
బైక్‌లు చోరీ చేసి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి
● ఇద్దరు నిందితులను
అరెస్ట్ చేసిన పోలీసులు
● రెండు బైక్‌లు, కంప్యూటర్,
ప్రింటర్ స్వాధీనం
సిద్దిపేటకమాన్: బైక్‌లను దొంగతనం చేస్తున్న వ్యక్తిని, అతడికి సహకరిస్తూ దొంగ బైక్‌లకు ఫోర్జరీ కాగితాలు సృష్టిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట కేసీఆర్ నగర్ దక్కల కాలనీలో నివాసం ఉంటున్న ఓర్సు కృష్ణ ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తూ అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. అలాగే దొంగిలించిన బైక్‌లకు సిద్దిపేట కేసీఆర్ నగర్‌కు చెందిన బండ్లగుండ్ల నాగరాజు ఒరిజినల్ పత్రాలు పోల్చే విధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు, బైక్ ఆర్‌సీలను సృష్టించి కృష్ణకు సహకరించేవాడు. ఇలా ఇద్దరూ బైక్ దొంగతనాలు మొదలు పెట్టారు. కొద్ది రోజుల కిందట పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన బాబు అనే వ్యక్తి తన ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది కనకరాజు, సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి శనివారం కరీంనగర్ రోడ్డు మార్కెట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి కృష్ణ, నాగరాజు పారిపో తుండగా వెంబడించి పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేస్తున్న దొంగతనాలు, నేరాలు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఫోర్జరీ కాగితాలను తయారు చేయడానికి వినియోగించిన కంప్యూటర్, ప్రింటర్, సీపీయూ, ఫోర్జరీ పత్రాలు స్వాధీ నం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.