
‘వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు’ అనేది సామెత. ఈ సామెత ఎలా పాపులర్ అయిందనేది పక్కన బెడితే, ఈ మధ్య కాలంల పెళ్లిళ్లలో మోసాలు ఆందోళన కరంగా మారింది. అధిక కట్నం కోసం ఫేక్ సర్టిఫికెట్లతో వధువు, వారి కుటుంబాన్ని మెప్పించేందుకు నానా తంటాలు పండతారు. తీరా అసలు విషయం తెలిశాక గొడవలు, విడాకులు తెలిసిన సంగతే.. ఈనేపథ్యంలోనే ఒక స్టోరీ నెట్టింట్ తెగ సందడి చేస్తోంది.
వివాహ సంబంధాల్లో మోసాలు, విడాకులు కేసులు, నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు పెళ్లి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్లు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. తన మనసుకు నచ్చిన భాగస్వామిని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ మాట్రిమమోనియల్ వెబ్సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తత చాలా అవసరం.
కొందరు తమ సంబంధాల గురించి అబద్ధం చెబుతుండగా, మరికొందరు తమ విద్యార్హతలు, వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గురించి అబద్ధం చెబుతారు. దీంతో ఆ జంట, వారి కుటుంబాల మధ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిమీదే ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాలరీ స్లిప్పులు అడగడం, అవునో కాదో ధృవీకరించు కోవాలా వద్దా? అనే ప్రశ్నపై చర్చ మొదలైంది. ప్రొఫైల్స్ వెరిఫికేషన్ పై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ పోస్ట్ పై నెటిజనుల స్పందన
ప్రపంచంలో పుష్కలంగా మంచితనం ఉందని నమ్మినా, వివాహం లాంటి కీలక అడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలపై స్పస్టత తెచ్చుకోవాలి. "జాతకానికి బదులుగా ITRని చెక్ చేయడం మంచిది. సీరియస్‌గా చెప్పాలంటే, ఇద్దరి మధ్యా ప్రముఖ ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య పరీక్ష నివేదిక , ITR తనిఖీ కనీసం జరగాలని ఒకరన్నారు. మరొకరు ఇలా రాశారు, "అవును, కొంతమంది పురుషులు జీతం గురించి అబద్ధం చెబుతారు. డిఫాల్టర్ కాకపోతే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగాలి, అతి ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్! అన్నాడు.
మరొకాయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నామని చెప్పి లెక్కలేనన్ని పెళ్లి కొడుకు కుటుంబాలు, అమ్మాయిల కుటుంబాలను మోసం చేశాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు సాలరీ స్లిప్‌లు ఉన్నాయి. పాత కాలంలో, ఇలాంటివేమీ లేవు కదా. అప్పట్లో లెక్చరర్‌గా ఉన్న నా సొంత మౌసి (ఇప్పుడు మరణించింది), తాను పోలీసు అధికారినని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా అతను మామూలు సేవకుడు, పైగా అతనికి అప్పటికే పెళ్లి అయింది. ఒక బిడ్డకూడా ఉన్నాడు. అంతే ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. మళ్లీ అతని గుమ్మం తొక్క లేదు. తన జీవితాన్ని విద్యకు అంకితం చేసింది, 2 పీహెచ్‌డీలు చేసింది, బోధనా వృత్తిలో ఉంది. మనస్తత్వశాస్త్ర పుస్తకాలు రాసింది అని చెప్పాడు.
ఒక యూజర్ ఇలా వ్రాశాడు, "నా స్నేహితుల్లో ఒకరు నియామక ప్రొఫైల్ ఉద్యోగంలో పని చేశారు.. ఆమె కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ సైట్లలో పేర్కొన్న ప్యాకేజీలను క్రాస్ చెక్ చేసేది. దాదాపు అన్నీ కల్పిత సమాచారంతో నిండిఉన్నాయనీ, ప్యాకేజీలు చాలావరకు అబద్ధం మని గుర్తించింది. "వెరిఫైడ్ జీతం స్లిప్పులు అడిగితే అబ్బాయి పారిపోవాలి" అని ఒక యూజర్ అన్నారు.
ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలా?
మరో కామెంట్ ఏంటంటే.. నన్ను ఒకమ్మాయి ఇలానే అడిగింది. పంపాను కానీ పెద్దలు కుదిర్చిన వివాహానికి నో చెప్పాను. నేను, నా జీతం మీద కూడా వాళ్లకి నమ్మకం లేకపోతే, భవిష్యత్తులో ఇక దేన్ని నమ్ముతారు?"
దీనిపై మీరేమనుకుంటున్నారు. కామెంట్ల రూపంలో తెలియజేయండి.