్చించి ఉంటే పరిస్థి తి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని కలెక్టర్ అంటున్నారు. 19న లేఖ రాస్తే 23న జేడీకి రిఫర్ చేస్తారా? మరో పక్క పాత పాలకవర్గాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని డీఎల్‌డీఏ జనరల్ బాడీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కోట్ చేస్తూ తాను చేసిన సిఫార్సు లేఖను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ లైట్‌గా తీసుకోవడం పట్ల మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గాన్ని మరో ఏడాది కొనసాగించాలంటూ తాను గత నెల 19వ తేదీన లేఖ రాశానని, ఆ లేఖపై చర్చించకుండా ఎన్నికలకు 21వ తేదీన నోటీసులు ఎలా జారీ చేస్తారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నిస్తున్నారు. పైగా తాను లేఖ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ప్లీజ్ డిస్కస్ అని జేడీకి పంపడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు నోటీసుల జారీ, జరిగే తేదీ కలెక్టర్‌కు తెలిసే ఉంటుందని తాము భావిస్తున్నామని, మంత్రి గంటా శ్రీనివాసరావు ఒత్తిడి మేరకే మిన్నకుండిపోయి ఉంటారని అయ్యన్న అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల నిర్వహణ కోసం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆదేశాలు జారీ చేసి ఆనక మాట మార్చడంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కాగా ఈ వ్యవహారంపై స్పందించేందుకు కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారులు నోరు మెదిపేందుకు ససేమిరా అంటున్నారు. నేడు గంటా దృష్టికి డీఎల్‌డీఏ వ్యవహారం గంటా అనుచరుడైన గాడు వెంకటప్పడు చైర్మన్‌గా 17 మంది సభ్యులతో ఏర్పడిన ఈ కమిటీ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న దశలో ఇలా బ్రేకుపడడం చర్చనీయాంశంమైంది. తన ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకు బైలా ప్రకారం జరిగిందని, ఎందుకు ఆపాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని వెంకటప్పడు వాదిస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకైనా తాము వెనుకాడబోమని కమిటీలో మరికొంతమంది సభ్యులు వాదిస్తున్నారు. బుధవారం జిల్లాకు రానున్న మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకెళ్లేందుకు వెంకటప్పడు బృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
కాంగ్రెస్ బలపడుతోంది: ఏపీ మంత్రి
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో బీజేపీ గెలిచినా కానీ.. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ రాదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి ఉన్నామని.. ఇరు పార్టీలు పంతాలకు పోతే ప్రజలు నష్ట పోతారని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో.. కలహాలు ఉన్నా కాపురం చేయక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. -
పురందేశ్వరి ఏమైనా ఇంజనీరా?
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టుపై కాఫర్ డ్యాం నిర్మాణం అవసరం లేదంటూ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కాఫర్ డ్యాం గురించి మాట్లాడడానికి ఆమె ఇంజనీరా? ఆమెకేం తెలుసని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న అగ్రి హ్యాక్‌థాన్ సదస్సు ప్రాంగణంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మరో బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో ఉన్న సిసలైన నాయకులెవరూ పోలవరం ప్రాజెక్టు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన వీరు డూప్లికేట్ నాయకులని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా వీరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీరికి సత్తా ఉంటే విమర్శలు మాని కేంద్రం నుంచి పోలవరానికి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. -
నాకేపాపం తెలీదు
► అంతా నా ముందు పని చేసిన వారే చేశారు ► సిట్ ఎదుట మాజీ తహసీల్దార్ శంకరరావు ► భూ కుంభం కోణంలో పెద్దల పేర్లు బయటపెట్టని వైనం సాక్షి, విశాఖపట్నం : విశాఖ భూ కుంభకోణంలో పెద్దల హస్తం ఉందంటూ ఓ పక్క రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్ బృందం ఎదుట హాజరై భూ కుంభకోణాలపై తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు. ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, దందాలపై పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. కేవలం 15 రోజుల్లో సిట్‌కు 2,600కి పైగా ఫిర్యాదులందా యి. వాటిలో 1బీ రికార్డుల ట్యాంపరింగ్, ప్రభు త్వ భూముల కబ్జాకు సంబంధించి సుమారు 15 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు గడిచిన మూడేళ్లలోనే రికార్డుల ట్యాంపరింగ్, భూకబ్జాలు జరిగాయని కుండబద్దలుగొట్టారు. అయితే మాజీ తహసీల్దార్ శంకరరావును విచారించిన సిట్ అధికారులు ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాకే పాపం తెలియదు కాగా.. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావించి మాజీ తహసీల్దార్ శంకరరావును జుడీషియల్ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న సిట్.. అతని నుంచి ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజుల పాటు రహస్య ప్రదేశానికి కెళ్లి..విచారించినప్పటికీ.. ఆయన మాత్రం నోరు మెదపలేదని తెలుస్తోంది. ముఖ్యంగా భీమిలి, విశాఖ రూరల్ పరిధిలో రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ భూమలు కబ్జాలకు సంబంధించి ఎలా జరిగింది.. వెనుక ఎవరున్నారు, ఎవరు చేయించారు తదితర వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు శ్రమటోడ్చాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే.. శంకరరావు మాత్రం.. తనకేపాపం తెలీదని, కావాలనే ఈ వ్యవహారంలో తనను బలిపశువును చేశారని, ట్యాంపరింగ్ వ్యవహారమంతా తన కంటే ముందు పనిచేసిన అధికారుల హయాంలోనే జరిగిందని సిట్ ఎదుట వాపోయినట్లు సమాచారం. 5 రోజుల పాటు జరిగిన విచారణలో అధికార పార్టీ నేతల పేర్లను మాట మాత్రంగానైనా శంకరరావు చెప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుధాకర్ నుంచి కీలక సమాచారం ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు చేసిన ఓ కీలక నిందితుడైన సుధాకర్‌రాజు అలియాస్ దాలి వమ్మినాయుడి నుంచి సిట్ కొంత వరకూ వివరాలు రాబట్టుకుందని చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంపరింగ్‌లో హస్తం ఉన్నట్టు గుర్తించిన 56 మందిలో ఏ ఒక్కరూ చెప్పుకోతగ్గ నేతలు, ప్రజాప్రతినిధులు లేరని సిట్ వర్గాలు చెబుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న సిట్ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయ్యన్న ప్రకటనతో కలవరం మరిన్ని ఆధారాలతో ఈ నెల 19న సిట్‌కు మరో ఫిర్యాదుల చిట్టా అందజేస్తానని మంత్రి అయ్యన్న చేసిన ప్రకటన గంటా వర్గీయులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆరంభం నుంచి ఈ కుంభకోణం వ్యవహారంలో దూకుడుగా విమర్శలు చేసిన బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు కూడా ఈ నెల 20వ తేదీన తనదగ్గరున్న ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్పడిన భూ కబ్జాలు, దందాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన సాక్షికి తెలిపారు. -
మంత్రి గంటాపై ఫిర్యాదు.. టీడీపీలో కలవరం
► సీఎంను కలిసేందుకు విజయవాడకు పయనం! విశాఖపట్నం: విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సీహెచ్ అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ జరుపుతున్న విచారణకు హాజరైన మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు.. మంత్రి గంటాపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలవరం సృష్టించింది. ఆనందపురం మండలం వేములవలసలో ప్రభుత్వ భూములను తమవిగా చూపి మంత్రి సమీప బంధువు పరుచూరి భాస్కరరావు ఇండియన్ బ్యాంకు నుంచి రూ.190 కోట్లు తీసుకున్న వైనంతోపాటు మరికొన్నింటిని అయ్యన్న సిట్‌కు సమర్పించినట్టు సమాచారం. పనిలో పనిగా గంటాతో సఖ్యతగా ఉండే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపైనా భూకబ్జాల ఆరోపణలతో అయ్యన్న సిట్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక ఈ నెల 19న మరిన్ని ఆధారాలతో సిట్‌కు మరలా ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడకు పయనమయ్యారు. సీఎం చంద్రబాబును కలిసేందుకే ఆయన విజయవాడ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. -
మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
అమరావతి: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మంత్రిననే విషయం ఆయనే స్వయంగా చెప్పినా బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేశారు. తిరిగి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. -
అయ్యన్నతో మ్యాచ్ ఫిక్సింగ్
