రాజ్యసభ నిరవధిక వాయిదా | Rajya Sabha sessions july 3rd 2024 updates | Sakshi
Sakshi News home page

రాజ్యసభ నిరవధిక వాయిదా

Published Wed, Jul 3 2024 11:04 AM | Last Updated on Wed, Jul 3 2024 2:13 PM

Rajya Sabha sessions july 3rd 2024 updates

ఢిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై  ప్రధాని మోదీ సమాధాన ప్రసంగం ముగిసింది. అనంతరం రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభను నిరవధికంగా వాయిదా చేశారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు...

  • బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాం

  • మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం: మోదీ

  • ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీ
  • చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.
  • సభను విపక్షాలు అవమానిస్తున్నాయి.

  • నా సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదు.

  • విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.

 

  • సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్‌ ఎలాంటి పథకాలు తేలేదు: మోదీ
  • కిషాన్‌ సమ్మాన్‌ నిధి రైతులకు అండగా నిలిచింది.
  • వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.
  • రైతుల కోసం పంటలకు మద్దతు ధరను భారీగా పెంచాం

 

  • విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ అసంతృప్తి
  • విపక్షాలు ఇలా చేయటం సరికాదు
  • విపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి.

 

  • నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదు: ప్రధాని మోదీ
  • విపక్షాలు అవమానిస్తున్నాయి.

 

  • రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌
  • విపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదని సభ నుంచి వాకౌట్‌

 

  • కిషాన్‌ సమ్మాన్‌ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
  • ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు
  • పదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం
  • ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగం
  • రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • ఈ ఎన్నికలో  దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నా
  • పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో  ముందు వెళ్లుతోంది.
  • అంబేద్కర్‌ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.
  • మా విజయాన్ని చూసి కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. 
  • రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు.

 

  • రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.
  • అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.
  • ఐదో అతిపెద్ద  ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది
  • ఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచి
  • కరోనా కష్టకాలంలో కూడా భారత్‌ ఆర్థికంగా  ముందుకు వెళ్లింది.
  • గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.
  • వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాం
  • ఆర్థిక వృద్ధిలో భారత్‌ను  ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాం
  • వచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం
  • విపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.
  • గతంలో రిమోట్‌ ప్రభుత్వం నడిచింది.
     
  • ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.
  • 60  ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసింది.
  • ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు.

 

  • హత్రాస్‌ సత్సంగ్‌ తొక్కిసలాట ఘటనపై  రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.
  • మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు  121 మంది భక్తులు మృతి చెందారు.

     

     

  •  ప్రారంభమైన రాజ్యసభ

  • రాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.

      

     

  • నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్‌ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

  • లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement