
West Indies vs India, 3rd ODI: బార్బడోస్.. వెస్టిండీస్‌తో మొదటి వన్డే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 114 పరుగులకే ఆలౌట్! భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల మాయాజాలానికి 23 ఓవర్లకే విండీస్ కథ ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్లు ఉన్న జట్టుకు 115 పరుగుల లక్ష్యం అసలు లెక్కే కాదు!
ఇషాన్ అదరగొట్టాడు
అయితే, ఆసియా వన్డే కప్, వన్డే ప్రపంచకప్-2023కి ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయోగాల పేరిట బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చేసింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పేరిట ఇషాన్ కిషన్- శుబ్‌మన్ గిల్‌లను ఓపెనింగ్ జోడీగా దింపింది. వీరిలో ఇషాన్ 52 పరుగులతో రాణించగా.. గిల్ 7 పరుగులకే నిష్క్రమించాడు.
రెండో వన్డేల్లో ఇలా
మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(19)..ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా(5), రవీంద్ర జడేజా(16- నాటౌట్), శార్దూల్ ఠాకూర్(1) కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.
అదే వేదికపై.. రెండో వన్డేలో రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఘోర పరాభవం ఎదురైంది. అనూహ్యంగా 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మళ్లీ రోహిత్, కోహ్లిలను రెస్ట్ పేరిట దూరంగా ఉంచినప్పటికీ ఘన విజయం సాధించింది.
మూడోసారి.. ఆ నలుగురు అదరగొట్టారు
ఓపెనర్లు ఇషాన్ కిషన్(77), శుబ్‌మన్ గిల్(85) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తొలిసారి అర్ధ శతకం(70- నాటౌట్)తో మెరిశాడు. వీరితో పాటు సంజూ శాంసన్ 51 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది టీమిండియా.
200 పరుగుల తేడాతో భారీ విజయం
ఇక కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక భారత బౌలర్ల విజృంభణ ముందు వెస్టిండీస్ పూర్తిగా తేలిపోయింది. శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ కుమార్ 3, కుల్దీప్ యాదవ్ 2, జయదేవ్ ఉనాద్కట్ ఒక వికెట్ తీయగా.. ఆతిథ్య కరేబియన్ జట్టు 35.3 ఓవర్లలోనే 151 పరుగులకు కుప్పకూలింది. దీంతో 200 పరుగుల తేడాతో విజయం టీమిండియాను వరించింది.
18 ఏళ్ల రికార్డును తిరగరాసి
కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి అర్హత కూడా సాధించని విండీస్ చేతిలో గత మ్యాచ్‌లో ఓడిన హార్దిక్ సేన.. తదుపరి మ్యాచ్‌లోనే ఈ మేరకు అదరగొట్టడం విశేషం. అదే విధంగా.. బ్రియన్ లారా స్టేడియంలో మూడో వన్డే సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
18 ఏళ్ల తన రికార్డును తిరగరాస్తూ.. జట్టులో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ సాధించకుండానే అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతంలో.. 2005- నాగ్‌పూర్‌లో శ్రీలంకపై 350/6, 2004- కరాచిలో పాకిస్తాన్‌పై 349/7, 2004- ఢాకాలో బంగ్లాదేశ్‌పై 348/5 స్కోర్లు సాధించింది.
చదవండి: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం కష్టం.. ఎప్పుడు, ఎక్కడైనా: సంజూ శాంసన్
మొన్న వాటర్‌బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్
Mukesh Kumar is in a hurry to finish things off! Can he convert it into a fifer?#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/wWPNTY853m
— FanCode (@FanCode) August 1, 2023
From 1-1 to 2-1! 👏 🏆
— BCCI (@BCCI) August 2, 2023
The smiles say it all! ☺️ ☺️ #TeamIndia | #WIvIND pic.twitter.com/M3oQLNUOg0