Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP coalition government fails to pay fee arrears for Poor Students1
ఫీజుల షెడ్యూల్‌కు బూజు!

ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్‌షిప్‌ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్‌, బీటెక్‌ ఈసీఈ ఫైనల్‌ ఇయర్, హెచ్‌.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్‌ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్‌ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్‌ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్‌ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్‌లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్‌లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్‌ మెయింటెనెన్స్‌ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌–ఎంటీఎఫ్‌) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్‌ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్‌ జగన్‌ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ (హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్‌ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్‌ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను ఏప్రిల్‌లో ప్రాసెస్‌ చేసి షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్‌ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, ఏప్రిల్‌–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్‌లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్‌టికెట్‌ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్‌ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్‌బుక్‌లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్‌ చదువుతున్నా. నాకు మూడు టర్మ్‌లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్‌బుక్‌లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్‌ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్‌ హుస్సేన్‌ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్‌ రిజ్వాన్‌ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా

CM Revanth Reddy Comments At Congress Legislature Party meeting2
మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి

సాక్షి, హైదరాబాద్‌: ‘మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్‌ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ రెండు పారీ్టలు కలిసి చేసిన కుట్రలే ఇందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకువచ్చాం. మొత్తం 2,200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్‌ చేస్తోంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్లడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్‌ నిర్మించే ఆలోచనలో ఉన్నాం. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్‌ స్వయంగా కిషన్‌రెడ్డికి చెప్పాడు. కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చెపితే అమిత్‌షా మోదీకి చెప్పాడు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్‌ మోడల్‌ పోయింది. తెలంగాణ మోడల్‌ ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా కులగణన గేమ్‌ ఛేంజర్‌ అయింది. రేపు జరిగే బిహార్‌ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతోంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణశాసనం కాబోతోంది..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎలీ్ప) సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాలి ‘సన్న బియ్యం, ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అద్భుత కార్యక్రమాలతో ముందుకెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయి. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీరు మళ్లీ గెలవాలంటే ఏం కావాలో అడగండి ఎవరైనా సరే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. నేనైనా, డిప్యూటీ సీఎం భట్టి అయినా పార్టీ చెప్పిన మేరకే పనిచేస్తాం. ప్రభుత్వంతో పాటు పార్టీ బలంగా ఉంటేనే మరోసారి గెలుస్తాం. మీరు రెండోసారి గెలవాలంటే మీ నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోండి. అవసరమైతే కన్సల్టెంట్‌ను పెట్టుకోండి. మే 1 నుంచి మీకు అందుబాటులో ఉంటా. మీ నివేదికలు నాకివ్వండి. నేను కూడా వెరిఫై చేసుకుని నిధులు కేటాయిస్తా. మీ నియోజకవర్గాలకు వస్తా. పాదయాత్రలా, కార్నర్‌ మీటింగ్‌లా, బహిరంగ సభలా.. ఏం పెడతారో మీ ఇష్టం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్యాచరణ ఇస్తారు. జూన్‌ 2 నుంచి జనాల్లోకి వస్తా.. నేను కూడా జూన్‌ 2 వరకు జనాల్లోకి వస్తా. మన ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరిద్దాం. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోంది. సన్నబియ్యం కాంగ్రెస్‌ పార్టీ పథకం. ఇది పేటెంట్, మన బ్రాండ్‌. సన్న బియ్యంతో పాటు ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు కీలక పాత్ర పోషించాలి. పార్టీ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయొద్దు..’ అని రేవంత్‌ అన్నారు. భారత్‌ సమ్మిట్‌కు రాహుల్, ప్రియాంక ‘మంత్రివర్గ విస్తరణను రిజర్వుడ్‌ ఫర్‌ జడ్జిమెంట్‌ తరహాలో అధిష్టానం ఫ్రీజ్‌ చేసింది. ఎవరేం చెప్పుకోవాలన్నా హైకమాండ్‌కు చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ కిరణ్‌రెడ్డి తను వెళ్లిన చోటల్లా ఒక మంత్రిని ప్రకటిస్తున్నాడు. అది సరైంది కాదు. అద్దంకి దయాకర్‌ చాలా ఓపికగా వెయిట్‌ చేశాడు. పార్టీ లైన్‌లో పనిచేశాడు. అవకాశం వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే భారత్‌ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాం«దీలు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను మంత్రులకివ్వాలి..’ అని సీఎం చెప్పారు. అవి వారి అస్తిత్వానికే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం ఒక ఎత్తయితే ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన కార్యక్రమాలను గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ధీరోదాత్తంగా చేసిందని అన్నారు. ఇవి బీఆర్‌ఎస్, బీజేపీలను కట్టి మూలన పడేస్తాయని, వారి అస్తిత్వానికే ప్రమాదంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సీఎం చెక్కులు అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచి్చన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కూడా హాజరయ్యారు. బెంబేలెత్తించిన లిఫ్ట్‌ సీఎల్పీ సమావేశం జరిగే రెండో అంతస్తుకు వెళ్లేందుకు గాను సీఎంతో పాటు పలువురు నేతలు లిఫ్ట్‌ ఎక్కారు. రెండో అంతస్తుకు వెళ్లిన ఆ లిఫ్ట్‌ అకస్మాత్తుగా మళ్లీ వేగంగా కిందకు వచ్చింది. దీంతో గాభరాపడిన వారంతా మరో లిఫ్ట్‌లో సమావేశ హాలుకు వెళ్లారు.

Several parties, public associations, and NGOs Fires On Election Commission3
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శ­కతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడి­గినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అను­మా­నాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతు­న్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్‌ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌)తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమో­దైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్‌–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్‌ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్‌సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్‌సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్‌ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్‌ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్‌ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్‌ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్‌ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

Experts on China Mineral Export Ban4
ట్రంప్‌కు కీలెరిగి వాత

అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్‌ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్‌ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్‌ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్‌లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్‌ టు మాగ్నెట్‌’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్‌ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్‌ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్‌–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్‌ క్షిపణులు, రాడార్‌ వ్యవస్థలు, ప్రిడేటర్‌ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్‌ సిరీస్‌ స్మార్ట్‌ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ వివరించింది.⇒ ఒక ఎఫ్‌–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్‌ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్‌ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్‌ ఆర్థిక సలహాదారువాషింగ్టన్‌: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక సలహాదారు కెవిన్‌ హసెట్‌ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్‌ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్‌ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్‌ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే.

National Herald Case: ED Files Chargesheet Against Sonia Gandhi And Rahul5
హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌పై చార్జిషీట్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాందీ, రాహుల్‌ గాం«దీతోపాటు ఇతర నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబే, సునీల్‌ భండారీతోపాటు యంగ్‌ ఇండియా, డాటెక్స్‌ మెర్కండైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను చార్జిషిట్‌లో నిందితులుగా చేర్చింది.రూ.2,000 కోట్ల విలువైన నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్‌ గాం«దీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన ఈ చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో నంబర్‌–1గా సోనియా గాం«దీ, నెంబర్‌–2గా రాహుల్‌ గాంధీ పేర్లను ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్‌ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విశాల్‌ గాగ్నే దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్‌ ఆరోపించింది. సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్‌ చేసింది. వాటిని స్వాదీనం చేసుకుంటామని చెబుతూ ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 2021లో ఈడీ విచారణ ప్రారంభమైంది. 2014 జూన్‌ 26న బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్‌ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ పరిగణనలోకి తీసుకున్నారు.మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు మోతీలావ్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. నిందితులపై దర్యాప్తు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేశాయని, దర్యాప్తునకు అనుమతించాయని గుర్తుచేసింది. సత్యమేవ జయతే: జైరామ్‌ రమేశ్‌ ఈడీ చార్జిషిట్‌పై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వేధింపులపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, కచ్చితంగా పోరాడుతామని స్పష్టంచేశారు. సత్యమేవ జయతే అంటూ మంగళవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. హెరాల్డ్‌ ఆస్తులను స్వా«దీనం చేసు కోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరమని విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెదిరించాలని చూస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు సోనియా, రాహుల్‌పై చార్జిషిట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏమిటీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసు? నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రికను 1938లో జవహర్‌లాల్‌ నెహ్రూ స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పత్రిక మూతపడింది. నేషనల్‌ హెరాల్డ్‌కు దేశ రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2010లో యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఏర్పాటైంది. ఇందులో సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీలకు 38 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.2,000 కోట్లకుపైగా విలువైన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ఆస్తులను 2012లో యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేవలం రూ.50 లక్షలకు కొట్టేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

