అన్నదాతను ముంచిన అకాల వర్షం | Hail and strong winds in several districts | Sakshi
Sakshi News home page

అన్నదాతను ముంచిన అకాల వర్షం

Published Mon, Apr 14 2025 12:57 AM | Last Updated on Mon, Apr 14 2025 12:57 AM

Hail and strong winds in several districts

పలు జిల్లాల్లో వడగళ్ల వాన, ఈదురు గాలులు

దెబ్బతిన్న వరి, మామిడి పంటలు

మార్కెట్లలో కొట్టుకుపోయిన ధాన్యం

నల్లగొండ జిల్లాలో పిడుగు పడి రైతు మృతి

నల్లగొండ/జనగామ రూరల్‌/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభ­త్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జన­గామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగు­పహాడ్‌.. చిల్పూర్‌ మండలం ఫత్తేపూర్‌.. జఫర్‌గఢ్‌ మండలం ఓబులాపూర్‌.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయిన­గూడెంలో వరి పంట దెబ్బతింది. 

జిల్లా కేంద్రంలోని వ్యవ­సాయ మార్కెట్‌ కాటన్‌ యార్డులోని ఐకేపీ సెంటర్‌లో సు­మా­రు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది. 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్‌ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement