
‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్‌చరణ్. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు ఆలిఫ్. కోల్‌కతాకు చెందిన వ్లోగర్ ఆలిఫ్ బొమ్మలు తయారుచేసే కార్మికుల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
లిక్విడ్ ప్లాస్టిక్‌ను వివిధ రకాల బొమ్మల మూసలలో పోయడం నుంచి బొమ్మల తలలకు ప్లాస్టిక్ వెంట్రుకలు అతికించడం వరకు రకరకాల దశలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘లైఫ్ ఇన్ ప్లాస్టిక్ నాట్ ఫంటాస్టిక్’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. ‘అందమైన బొమ్మల వెనుక ఇంత కష్టం ఉంటుందా!’ అని చెప్పేలా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది.