
దేవన్నపేట పంప్‌హౌస్ వద్ద మోటార్‌ను ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
ధర్మసాగర్ రిజ్వరాయర్ వద్ద చీర,సారె సమర్పణ
ధర్మసాగర్/హసన్‌పర్తి: ఎట్టకేలకు దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి మంత్రులు నీటిని విడుదల చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్‌లైన్ మోటార్‌ను ప్రారంభించడానికి వారం రోజుల క్రితం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ«నివాస్‌రెడ్డి రాగా, సాంకేతిక సమస్యతో మోటార్లు ఆన్ కాని విషయం తెలిసిందే.
మరమ్మతుల అనంతరం రెండు రోజల క్రితం కూడా మళ్లీ ట్రయన్‌రన్ చేయగా, గేట్‌వాల్‌్వలు పడిపోయాయి. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. దీంతో గురువారం తెల్లవారు జామున ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. సాయంత్రం మంత్రులిద్దరూ దేవన్నపేటలోని పంప్‌హౌస్ వచ్చారు. అయితే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట పాటు ఆగాల్సి వచి్చంది. టెక్నీషియన్‌లు సమస్యను పరిష్కరించిన తర్వాత మంత్రులు మోటార్లు ఆన్ చేశారు.
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్‌లైన్ మోటార్‌ను గురువారం సాయంత్రం ఆయన ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ వద్ద నీటిలో పూలు, చీర, సారె వదిలారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం డిసెంబర్‌లోపు అన్ని పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు.
అందులో భాగంగా ఈ రోజు ఒక పంప్ ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని,. రెండవ మోటారును కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర నిధులు అందించాలని కోరుతూ కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన విషయాన్ని గుర్తు చేశారు. దేవన్నపేట వద్ద పంప్‌హౌస్‌ను అద్భుతమైన డిజైన్‌తో రూపొందించామని, 144.50 మీటర్ల లోతులో 25.50 మీటర్ల వెడల్పుతో నిర్మిoచిన ఈ పంప్‌హౌస్‌లో మూడు 31 మెగావాట్ల సింక్రోనస్ మోటార్లు అమర్చామని చెప్పారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును నేడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే 3వ దశ పనులు పూర్తి చేసి మోటార్లను ఆన్ చేసిందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు మంత్రి ఉత్తమ్ అధికారులను పరుగులు పెట్టించి టెక్నికల్‌గా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించి ఒక మోటార్‌ను ఆన్ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, ఈఎన్‌సీ అనిల్‌కుమా ర్, సీఈ అశోక్‌కుమార్, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.