Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Yellow Media1
బాబు కోసం సరే.. రేవంత్‌ సంగతేంటీ.. పచ్చ పైత్యంతో పిచ్చి రాతలు!

‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్‌ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్‌ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

US Freezes 2 2 Billion Funding for Harvard after University Defies2
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్‌

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్‌ సర్కారు హార్వాడ్‌ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్‌ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్‌ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్‌ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్‌ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్‌ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

Why Are They Giving Me The Award: Dhoni Stunned By Player Of The Match Win3
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని

మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు ఐపీఎల్‌-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్‌ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్‌లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్‌ పంత్‌ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (30), ఆయుశ్‌ బదోని (22), అబ్దుల్‌ సమద్‌ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఈ సీజన్‌లో తొలిసారి బ్యాట్‌ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్‌ చేసిన నూర్‌మిగతా వాళ్లలో నూర్‌ అహ్మద్‌ అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ స్పిన్‌ బౌలర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్‌ రషీద్‌ (19 బంతుల్లో 27), రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్‌ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్‌ రషీద్‌ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్‌ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను నూర్‌ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్‌ 2025: లక్నో వర్సెస్‌ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మహేంద్ర సింగ్‌ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025

CM Chandrababu Govt Bullying Cows Death In TTD4
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్‌మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొ­న్నారు. వైఎస్సార్‌సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్‌ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అప­చా­రాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్‌ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్‌ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్‌ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్‌చల్‌ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు.

BRS MLA Kotha Prabhakar Reddy Sensational Comments5
రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?

సాక్షి, దుబ్బాక: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Nita Ambani 60 Million US Dollar Emerald Necklace's Replica At Rs 1786
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్‌..178కే : హర్ష్‌ గోయెంకా ఫన్నీ ట్వీట్‌

అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్‌. మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్‌ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్‌ సారీ అయినా, కోట్ల విలువ చేసే డిజైనర్‌ డైమండ్‌ నెక్లెస్‌ అయినా ఒరిజినల్‌ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథనం చదివితే.. ఔరారెప్లికా అనిపించక మానదు. ఇక కోట్ల విలువ చేసే డైమండ్‌ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ పేరే. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు . దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం రూ.178 కి జైపూర్‌లో అన్‌లైన్‌ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీ జీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్‌ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త,RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్‌ చేశారు. "అబ్ క్యా బోలూన్! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో భారతదేశం అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా ' అని, కమెంట్‌ చేశారు. 'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.

Katy Perry And women launched Into space with Blue Origin7
అంతరిక్షంలోకి మహిళల టీమ్‌.. సింగర్‌ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..

అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్‌ కాబోయే భార్య లారెన్‌ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్‌ కింగ్, సినీ నిర్మాత కెరియన్‌ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్‌ ఆయేషా బోవ్‌ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అ‍యితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్‌ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్‌ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025

Postural Awareness: What It Is How To Correct And Effect Of Your Health8
మీ భంగిమ 'వెన్న'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్‌ అంటే..?

