
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.
తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు.

ఈ టీచర్ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది.