‘నీ బావను గెలిపించుకోలేవు కానీ..’ | Ayyanna patrudu takes on pawan kalyan demands MP avanthi srinivas to Resign | Sakshi
Sakshi News home page

‘నీ బావను గెలిపించుకోలేవు కానీ..’

Published Sat, Sep 10 2016 1:39 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

‘నీ బావను గెలిపించుకోలేవు కానీ..’ - Sakshi

‘నీ బావను గెలిపించుకోలేవు కానీ..’

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్పై మంత్రి అయ్యన్నపాత్రుడు శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్పై మంత్రి అయ్యన్నపాత్రుడు శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘అనకాపల్లిలో నీ బావ అల్లు అరవింద్ పోటీ చేస్తే నువ్వు, నీ అన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు.

అప్పటికే పెద్ద హీరోలు అయ్యుండి అల్లు అరవింద్ను గెలిపించుకోలేని మీరు రాజీనామా చేస్తే అవంతి శ్రీనివాస్ను గెలిపిస్తారా?. నీకు ఎంపీలను గెలిపించే సత్తా ఉంటే ఆ రోజు ఎందుకు గెలిపించుకోలేకపోయావు. ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలి. పవన్ కల్యాణ్ మాట్లాడటానికి ఓ అర్థం ఉండాలి.’ అని ఎద్దేవా చేశారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఎంపీ అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తే జనసేన నుంచి అనకాపల్లి టిక్కెట్ ఇచ్చి తాను అక్కడే ఉండి గెలిపిస్తానంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement