చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Published Sun, Apr 6 2025 6:56 AM | Last Updated on Sun, Apr 6 2025 6:56 AM

చేపల

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

జిన్నారం (పటాన్‌చెరు): చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన కొడకంచి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగలక్ష్మి కథనం మేరకు.. గ్రామానికి చెందిన కంచనపల్లి ఆంజనేయులు (49) పుట్టగూడ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు శుక్రవారం వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో కాళ్లకు వల చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వేటకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆచూకీ కోసం మత్స్యకారులు గ్రామస్తులతో కలిసి చెరువులో గాలించగా మృతదేహం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుమారుడు జితేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి..

కొల్చారం(నర్సాపూర్‌): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వరిగుంతం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలయ్య వాళ్ల పోచయ్య(39) సెంట్రింగ్‌ మేసీ్త్రగా పని చేస్తున్నాడు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీళ్లు పట్టేందుకని వెళ్తున్నానని భార్య చంద్రకళకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. కొద్దిసేపటికి నీళ్లు పడుతున్న క్రమంలో పోచయ్య చేయి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో కరెంట్‌ షాక్‌ కొట్టి కిందపడిపోయాడు. వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ

వెల్దుర్తి(తూప్రాన్‌) : ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని శంశిరెడ్డిపల్లి తాండా పంచాయతీ పరిధి బండమీదిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిట్టల శంకర్‌ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగా శనివారం గ్రామ శివారులో జరిగిన ఉపాధి హామీ పనులకు వెళ్లి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురి కావడంతో వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. వడదెబ్బ సోకడంతోనే అస్వస్థతకు గురై మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

గజ్వేల్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ శివారులో రింగురోడ్డుపై శనివారం చోటు చేసుకుంది. గజ్వేల్‌ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్‌ మండలం చాట్లపల్లిలోని ఓ పౌల్ట్రీ ఫాంలో వాచ్‌మెన్‌గా పని చేసే ఎలుక గోపిరెడ్డి(75) ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య సత్తమ్మను చూసేందుకు స్కూటీపై మనుమడు కార్తీక్‌రెడ్డితో కలిసి బయలుదేరాడు. ప్రజ్ఞాపూర్‌ శివారులో రింగురోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న గోపిరెడ్డి ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన గోపిరెడ్డిని 108 వాహనంలో ప్రజ్ఞాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి 1
1/2

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి 2
2/2

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement