
(ఫైల్ ఫోటో)
సాక్షి, విశాఖపట్నం : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభద్రతా భావంలో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, వెంటనే ఆయనను కుటుంబసభ్యులు మంచి ఆసుపత్రిలో చేర్పించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వ యంత్రాంగం.. ముఖ్యంగా పోలీసు డిపార్ట్‌మెంట్, వైద్య సిబ్బంది స్పందించిన తీరు అద్భుతం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రుపాయులు ఆర్థిక భరోసా కల్పించడంద్వారా సీఎం జగన్ గొప్ప మనసున్న మనిషని మరోసారి రుజువు చేసుకున్నారు. ( ‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’)
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ లీక్ ప్రమాదంలో పరిస్థితిని చూసి ఆ రోజే కోటి రుపాయులు డిమాండ్ చేశారు. ఈ రోజు అమలు చేశారు. సీఎస్, రాష్ట్ర మంత్రులను ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని విశాఖలోనే ఉంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు’’అని అన్నారు.