
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
అంతకుముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు. కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.