మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక

Published Thu, Apr 3 2025 7:53 PM | Last Updated on Thu, Apr 3 2025 7:53 PM

మెర్స

మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక

మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌కు చెందిన రవీందర్‌ బాలమణి దంపతులు కుమారుడు జెర్ర స్వామినాథన్‌ ప్రతిష్టాత్మకమైన మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక వెయ్యి మంది యువ ఇన్నోవేటర్లను మెర్సిడెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా స్వామినాథన్‌ ఎంపికై తన ప్రతిభను చాటాడు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబాయితోపాటు జర్మనీ వంటి దేశాల్లో జరిగే ప్రపంచ స్థాయి ఇన్నోవేటర్లతో జరిగే సమావేశాల్లో స్వామినాథన్‌ పాల్గొననున్నాడు. రాష్ట్రం నుంచి స్వామినాథన్‌ ఎంపిక కావడంపై ఖాజీపూర్‌ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

నర్సాపూర్‌: గంజాయి అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐ గోపాల్‌ తెలిపారు. నర్సాపూర్‌లోని జగన్నాధరావు కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్‌ ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందింది. బుధవారం సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా ఇంట్లో 310 గ్రాముల గంజాయి దొరికిందని, వెంటనే అరెస్టు చేసి ఎకై ్సజ్‌ ఇన్‌చార్జి సీఐ ఖాజా పాషకు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో తనతోపాటు ఎస్‌ఐ బాలయ్య, ఇతర సిబ్బంది చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, రవి, నవీన్‌, నరేశ్‌ పాల్గొన్నారని సీఐ తెలిపారు.

అతిగా మద్యం తాగి

పర్మిట్‌ రూమ్‌లోనే మృతి

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): అతిగా మద్యం సేవిస్తూ పర్మిట్‌ రూమ్‌లోనే అపస్మారక స్థితికి చేరుకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిలప్‌చెడ్‌ మండలం జగ్గంపేట శివారులో చోటు చేసుకుంది. బుధవారం ఎస్‌ఐ నర్సింహులు కథనం మేరకు.. హత్నూర మండలం సిరిపుర గ్రామానికి చెందిన గంగిరెదుల్ద భాషా (45) వడ్డె మల్లయ్య, గంగిరెద్దుల గోవిందులతో కలిసి జగ్గంపేటలో గల ఎస్‌వీఆర్‌ వైన్స్‌లో గల పర్మిట్‌ రూమ్‌లో అతిగా మద్యం సేవించి కింద పడిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న భాషా కుమారుడు అంబదాసు వచ్చి తండ్రిని లేపగా లేవకపోవడంతో వైద్యుడిని పిలిపించాడు. డాక్టర్‌ పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కడుపునొప్పి భరించలేక

ఉరేసుకొని ఆత్మహత్య

తూప్రాన్‌: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి కథనం మేరకు.. గ్రామానికి చెందిన అరకల శ్రీనివాస్‌(56) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి తిని పడుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి కొంపల్లిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో జరిమానా

గజ్వేల్‌రూరల్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి కోర్డు జైలు శిక్ష విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మురళీ పేర్కొన్నారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 12 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వీరిని బుధవారం గజ్వేల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ప్రియాంక ఎదుట హాజరు పర్చగా విచారణ అనంతరం 12 మందికి రూ. 8,700 జరిమానాతో పాటు ఓ వ్యక్తికి రెండ్రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక 
1
1/1

మెర్స్‌డెస్‌ బెంజ్‌ బీవీజనీర్స్‌ ఫెలోషిప్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement