
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.
చెపాక్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్‌కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్‌లో సీఎస్‌కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్‌కు సాధ్యమైంది.
కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.