► చంద్రబాబు, గంటా ఆయన నోరు నొక్కేశారు ► విష్ణుకుమార్‌రాజు నోరు వెంకయ్యతో మూయించారు ► వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యలు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖలో భూకబ్జాల అవినీతిలో రాష్ట్ర మంత్రి అయ్యన్నకు భాగం పంచారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఆరువేల ఎకరాల భూములు దోచేశారని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన ఇపుడు మౌనం దాల్చడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో కోట్ల విలువైన భూకుంభకోణంపై ప్రస్తావించారు. భూ కుంభకోణాలపై ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి లోకేష్ అవినీతి సొమ్ముతో నోరునొక్కి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. వేల ఎకరాల భూములు దోచేశారని వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఆపారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు గంటాపై ఆరోపణలు చేశాక గంటా కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి సీబీఐ విచారణకు తానూ సిద్ధమేనని ప్రకటించారని తెలిపారు. బయటకు అలా చెప్పి అయ్యన్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని మండిపడ్డారు. ఆరువేల ఎకరాలు దోచేశారని అయ్యన్న వ్యాఖ్యలు చేస్తే టీడీపీ ప్రభుత్వం అంతకాదు... రెండు మూడు వందల ఎకరాలు ఉంటుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. భూ దోపిడీలపై వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విశాఖలో సేవ్ విశాఖ పేరిట ధర్నాకు దిగడంతో దీనినుంచి బయటపడేందుకే సిట్ విచారణ చేయిస్తున్నారన్నారు. సీబీఐ విచారణ కాకుండా సిట్‌తో దర్యాప్తు చేయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రోజా ఖండించారు. ఘనస్వాగతం: అంతకుముందు ఎమ్మెల్యే రోజాకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలి కారు. వైఎస్సార్సీపీనగర అధ్యక్షురాలు పసుపు లేటి ఉషాకిరణ్‌తో పాటు అనేక మంది నాయకులు ఆమెకు స్వాగతం చెప్పారు. -
మన్యం పట్టని మంత్రులు
► కొడుకు సినిమా ప్రమోషన్లో ఒకరు ► వ్యక్తిగత పనుల్లో మరొకరు ► పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు ► ముఖం చాటేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు ► ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షకు హాజరు కాని వైనం ► ఏజెన్సీలో పర్యటిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి సాక్షి, విశాఖపట్నం: ఆంత్రాక్స్..ఇప్పటికే 10 మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. ఇక విషజ్వరాలతో మన్యం మంచంపట్టింది. రక్తహీనత, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో వందలాది మంది అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా ఉంటోంది. జిల్లా మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఇది పట్టడం లేదు. ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజ సినిమా ప్రమోషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఏజెన్సీవాసుల ఆరోగ్యం పట్ల ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవితేజ నటించిన జయదేవ్ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం గంటా నానా హైరానా పడుతున్నారు. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఇదే రీతిలో ముఖం చాటేశారు. ఆంత్రాక్స్‌తో ఏజెన్సీ అల్లాడి పోతున్నా అయ్యన్న అటువైపు చూడకపోవడం పట్ల ఏజెన్సీ వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు..అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ అటు వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. చివరకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు సైతం సొంత నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా చీమకుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మన్యంలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించినప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ హాజరుకాకపోవడం ఏజెన్సీ వాసుల ఆరోగ్య పరిరక్షణ పట్ల వీరికి ఏపాటి శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతోంది. గిడ్డి ఈశ్వరి ఒక్కరే వైఎస్సార్సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే ఏజెన్సీలో కలియతిరుగుతున్నారు. ఆంత్రాక్స్ విజృంభించిన అరకు నియోజకవర్గంతో పాటు పాడేరులో నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు.ఆంత్రాక్స్ లక్షణాలున్న వారినే కాదు..జ్వరపీడితులు ఎçక్కడెక్కడ ఉన్నారో గుర్తించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి చూస్తున్నారు. -
ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్
విశాఖ : రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో విజయ్‌కు పెద్ద మొత్తంలో షేర్లున్నాయని, దాన్ని అడ్డుకోవాలంటూ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయ్.. తనకు మైనింగ్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయనడం సత్యదూరమన్నారు. అబ్బాయి రెడ్డి, శ్రీనులతో తనను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. -
వెనక్కుతగ్గని అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం సిటీ: విశాఖ భూ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో ఏ పార్టీ నేత పట్టుబడినా శిక్ష పడాల్సిందేనని ఆర్అండ్బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం చెప్పారు. ‘సిట్’ బృందానికి ప్రజలు వాస్తవాలివ్వాలని సూచించారు. ఉన్న భూములను ఎలా కాపాడడంతోపాటు భూ కుంభకోణాల నుంచి విశాఖను రక్షించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ‘సిట్’ వేసినా ప్రతిపక్షాలు ధర్నాలంటూ హడావుడి చెయ్యడం సరికాదన్నారు. విచారణలో ప్రజలకు న్యాయం జరగకపోతే ధర్నా చేపట్టాలని సూచించారు. కుంభకోణాన్ని నీరుగార్చే ఉద్దేశం టీడీపీకి లేదని, ఒకవేళ అదే ఉద్దేశం ఉంటే ‘సిట్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా, టీడీపీ నేతలపై మీడియా ముఖంగా ఆరోపణలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని అయ్యన్నపాత్రుడు ఇరుకునపెడుతున్నారని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాల పరిష్కారానికి త్రిసభ్య ఏర్పాటు చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. ఇంత జరిగినా అయ్యన్నపాత్రుడు వెనక్కుతగ్గకపోవడం గమనార్హం. -
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ
-
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ
హైదరాబాద్ : విశాఖ భూముల వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సేవ్ విశాఖ’ పేరుతో మహాధర్నాకు సిద్ధమైన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుతో ప్రెస్ మీట్ పెట్టించారు. వైఎస్ జగన్ ధర్నాపై విమర్శలకు అయ్యన్నను చంద్రబాబు ప్రయోగించారు. ఆరోపణలు చేసిన తానే ఎలా ప్రెస్‌మీట్ పెడతానంటూ అయ్యన్న తన అనుచరుల వద్ద మల్లగుల్లాలు పడ్డారు. అయితే విధిలేని పరిస్థితుల్లో అధినేత ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రెస్‌మీట్ పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా సిట్ నేతృత్వంలో నిఖార్సు అయిన విచారణ జరుగుతుందని ఆయనతో చంద్రబాబు చెప్పించే యత్నం చేశారు. అయ్యన్నను అస్త్రంగా.. అయ్యన్నపాత్రుడు ప్రెస్మీట్లో మాట్లాడుతూ... ‘విశాఖ భూముల కబ్జా గురించి మొదట స్పందించింది నేనే. నా తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మేమిద్దరం మాట్లాడాకే కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ వేశారు. కబ్జాలకు పాల్పడిన నేతల పేర్లు ఉంటే సిట్‌ను కలిసి విపక్ష నేతలు ఇవ్వాలి. అన్యాయం జరిగిన ప్రజలు కూడా సిట్‌కు తమ ఆవేదనను తెలియచేయాలి. భూ కబ్జాలపై వైఎస్ జగన్ ధర్నా చేయాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అయన్నపాత్రుడిపై చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు లేఖ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారని ఫిర్యాదు అమరావతి: విశాఖ టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ప్రభుత్వంపై విమర్శలు ఇరుకున్నపెడుతున్న అయ్యన్నపాత్రుడి వైఖరిపై అధినేతకు గంటా ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. అయన్నపాత్రుడి తీరుతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకల పథకాలపై నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారని వాపోయారు. ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూకుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం సంచలనం రేపిందని గుర్తు చేశారు. అయన్నపాత్రుడి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. అయన్న ఆరోపణలతో విశాఖ ప్రతిష్టతో పాటు యావత్ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాద ముందని ఆవేదన చెందారు. విశాఖ భూకుంభకోణంపై సీబీసీఐడీ, సీబీఐ లేదా జట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని గంటా శ్రీనివాసరావు లేఖలో కోరారు. -
మంత్రి పదవిని వదులుకుంటా..
►నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి అయ్యన్న కీలక వాఖ్యలు ►నిజాన్ని చెప్పడంలో దేనికైనా సిద్ధమంటున్న మంత్రి ►రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు సహకరించాలని వినతి నర్సీపట్నం : తాను నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. భూ దోపిడిదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి అధికంగా జీతాలు తీసుకుంటున్నా, వీరింతా విధులకు ఎగనామం పెట్టి నర్సీపట్నంలో వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. విభజన జరిగిన తరువాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా సీఎం చంద్రబాబు నిధులు కేటాయింపులు చేస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి గడచిన రెండేళ్లలో 11,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మాణం చేశామని ఆయన పేర్కొన్నారు. దేశంలో మిగిలిన 28 రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. దీనికి కేంద్రం ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 4,500 అంగన్వాడీ భవనాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 10లక్షల గృహాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేసి విశాఖకు పోలవరం జలాలను తీసుకువస్తామన్నారు. పోలవరం జలాలు రావడంతో జిల్లా కొత్తగా 70 పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈ పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇలాంటి ప్రభుత్వ కార్యాక్రమాలన్నీ సజావుగా సాగాలంటే అధికారుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన కోరారు. నర్సీపట్నం మెయిన్ రోడ్డును వంద అడుగుల మేర విస్తరిస్తామన్నారు. పది మంది తిట్టుకున్నా...,90 శాతం మంది ప్రయోజనార్ధం రోడ్డు విస్తరణ చేసి తీరుతానన్నారు. -
మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా...
విశాఖ : రోడ్లు భవనాల శాఖలో అందరి సమన్వయంతో పనిచేస్తానని ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని, అందరికీ పదవులు ఇవ్వడం కష్టమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనకు కేటాయించిన ఆర్అండ్బీ శాఖ సంతృప్తికరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాల వారితో పనిచేయడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్నందున... కొత్తగా ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు మంత్రిగా సలహాలు ఇస్తానని అయ్యన్న తెలిపారు. కాగా ఏపీ మంత్రివర్గ పునరవ్యవస్థీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ కోసం పంచాయతీ రాజ్ శాఖను కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అయ్యన్న ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీరాజ్ శాఖను చిన్నబాబు లోకేశ్‌కు కేటాయింపుతో ఆ శాఖను అయ్యన్న త్యాగం చేయాల్సి వచ్చింది. -
అయ్యన్నకు శాఖా చలనం
►గంటా సీటు పదిలం ►లోకేష్ కోసం పంచాయతీరాజ్‌ను త్యాగం చేసిన అయ్యన్న ►ఆయనకు తాజాగా రోడ్లు, భవనాల అప్పగింత ►ఆరోపణలను అడ్డుకున్న సమీకరణలు అందువల్లే మార్పు నుంచి తప్పించుకున్న విద్యామంత్రి విశాఖపట్నం :రాష్ట్ర మంత్రివర్గ పునరవ్యవస్థీకరణలో తమ పదవులను కాపాడుకోగలిగిన జిల్లా మంత్రులిద్దరిలో ఒకరికి మాత్రమే శాఖామార్పు జరిగింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావును వేరే శాఖకు మార్చవచ్చని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఆయన్ను శాఖలో కొనసాగనిస్తూ.. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడుకు మాత్రం శాఖ మార్చారు. తాజా శాఖల కేటాయింపులో అయ్యన్నకు రోడ్డు, భవనాల శాఖ లభించింది. అయ్యన్న ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖను చిన్నబాబు లోకేష్‌కు కేటాయిస్తారని ముందునుంచీ ప్రచారం జరగడంతో అయ్యన్నకు స్థాన చలనం తప్పదని అందరూ భావించారు. చివరికి అదే జరిగింది. అయ్యన్న చేతిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను లోకేష్‌కు కేటాయించారు. గతంలో అయ్యన్న ప్రాతినిధ్యం వహించిన అటవీ, ఆర్ అండ్ బీ శాఖల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని భావించగా.. ఊహించినట్టుగానే ఆర్ అండ్ బీ శాఖను కట్టబెట్టారు. ఇక శాఖమార్పు తథ్యమని భావించిన గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఎలాంటి మార్పు చేయకుండానే పాత శాఖలోనే కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అందర్ని ఆశ్చర్యపర్చింది. టెన్త్, ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు వివిధ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటాను రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పించే సాహసం చేయలేని చంద్రబాబు కనీసం శాఖనైనా మారుస్తారంటూ బలంగా ప్రచారం జరిగింది. విద్యాశాఖలో తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖ నుంచి తప్పించి గతంలో తాను నిర్వహించిన ఓడ రేవులు, షిప్పింగ్‌ల శాఖ కేటాయించాలని గంటా సైతం ముఖ్యమంత్రిని కోరారు. మరో వైపు మానవవనరుల శాఖలో భాగమైన ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలను తప్పించి ప్రాధమిక, మాధ్యమిక శాఖలకు పరిమితం చేస్తారని భావించారు. కానీ ఉహాగానాలకు తెర దించుతూ గంటాను ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలతో కూడిన మానవవనరుల శాఖలోనే కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తమ నాయకుడికి శాఖ మార్చిన సీఎం.. గంటా శాఖను మార్చకపోవడంపై అయ్యన్న వర్గీయులు కొంత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. -
సాక్షి ప్రతికను టీడీపీ చదవద్దని చెప్పింది
-
‘నీ బావను గెలిపించుకోలేవు కానీ..’
విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి అయ్యన్నపాత్రుడు శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘అనకాపల్లిలో నీ బావ అల్లు అరవింద్ పోటీ చేస్తే నువ్వు, నీ అన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు. అప్పటికే పెద్ద హీరోలు అయ్యుండి అల్లు అరవింద్‌ను గెలిపించుకోలేని మీరు రాజీనామా చేస్తే అవంతి శ్రీనివాస్‌ను గెలిపిస్తారా?. నీకు ఎంపీలను గెలిపించే సత్తా ఉంటే ఆ రోజు ఎందుకు గెలిపించుకోలేకపోయావు. ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలి. పవన్ కల్యాణ్ మాట్లాడటానికి ఓ అర్థం ఉండాలి.’ అని ఎద్దేవా చేశారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఎంపీ అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తే జనసేన నుంచి అనకాపల్లి టిక్కెట్ ఇచ్చి తాను అక్కడే ఉండి గెలిపిస్తానంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘హోదాపై పార్లమెంట్లో ఇచ్చిన మాట నిలుపుకోవాలి’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తున్నందున పార్లమెంటులో ఇచ్చిన మాటను కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన పాత్రుడు కోరారు. శుక్రవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాల్లో విభేదాలు సహజమని, టీడీపీ, బీజేపీలు పొత్తును వదులుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా ఇంకా ఎక్కువగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 1,300 పంచాయతీల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నామని, 6 వేల పంచాయతీ భవనాలు, 2,500 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించనున్నామని చెప్పారు. ఈ ఏడాది రూ.2,500 కోట్లతో గ్రామాల్లో 5 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను, డ్రైన్లను అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో శ్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, పంచాయతీలు తీర్మానం చేసి పంపితే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో శ్మశానం అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. హుద్‌హుద్ తుపానులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.350 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న రోడ్లను రూ. 61 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మంత్రితో ఉన్నారు. -
త్వరలో 4600 పోలీసు పోస్టుల భర్తీ
మహిళల రక్షణకు ప్రత్యేక యాప్: హోంమంత్రి చినరాజప్ప ఎస్.రాయవరం: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత అధికంగా ఉందని, త్వరలో 4600 పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. విశాఖ జిల్లా అడ్డురోడ్డు జంక్షన్ వద్ద నక్కపల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాలు నిర్వహించాలని, తప్పుడు ఫిర్యాదులతో వచ్చే వారిపై పార్టీలకతీతంగా కఠినంగా వ్యహరించాలని సూచించారు. మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు.అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పంచాయతీల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. -
వీర్రాజుపై అయ్యన్న గరంగరం
కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం విదిలింపు అన్నిరాష్ట్రాలకు ఇచ్చినట్టే రాష్ట్రానికీ నిధులు రూ. 2500 కోట్లతో గొప్ప రాజధాని ఎలా సాధ్యం? విశాఖపట్నం : కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా సాయం చేయడం లేదని, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకూ నిధులు ఇస్తోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేసారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన నిధులు ఇచ్చామన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి అయ్యన్న ఘాటుగా స్పందించారు. విభజన తరువాత అన్యాయానికి గురైన ఏపీని ఎక్కువ నిధులిచ్చి ఆదుకోవాల్సి ఉండగా, బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశం తర్వాత ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయని విమర్శించారు. మంగళవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఐతేప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడేందుకు ఇది సమయం కాదని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండబోయే మూడేళ్లలో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఢిల్లీని మించిని రాజధానిని ఏపీకి నిర్మిస్తామని ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో చెప్పారని, ఐతే రూ. 2500 కోట్లతో అలాంటి రాజధానిని నిర్మించడం కష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 20 సార్లు ఢిల్లీ వెళ్లి మోదీకి, ఆయన క్యాబినెట్లో మంత్రులకు విజ్ఞప్తి చేశారని అయ్యన్న చెప్పారు. -
రగిలే జ్వాల!
పక్కా ప్రణాళికతో ఆజ్యం పోస్తున్న అయ్యన్న డిమాండ్ల చిట్టా విప్పుతున్న కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులు మంత్రి గంటా వర్గానికి షాక్ విశాఖపట్నం: అనుకున్నంతా అవుతోంది. కొణతాల వర్గం ప్రభావం టీడీపీ వర్గవిభేదాల చిచ్చును మరింతగా రాజేస్తోంది. ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకుండానే కొణతాల వర్గం తమ మనసులో మాట బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి, పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీ టిక్కెట్లు తమవేనని వ్యూహాత్మకంగా వెల్లడించింది. అయ్యన్న తెరవెనుక ఉండి ఆడిస్తున్న ఈ రాజకీయ నాటకం గంటా వర్గంలో కలవరం రేకెత్తిస్తోంది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రంగా స్పందించగా... మంత్రి గంటా ఆత్మరక్షణలో పడ్డారు. వ్యూహాత్మకం: కొణతాల వర్గం పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గంటా వర్గానికి తాజా పరిణామం షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో యలమంచిలి టిక్కెట్టు గండి బాబ్జీదేనని కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులిచ్చింది. మునగపాకలో నిర్వహించిన సమావేశంలో కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ గండి బాబ్జీ వస్తేనే యలమంచిలి సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానిచండం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా వర్గంలో కీలకమైన పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తుతం యలమంచిలి ఎమ్మెల్యేగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కదని కొణతాల వర్గం చెప్పకనే చెప్పింది. ఈ పరిణామంతో పంచకర్ల రమేష్‌బాబే కాదు మొత్తం గంటా వర్గం బిత్తరపోయింది. పంచర్ల ఎదురుదాడికి దిగారు. అసలు పార్టీలో చేరకుండానే యలమంచిలి టిక్కెట్టు తమదేనని కొణతాల వర్గం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యలమంచిలి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ శ్రేణులకు భవిష్యత్తు రాజకీయాలపై ఉప్పందింది. జాబితా ఇంకా పెద్దదే.... మంత్రి గంటా వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మంత్రి అయ్యన్న పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నారు. చక్రం తిప్పుతున్నారు. తాను తెరపైకి రాకుండా కొణతాల వర్గంతో కథ నడిపించాలని ఆయన ఎత్తుగడ వేశారు. వ్యూహాత్మకంగా పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలతోపాటు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. గండి బాబ్జీ రాకను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గండి బాబ్జీ పెందుర్తి మీద కాకుండా మరో నియోజకవర్గంపై కన్నేశారనే లీకులు ఇచ్చింది. తద్వారా ఎమ్మెల్యే బండారును ప్రస్తుతానికి చల్లబర్చవచ్చన్నది అయ్యన్న వర్గం వ్యూహం. కానీ వాస్తవానికి పెందుర్తి, యలమంచిలి రెండు నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని బలోపేతం చేయడానికి పావులు కదుపుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా కొణతాల వర్గం నుంచి పార్టీలో చేరేవారికే వచ్చేలా చేయాలన్నది అయ్యన్న వ్యూహం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొణతాల వర్గం, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల మధ్య పూర్తి సఖ్యత ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య వివాహ బంధం ఏర్పడనుంటమే ఇందుకు కారణం. దాంతో గంటా వర్గం నుంచి పెందుర్తి, యలమంచిలి స్థానాలు, అనకాపల్లి ఎంపీ స్థానాన్ని లాక్కోవాలని అయ్యన్న వ్యూహరచన చేశారు. గంటా వర్గం తర్జన భర్జన తాజా పరిణామాలతో గంటా వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఎదురుదాడి చేశారు. కానీ అయ్యన్న వర్గం పక్కా వ్యూహంతో వెళుతుండటంతో ఏంచేయాలన్నదానిపై మంత్రి గంటా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తమ వర్గం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే జారుకున్నారు. పాకయరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండారు, పంకచర్ల, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లకు వారి నియోజకవర్గాల్లోనే పొగ బెడుతున్నారు. దాంతో తాము ఎలా ఎదురుదాడి చేయాన్నదానిపై మంత్రి గంటా తమవర్గీయులతో తీవ్రంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గ పోరు మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
'అవును.. అది మా ప్రభుత్వం తప్పే'
పిఠాపురం టౌన్(తూర్పుగోదావరి): రాష్ట్రంలో ఇసుక మాఫియాను నిరోధించడంలో ప్రభుత్వం విఫలం చెందడం తమ తప్పేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక ధరను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారని అన్నారు. ఇసుక రీచ్‌లకు ధర నిర్ణయించి, బహిరంగ వేలం ద్వారా అమ్మకాలు చేయడానికి విధాన నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల నష్టపోయే డ్వాక్రా సంఘాలకు కొంత శాతం నిధులు సమకూరుస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం తప్పనిసరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీకి చెందిన ఒకరిద్దరు నేతలు టీడీపీని విమర్శించడం వల్ల పెద్దగా నష్టం ఉండదని, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీ కలయికను నమ్మి ఓట్లేశారని, దీనిని అందరూ గౌరవించాల్సి ఉందని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి ఎయిర్‌పోర్టు అవసరం లేదా ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టులు వద్దని కొందరు నేతలు రెచ్చగొడుతున్నారని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేమి ఉన్నవారే ఎయిర్‌పోర్టును అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఎయిర్‌పోర్టు అవసరం లేదా ? అని రాజకీయ నేతలను అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం చంద్రబాబు ప్రభుత్వం భూములు సేకరిస్తుంది. అయితే తమ భూములు ఇచ్చేది లేదని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం భోగాపురం మండల ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అండగా ఉంటానని సదరు రైతులకు భరోసా ఇచ్చారు. పేదలు, రైతుల భూముల చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడుపై విధంగా స్పందించారు. -
దోస్త్ మేరా దొస్త్
-
మంత్రి అయ్యన్ననివాసం ముట్టడి
మహారాణిపేట: ఎంపీడీవో పోస్టులను అమ్ముకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. విశాఖలోని మంత్రి అయ్యన్నపాత్రుడి నివాసాన్ని ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరుద్యోగులు శుక్రవారం ముట్టడించారు. మంత్రి నివాసం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 122 ఎంపీడీవో పోస్టులను, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంత్రి అయ్యన్నపాత్రుడు అమ్మకుని నిరుద్యోగులను నిరాశపరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,600 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ పోస్టులను ఎపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
గంటా, చింతకాయల మధ్య మరో వివాదం!
-
గంటా వర్గం నుంచి అయ్యన్న వర్గం వైపు...
విశాఖపట్నం: టీడీపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తాజాగా మరోసారి బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో విశాఖ జిల్లా టీడీపీ నేత ఉప్పలపాటి వెంకట రమణ మూర్తిరాజు(కన్నబాబురాజు) రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చంద్రబాబు తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే అయ్యన్నపాత్రుడితో కలిసి ఆయన బుధవారం హైదరాబాద్ లో ప్రత్యక్ష మయ్యారు. ఆయనను అయ్యన్నపాత్రుడు స్వయంగా సీఎం చంద్రబాబుకు వద్దకు తీసుకొచ్చారు. కన్నబాబును బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింప జేసేందుకు అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. కాగా నిన్నటివరకు తమ వర్గంలో ఉండి ఒక్కసారిగా అయ్యన్నపాత్రుడు వైపు కన్నబాబు చేరడంతో మంత్రి గంటా వర్గం అవాక్కయింది.