
కరీంనగర్: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్(టీటీడీ) చైర్మన్ కు కేంద్ర హోంశాక సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్ శివారులో రెండేళ్ల క్రితం టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగినా ఇప్పటికే ముందడుగు పడకపోవటం దురదృష్టకమరమన్నారు బండి సంజయ్. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు.
‘కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారు ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలి. 20223, మే 31వ తేదీన పద్మానగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ చేశారు. మళ్లీ ఆలయ నిర్మాణంలో ముందడుగు పడకపోవడం దురదృష్టకరం.యావత్తు శ్రీవారి భక్తులు ఎంతో ఆశగా ఆలయ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి కరీంనగర్ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను అందించాలని కరీంనగర్ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను’ అని బండి సంజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారు ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి లేఖ వ్రాయడం జరిగింది.
గతంలో 2023 సంవత్సరంలో మే 31న కరీంనగర్ లోని పద్మానగర్ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ… pic.twitter.com/UecjISFw7S— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 5, 2025