
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
కోహ్లి ఇప్పటివరకు సీఎస్‌కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.