తగ్గే ప్రసక్తే లే..! చిరుతకు చెమటలు పట్టించిన శునకం..! | Dogs Chase Away Leopard Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

తగ్గే ప్రసక్తే లే..! చిరుతకు చెమటలు పట్టించిన శునకం..!

Apr 10 2025 9:11 AM | Updated on Apr 10 2025 12:03 PM

Dogs Chase Away Leopard Goes Viral On Social Media


వంగపండు ‘ఏం పిల్లడో’ పాటలో ‘పులుల్ని మింగిన గొర్రెలున్నయట’ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటలో‘చిరుతకు చెమటలు పుట్టించిన కుక్కలున్నయట’ అనే మాటను చేర్చవచ్చు. ఈ కథనం ఊళ్లోకి ప్రవేశించిన చిరుతపై తీవ్రంగా కన్నెర్ర చేసిన శునకం గారి గురించి. 

ఒక అర్ధరాత్రి... ఊరంతా గుర్రు పెట్టి నిద్రపోతోంది. చిన్న అలికిడి కూడా లేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక చిరుత పులి వీధిలోకి వచ్చింది. ఆ తరువాత ఒక ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు... ‘భౌభౌ’ అనే శబ్దం వినిపించింది. మామూలుగానైతే.... ‘నన్ను బెదిరించేంత సీన్‌ నీకు లేదు’ అని ఆ ఇంటి కాపలా కుక్కపై చిరుత కన్నెర్ర చేయాలి.

అయితే సదరు చిరుత మాత్రం కుక్క అరుపులు విని వెనక్కి తిరిగి చూడకుండా పరుగో... పరుగు!
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో 3.5 మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకు΄ోతోంది. ఇది ఏ ప్రాంతానికి చెందిన వీడియో క్లిప్‌ అనేది తెలియదుగానీ నెట్‌వాసులు జోక్‌లు విపరీతంగా పేలుస్తున్నారు.

 

(చదవండి: ఆయన ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement