
చెన్నై: కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.
ఈ అంశంపై తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా మండిపడ్డారు స్టాలిన్. ‘ ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్ లో మన గొంతు వినిపించుకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇంత ఎంతమాత్ర సమ్మతం కాదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
ఈ డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు.
The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!
I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V— M.K.Stalin (@mkstalin) March 7, 2025