Two Telangana nationals die in Dubai6
దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య

సోన్‌/నిర్మల్‌/ధర్మపురి/ఆర్మూర్‌ టౌన్‌: పొట్టకూటి కోసం దుబాయ్‌ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్‌ ప్రాంతంలో మోడర్న్‌ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ దాడిలో నిర్మల్‌ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్‌ (40), జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన దేగాం సాగర్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్లు వారి బంధువులు చెప్పారు. చిన్న బిడ్డను చూడకుండానే..నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్‌ (40) ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్‌ బేకరీలో యంత్రం ఆపరేట్‌ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్‌ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్‌ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్‌ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు. ప్రేమ్‌సాగర్‌ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్‌ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్‌ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. శ్రీనివాస్‌ మృతి విషయం ఆయన తల్లి రాజవ్వకు ఇంకా చెప్పలేదు. ప్రేమ్‌సాగర్‌ కుటుంబానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అండగా నిలిచారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురా>వడంతోపాటు నిందితులపై కఠినచర్యలు తీసుకునేలా చూడాలని విదేశాంగ శాఖను కోరారు.విదేశాంగ శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖసాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్‌ లోని భారత కాన్సులేట్‌ అధికారులు.. బుర్‌ దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వక హత్యకేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా, ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్‌ ద్వారా దుబాయ్‌ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆయన ప్రేమ్‌ సాగర్‌ సోదరుడు అష్టపు సందీప్‌తోనూ మాట్లాడారు.

Sensex and Nifty surge over 2 Percent on global markets rally after Trump relaxes tariffs on electronics7
సెన్సెక్స్‌ప్రెస్‌!

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తులను మినహాయించడంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్‌ సూచీలు మంగళవారం 2% ర్యాలీ చేశాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 65 డాలర్లకు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత అంశాలూ కలిసొచ్చాయి.ఫలితంగా సెన్సెక్స్‌ 1,578 పాయింట్లు పెరిగి 76,735 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 500 పాయింట్లు బలపడి 23,329 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 1,695 పాయింట్ల లాభంతో 76,852 వద్ద, నిఫ్టీ 539 పాయింట్లు పెరిగి 23,368 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. విస్తృత స్థాయిలో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాలు నిలుపుకోలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 76,907 వద్ద, నిఫ్టీ 23,368 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి. రంగాల వారీగా సూచీలు రియల్టీ 6%, ఇండ్రస్టియల్, క్యాపిటల్‌ గూడ్స్‌ 4%, ఆటో, కన్జూమర్‌ డిస్క్రిషనరీ, ఫైనాన్సియల్‌ సర్విసెస్, మెటల్‌ షేర్లు మూడుశాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు 3% ర్యాలీ చేశాయి. లాభాల బాటలో అంతర్జాతీయ మార్కెట్లు ఆసియాలో సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్, తైవాన్‌ వెయిటెడ్‌ 2%, జపాన్‌ నికాయ్, కొరియా కోస్పీ, ఇండోనేషియా జకార్తా ఒకశాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై అరశాతం రాణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ సీఏసీ 1%, జర్మనీ డాక్స్‌ 1.50%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.5% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్ల దన్ను: ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్ఫారీస్‌ అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3%, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 7%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ ఆర్జించిన మొత్తం పాయింట్ల ఈ నాలుగు షేర్ల వాటాయే 750 పాయింట్లు కావడం విశేషం.ఆటో షేర్ల పరుగులు: ఆటో మొబైల్స్‌ పరిశ్రమపై గతంలో విధించిన సుంకాలు సవరించే వీలుందని ట్రంప్‌ సంకేతాలతో ఆటో షేర్లు పరుగులు పెట్టాయి. సంవర్ధన మదర్శన్‌సుమీ 8%, భారత్‌ ఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 7%, టాటా మోటార్స్, ఎంఆర్‌ఎఫ్‌ 4.50% ర్యాలీ చేశాయి. హీరో మోటోకార్ప్‌ 4%, ఐషర్‌ మోటార్స్‌ 3.50%, టీవీఎస్‌ మోటార్, అశోక్‌ లేలాండ్, బజాజ్‌ ఆటో 3% లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, మారుతీ 2% పెరిగాయి.రూపాయి రెండోరోజూ ర్యాలీ దేశీయ ఈక్విటీ మార్కెట్‌ అనూహ్య ర్యాలీ, అమెరికా కరెన్సీ బలోపేతంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 30 పైసలు బలపడి 85.50 వద్ద స్థిరపడింది. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు భారత కరెన్సీ బలపడేందుకు తోడ్పడ్డాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ 85.85 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.59 స్థాయి వద్ద గరిష్టాన్ని తాకింది. 2 రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లు దలాల్‌ స్ట్రీట్‌లో రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.

YouTuber reached the top of Tirumala Hill with a drone8
నిద్దరోతున్న నిఘా!

తిరుమల : కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది. విరామం లేకుండా దర్శనాలతో స్వామి వారికి మాత్రం కంటి మీద కునుకు లేకపోగా, భద్రతా యంత్రాంగం మాత్రం నిద్ర మత్తులో జోగుతోంది. నిత్యం భక్త జన సందోహంంతో ఉండే ఏడు కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్‌ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అభాసుపాలవుతున్నా సమర్థించుకోవడం.. ఎదురు దాడి చేయడం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్‌ పోలీస్, అక్టోపస్‌తోపాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిసూ్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టే అనాలిటిక్స్‌ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వివిధ సముదాయాల వద్ద అత్యంత నాణ్యతగా చిత్రీకరించే అధునాతన నిఘా కెమెరాలను అమర్చారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సెకండ్ల వ్యవధిలో విజిలెన్స్‌ విభాగానికి చేరేది. దొంగతనాలు, మిస్సింగ్స్‌ ఇలా అనేక ఘటనలను సులభంగా గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించేది నిఘా వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు ఏమైందో ఏమోగానీ పది నెలలుగా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తోందని వరుసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా డ్రోన్‌ కలకలంరాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన అన్షుమన్‌ తరెజా అనే ఓ యూట్యూబర్‌ మంగళవారం సాయంత్రం తిరుమల ఆలయంపై డ్రోన్‌ ఎగురవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్‌ ద్వారా వివిధ కోణాల్లో చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయం మహా ద్వారం మొదలుకొనిం ఆనంద నిలయం వరకు ఏరియల్‌ వ్యూను చిత్రీకరించాడు. నిత్యం రద్దీగా ఉండే.. అధిక సంఖ్యలో నిఘా నేత్రాలు ఉన్న కళ్యాణకట్ట సమీపంలోని హరినామ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చుని డ్రోన్‌ను ఆపరేట్‌ చేశారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగురుతుండటాన్ని గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎవరికి తెలియజేయాలో తోచక చూసూ్తనే ఉండిపోయారు. పైగా దర్శనం కోసం వచ్చినందున వారి వద్ద సెల్‌ ఫోన్లు కూడా లేవు. ఈ క్రమంలో 12 నిమిషాల అనంతరం శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ ఎట్టకేలకు గుర్తించింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన భద్రత సిబ్బంది డ్రోన్‌తో సహా తరెజాను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, 2 వేల కెమెరాలతో నిఘా ఉన్నా, వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ విజిలెన్స్‌ పహారా ఉన్నా, అంత సేపటి వరకు డ్రోన్‌ ఎగురుతుండటాన్ని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ఎగ్‌ బిర్యానీ, మద్యం తాగి ఓ యువకుడు హల్‌చల్‌ చేసిన వ్యవహారం మరిచిపోక ముందే ఇప్పుడీ డ్రోన్‌ కలకలం రేపింది. ‘ఇంత పటిష్ట యంత్రాంగం, భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని ఓ యువకుడు డ్రోన్‌తో చిత్రీకరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. అని తలుచుకుంటేనే భయమేస్తోంది. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు, తొక్కిసలాట, తరచుగా అపచారాలు.. ఎందుకిలా’ అని పలువురు భక్తులు వాపోయారు. అలిపిరి వద్ద చెక్‌ చేయలేదా?సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. బ్యాగులను స్కానింగ్‌ చేసి అందులో నిషేధిత వస్తువులు ఉంటే వాటిని గుర్తించి, తొలగించి పంపుతారు. అయితే రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్‌ అన్షుమన్‌ తరేజా తిరుమలకు తనతో పాటు డ్రోన్‌ను ఎలా తెచ్చుకున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది.

Kolkata Knight Riders lost to Punjab Kings by 16 runs9
111 తోనే పంజాబ్‌ పండుగ

సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్‌ పదునైన స్పిన్‌తో కేకేఆర్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్‌ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్‌ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్‌ బంతితో రసెల్‌ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్‌... పంజాబ్‌ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌...ఇప్పుడు ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యుజువేంద్ర చహల్‌ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్‌ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్‌ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్‌ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్‌ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను అవుట్‌ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఇన్‌గ్లిస్‌ (2) కూడా వరుణ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్‌ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్‌ (7), ఇంపాక్ట్‌ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్‌ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్‌ సింగ్‌ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్‌ (5), డికాక్‌ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్‌ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్‌ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్‌ తర్వాతే పరిస్థితి మారింది. బాల్‌ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్‌ స్టంప్‌ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు. చహల్‌ మ్యాజిక్‌ టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్‌ పేలవ ఫామ్‌ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్‌ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్‌ చేసి పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో నేడుఢిల్లీ X రాజస్తాన్‌ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 30; శ్రేయస్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్‌ (బి) వరుణ్‌ 2; వధేరా (సి) వెంకటేశ్‌ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7; సూర్యాంశ్‌ (సి) డికాక్‌ (బి) నరైన్‌ 4; శశాంక్‌ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్‌ (బి) నరైన్‌ 1; బార్ట్‌లెట్‌ (రనౌట్‌) 11; అర్ష్ దీప్ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్‌) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్‌ రాణా 3–0–25–3, వరుణ్‌ చక్రవర్తి 4–0–21–2, నరైన్‌ 3–0–14–2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) సూర్యాంశ్‌ (బి) బార్ట్‌లెట్‌ 2; నరైన్‌ (బి) యాన్సెన్‌ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్‌ 17; రఘువంశీ (సి) బార్ట్‌లెట్‌ (బి) చహల్‌ 37; వెంకటేశ్‌ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్‌ 7; రింకూ సింగ్‌ (స్టంప్డ్‌) ఇన్‌గ్లిస్‌ (బి) చహల్‌ 2; రసెల్‌ (బి) యాన్సెన్‌ 17; రమణ్‌దీప్‌ (సి) శ్రేయస్‌ (బి) చహల్‌ 0; రాణా (బి) యాన్సెన్‌ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్‌) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్‌: యాన్సెన్‌ 3.1–0–17–3, బార్ట్‌లెట్‌ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్‌ 4–0–28–4, మ్యాక్స్‌వెల్‌ 2–0–5–1.

India to receive above normal monsoon rains: IMD10
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం

న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలియజేశారు.సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్‌ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్‌ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్‌ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్‌ ముగుస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement