
సాక్షి, కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. నియోజకవర్గంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024
న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిలిపి చేష్టలు. pic.twitter.com/wvyvurebqp
కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సత్యనారాయణ చిలిపి చేష్టలు చేశారు. కేక్ కటింగ్ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్ పూయగా, ఆమె పక్కకు తప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తకు కేక్ పూశారు. దీంతో సదరు మహిళ కాస్తా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యేపై నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇది కాంగ్రెస్ నాయకుల అసలు నైజం...!
— Sumiran Komarraju (@SumiranKV) January 2, 2024
సభ్య సమాజం తలదించుకునేలా మహిళతో మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ అసభ్య ప్రవర్తన.
దేశం మొత్తం నీతులు బోధించే ప్రియాంక గాంధీకి ఈ విషయం పట్ల స్పందించే ధైర్యం ఉందా...? pic.twitter.com/4wwNVCO9Qb