త్వరలో 4600 పోలీసు పోస్టుల భర్తీ
మహిళల రక్షణకు ప్రత్యేక యాప్: హోంమంత్రి చినరాజప్ప
ఎస్.రాయవరం: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత అధికంగా ఉందని, త్వరలో 4600 పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. విశాఖ జిల్లా అడ్డురోడ్డు జంక్షన్ వద్ద నక్కపల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాలు నిర్వహించాలని, తప్పుడు ఫిర్యాదులతో వచ్చే వారిపై పార్టీలకతీతంగా కఠినంగా వ్యహరించాలని సూచించారు.
మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు.అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పంచాయతీల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు.