budi mutyala naidu
-
పారిపోయిన సీఎం రమేష్
-
డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర
-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
ఒక రౌడీని గెలిపిస్తే అనకాపల్లి నాశనం అయిపోతుంది
-
అనకాపల్లిలో సామాన్యుడు బలవంతుడికి మధ్య పోటీ- బూడి ముత్యాలనాయుడు
-
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన YSRCP
సాక్షి, గుంటూరు: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె. గత ఎన్నికల ఫలితాలేంటీ? మాడుగుల స్థానంలో పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు. -
బొబ్బిలిలో బడుగుల గర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్‌లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం–వెల్నెస్ సెంటర్ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్... జై వైఎస్సార్సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం: పుష్పశ్రీవాణి సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునామీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్‌ను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. -
బడుగు బలహీనర్గాలకే కీలక పదవులు: బూడి మూత్యాల నాయుడు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు. ఎంపీ సత్యవతి పాయింట్స్ ►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది. బూడి ముత్యాల నాయుడు పాయింట్స్ ►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు. ►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు. ►కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు. ►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు. ►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా. ►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. ►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్ ►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు. ►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు. ►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు ►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా? ►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా? ►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు. ►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు. ► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి. ►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్. ►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు. ►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి. ►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు. ►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. ►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు. ►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు రాజన్న దొర డిప్యూటీ సీఎం ►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. ►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు. ►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. ►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు. ►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు. ►పేదలు పక్ష పాతి సీఎం జగన్ ►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్ ►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ. ►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు. ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు. ►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే. ►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్‌గానే పోటీ చేస్తారు. ►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది. -
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఇవాళ ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి: డిప్యూటీ సీఎం
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు: డీప్యూటీ సీఎం
-
బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన కలిగించాం: బూడి
-
చిత్తశుద్ధితో కొత్త అర్థం చెప్పిన సీఎం జగన్
-
‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్ చేస్తారా?^
సాక్షి, మాడుగుల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినా ఆ బాధ వారి కుటుంబ సభ్యుల్లో కనిపించడంలేదని అన్నారు. కాగా, బూడి ముత్యాల నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కాం కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జైలులో బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు. నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం కలిసి ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు కదా?. రూ.371 కోట్ల అవినీతిలో చంద్రబాబు అడ్డంగా దొరికొపోయారు కాబట్టే జైలు జీవితం గడుపుతున్నారు. స్కిల్ స్కాంలో బయటపడింది కేవలం గోరంత మాత్రమే. చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే.. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు -
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
-
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏం చేసాడో చూడండి
-
63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,14,192 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గురువారం నుంచి 1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవారమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా..స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు లబ్ధిదారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పంపిణీ ప్రక్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
పథకాలను సీఎం ప్రతినిధులుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ఆయన ప్రతినిధులుగా గ్రామీణ ప్రజలకు వివరించి.. వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత మీదేనని వైఎస్సార్సీపీ సర్పంచులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 175 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సర్పంచులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడుతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని సమస్యలను, ఇతర అంశాలను సజ్జల రామకృష్ణారెడ్డి, బూడి ముత్యాలనాయుడుల దృష్టికి సర్పంచులు తీసుకొచ్చారు. వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచులకు వారు హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచులను ఉద్దేశించి సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా సీఎం వైఎస్ జగన్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన, కోవిడ్, ఆర్థిక సమస్యలు.. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పేదరికాన్ని పోగొట్టడం, విద్య, వైద్యం వంటి విషయాల్లో ప్రయోజనం కలిగేలా సీఎం వైఎస్ జగన్ దార్శనికతతో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలకు అవకాశాలు కల్పించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా పేదలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. పథకాల ఫలాలు ప్రజలకు చేరడం వల్లే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం ఆ పథకాల ఫలితాలు మరింతగా ప్రతి కుటుంబానికి చేరడంతో ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ మరింతగా పెరిగిందని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులమేగానీ దొరలం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలతో సర్పంచుల అధికారాలను హరించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆయన ప్రతినిధులుగా ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు. పథకాలు అందుతున్న తీరు తెన్నులను మీరే పరిశీలించాలి. తద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుందంటే.. మీకు, మనందరికి ఆదరణ పెరిగినట్లే’ అని సజ్జల చెప్పారు. ప్రతిపక్షాలకు సర్పంచులు కనీస సంఖ్య లేకున్నా.. పాత సంఘాల పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సర్పంచులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లతో రాష్ట్రస్థాయి కార్యవర్గం: మంత్రి బూడి ముత్యాలనాయుడు మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి సంబంధించిన సర్పంచులతో రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దాని ద్వారా వారి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచులకు నిధులివ్వడం లేదంటూ ప్రతిపక్షాల విమర్శలు అర్థంలేనివన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రాం వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు. -
ఐదేళ్ళలో టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పారు: బూడి ముత్యాలనాయుడు
-
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు: బూడి ముత్యాలనాయుడు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సీరియస్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ కంటే పెద్ద సైకోలు ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బూడి ముత్యాలనాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ప్రజాసంక్షేమం అవసరం లేదు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడండి. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావు. మూడున్నర ఏళ్ల కాలంలో ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడారా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాఉ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదు. అయ్యన్న పోలీసులపై ఇష్టానుసారం మాట్లాడతారా?. టీడీపీ నేతల మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ నేతల తీరుతోనే గుంటూరులో అమాయకులు బలయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడాలి. 650 హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు 57.88 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 37.07 లక్షల మందికి రూ.1021.02 కోట్లు అందజేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి దాకా.. ప్రతి నెలా వీరు రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 1 నుంచి జరిగే పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి పండుగ వాతావరణంలో వారోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. జనవరి 3వ తేదీన సీఎం వైఎస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. 64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. జనవరి ఒకటి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది. మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు ► 1వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. 7వ తేదీ వరకు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విడతల వారీగా అన్ని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్, నగర కార్పొరేషన్ల వారీగా ఫించను లబ్ధిదారుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు స్థానిక ప్రజా ప్రతిని«ధులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3వ తేదీ రాజమండ్రిలో పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపు వారోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణకు ప్రభుత్వం మండల కేంద్రానికి రూ.10 వేలు, మున్సిపాలిటీకి రూ.15 వేలు, కార్పొరేషన్‌కు రూ.50 వేలు, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద కార్పొరేషన్లకు రూ.లక్ష.. విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.1.50 లక్షలు విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.20 వేల చొప్పున ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. కొత్తగా బియ్యం.. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ► పింఛన్లు రూ.2,750కి పెంపుతో పాటు కొత్తగా పెన్షన్, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను (జూలై 2022 నుంచి నవంబర్ 2022 వరకు) అర్హులైన వారికి మంజూరు కార్డులను వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. ► 44,543 మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు, 14,401 కుటుంబాలకు కొత్తగా ఆరోగ్యశ్రీ, మరో 14,531 కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ► వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింఛన్ల కోసం రూ.62,500 కోట్లు ఖర్చు పెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తాజాగా 64.06 లక్షలకు పెరిగింది. పెరిగిన పింఛన్లపై ఏటా రూ. 21,180 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా.. ► చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పింఛన్‌ను జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రూ.2,250కు పెంచడంతో పాటు.. 2022 జనవరిలో రూ.2,500కు, ఈ జనవరి నుంచి రూ.2,750కి పెంచుకుంటూ వచ్చారు. ► గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నెల వారీగా పింఛన్ల పంపిణీకి అరకొరగా రూ.400 కోట్ల చొప్పున పంపిణీ చేయగా, 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ల వ్యయం ఏకంగా మూడున్నర రెట్లు పెంచి రూ.1,350 కోట్లు ఖర్చు చేసింది. ► గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తద్వారా 2019లో 52.17 లక్షలకు, 2022లో 62.31 లక్షలకు, 2023లో 64.06 లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది. లంచం, వివక్ష లేకుండా పింఛన్ల మంజూరు కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే తారతమ్యాలు లేకుండా.. లంచాలు, వివక్షకు అవకాశం ఇవ్వకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం సంతప్త స్థాయిలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు మంజూరు అవుతున్నాయి. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించే పద్దతే ఉండేది కాదు. లంచాలు.. లేదంటే వివక్షే కనిపించేది. టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అర్హులను గుర్తించేవి. వాళ్లు లంచాలు ఇస్తేనో లేక తమ వర్గం, తమ పార్టీ వాళ్లో అయితేనే పింఛన్లు మంజూరు చేసేవారు. ఒక్కొక్క గ్రామానికి ఇన్ని పింఛన్లే అని కోటా పెట్టుకొని, ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పింఛన్లు ఇచ్చే వారు కాదు. మాకు పింఛను అర్హత ఉంది కదా అని ఎవరైనా అడిగితే.. మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి స్థానంలో ఇస్తామని నిస్గిగ్గుగా చెప్పేవారు. పింఛన్లు తీసుకోవడం కోసం వృద్దులు, దివ్యాంగులు ప్రతి నెలా చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల డబ్బులు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కూడా పూర్తి పాదర్శకంగా చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. పేదలకు పెద్దన్న సీఎం జగన్ కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛను పెంపు ద్వారా పేదల కళ్లల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు, ఆత్మ గౌరవం తీసుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏకంగా 64.06 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సీఎం జగన్.. తన సంక్షేమాభివృద్ధి పాలన ద్వారా రాష్ట్రంలో పేదలకు పెద్దన్నగా మారారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామినైనందుకు గర్వ పడుతున్నాను. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి -
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష
-
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని) -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు: డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
1వ తేదీనే రూ. 1,404.03 కోట్లు పంపిణీ
సాక్షి, అమరావతి: ఠంచన్‌గా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వలంటీర్లే వెళ్లి డబ్బులు అందజేశారు. మంగళవారం ఒక్క రోజునే 55,23,610 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,404.03 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలకు గాను 62,33,382 మంది పింఛన్‌దారులకు పంపిణీ చేసేందుకు రూ.1,585.60 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఒక్క రోజు ముందే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పంపిణీ ప్రారంభించి తొలి రోజు 88.55 శాతం మందికి పంపిణీ పూర్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో ఐదవ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం 62.33లక్షల మంది పెన్షనర్లకు రూ.1585.60 కోట్లను విడుదల చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 57.42 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. 35.79 లక్షల మందికి రూ.908.63 కోట్లు అందజేశారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. -
‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇంట్లో దాక్కుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా? తన నియోజకవర్గానికి అయ్యన్నపాత్రుడు ఏం చేశాడు?. మీరెప్పుడు ఊహించని రీతిన సీఎం జగన్ నర్సీపట్నం సమీపంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో అయ్యన్న చంద్రబాబుకు సహకరించారు. అయ్యన్న సైకో. ఆయన ప్రవర్తన నర్సీపట్నం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని ముత్యాలనాయుడు అన్నారు. -
పేదల ‘ఉపాధి’కి గండికొట్టాలని ప్రయత్నం
సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా పేదలకు ఉపాధి కల్పిస్తే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కొందరు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పథకం గురించి తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తూ కూలీలకు పనిలేకుండా చేసి వారి జీవనోపాధికి గండికొట్టాలని చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. 2020 జూలై 16న, గత ఏడాది జూలై 14న, నవంబర్ 26న, ఈ ఏడాది ఆగస్టు 22న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. అవన్నీ తప్పుడు ఫిర్యాదులు కావడంతో కేంద్రం ఎలాంటి చర్యలకు పూనుకోలేదని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు అతిక్రమించలేదని తెలిపారు. రాష్ట్రంలో పేదల ఉపాధికి గండికొట్టేలా చంద్రబాబుకు మద్దతు పలికే పత్రికలు కూడా తప్పుడు కథనాలు రాస్తున్నాయని పేర్కొన్నారు. నిరాధారమైన, అవాస్తవమైన వివరాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేవారు. -
గ్రామాల్లో అభివృద్ధి కనిపించటం లేదా?
విశాఖపట్నం (దొండపర్తి): ఒకవైపు గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుండటంతో పంచాయతీల విషయంలో ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో తెలియక ‘ఈనాడు’ పత్రిక ఇష్టానుసారం కథనాలు రాస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీల నిధులు మళ్లించారంటూ... పీడీ ఖాతాల్లో జమ చేశారం టూ... విద్యుత్ బకాయిలు చెల్లించేస్తున్నారంటూ పొంతన లేని కథనాలు రాయడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా అప్రదిష్టపాలు చేసి, చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలన్న తాపత్రయంతో పచ్చ పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ‘ఊళ్లలో ఇంతకు ముందెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు కొత్త రూపం తెచ్చుకున్నాయి. ఊరికి ఇంగ్లిష్ మీడియం చదువులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు వచ్చాయి. అదే ఊళ్లో కాస్త ముందుకెళితే నిత్యం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందుబాటులో ఉండే విలేజ్ హెల్త్ క్లినిక్ కనిపిస్తోంది. అక్కడే పరీక్షలు చేయటంతో పాటు ఇంకాస్త మెరుగైన చికిత్స అవసరమనిపిస్తే వాళ్లే టెలీ కన్సల్టింగ్ చేయిస్తున్నారు. అదే ఊళ్లో రైతు అవసరాలు తీర్చే ఆర్బీకే, దూరాభారాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయం అన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నిటి విలువ దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు. గ్రామాల్లో ఇంత అభివృద్ధిని గతంలో కనీసం ఊహించారా? వీటన్నిటినీ తట్టుకోలేక రాష్ట్రంలో కేవలం 10 శాతం ఉన్న టీడీపీ సర్పంచ్‌లను రోడ్డు మీదకు తీసుకువచ్చి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని జనం గ్రహించలేదనుకుంటున్నారా?’’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దివాళాకోరు తనానికి నిదర్శనం మొన్నటిదాకా పంచాయతీల ఖాతాల్లోకి నిధులింకా జమ చేయలేదని, వాటన్నిటినీ మళ్లించేశారని రాసిన ‘ఈనాడు’... ఇపుడు పీడీ ఖాతాల్లో వేశాక కూడా ఆందోళనలంటూ వార్తలు రాయటం దివాలాకోరుతనానికి నిదర్శనమని ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. ‘గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా గతంలోకన్నా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి. ఉపాధి హామీ నిధులు కాకుండా, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి సొంతంగా పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున దాదాపు రూ.3,000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాల నిమిత్తం ఇస్తున్న ఈ నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా ఖర్చుచేయాల్సిన బాధ్యత, చేసే అధికారం సర్పంచులకే ఉంది’ అని వివరించారు. గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది కాబట్టే తెలుగుదేశం, దాని మిత్రపక్ష మీడియా జీర్ణించుకోలేకపోతోందన్నారు. పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లించడాన్ని కూడా ఏదో తప్పు చేస్తున్నట్లుగా చూపించడాన్ని విమర్శించారు. ‘పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా డిస్కంలకు బకాయి పడ్డాయి. వాటిని తీర్చాలి కదా? డిస్కంలు కూడా పనిచేయాలి కదా? అవి ఆర్థికంగా బాగుంటేనే కదా రాష్ట్రానికి కరెంట్ ఇవ్వగలిగేది? ఈ మాత్రం కూడా తెలియనట్లుగా పనికిమాలిన విమర్శలు చేస్తే ఎలా? విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించటం నేరమా? మొన్నటిదాకా డబ్బులు వేయలేదని, మళ్లించేశారని రాశారు. ఇప్పుడు పీడీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు కదా? ఇది కూడా తప్పేనంటారా’ అని ప్రశ్నించారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రమే పేర్కొన్నదని గుర్తుచేశారు. చంద్రబాబు డిస్కంలను గాలికి వదిలేసి నిధులన్నీ మళ్లించేశారని, తమ ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లిస్తూ డిస్కంలను గాడిలో పెడుతోందని వివరించారు. -
సైకోలా అయ్యన్న తీరు
దేవరాపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైకో చేష్టలు మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. వైఎస్సార్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలను సహించబోమని హెచ్చరించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటంపై సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌కు 41 ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అయ్యన్న అనుచిత వాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తప్పు చేయకుంటే సీఐడీ విచారణను ఎదుర్కోవాలన్నారు. నర్సీపట్నంలో యువకుడి చేతిలో ఓటమి చెందడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
సంబరంలా వైఎస్సార్ చేయూత
సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు ఈ పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు మహిళలు వెల్లువలా తరలి వచ్చారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతితో కలిసి 4,885 మందికి రూ.9.15 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలకు సొంత సోదరునిలా మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ జిల్లా ఎస్.అన్నవరం వద్ద జరిగిన కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి దాడిశెట్టి రాజా రూ.9.89 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల గుండెల్లో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ సుస్థిరంగా ఉండిపోతారని మంత్రి రాజా చెప్పారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా బాగు పడడం కాదని, రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన వైఎస్సార్ చేయూత సంబరాల సభలో వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 13,989 మంది లబ్ధిదారులకు రూ.25.28 కోట్లు అందజేశారు. సీఎం జగన్ మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమాంతర అభివృద్ధిని కాంక్షిస్తుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతే రాజధాని అంటూ తన కులం, కుటుంబీకులు, బంధువుల లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రమేష్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో జరిగిన సభలో మంత్రి ఆర్కే రోజా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 11,530 మందికి రూ.21.69 కోట్లు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేది లేదని, జగనన్న తగ్గేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. -
బీసీల ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్రలో బలహీన వర్గాల ద్రోహిగా నిలిచిపోతారని డిప్యూటీ సీఎం (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. కనుచూపు మేరలో ఎన్నికలు కనిపిస్తుండటంతో బాబుకు మళ్లీ బీసీలు గుర్తుకొస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారత దిశగా సీఎం జగన్ బాటలు వేశారని చెప్పారు. బీసీలను చంద్రబాబు బ్యాక్ వర్డ్ క్లాస్‌గా భావిస్తే బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం జగన్ మార్చారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1999 ఎన్నికల ముందు ఓట్ల కోసం రజకులకు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాయీ బ్రాహ్మణులకు కత్తెరలు, శెట్టి బలిజ, గీత కార్మీకులకు మోకులు ఇవ్వటం మినహా బీసీలకు చంద్రబాబు ఏం చేశారు? ► బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తామని 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు ఐదేళ్లలో ఏమీ ఇవ్వకుండా మోసం చేశారు. ► బీసీలకు తొలుత న్యాయం జరిగింది దివంగత వైఎస్సార్ హయాంలోనే. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా ఆదుకున్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే వారి బతుకులు మారతాయని ఆయన గట్టిగా నమ్మారు. సామాన్యులు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఏనాడైనా ఆ కోణంలో ఆలోచించారా? కనీసం ఒక్కటైనా అమలు చేశారా? ► పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూసిన సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యాకానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్కచెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారు. ► బీసీలకు రాజకీయంగా, ఆరి్థకంగా అండగా నిలుస్తూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు ఎంపిక చేశారు. ► బీసీల సంక్షేమం కోసం ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు బీసీల్లో మొత్తం కులాలు, ఉప కులాలను గుర్తించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని చంద్రబాబు లాక్కున్నారు. చివరకు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్‌ను దేవుడు అంటున్నారు. ► తనకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు తెలుసు. కుప్పంలో పోటీ చేసే శక్తి, సామర్థ్యం ఆయనకు లేవు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. -
పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్రంలో సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం వినాయక చవితి పండుగ అయినప్పటికీ.. ఒకటో తేదీ (గురువారం) తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయానికే రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ మంగళవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చే చేశారన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే పంపిణీకి సిద్ధంగా ఉండాలని సెర్ప్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామన్నారు. అలాగే రియల్ టైమ్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్‌సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామన్నారు. -
మహిళల్ని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
పిఠాపురం: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘చేయూత మహిళా మార్టు’లకు శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఏర్పాటు చేసిన ‘చేయూత మహిళా మార్టు’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు సమీపంలో ఉండేలా.. తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించే మార్టులు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం జగన్ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులను పెద్ద వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి మార్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్థానికులంతా మహిళా మార్టును వినియోగించుకుని మహిళా సంఘాలకు తోడ్పాటునివ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే లక్షాధికారులుగా మారిన అక్కాచెల్లెమ్మలు.. ఈ మార్టుల ద్వారా కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. టీడీపీ హయాంలో లంచాలిస్తే గాని ప్రజలకు పథకాలు మంజూరు చేసేవారు కాదని.. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం 28,682 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.83.46 కోట్ల శ్రీనిధి రుణాలను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, జిల్లా పరిషత్ చైర్మన్ వి.వేణుగోపాలరావు, స్త్రీ నిధి ఎండీ నాంచారయ్య, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
62.79 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 62,79,486 మంది లబ్ధిదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి వైఎస్సార్ పింఛన్ కానుక కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్మును అందజేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడానికి 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, ఆర్బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. -
అధికారం అంటే ప్రజలపై మమకారం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ‘ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద’’ని ఈ సందర్బంగా పేర్కొన్నారు ఆయన. దరఖాస్తు చేసిన 3,39, 096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. -
మహిళా సాధికారతకు సీఎం ప్రాధాన్యం
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. బుధవారం విశాఖలో అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలు, అదనపు పీడీలతో నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ (సెర్ప్) వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళా సాధికారతకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడమేకాక, దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలు ఉన్న సంస్థ సెర్ప్ మాత్రమేనని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన నవరత్నాలలో మూడు ‘ సెర్ప్ ద్వారానే అమలవుతున్నాయంటే.. ఈ సంస్థకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలుస్తుందన్నారు. గత మూడేళ్లలో సెర్ప్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులు, సాధించిన విజయాలపై సంస్థ సీఈవో ఎండీ ఇంతియాజ్ అహ్మద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా 1.08 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు రూ.500 కోట్లు లబ్ధి పొందనున్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు స్కోచ్ అవార్డులు వచ్చాయన్నారు. వైఎస్సార్ చేయూతలో తొలి విడతలో దాదాపు 24 లక్షల మంది, రెండో విడతలో 25 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ ఆసరాలో మొదటి విడతలో 7,87,524 స్వయం సహాయక సంఘాలు, రెండో విడతలో 7,96,532 సంఘాలు లబ్ధి పొందాయని చెప్పారు. 95 శాతనికి పైగా స్వయం సహాయక సంఘాలు ఎ, బి గ్రేడ్లలో ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. డ్వాక్రా రుణాల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను స్కోచ్ అవార్డు కూడా వచ్చిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 80 లక్షల మంది మహిళలకు డిజిటల్ ఆర్థిక లావాదేవిలపై శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. దిగ్గజ వ్యాపార సంస్థలతో ఎంవోయూలు సెర్ప్ దిగ్గజ సంస్థలతో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు చేసుకొంది. అమూల్ ఉత్పత్తుల విక్రయానికి ఒప్పందం జరిగింది. స్వయం సహాయక గ్రూపుల మహిళలకు డిజిటల్ లావాదేవీల్లో శిక్షణకు అయికార్ట్æ, సీఎస్‌సీలతో ఎంఓయూలు జరిగాయి. స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, లైవ్లీహుడ్ డైరెక్టర్ విజయకుమారి పాల్గొన్నారు. -
పాడేరులో అల్లూరి విగ్రహావిష్కరణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని వివరించారు. -
ఈ పాపం బాబుది కాదా?
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కడప కార్పొరేషన్: ‘గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి నాడు ఎన్ని లోపాలున్నా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా, పచ్చ పత్రికలు ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే దశల వారీగా రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులు చేపట్టింది. ఇది చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు, వారికి బాకా ఊదే ఈనాడుకు గిట్టడం లేదు. వాస్తవానికి రహదారులు ఇంత దారుణంగా ఉండటానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వమే. ఆ విషయాన్ని విస్మరించి.. అదే పనిగా ఉన్నవీ, లేనివీ కల్పించి ఈనాడు తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తోంది’ అని విశాఖ, కడపలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజద్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ‘నగర రోడ్లపై నరక యాతన’ శీర్షికన శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన అవాస్తవాలతో కూడిన కథనాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విశాఖలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సెన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, కడపలో మేయర్ సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌లతో కలిసి అంజాద్‌బాషాలు ఆయా కలెక్టరేట్లలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవి పాత ఫొటోలు.. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోంది. విశాఖలో అవసరమైన మేరకు నిధులు కూడా కేటాయించాం. కానీ ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసింది. ద్వారకానగర్‌లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేశాం. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టాం. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో వార్తలు రాయడం దారుణం. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయి. దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. అవన్నీ సరిచేయిస్తున్నాం. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాల మేరకు పనులు చేపడుతున్నాం. అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించాం. ఇందులో సుమారు 3,200 గుంతలను రూ.9 కోట్లతో మరమ్మతులు చేశాం. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టాం’ అని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వివరించారు. ఓర్వలేని రాతలవి.. ‘కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఈనాడు ఓర్వలేకపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే.. మంచి చేస్తున్నారని మాట మాత్రమైనా చెప్పని పచ్చ పత్రికలు నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ దుష్ప్రచారం చేస్తుండటం అన్యాయం. రాష్ట్రంలో రూ.2300 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. కడపలో 74 రోడ్లను రూ.124.14కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. అందులో రూ.103.44 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కడపలో నిర్మిస్తున్న రాజీవ్ మార్గ్ రహదారి మొదట రూ.3.08 కోట్లతో మంజూరైంది. ఆ తర్వాత ఆ నిధులు చాలవని డీఎంఏ నిధుల నుంచి రూ.1.10 కోట్లు, కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి రూ.1.04 కోట్లు ఖర్చు చేసి సుమారు రూ.6కోట్లతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ఈ రోడ్డులో 37 ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి. వారందరినీ ఒప్పించి పనులు చేయడం కూడా ఆలస్యానికి కారణం. ఇప్పటికే 790 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అటువైపు ఫొటో తీయకుండా, మరో వైపు ఫొటో తీసి దుష్ప్రచారానికి తెరతీశారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా రూపాయి నిధులివ్వలేదు. కార్పొరేషన్ సాధారణ నిధులు, కేంద్ర నిధులతోనే రోడ్లు నిర్మించాం’ అని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
Atchutapuram Gas Leak: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా) ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత) -
గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ పురస్కారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్–2021’లో ఏపీ.. దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్’ స్కోచ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ ఎండీ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన తెలిపారు. స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడంపట్ల డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ అరుదైన గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడం వంటి అంశాలతో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే ఈ స్కోచ్ అవార్డని అన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. -
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కిన మరో అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ''స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2021''లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డు''కు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. చదవండి: నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి! స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం (పిఆర్ అండ్ ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందని అన్నారు. గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఎంపిక అవ్వడమని అన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. -
రహదారులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారులపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకుసాగుతోంది. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మనపై విమర్శలు చేస్తున్నారు, వక్రీకరణలు చేస్తున్నారు. వీటిని చాలెంజ్‌గా తీసుకుని ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను తయారు చేయాలి. ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలి. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ. 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నాం. రోడ్ల విషయంలో వక్రీకరించడానికి ప్రతిపక్షాలు, వాటికి సంబంధించిన మీడియా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాలో గతంలో ఎంత ఖర్చు చేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం ? అన్నదానిపై వివరాలను ప్రజల ముందు ఉంచండి. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు.. ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశామో ప్రజలకు వివరాలు అందించండి. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయండి. బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి, పెండింగ్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. ఇవన్నీ కూడా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికిన దీని మీద దృష్టిపెట్టాలి. వచ్చే ఏడాదిలోగా ఇవి పూర్తికావాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమైనది, నాణ్యత కచ్చితంగా పాటించాల్సిందే. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోడ్లు వేయాలి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టుల శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని స్పష్టం చేశారు. ఏపీలో రోడ్ల సంబంధిత అభివృద్ధిపై వివరించిన అధికారులు.. 1. 7,804 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లుకు మరమ్మతులు. దీనికోసం దాదాపుగా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 1,168 పనుల్లో రూ. 947 కోట్ల విలువైన 522 పనులు ఇప్పటికే పూర్తి. సుమారు రూ.900 కోట్ల బిల్లులు చెల్లింపు. వర్షాకాలంలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు. 2. నిడా –1 కింద 233 రోడ్లు, బ్రిడ్జిల పనులు. దీని కోసం రూ.2,479 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే రూ.2వేల కోట్లు ఖర్చు. ఆగస్టు నాటికి ఫేజ్–1 పనులు పూర్తిచేసేలా అడుగులు. నిడా–2 కింద 33 ఆర్వోబీ పనులు. దీని కోసం దాదాపు రూ.816.51 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. 3. కొత్తగా 38 ఆర్వోబీల పూర్తికి రూ. 2,661 కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం. 4. నివర్ తుఫాను కారణంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దెబ్బతిన్న బ్రిడ్జిలు తదితర నిర్మాణాల కోసం దాదాపు రూ.915 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. దీని కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. 5. ఎన్డీబీలో ఫేజ్–1 కింద 1,244 కి.మీ.ల కోసం రూ. 3,014 కోట్లు ఖర్చు. ఫేజ్ –1 కింద పనులు మే నెలాఖరు నాటికి ప్రారంభించనున్న ప్రభుత్వం. – ఎన్డీబీలో ఫేజ్–2 కింద 1,268 కి.మీ. కోసం రూ.3,386 కోట్లు ఖర్చు. డిసెంబరులో ఫేజ్–2 పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. మొత్తంగా ఎన్డీబీ రోడ్ల కోసం రూ.6,400 కోట్లు ఖర్చు. దీనికోసం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రోడ్లను 2 లేన్లుగా విస్తరిస్తున్న ప్రభుత్వం. 6. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా 99 పనులు. రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్‌హైవేలను కనీసంగా 10 మీ. వెడల్పుతో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం. మొత్తంగా 3079.94 కి.మీ. మేర విస్తరణకోసం రూ.రూ.30వేల కోట్లు ఖర్చు. ఇప్పటికే రూ.2041 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. 7. రాష్ట్రాల అనుసంధానం కోసం మరో 6 ప్రాజెక్టులు. 2,157 కి.మీ నిడివి ఉన్న రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ. 15,875 కోట్లు ఖర్చు. ఈ పనుల్లో భాగంగా బెంగుళూరు–చెన్నై, చిత్తూరు–చెన్నై, రాయ్‌పూర్–విశాఖపట్నం, షోలాపూర్ –కర్నూల్, హైదరాబాద్ –విశాఖపట్నం, నాగ్‌పూర్–విజయవాడ రహదారుల అభివృద్ధి. 8. రాష్ట్రంలో మరో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం. వీటికి ఏడాదిలోగా భూ సేకరణ పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న అధికారులు. 3,004 కి.మీ. నిడివి ఉన్న ఈ రహదారుల కోసం దాదాపు రూ. 41,654 కోట్లు ఖర్చు. బెంగుళూరు – విజయవాడ, ఖమ్మం –దేవరపల్లి, మదనపల్లె–పీలేరు, రేణిగుంట– నాయుడుపేట, ముద్దనూరు–బి.కొత్తపల్లి–గోరంట్ల, తాడిపత్రి – ముద్దనూరు, మైదుకూరు–పోరుమామిళ్ల–సీతారాంపురం –మాలకొండ–సింగరాయకొండ రోడ్లు జాతీయ రహదారులగా అభివృద్ధి. ఇవికాక పంచాయతీరాజ్ రోడ్లను రూ.1072.92 కోట్లతో బాగుచేస్తున్న ప్రభుత్వం. 2019 నుంచి 2022 వరకూ మొత్తంగా 3,705 కి.మీ మేర పంచాయతీరాజ్ రోడ్ల కొత్త కనెక్టివిటీ, అపగ్రేడేషన్ కోసం రూ. 2131 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం. ఇవికాకుండా 444 కి.మీ మేర బీటీ అప్రోచ్ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.308 కోట్లు ఖర్చు చేసింది. ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ -
సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం, కార్యకర్తల కృషి వలనే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కరణం ధర్మశ్రీ ఆదివారం వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ గెలిచిన తర్వాత మూడేళ్లు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. నవరత్నాల ద్వారా సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎల్లో మీడియా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: (మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్ సింగిల్‌గానే: దాడిశెట్టి రాజా) ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన ఐరెన్ లెగ్ ఎవరూ లేరు. చంద్రబాబు ఐరెన్ లెగ్ 1 అయితే లోకేష్ 2. చంద్రబాబు పాలనలో అంతా కరువు కటకాలే. సీఎంగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వైఎస్ జగన్ గోల్డెన్ లెగ్ అని మంత్రి అమరనాథ్ అన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ధర్మశ్రీని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియమించడం సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాము. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ రావడం మన అదృష్టం. సీఎం జగన్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు వైస్సార్సీపీని విజయవంతం చేస్తామ'ని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్) -
బాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం శనివారం విశాఖపట్నంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరిగింది. సమావేశంలో టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఈ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారంటే అది వైఎస్సార్సీపీ కార్యకర్తల సహకారమేనని అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అదోగతి పాలైందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు గుర్తించి మానిఫెస్టోలోని 98 శాతం అమలు చేశారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలనలో స్పష్టంగా కనిపిస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 'సీఎం జగన్ కరోనా సమయంలో కూడా ఆర్థిక భారం ప్రజలపై పడకుండా కాపాడారు. మూడేళ్లు జగన్మోహన్రెడ్డి పాలన చూసి నిద్రపోయిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు బయటకు వచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉంటే తోడుగా కరువు తెస్తారు. చంద్రబాబు ది ఐరెన్ లెగ్. గతంలో చంద్రబాబు గద్దె ఎక్కిన వెంటనే విశాఖకు హుద్‌హుద్ తుఫాన్ తెచ్చారు. చంద్రబాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా. ఏపీ ప్రజలు క్విట్ ఏపీ అని చంద్రబాబును.. క్విట్ మంగళ గిరి అని లోకేష్‌ని తిప్పి పంపించారు. మే 11 నుంచి గడప గడకు కార్యక్రమం మొదలవుతుంది. మూడేళ్ల జగన్ పాలనలో అందిన ఫలాలు ప్రజలకు వివరించాలి. రానున్న రోజుల్లో విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ వశం ఖాయం. జెండా మోసిన ప్రతి వ్యక్తికి వైఎస్సార్సీపీలో గుర్తింపు ఉంటుంది' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి) ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇంఛార్జి మంత్రి విడదల రజనీ, విశాఖ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్య నారాయణ, మేయర్ హరి వెంకట కుమారి, జెడ్పీ ఛైర్మన్ జల్లిపల్లి సుభద్ర హాజరయ్యారు. -
జర్నలిజమా లేక అధికార పిచ్చా!
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా తమ వాడు లేకపోతే ఈనాడు, మరికొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు రాస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ఈనాడులో ప్రచురితమైన కథనం తప్పుడు ప్రచారంలో భాగమేనని చెప్పారు. మీవాడు అధికారంలో లేడని కడుపు మంటతో సామాజిక పింఛన్లను కూడా వక్రీకరించి రాస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? దీనిని జర్నలిజం అంటారా? అంటూ తూర్పారపట్టారు. పింఛన్ల వాస్తవాలు ఇవిగో.. ‘2014–19 మధ్య చివరి రెండు నెలలూ మినహాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం నెలకు ఇచ్చిన సామాజిక పింఛన్ రూ.1,000 మాత్రమే. ఆయన నెలవారీగా ఇచ్చిన పింఛన్లు 39 లక్షలే. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి నెలా ఏకంగా 62 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల మీద నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు రూ.1,570 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అంటే అప్పట్లో ఇచ్చిన దానికంటే నెలకు రూ.1,170 కోట్లు, ఏడాదికి రూ.14,040 కోట్లు ఎక్కువ. పింఛన్ల కోసం ఇంత ఖర్చు చేస్తున్నందుకు చంద్రబాబుకు బాధగా ఉందా? లేక రామోజీరావుకు కడుపుమంటగా ఉందా?’ అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల ఆగడాలపై అప్పుడెందుకు రాయలేదో? ‘బాబు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీల దోపిడీపై ఇదే ఎల్లో మీడియా ఎందుకు చెప్పలేదు? పింఛన్లు కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్టాఫీస్‌ల ముందు మండుటెండలో క్యూలు కట్టేవారు. క్యూలలో నిల్చోలేక పలువురు చనిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అప్పట్లో ప్రతి నెలా పింఛను ఇచ్చింది 89 శాతం మందికే. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే 90 శాతం మందికి, మొదటి అయిదు రోజుల్లోనే 99 శాతం మందికి పింఛన్లు చేరుతున్నాయి. పదేపదే తిప్పించుకుని పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది? నెలలో మొదటి రోజే, సూర్యోదయానికి ముందే పెన్షనర్లు ఎక్కడ ఉంటే అక్కడికే వలంటీర్లు వెళ్లి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరిది? అని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికీ అక్కడికే వెళ్లి ఇస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా పింఛన్ల రూపంలో çరూ.50 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇప్పుడు పింఛన్లకు కోటాలు, కోతలు లేవు. కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీ ఏదన్నది చూడటంలేదు. లంచాలు, దళారీలకు చోటు లేదు. జన్మభూమి కమిటీల ముందు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకొని మోకరిల్లాల్సిన పరిస్థితి లేనే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ఏడుపంతా ఇదే కదా?’ అని అన్నారు. ప్రతి దాంట్లో అబద్ధపు ప్రచారమే.. ‘అమ్మ ఒడి స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని ఇటీవలే రాశారు. మత్స్యకార భరోసా స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని మరో రోజు రాశారు. ఏ ఒక్క అర్హతా మార్చలేదు. పైగా, మొదట నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే వారికే అమ్మ ఒడిని వర్తింపజేస్తే.. తర్వాత దాన్ని 300 యూనిట్లు చేసింది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. దీనివల్ల 95 శాతం మందికి అమ్మ ఒడి అర్హత లభించింది. దాన్ని కూడా వక్రీకరించి రాశారు. మత్స్యకారుల కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా వివాహం చేసుకుని వేరే కాపురం పెడితే... వారికి కూడా ఈ స్కీములన్నీ వర్తిస్తాయి. మత్స్యకారులకు, బీసీలకు ఏనాడూ ఏమీ చేయని చంద్రబాబును సమర్థించి.. ఇలాంటి మంచి స్కీముల్ని విమర్శించటాన్ని జర్నలిజం అంటారా? లేక అధికార పిచ్చి, కుల పిచ్చి అంటారా?’ అని ముత్యాలనాయుడు ప్రశ్నించారు. -
కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు: బూడి ముత్యాలనాయుడు
సాక్షి, విశాఖపట్నం: ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే పెన్షన్ ఇస్తుంటే.. కొన్ని పత్రికలు ఐదో తేదీన ఇస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే బాధ కలిగి మాట్లాడుతున్నా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పెంచుతామని చెప్పారు. కానీ జనం నమ్మలేదు. జగన్ కూడా ఒకేసారి పెంచుతామని చెప్పలేదు దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి అలాగే పెంచుతున్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ కోసం నాలుగు వందల కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం రూ.1,570 కోట్లు ఇస్తోంది. చంద్రబాబు, రామోజీరావుకు సీఎం జగన్ పాలన చూసి కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు. టీడీపీ హయాంలో ఈ పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. అర్హతలే ప్రామాణికంగా వాలంటీరు, సచివాలయం వ్యవస్థ పని చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జగన్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. లంచం ఇస్తే టీడీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా.. అర్హులకు మాత్రమే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. చదవండి: (పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్!) పాలన విషయంలో సీఎంను విమర్శించే అర్హత, హక్కు ప్రతిపక్షాలకు లేదు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని ప్రతిపక్షం, కొన్ని పచ్చ పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం అమలు ఆగదు. ఇప్పటికే సీఎం జగన్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించారు. రేషన్ కోసం, పెన్షన్ కోసం అరుగుల మీద కూర్చొనే స్థితి నుంచి ఇంటి వద్దకే అందించే వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారు' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. -
మారని సెంటిమెంట్: అనకాపల్లికి మహర్దశ
అనకాపల్లి: అనకాపల్లికి మహర్దశ వచ్చింది. బెల్లంపల్లిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అనకాపల్లి పట్టణం విశాఖ జిల్లాలో ఉన్నప్పుడూ ఎంతో ప్రాధాన్యం దక్కించుకునేది. ఇప్పుడు అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడడంతో అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త జిల్లా సందడితో ఉన్న అనకాపల్లి జిల్లా వాసులకు ముఖ్యమంత్రి మరో వరాన్ని ప్రకటించారు. దీంతో కొత్త జిల్లా అంతా ఖుషీ ఖుషీగా ఉంది. డిప్యూటీ మంత్రితో కూడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవితో పాటు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కూడా అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో కొత్తజిల్లాలో కొంగొత్త ఆశలు మొదలయ్యాయి. కొనసాగుతున్న అనకాపల్లి సెంటిమెంట్... అనకాపల్లి ఎమ్మెల్యే అయితే చాలు... మంత్రి పదవి వరిస్తుందనేది సెంట్మెంట్. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర కే బినెట్లో కీలకమైన శాఖలు దక్కాయి. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా అనకాపల్లి పేరుతో జిల్లా రాగా అనకాపల్లి ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడంతో అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది. రాజకీయ, వర్గాలకతీతంగా అనకాపల్లి జిల్లాకు రెండు పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పని చేసిన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావులకు మంత్రి పదవులు లభించాయి. చదవండి: (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్) తాజాగా ఎమ్మెల్యే అమర్నాథ్కు కూడా మంత్రి పదవి రావడంతో అనకాపల్లి సెంటిమెంట్ మరోసారి నిరూపితమైంది. ఇక ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి అనకాపల్లి కేంద్రం కానుంది. ఆధ్యాత్మిక, భౌగోళిక, వారసత్వ, సుదీర్ఘ తీర ప్రాంత వనరులతో పాటు భూగర్భ నిక్షేపాలకు తోడు జలాశయాలు, నదులు, సాగునీటి కాలువలతో వ్యవసాయరంగానికి కీలకమైన అనకాపల్లి జిల్లా పరిశ్రమల స్థాపనలోనూ దూసుకుపోతోంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్, పరవాడ ఫార్మా, సింహాద్రి, అన్‌రాక్, చక్కెర కర్మాగారాలు, హెట్రో, మైహోంతోపాటు మరిన్ని పరిశ్రమలు అనకాపల్లికి దక్కనున్నాయి. అనకాపల్లి జిల్లాకు ఇప్పుడంతా మంచి శకునాలేనని పలువురు విశ్లేషిస్తున్నారు. -
బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమరనాథ్ పరస్పర అభినందనలు
సాక్షి, అనకాపల్లి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ పరస్పరం అభినందించుకున్నారు. చదవండి: (విజయసాయిరెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు) -
విజయసాయిరెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
సాక్షి, దేవరాపల్లి: రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో మంగళవారం విజయసాయిరెడ్డిని శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా) -
పల్లె వెలుగులు.. ఐటీ పరుగులు
ఇటు గ్రామాల అభివృద్ధితోపాటు.... అటు పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. పంచాయతీలకు మరింత పవర్ వచ్చేలా కృషి చేస్తానని.... ఇందుకోసం వార్డు సభ్యుడి నుంచి అంచలంచెలుగా ఎదిగిన తనకు ఆ అనుభవం పనికొస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అంటున్నారు. పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ హామీనిస్తున్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కేలా కృషి చేయడంతోపాటు స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు పేర్కొన్న అంశాలు ఇవే..! – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం రాబోయే రెండేళ్ల కాలంలో సాధ్యమైనంత వరకూ గ్రామాల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతల్ని అప్పగించారనీ, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి రుణం తీర్చుకుంటానని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే... వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఎదిగా... 1988లో వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశాను. బహుశా నా ఈ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించే పంచాయతీరాజ్‌శాఖను నాకు ముఖ్యమంత్రి కేటాయించారని భావిస్తున్నాను. గ్రామాల్లో సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఏం చెయ్యాలనే అంశాలపై నాకు అవగాహన ఉంది. ఆ అనుభవం ద్వారా పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. గత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని ప్రస్తుతం చేపడుతున్న పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. రాబోయే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని పల్లెలు ప్రకాశవంతంగా మారేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తాను. ప్రస్తుతం జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా చేపడుతున్న పనుల్ని సాధ్యమైనంత వరకూ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. రహదారుల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం గ్రామీణ ప్రాంతాలకు రహదారులు అనుసంధానం చేసే అంశానికి ప్రథమ ప్రాధాన్యమిస్తాను. ప్రస్తుతం ఉన్న రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం మొదలైన పనులపై దృష్టి సారిస్తాను. మార్కెట్ సెస్ ద్వారా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి... వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను. ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు కృషి ఇప్పటి వరకూ ఉపాధి హామీ నిధులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వలంటీర్ల వ్యవస్థపై దృష్టి సారించాం. ఇకపై పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి చేసి.. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచి.. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల్ని పల్లె ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు స్థానికంగా ఉన్న వనరులు, వసతుల ఆధారంగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాననీ.. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇంకా ఏమన్నారంటే... పారిశ్రామిక పార్కులు...! రాష్ట్రంలో ఉన్న 26 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. స్థానికంగా ఉన్న వనరుల్ని రాబోయే పరిశ్రమలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఆధారంగా చిన్న లేదా భారీ ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఈ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉన్న వనరులు వినియోగించుకోవడంతో పాటు అక్కడ యువతకు ప్రత్యక్షంగా ప్రజలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తాను. విశాఖలో ఐటీ అభివృద్ధి... విశాఖపట్నంలో ప్రస్తుతం ఐటీ పరిశ్రమలు ఉన్నాయంటే అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలవే. ఆయన మరణం తర్వాత చంద్రబాబు హయాంలో పూర్తిగా అథఃపాతాళానికి పడేశారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఐటీ పాలసీతో పరిశ్రమలకు రాయితీలు అందిస్తూ... ఇప్పుడిప్పుడే సీఎం వైఎస్ జగన్ ఊపిరిపోస్తున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా చెయ్యాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికనుగుణంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం శ్రమిస్తాను. ఇక రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలతో పాటు ఫార్మాస్యుటికల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాను. స్థానిక ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ పర్యావరణ హితంగా ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తాను. దుబాయ్ ఎక్స్పో ఒప్పందంలోని పరిశ్రమల రాకకు కృషి... గౌతమ్‌రెడ్డి నిర్వర్తించిన శాఖ బాధ్యతను నాకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన హయాంలో పైప్‌లైన్‌లో ఉన్న పరిశ్రమలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. దుబాయ్ ఎక్స్‌పోలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యేందుకు పాటుపడతాను. అదే ఆయనకు అర్పించే నివాళి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని తీరప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్ని పూర్తి చేస్తాం... గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న తీరప్రాంత అనుకూలతను ఉపయోగించుకునేలా పోర్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులతోపాటు ఎయిర్‌పోర్టుల్ని వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై దృష్టి సారిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతుల్ని త్వరగా తీసుకొచ్చి ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. -
AP: కొప్పుల వెలమలకు తొలిసారి గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి తొలిసారి గుర్తింపునిచ్చింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు చెప్పారు. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుని గతంలో ప్రభుత్వ విప్‌గా నియమించారని, ఇప్పుడు కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమించడం తమకు జగన్ ఇచ్చిన గౌరవమని అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 25 లక్షల మందికి పైగా ఉన్న తమ సామాజికవర్గం కోసం మొదటిసారి సీఎం జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కొప్పుల వెలమలు వైఎస్ జగన్ వెంట నడుస్తారని చెప్పారు. చదవండి: ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు -
బూడి ముత్యాలనాయుడు అనే నేను..
-
AP New Cabinet: డబుల్ ధమాకా
సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది. సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు. నమ్మకానికి మారుపేరు... సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినేట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు. 2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో సంబరాలు... ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను. – గుడివాడ అమర్నాథ్ సైనికుల్లా పనిచేస్తాం... కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు -
ఆదర్శంగా నిలుస్తున్న బూడి ముత్యాల నాయుడు
-
‘బాబును మంచి ఆసుపత్రిలో చేర్పించాలి’
సాక్షి, విశాఖపట్నం : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభద్రతా భావంలో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, వెంటనే ఆయనను కుటుంబసభ్యులు మంచి ఆసుపత్రిలో చేర్పించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వ యంత్రాంగం.. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్, వైద్య సిబ్బంది స్పందించిన తీరు అద్భుతం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రుపాయులు ఆర్థిక భరోసా కల్పించడంద్వారా సీఎం జగన్ గొప్ప మనసున్న మనిషని మరోసారి రుజువు చేసుకున్నారు. ( ‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ లీక్ ప్రమాదంలో పరిస్థితిని చూసి ఆ రోజే కోటి రుపాయులు డిమాండ్ చేశారు. ఈ రోజు అమలు చేశారు. సీఎస్, రాష్ట్ర మంత్రులను ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని విశాఖలోనే ఉంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు’’అని అన్నారు. -
‘బాబు విశాఖ ప్రజలపై విషం చిమ్ముతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్వహించిన జీవీఎంసీ సమీక్షలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు, భాగ్యలక్ష్మీ, గొల్ల బాబూరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే ఆయన ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ది వల్ల ఇతర ప్రాంతాలకి నష్టమని చంద్రబాబు తీరువల్ల ప్రజలు నష్టపోయే పరిస్ధితి వచ్చిందని విమర్శిచారు. చంద్రబాబు తన స్ధాయి మరిచి విశాఖ, రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని, పెద్దల సభలో టీడీపీ నుంచి ఎక్కవ మంది అవగాహన లేని వారే ఉన్నారు ఎద్దేవా చేశారు. కౌన్సుల్ రద్దు కాకుండా చంద్రబాబు బీజేపీ నేతలతో టచ్‌లో ఉండటం దారుణమన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, ఓట్లేసిన విశాఖ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలకు మద్దతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ప్రజలు తన్నేలా ఉన్నారని, విశాఖపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ: చంద్రబాబు విశాఖపై విషం చిమ్ముతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమన్నారు. విశాఖ సుందరమైన నగరం...దేశంలోనే విశాఖకు 9 వ స్ధానం ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు చేసిన అన్యాయమేంటని, మిమ్మల్ని గెలిపించడమే విశాఖ ప్రజలు చేసిన శాపమా అని ప్రశ్నించారు. కాగా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను ఘోరాతి ఘోరంగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని .. రాజధాని భూములని రైతులకి తిరిగి ఇచ్చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. వికేంద్రీకరణను బీజేపీ వ్యతిరేకిస్తే వారి మేనిఫెస్టోను వారే వ్యతిరేకించినట్లే అన్నారు. ఇక మార్చి నాటికి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ: గతంలో విశాఖపై ప్రశంసలు కురిపించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇపుడు చంద్రబాబుకి విశాఖ ఎందుకు చేదుగా మారిందని, దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రజలకేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడు కాదు...ఒక వర్గానికి మాత్రమే నేత అన్నారు. విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలే చంద్రబాబు తీరును ఛీ కొడుతున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ: చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్దిని కుతంత్రాలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఒక ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని ఆయన సవాలు విసిరారు. ఇక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ: చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వికేంద్రీకరణ అమలు జరిగితే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందన్నారు. వికేంద్రీకరణబిల్లు అమలు ద్వారా ఏపీ దేశంలోనే అగ్రాగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల సంక్షేమ పాల చూసి టీడీపీ నేతలు సైతం సీఎం జగన్‌కు జై కొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుమారకుంటే 23 నుంచి 3కి తగ్గిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. -
టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామన్నారు
సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పారని వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష ఉపనాయకుడు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయడు వెల్లడించారు. విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరంలో ఆదివారం పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలకా ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ పలకా రవితో పాటు మాజీ కౌన్సిలర్లు, వందలాది మంది వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండేదన్నారు. 2014లో జగన్ ఆశీస్సులతోనే ఆ కోరిక నెరవేరిందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి గంటా, అయ్యన్న, అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. గంటా, అయ్యన్న గనులు, భూములు దోచుకుంటున్నారని విమర్శించారు. గంటా ఆస్తి 10 వేల కోట్లు, అయ్యన్న ఆస్తి 5 వేల కోట్లు, పీలా గోవింద్ ఆస్తి వేయి కోట్లు ఎలా పెరిగాయో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. గతంలో వైఎస్ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో, జగన్ అలాగే పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనను చంపేందుకు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రా>ష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, నేతలు మళ్ల బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్‌రాజు, మూనూరు శ్రీనివాసరావు మాట్లాడారు. -
ఒడిశా లాంటి చర్యలు తీసుకోవాల్సింది
హైదరాబాద్:తుపాను ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందు జాగ్రత్త చర్యలు బాగా తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. అక్కడ ముందుగానే విద్యుత్ సరఫరా లైన్లను కట్ చేశారని, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుని ఉంటే బాగుండేదని ముత్యాల నాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు హుద్‌హుద్ తుపానుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి నష్ట నివారణ కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ఒక్క విశాఖపట్నానికే వచ్చారు తప్ప ఆయన గ్రామీణ ప్రాంతాలకు రాలేదని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తృతంగాపర్యటించి నష్టాన్ని స్వయంగా అంచనా వేశారని, సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించారని ముత్యాలనాయుడు తెలిపారు.