ఇటీవల చాలా చిన్న వయసులో ఉన్నవారు కూడా కండరాల నొప్పులని ఒళ్లునొప్పులనీ అంటుండటం మామూలే. దీనికి కారణం ఏదో జబ్బు లేదా వ్యాధి కాకపోవచ్చు. సరిగా నిలబడటం, కూర్చోవడం వంటివి చేయక΄ోవడమే కావచ్చంటున్నారు నిపుణులు. చాలామంది సరిగా నిల్చోవడం, ఆఫీసుల్లో లేదా ఇతరత్రా కూర్చోవడం, ఏదైనా వస్తువులు అందుకోవడం కోసం ఒంగడం వంటివి సరిగా చేయడం లేదంటే చాలామందికి అది ఆశ్చర్యమే. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. సరైన రీతిలో నిలబడటం, కూర్చోవడం, వంగడం, సెల్‌ఫోన్‌ మాట్లాడేటప్పుడు మెడ కండరాలపైన ఒత్తిడి పడేలా ఒక పక్కకు పూర్తిగా మెడ వంచకపోవడం వంటి శారీరక భంగిమలను (పోష్చర్‌ను) సరైన రీతిలో ఉంచడం వంటి మామూలు జాగ్రత్తలతోనే చాలా నొప్పులు నివారించవచ్చనీ, ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన అరుగుదల సమస్యలను ముందే తెచ్చుకోకుండా రక్షించుకోవచ్చని తెలుసుకోవడం మేలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... సరిగ్గా నిలబడటం, నడిచేటప్పుడు ముందుకు లేదా పక్కకు ఒంగినట్లుగా కాకుండా సరిగ్గా నడవడం, కార్‌ లేదా బైక్‌ నడిపేటప్పుడు సరిగా కూర్చోవడం వల్ల ఒంటికి సంబంధించిన చాలా నొప్పులనూ, చాలా అరుగుదల సమస్యలను రాకుండా చూసుకు΄ోవచ్చు. ఇలా నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, కార్‌ లైదా బైక్‌ నడిపేటప్పుడు మనం ఉండే శారీరక భంగిమల్లో (పోష్చర్స్‌లో) మన కండరాలు, ఎముకలపైన ఒత్తిడి పడుతుంటుంది. దాని కారణంగా ఆయా కండరాల్లో నొప్పులు రావడం లేదా అక్కడి ఎముకలు ఎప్పుడో చాలాకాలం తర్వాత అరగాల్సినవి కాస్తా ముందుగానే అరగడం జరగవచ్చు. తప్పుడు భంగిమల వల్ల కండరాల మీద పడే అలాంటి ఒత్తిడులను వీలైనంత తగ్గించగలిగితే / నివారించగలిగితే కండరాలనూ, లిగమెంట్లనూ, టెండన్లనూ చాలాకాలం బలంగా, పటిష్టంగా కా΄ాడుకోవచ్చు. దాంతో కండరాల నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. దీనికి కావల్సిందల్లా మనం సరిగ్గా నిలబడటం, సరిగా కూర్చోవడంలో సరైన భంగిమలు (పోష్చర్స్‌) పాటించడమే. ఇలా దేహ భంగిమను (పోష్చర్‌ను) ఎంత బాగా మెయింటెయిన్‌ చేసుటే ఎముకల అరుగుదల సమస్యలనూ (డీజనరేటివ్‌ ప్రాబ్లమ్స్‌ను), కండరాలపై పడే ఒత్తిడిని అంతగా నివారించుకోచ్చు అని తెలుసుకోవడం ముఖ్యం. సరైన పోష్చర్‌ అంటే... ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపైనా భూమ్యాకర్షణ శక్తి ప్రతినిత్యం పనిచేస్తూ, ప్రతివారూ నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆఖరికి పడుకుని ఉన్నప్పుడు కూడా మనందరి మీదా ప్రభావంచూపుతూనే ఉంటుంది. తప్పుడు పద్ధతుల్లో నిలబడటం, కూర్చోవడం జరిగినప్పుడు ఆ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. అందుకే అరుగుదల, కండరాలపై ఒత్తిడి దుష్ప్రభావం ఎక్కువ. దీనికి బదులు సరైన భంగిమల్లో నిలబడటం, కూర్చోవడం, వాహనం నడపడం, ఫోన్‌ మాట్లాడటం చేస్తుంటే అన్ని అవవయవాల మీద ఒత్తిడి సమంగా పడటంతో అరుగుదల, దుష్ప్రభావాలు ఒకేచోట కేంద్రీకృతం కావడం వంటి సమస్యలు ఉండవు. దాంతో నొప్పులూ, బాధలూ లేకుండా చాలాకాలం పాటు హాయిగా ఉండవచ్చు. సరైన పోష్చరల్‌ భంగిమలంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం.చాలా సేపు నిలబడాల్సిన వాళ్లు ఎవరంటే... ఏదైనా వైకల్యమో లేదా ఆరోగ్య సమస్య ఉంటేనో తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తీ తన రెండు కాళ్లపై నిలబడటం మొదలుపెట్టిన నాటినుంచి సరిగా నిలబడటం నడవటం చేస్తుంటారు. ఇక ట్రాఫిక్‌లో నిలబడి డ్యూటీ చేసే పోలీసులు, ముఠాలు చెప్పడం కోసం బోర్డు దగ్గర లేదా టేబుల్‌ దగ్గర నిలబడే ఉపాధ్యాయులు / లెక్చరర్లు, సిటీ బస్సుల్లోని కండక్టర్లు, వంట చేసే మగవారు లేదా గృహిణులు, సేల్స్‌ గర్ల్స్, సేల్స్‌ బాయ్‌స్, మెషిన్‌ ఆపరేటర్లు... ఇలాంటి వారందరికీ తమ వృత్తులపరంగా చాలాసేపు నిలబడే ఉండాల్సిన అవసరముంటుంది. వీళ్లలో కాళ్లపైనా, ΄ాదాలపైనా ఒంటిబరువు చాలాసేపు పడటం వల్ల కాళ్లల్లో నీరసం, నిస్సత్తువ, కాళ్లవాపులు, వేరికోస్‌ వెయిన్స్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.మంచి పోష్చర్‌లో నిలబడటం ఎలా? సరైన శారీరక భంగిమలో (మంచి పోష్చర్‌లో) నిలబడటం వల్ల కాళ్లు, కండరాలు, నడుము, మెడ వంటి అవయవాలపై తక్కువ భారం పడుతుంది. అలా తక్కువ భారం పడేలా సరైన రీతిలో నిలబడటానికి ఈ కింద పేర్కొన్న సూచనలు / జాగ్రత్తలు పాటించడం మేలు. అవి... నిలబడి చేసే పనులకు ఉపయోగించే ప్లాట్‌ఫారాన్ని (ఉదాహరణకు వంట చేసేవారు వంట టేబుల్, నిలబడి డ్రాయింగ్‌ వేసేవారు తమ ప్లాంక్‌ వంటి వాటిని) తమ ఎత్తుకు తగినట్లుగా అడ్జెస్ట్‌ చేసుకోవడం. నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న రకరకాల వస్తువులను అందుకునే క్రమంలో పూర్తిగా ఒంగి తీసుకోవాల్సి వచ్చే దూరంగా ఉంచకుండా, తేలిగ్గా తీసుకునేంత దూరంలోనే వస్తువులను ఉంచుకోవడం. ఫ్లాట్‌ఫారమ్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే పనులను చేసుకోవడం (ఉదాహరణకు వంట లేదా డ్రాయింగ్‌ వంటివి చేసేప్పుడు మీ ప్లాట్‌ఫారానికి పక్కగా ఉండకుండా ఎదురుగానే ఉండటం అవసరం). మడమలను పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచకుండా వాటి కింద కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవడం. (అయితే మడమల కింద ఉంచుకునే ఎత్తు మరీ ఎత్తుగా లేకుండా జాగ్రత్త పడటం). చాలాసేపు నిలబడి వంట చేయాల్సి వచ్చినప్పుడు ఒంటి బరువును కాళ్లపై మార్చి మార్చి వేస్తుండటం. (అంతేతప్ప... మొత్తం బరువును చాలాసేపు ఒకే కాలిపైన మోపడం సరికాదని గుర్తుంచుకోవాలి). నిలబడి చేసే పనులు (అంటే నిలబడి ఫ్లోరింగ్‌ శుభ్రం చేయడం, మాపింగ్, గార్డెనింగ్‌) వంటివి వీలైనంత నిటారుగా నిలబడే చేయడం. (అంతే తప్ప... చాలాసేపు ముందుకు ఒంగి΄ోయి చేయడం సరికాదు. అలా ఒంగి΄ోయి చాలాసేపు పనిచేయడం వల్ల వెన్నెముకపై ఎక్కువ భారం పడుతుందని తెలుసుకోవాలి).సరైన పోష్చర్‌లో కూర్చోవడమిలా...గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. అయితే ఇలా కూర్చుని పని చేసేటప్పుడు సరైన ΄ోష్చర్‌లో కూర్చోక΄ోవడమే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలం. కూర్చుని కంప్యూటర్‌పై పనిచేసేవారు మొదలుకొని బల్లలపై కూర్చొని రాత పనిచేసే అనేక మందిలో సరిగా కూర్చోక΄ోవడం వల్లనే నడుమునొప్పి, కండరాల నొప్పులు, మెడ బిగుసుకు΄ోవడం (స్టిఫ్‌నెక్‌), తరచూ పాదాలకు తిమ్మిరిపట్టడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలా అదేపనిగా, సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని రకాల మానసిక సమస్యలూ వచ్చే అవకాశాలున్నాయి. కండరాలు, ఎముకలపై వీలైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడం ఎలాగంటే... కుర్చీలో వీలైనంత నిటారుగా కూర్చోవాలి. అంతేతప్ప వెన్నుపై అధికమైన భారం పడేలా భుజాలను వేలాడేసి లేదా ఒంగి΄ోయి కూర్చోవడం సరికాదు.కంప్యూటర్‌ మానిటర్‌ సరిగ్గా ఉపయోగించేవారి కళ్లకు సరిగ్గా ఎదురుగా ఉండేలా అమర్చుకోవాలి. అంతే తప్ప మెడను బాగా ఎత్తిగానీ లేదా మెడను మరీ ఎక్కువగా ఒంచి చూసేలా దాన్ని అమర్చుకోకూడదు. కీబోర్డు చేతులకు, వేళ్లకు సౌకర్యంగా అందేలా ఉండాలి. కీబోర్డుపై పనిచేసే పమయంలో మోచేతులకు స΄ోర్ట్‌ ఉండేలా కూర్చీ తాలూకు హాండ్‌రెస్ట్‌లను అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు అలసిపోకుండా చాలాసేపు పని చేయడానికి వీలవుతుంది. కంప్యూటర్‌ పై పనిచేస్తున్నప్పుడు వీపును కుర్చీ తాలూకు బాక్‌రెస్ట్‌కు ఆనించి ఉంచాలి. అలాగని కుర్చీ బ్యాక్‌రెస్ట్‌ మరీ వెనక్కువాలి ఉండకూడదు. పనిచేసే సమయంలో వెనక్కు ఆనక΄ోవడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వచ్చే అవకాశముంది. నడుం కండరాలపై ఎక్కువ భారం పడి, ఎక్కువ శ్రమ కలుగుతుంది. పని చేసే సమయంలో కూర్చీ బ్యాక్‌రెస్ట్‌ను నిటారుగానే ఉంచి, వీపును దానికి ఆనించి ఉంచాలి. అప్పుడు వీపుకు తగినంత సపోర్ట్‌ దొరికి, వెన్నుపై భారం తగ్గుతుంది. కంప్యూటర్‌ అదేపనిగా కంటిన్యువస్‌గా ఉపయోగించడానికి బదులుగా ప్రతి గంటసేపు పని తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి ఇవ్వడం మందిది. అది కూడా ఆ 10 నిమిషాలూ మళ్లీ కూర్చునే ఉండటానికి బదులుగా లేచి కాస్త అటు ఇటు తిరగడం మేలు. ఎదురుగా ఉన్న బల్లపైన మనం తరచూ ఉపయోగించే వస్తువులను మూడు అంచెల్లో పెట్టుకోవచ్చు. మొదటి అంచెలో అనుక్షణం అందుకునే వస్తువులు / పనిముట్లు / పుస్తకాలు / ఉపకరణాలు ఉంచుకోవాలి. రెండో అంచెలో తరచూ ఉపయోగించేవి పెట్టుకోవాలి. ఎప్పుడోగాని ఉపయోగించని వాటిని డెస్క్‌/టేబుల్‌కు అటు చివర ఉంచాలి. ఇలా మన వస్తువుల అమరిక ఉండటం వల్ల... వస్తువులను అందుకునే సమయంలో వెన్నుపై భారం చాలావరకు తగ్గుతుంది. కూర్చొని ఉన్నప్పుడు కాళ్లను ఫుట్‌రెస్ట్‌పైన కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. దాంతో వెన్ను/నడుము నొప్పి నివారించవచ్చు.కార్‌ డ్రైవింగ్‌లో పాటించాల్సిన పోష్చర్‌ జాగ్రత్తలు...డ్రైవింగ్‌ చేసే సమయంలో కారులో లేదా వాహనంలో కూర్చునే పోష్చర్‌ సరిగా లేకపోతే వెన్నుకు, మెడకు, నడుముకు సంబంధించిన చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశాలెక్కువ.డ్రైవింగ్‌ సమయంలో సరిగా కూర్చోకపోతే... డ్రైవింగ్‌ పోష్చర్‌ సరిగా లేక΄ోతే ‘రిపిటిటివ్‌ డ్రైవింగ్‌ ఇంజ్యురీస్‌’ (ఆర్‌డీఐ) అనే సమస్యలు వస్తాయి. దాంతో మెడ బిగుసుకు΄ోవడం (స్టిఫ్‌నెక్‌), పాదాలు, కాళ్లకు తిమ్మిర్లు రావడం, భుజాలు నొప్పి పెట్టడం, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్‌డ్రైవింగ్‌ చేసేవారు పోష్చర్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.డ్రైవింగ్‌లో సరిగా కూర్చోవడమిలా... ఫోర్‌వీలర్‌ డ్రైవింగ్‌ సమయంలో వెన్నుపైన సాధ్యమైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడానికి పాటించాల్సిన సూచనలివి... డ్రైవ్‌ చేసేవాళ్లు సౌకర్యంగా కూర్చునేలా డ్రైవింగ్‌ సీట్‌ ఉండాలి. డ్రైవింగ్‌ చేసే సమయంలో స్టీరింగ్‌పై చేతులు పెట్టే పద్ధతి ఎలా ఉండాలంటే... మన డెస్క్‌పై చేతులు ఉంచినప్పటికంటే... స్టీరింగ్‌పై చేతులు కాస్త ఎత్తుగానే ఉండాలి. స్టీరింగ్‌ వీల్‌కూ, డ్రైవర్‌ ఛాతీకి మధ్య 25 – 30 సెం.మీ. (10 – 12 అంగుళాల) స్థలం ఉండేలా స్టీరింగ్‌ అడ్జెస్ట్‌ చేసుకోవాలి. డ్రైవ్‌ చేసేవారు ఎలా కూర్చోవాలంటే... స్టీరింగ్‌వీల్‌ ఎట్టిపరిస్థితుల్లో తమ కాళ్లకు ఆనకుండా చూసుకోవడం అవసరం. అలా స్టీరింగ్‌ వీల్‌కూ తమ దేహానికి మధ్య అవసరమైనంత స్థలం ఉన్నప్పుడు స్టీరింగ్‌ను సౌకర్యంగా తిప్పడానికీ, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోడానికీ వీలుగా ఉండి, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్‌ చేసేవారికి ఎక్కువ రక్షణ కలుగుతుంది. కారు కుదుపుల్లో సైతం కాళ్లకు స్టీరింగ్‌కు ఆనకూడని విధంగా సీట్, స్టీరింగ్‌వీల్‌ అడ్జెస్ట్‌ చేసుకోవాలి. వాహనం ఆగాక డ్రైవింగ్‌ చేసేవారు చాలా సౌకర్యంగా దిగగలిగే విధంగా కారు సీట్‌ ఉండాలి. స్టీరింగ్‌కూ, సీట్‌కూ మధ్య... డ్రైవ్‌ చేసే వ్యక్తి దిగేందుకు అనువుగా ఉండేంత స్థలం ఉండాలి. డ్రైవింగ్‌ చేసేవారు... మరీ 90 డిగ్రీలు నిటారుగా కూర్చొని డ్రైవ్‌ చేయడమూ సరికాదు. కాస్తంత వెనక్కు వాలి సౌకర్యంగా కూర్చుని డ్రైవ్‌ చేయాలి. అయితే డ్రైవింగ్‌ సీట్‌లో అలా వెనక్కి వాలినప్పుడు ఆ కోణం 120 డిగ్రీలకు మించకూడదు. డ్రైవింగ్‌ సీట్‌ వర్టికల్‌గా డ్రైవింగ్‌ చేసేవారి వెన్నుకూ, కింది భాగంలో వారి తొడలకు మంచి స΄ోర్ట్‌ ఇవ్వాలి. అలా మంచి స΄ోర్ట్‌ ఇచ్చేలా సీట్‌ కుషన్‌ ఉండటం మేలు. డ్రైవ్‌ చేసేప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలి. బ్రేక్, క్లచ్‌ పెడల్స్‌ వంటి కారు భాగాలన్నీ డ్రైవింగ్‌ చేసేవారి కాళ్లకు సౌకర్యంగా తక్షణం అందేలా డ్రైవింగ్‌ సీట్‌ అమర్చుకోవాలి.టూవీలర్‌ (బైక్‌) డ్రైవింగ్‌లో పోష్చర్‌ ఇలా... సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి భాగాల అమరికలో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. వాటిని అనుసరించడం వల్ల చాలా సమస్యలు రావు. అయితే బాగా స్టైల్‌గా కనిపించడం కోసం కొంతమంది తమ బైక్‌ హ్యాండిల్‌ బార్స్‌ను, సీట్‌ కోణాన్ని రకరకాలుగా మార్చి అమర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పొట్టి హ్యాండిల్‌ బార్స్‌ వాడటం, సీట్‌ను మరీ ఏటవాలుగా ఉండేలా అమర్చుకోవడ వంటివి చేస్తుంటారు. అలా కాకుండా బైక్‌ తయారీదారులు ప్రామాణికంగా ఉంచిన విధంగానే హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌లు ఉంచుకోవడం మేలు. మరీ ఇబ్బందిగా ఉంటేనే తప్ప వాటిలో వ్యక్తిగతమైన మార్పులు చేసుకోక΄ోవడమే మంచిది. బైక్‌ వాడుతున్నప్పుడు నడుమునొప్పి, వెన్నునొప్పి వస్తుంటే... డ్రైవింగ్‌ చేసేవారికి బైక్‌ సీట్‌ అనువుగా, సౌకర్యంగా ఉండేలా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. అవి... బైక్‌ల హ్యాండిల్స్‌ తగినంత విశాలంగా, రెండు చేతులు సరైన గ్రిప్‌ ఉండేలా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ముందుకు ఒంగి΄ోవడంతో ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. హ్యాండిల్‌ పట్టుకున్నప్పుడు డ్రైనింగ్‌ చేసేవారు తమ దేహం నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అయితే ఇటీవల కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలోని సీట్లు, హ్యాండిల్‌ బార్స్‌ శరీరం బాగా ముందుకు వాలి΄ోయి ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇలా వాలి΄ోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల వెన్ను నిటారుగా ఉండక΄ోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హ్యాండిల్‌బార్‌నూ, సీట్లను అలాంటి ఫాల్టీ ΄ోష్చర్స్‌కు అవకాశమిచ్చేలా అమర్చుకోవడం సరికాదు. కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాళ్లతో బ్రేక్‌ వేయడానికీ, గేర్లు మార్చడానికీ సౌకర్యంగా, వీలుగా ఉండేలా ఫుట్‌రెస్ట్‌లు ఉండాలి. చాలామంది బైక్‌లపై ప్రయాణాలు చేసేవారు తమ వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌΄్యాక్స్‌) పెట్టుకొని వెళ్తుండటం ఇటీవల చాలా సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ భారం నడుంపై ఎక్కువగా పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా, అది సీట్‌పై ఆనేలా చూసుకోవడం చాలా మంచిది. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీలైనంత ఎక్కువ కాలం ΄ాటు నొప్పులు రాకుండా కండరాలను సంరక్షించుకోవడం, ఎముకలు అరగకుండా నివారించుకోవడం సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సెల్‌ఫోన్‌ వాడకంలోజాగ్రత్తలివి...ఇటీవల టూవీలర్‌ డ్రైవ్‌ చేస్తుండే వాళ్లు అలాగే డెస్క్‌ మీద కంప్యూటర్‌పై పనిచేస్తూనే భుజానికీ చెవికీ మధ్య సెల్‌ఫోన్‌ ఉంచుకుని, మెడతో ఆ ఫోన్‌ను నొక్కిపట్టి ఉంచి మాట్లాడటం చేస్తుంటారు. అది సరికాదు. ఇందుకు బదులుగా వాహనం ఆపి ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్‌ వాడటమన్నది మెడ, వెన్ను ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రైవింగ్‌ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్‌ మాట్లాడకూడదు. పైగా అది చట్టరీత్యా నేరం. అలాగే అది ప్రాణానికి ప్రమాదం కూడా. సెల్‌ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ వాడుతుండటం వల్ల బొటనవేలి వెనక ఉండే టెండన్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. అ తర్వాత కూడా అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానకుండా మాటిమాటికీ తిరగబెడుతుంది. దీన్నే బ్లాక్‌బెర్రీ థంబ్‌ లేదా గేమర్స్‌ థంబ్‌ అంటారు. అందుకే వీలైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్‌ ఉపయోగించాలి. సెల్‌ఫోన్‌ సంభాషణలు వీలైనంత క్లుప్తంగా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడటం కన్నా మెసేజ్‌లనే ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది. అయితే ఇలా మెసేజ్‌లు ఇచ్చేటప్పుడు మెడను హానికరమైన కోణాలలో ఒంచకూడదు. మీ మెడను ఎంతగా ఒంచితే వెన్నుపై పడే భారం అంతగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సెల్‌ఫోన్‌ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వడం వల్ల అనవసరమైన కాల్స్‌ను అవాయిడ్‌ చేయవచ్చు. పొద్దున్నే లేవడానికి అలారం మొదలుకొని... రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్‌... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్‌ మీదే అతిగా ఆధారపడటం అంత మంచిది కాదు. అది వెన్నుకు చేటు చేయడంతోపాటు సెల్‌ఫోన్‌ అడిక్షన్‌కు దారితీయవచ్చు. (చదవండి:

KL Rahul ventured into business alongside cricket career9
హై-ఎండ్‌ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలు

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్‌ మార్కెట్‌ అధికంగా ఉంటుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్‌ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్‌లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తులో భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టీమ్‌ లక్నో సుపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్‌ చేస్తున్న బ్రాండ్‌ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్‌లను రాహుల్ ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్‌ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్‌ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్‌ నిలకడైన గేమింగ్‌ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది.

Allu Arjun Meet AP Deputy CM Pawan Kalyan10
పవన్‌ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్‌ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్‌ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement