
పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గతేడాది డిసెంబర్‌లోపు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి?. ఇళ్లులేని వారందరికీ రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామన్నారు.. ఏమైంది?’’ అంటూ కిషన్‌రెడ్డి నిలదీశారు.
‘‘బాధ్యతలు, హామీలను విస్మరించి సీఎం గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలే సీఎం అసహనానికి కారణం. రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. నేను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నానన్నది అవాస్తవం. సీఎం రేవంత్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.