
నాలుగు నెలల్లో ఘాట్ నిర్మాణం పూర్తి
● మంత్రి నారాయణ
నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఘాట్ నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఉగాది సందర్భంగా నారాయణ, రమాదేవి దంపతులు ఆదివారం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులతో కలిసి మంత్రి పెన్నా ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణ మాట్లాడుతూ 15 రోజుల్లో టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం నారాయణ, రమాదేవి దంపతులు వీఆర్సీ సెంటర్ చాకలివీధిలోని శ్రీమహాలక్ష్మమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.