బీజేపీకి లేని కోవిడ్‌ ఆంక్షలు కాంగ్రెస్‌కేల? | Telangana: Manickam Tagore Criticized TRS Government | Sakshi
Sakshi News home page

బీజేపీకి లేని కోవిడ్‌ ఆంక్షలు కాంగ్రెస్‌కేల?

Published Sat, Jan 8 2022 1:56 AM | Last Updated on Sat, Jan 8 2022 1:56 AM

Telangana: Manickam Tagore Criticized TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కారు ద్వం ద్వ నీతిని పాటిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహా రాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ విమర్శించారు. సంఘ్‌ పరివార్‌ సమావే శానికి 300 మంది నేతలు హాజరైతే వారికి రక్షణ కల్పించి మరీ అనుమతినిచ్చారని, తాము 120– 150 మంది నాయకులకు శిక్షణ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరించారని శుక్రవారం ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో దోస్తీ చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ చేస్తున్నాయని అన్నారు. కాగా, మాణిక్యం ఠాగూర్‌ ట్వీట్‌పై రాష్ట్ర డీజీపీ స్పందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. సంఘ్‌ పరివార్‌ కార్య కర్తల సమావేశానికి అనుమతిచ్చి తమకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement