63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు | Pension Distribution by Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు

Published Thu, Jun 1 2023 6:30 AM | Last Updated on Thu, Jun 1 2023 7:29 AM

Pension Distribution by Andhra Pradesh Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,14,192 మం­ది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు­లకు గురు­వారం నుంచి 1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. లబ్ధిదా­రుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవా­రమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా..స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు.

గురువారం తెల్లవారు­జాము నుంచి తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపా­రు. వలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు లబ్ధి­దారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యా­దులు లేకుండా పంపిణీ ప్ర­క్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్‌ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement