Top Stories
ప్రధాన వార్తలు

బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. జగన్ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

KKR VS LSG Updates: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రహానే.. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 149/2
టార్గెట్ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్6.2వ ఓవర్- పవర్ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్ (90/1) ఆతర్వాతి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ సునీల్ నరైన్‌ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. టార్గెట్ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్ బ్యాటర్లుభారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ.. సునీల్ నరైన్ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది. టార్గెట్ 239.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్2.3వ ఓవర్- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లో 16 పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి డికాక్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్ నరైన్‌కు (15) జతగా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు.మార్ష్, పూరన్ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, రసెల్ ఓ వికెట్ తీశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్‌పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 192/2గా ఉంది. పూరన్‌తో పాటు అబ్దుల్ సమద్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్15.2వ ఓవర్- 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. రసెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 170/1గా ఉంది. మార్ష్ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్‌హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ మరింత స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 138/1గా ఉంది. మార్ష్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది. గేర్ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి

నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్‌చరణ్ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్‌చరణ్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.మా బంధం బలంగా ఉండటానికి అదే కారణంఅలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్ నైట్‌కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. వారంలో ఒకరోజుకాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్‌ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలికుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్‌ఫ్రెండ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.అదే నా ధీమాఅప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్

అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి...దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం.

ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్‌ఎమ్‌వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో శ్రేయస్ అయ్యర్
2025 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డు రేసులో జేకబ్ డఫీ (న్యూజిలాండ్), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), శ్రేయస్ అయ్యర్ (భారత్) ఉన్నారు. మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం చేతన ప్రసాద్ (యూఎస్ఏ), జార్జియా వాల్ (ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా) పోటీ పడుతున్నారు.స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లు వచ్చే వారం ప్రకటిస్తారు.జేకబ్ డఫీ- మార్చి నెలలో న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు 4 వికెట్ల ప్రదర్శనలు సహా 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఢపీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. డఫీ చెలరేగడంతో పాక్‌తో సిరీస్‌ను కివీస్ 4-1 తేడాతో గెలుచుకుంది. పాక్‌తో మార్చిలోనే జరిగిన తొలి వన్డేలోనూ డఫీ రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీశాడు. మొత్తంగా డఫీ మార్చిలో 6 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును నామినేట్ అయ్యాడు.రచిన్ రవీంద్ర విషయానికొస్తే.. ఈ కివీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 3 వన్డేలు ఆడి 50.33 సగటున 151 పరుగులు చేశాడు. అలాగే 4.66 ఎకానమీ రేట్‌తో 3 వికెట్లు తీశాడు. రచిన్ ఈ టోర్నీ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై సెంచరీ (108) చేశాడు. ఈ టోర్నీలో రచిన్‌కు ఇది రెండో సెంచరీ. అంతకుముందు ఫిబ్రవరిలో రచిన్ మరో సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్ వరకు చేరి తుది సమరంలో భారత్ చేతిలో ఓటమిపాలైంది.శ్రేయస్ అయ్యర్- శ్రేయస్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శ్రేయస్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్ రోడ్లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
సెల్ఫీ ఇవ్వని ట్రావిస్ హెడ్.. మండిపడుతున్న ఫ్యాన్స్! వీడియో
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
‘వైద్యాన్ని ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం’
గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’
అక్కినేని అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ తెలుసా?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ప్రాణాలు తీస్తున్న సరదా
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
ఈ పాపం.. ఎవరిది పవన్?
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
తల్లీకొడుకు... యాక్షన్
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
సెల్ఫీ ఇవ్వని ట్రావిస్ హెడ్.. మండిపడుతున్న ఫ్యాన్స్! వీడియో
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
‘వైద్యాన్ని ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం’
గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’
అక్కినేని అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ తెలుసా?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ప్రాణాలు తీస్తున్న సరదా
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
ఈ పాపం.. ఎవరిది పవన్?
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
తల్లీకొడుకు... యాక్షన్
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
సినిమా

తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఓదెల 2'. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఏప్రిల్ 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)ట్రైలర్ బట్టి చూస్తే.. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి (తమన్నా) ఈ ఊరికి వస్తుంది. తర్వాత దెయ్యాల ఆట ఎలా కట్టించింది అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.తమన్నా తప్పితే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేనప్పటికీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం డివోషనల్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. చూస్తుంటే ఓదెల 2.. బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. అశోక్ తేజ దర్శకుడు కాదా.. సంపత్ నంది మిగతా విషయాలన్నీ చూసుకున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి)

ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: టాక్సీవాలా హీరోయిన్
మెజారిటీ హీరోయిన్లు వరుస సినిమాలతో దూకుడు పెంచుతుంటే ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే వచ్చిన మ్యాడ్ స్క్వేర్‌లో నటించి అలరించింది. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. నేను మొదటగా టాక్సీవాలా సినిమాకు సంతకం చేశాను. ఈ సినిమా కోసం యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్న సమయంలో కల వరం ఆయె చిత్రయూనిట్ నన్ను సంప్రదించారు. బడ్జెట్ లేదని పారితోషికం వద్దన్నానువారు అప్పటికే ఓ హీరోయిన్‌తో షూటింగ్ చేశారట.. కానీ అది నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారు. సరే అని చేశాను. అయితే అప్పుడు నాకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారి దగ్గర బడ్జెట్ కూడా లేదు. మా దగ్గర రూ.10 వేలు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ లేనప్పుడు ఇవ్వడం దేనికిలే.. అని వద్దన్నాను. నా స్నేహితురాలేమో చేస్తున్న పనికి ఎంతోకొంత తీసుకోవాలి కదా అని వారించింది. దాంతో వాళ్లకు ఫోన్ చేసి ఆ పది వేలు తీసుకుంటానన్నాను. మొదటి పారితోషికం ఎంతంటే?నేను వద్దన్నానని వేరేవాటి కోసం కొంత వాడేశాం.. ఇప్పుడు మా దగ్గర రూ.6 వేలే ఉన్నాయని చెప్పారు. అలా నేను తొలి సినిమాకు రూ.6 వేలు తీసుకున్నాను. తర్వాత ఓ యాడ్ కోసం రూ.10 వేలు తీసుకున్నాను. కథ బాగుంటేనే సినిమాలు చేయాలని నియమం పెట్టుకున్నాను. అందుకే గమనం సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. టిల్లు స్క్వేర్‌లో 15 సెకన్లు మాత్రమే కనిపించే రోల్ చేశాను. తెలుగు, తమిళంలో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో, ఓ తమిళ సినిమాలో నన్ను చివరి నిమిషంలో తీసేశారు అని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. ప్రియాంక.. టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం సినిమాలు చేసింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్

ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పిన సమయానికి అస్సలు రిలీజ్ కావట్లేదు. లెక్క ప్రకారం 'రాజాసాబ్' ఈ 10వ తేదీన రిలీజ్ కావాలి. కానీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)చాన్నాళ్ల క్రితం రాజాసాబ్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. దీంతో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతిని ట్విటర్ లో అదే ప్రశ్న అడిగారు.తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్ని దర్శకుడు మారుతి దర్శించుకున్నాడు. ఆ ఫొటోలు పోస్ట్ చేయగా 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగారు. దీంతో మారుతి సమాధానమివ్వాల్సి వచ్చింది. 'రిలీజ్ అనేది నా ఒక్కడి చేతుల్లో లేదు. ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)షూటింగ్ అప్డేట్ గురించి మరో అభిమాని అడగ్గా.. 'కొంత టాకీ, పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుంది. చిత్రీకరణ పూర్తవగానే పాటలు రిలీజ్ చేస్తాం. మా కష్టాన్ని చూపించేందుకు మేం కూడా ఎదురుచూస్తున్నాం' అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు.డైరెక్టర్ చెప్పిన దానిబట్టి చూస్తే ఈ ఏడాదిలో రాజాసాబ్ రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

ఓ ఇంటివాడైన రవిశాస్త్రి.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధైర్య కర్వా ఓ ఇంటివాడయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన వివాహా వేడుకలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకలో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.కాగా.. ధైర్య కర్వా బాలీవుడ్లో దీపికా పదుకొణె నటించిన గెహరియాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కెప్టెన్ సర్తాజ్ సింగ్ చందోక్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా 83 లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంలో రవిశాస్త్రి పాత్రలో ఆకట్టుకున్నారు. గతేడాది గ్యారాహ్ గ్యారాహ్ సినిమాలో నటించారు. పలు సినిమాలతో బాలీవుడ్లో అభిమానులను మెప్పించిన ధైర్య కర్వా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే అతను చేసుకున్న ఆమె గురించి వివరాలేమీ తెలియదు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్’ మాస్ క్రేజ్ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.డిఫెండింగ్ చాంపియన్‌పై గెలుపుతో మొదలుఅయితే, రజత్ పాటిదార్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను మట్టికరిపించింది.చెన్నైని చెపాక్‌లో ఓడించికేకేఆర్ను తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న పాటిదార్ సేనపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.ముంబై కంచుకోట బద్దలుముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్ టైమ్ చాంపియన్‌ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గాఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో.. ఒకే సీజన్లో కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.గతంలో పంజాబ్ కింగ్స్ 2012లో ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో ఓడించింది. అంతకుముందు డేవిడ్ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.బ్యాటర్‌గానూ సూపర్‌హిట్ ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్‌పై 16 బంతుల్లో 34, సీఎస్కేపై 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు.అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్‌పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..

రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్‌ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్‌లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్‌రైజర్స్) 95 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్‌రేట్‌తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

KKR VS LSG Updates: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రహానే.. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 149/2
టార్గెట్ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్6.2వ ఓవర్- పవర్ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్ (90/1) ఆతర్వాతి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ సునీల్ నరైన్‌ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. టార్గెట్ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్ బ్యాటర్లుభారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ.. సునీల్ నరైన్ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది. టార్గెట్ 239.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్2.3వ ఓవర్- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లో 16 పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి డికాక్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్ నరైన్‌కు (15) జతగా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు.మార్ష్, పూరన్ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, రసెల్ ఓ వికెట్ తీశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్‌పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 192/2గా ఉంది. పూరన్‌తో పాటు అబ్దుల్ సమద్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్15.2వ ఓవర్- 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. రసెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 170/1గా ఉంది. మార్ష్ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్‌హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ మరింత స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 138/1గా ఉంది. మార్ష్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది. గేర్ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి

MI VS RCB: తిలక్ వర్మ ఎపిసోడ్లో అసలు విషయాన్ని బయట పెట్టిన హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. నిన్న హోం గ్రౌండ్ వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే గెలుపు దరి చేరిన సమయంలో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్సీబీ ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 18, 19 ఓవర్లలో ప్రమాదకరంగా కనిపిస్తున్న తిలక్ (భువీ), హార్దిక్‌ను (హాజిల్‌వుడ్) ఔట్ చేశారు. చివరి ఓవర్లో కృనాల్ చెలరేగి (6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో (లక్నో) తిలక్‌ను రిటైర్డ్ ఔట్‌గా వెనక్కు పంపడంపై అసలు విషయాన్ని బయటపెట్టాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ సమయంలో తిలక్‌ను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపడం కేవలం వ్యూహం మాత్రమే కాదని వివరించాడు. గాయం కారణంగా తిలక్ షాట్లు ఆడలేక అసౌకర్యంగా కనిపించాడన్నాడు. అందుకే అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపి సాంట్నర్‌ను బరిలోకి దించామని పేర్కొన్నాడు.కాగా, లక్నోతో మ్యాచ్ ముగిశాక హార్దిక్ తిలక్ గాయం విషయాన్ని చెప్పలేదు. భారీ షాట్లు ఆడే ఆటగాడు కావాలనే ఉద్దేశంతో సాంట్నర్‌ను బరిలోకి దించినట్లు తెలిపాడు. సాంట్నర్‌ను భారీ హిట్టర్‌గా చెప్పుకొచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో అతనికి స్ట్రయిక్ ఇవ్వకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్‌లో ముంబై లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీతో మ్యాచ్ తరహాలోనే ఆ మ్యాచ్‌లోనూ ముంబై విజయతీరాల వరకు చేరి గెలుపు సాధించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికి ముంబై 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి ఈ సీజన్లో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఓటమి ఎరుగని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది.
బిజినెస్

‘మైక్రోసాఫ్ట్‌లో డిజిటల్ ఆయుధాల తయారీ’
వాషింగ్టన్లో ఇటీవల జరిగిన మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ వేడుకలకు పాలస్తీనా అనుకూల ఉద్యోగులు అంతరాయం కలిగించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో మైక్రోసాఫ్ట్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఇందులో కొందరు రాజీనామా చేశారు. వీరిలో మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగానికి చెందిన ఇండో అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు. గాజాలో హింసాకాండకు ఈ సంస్థ సహకరిస్తోందని ఆరోపిస్తూ మైక్రోసాఫ్ట్‌ను ‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’గా అభివర్ణించారు. బహిరంగంగానే రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తూ నినాదాలతో సమావేశం నుంచి బయటకు వచ్చారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న 133 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అగర్వాల్ ఖండించారు. కంపెనీ ఏఐ, అజూర్ క్లౌడ్ సేవలు పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మద్దతుగా నిలిస్తున్నాయని పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్, కృత్రిమ మేధ గాజాలో ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ప్రాణాంతకంగా, విధ్వంసకరంగా మార్చేందుకు వీలు కల్పిస్తున్నాయి’ అని అగర్వాల్ కంపెనీకి సమర్పించిన ఈమెయిల్లో రాశారు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు, యుద్ధ మౌలిక సదుపాయాలతో ముడిపెట్టిన నివేదికలను ఆమె ఉదహరించారు.ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీఅమెజాన్లో మూడేళ్లకు పైగా పనిచేసిన తర్వాత 2023 సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన అగర్వాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్లో అసమ్మతి పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆమె నిరసన తెలపడం తాజాగా చర్చనీయాంశం అయింది. ఫిబ్రవరిలో సీఈఓ సత్య నాదెళ్లతో జరిగిన ఒక సమావేశంలో ఇలాంటి ఆందోళనల కారణంగా అంతరాయం కలగడంతో ఐదుగురు సిబ్బందిని తొలగించారు. ఈ ఆరోపణలపై గానీ, అగర్వాల్ రాజీనామాపై గానీ మైక్రోసాఫ్ట్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు.

తగ్గిన భోజనం ధరలు
వెజిటేరియన్లూ.. మీ భోజనం ఖర్చులు తగ్గాయ్! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చు కూడా తగ్గింది. క్రిసిల్ రేటింగ్ సంస్థ ఈమేరకు రిపోర్ట్ వెలువరించింది. ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణం.. వెజిటేరియన్ అన్ని వంటల్లో దాదాపుగా వాడే టమాటా ధరలు తగ్గడమేనని నివేదిక తెలిపింది. నాన్‌వెజ్ మీల్స్ తగ్గింపునకు చికెన్ ధరలు దిగిరావడమే కారణమని పేర్కొంది.క్రిసిల్ నివేదికలోని వివరాల ప్రకారం.. మార్చిలో ఇంట్లో వండిన థాలీ ధర వరుసగా ఐదోసారి తగ్గింది. దాంతో ఇది రూ.26.6కు చేరుకుంది. ముఖ్యంగా టమాటా ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మార్చిలో బ్రాయిలర్ చికెన్ ధరలు తగ్గడంతో మాంసాహార థాలీ ధర కూడా రూ.54.8కి చేరింది. శాఖాహార థాలీలో రోటీ, అన్నం, పప్పు, కూరగాయలు..వంటివి ఉంటాయి. ఈ భోజనాన్ని ఇంట్లో తయారు చేయడానికి సగటు ఖర్చు మార్చిలో రూ.26.6కు పడిపోయింది.ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీభోజన ఖర్చులు క్షీణించడం కొన్ని వర్గాల వారికి ఆహార ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గేలా చేసింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గడంతో ఈమేరకు ఉపశమనం కలిగినట్లయింది. ఇంట్లో వండిన భోజనంపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఎంతో మేలు కలిగిస్తుంది. నాన్ వెజిటేరియన్ థాలీ ధరలు ప్రధానంగా చికెన్‌పై ఆధారపడి ఉంటాయి. బ్రాయిలర్ చికెన్ ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. మార్చిలో బర్డ్‌ఫ్లూ భయాలు అధికం కావడంతో భారీగా ధరలు తగ్గాయి. ఇది నాన్‌వెజ్ థాలీ తగ్గుదలకు కారణమైంది. మధ్యలో చికెన్ ధరలు ఒడిదొడుకులకులోనైనా చౌకగా కూరగాయలు లభ్యత ఉండడంతో ఖర్చులను భర్తీ చేసేందుకు తోడ్పడింది.

త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్‌పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.టారిఫ్‌ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారత్‌పైనా ప్రభావం..విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గుఐఫోన్ రూ.రెండు లక్షలు!చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.

సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
ప్రముఖ మెసేజింగ్ టూల్ హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఇటీవల భారతదేశ ఇంజినీరింగ్ వ్యవస్థ గురించి, ఆవిష్కరణల సామర్థ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో చైనా సాధించిన విజయాలతో సరితూగే భారతదేశ సామర్థ్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. చాలా మంది భారతీయ ఇంజినీర్లు కొత్త సాంకేతికత సృష్టించడానికి బదులుగా వాటి నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.99 శాతం భారతీయ ఇంజినీర్లు అపార జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ చాలావరకు స్పష్టమైన ఉత్పత్తులను సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మనస్తత్వం మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశ సామర్థ్యాన్ని అణచివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ సృష్టి కంటే ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించే వ్యాపారవేత్తలపై భారత్ ప్రశంసలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ స్కిల్స్‌ను ప్రోత్సహించేందుకు భారత్ తన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని భాటియా వ్యాఖ్యానించారు. దీన్ని చైనా సమ్మిళిత విద్యా విధానాలతో పోల్చారు. ఇది సృజనాత్మకత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి విజయానికి దోహదపడిందని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..ఇంజినీరింగ్ విద్య, వర్క్ కల్చర్ విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని భాటియా పిలుపునిచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలకు విలువనివ్వడం, సృజనాత్మకత వృద్ధి చెందేలా తగిన వాతావరణాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు.
ఫ్యామిలీ

వాంటెడ్స్ వేలల్లో! కింగ్ మేకర్స్ ఐదుగురు నైజీరియన్లే
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 2020-24 మధ్య నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో 8,822 మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సిండికేట్‌ను వాళ్లే నడిపిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు గుర్తించారు. 2023లో పోలీసులు రూ.94.39 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా, అది ఇది గత ఏడాది నాటికి రూ.148.09 కోట్లకు చేరింది. ఈ కేసుల్లో సూత్రధారులు కంటే పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన డ్రగ్స్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీజీఏఎన్‌బీ అధికారులు వాంటెడ్‌గా ఉన్న వారి కోసం గాలిస్తోంది. అప్పట్లో నేరుగా వచ్చిమాదకద్రవ్యాల క్రయవిక్రయాలన్నీ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కేంద్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనే పెడ్లర్లు, సప్లయర్లు, కన్జ్యూమర్ల మధ్య బేరసారాలు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించుకునే పెడ్లర్లు సిటీకి వచ్చి డ్రగ్స్ అందించి వెళ్లే వాళ్లు. అయితే టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాపై నిఘా పెరిగింది. వరుస పెట్టి డెకాయ్ ఆపరేషన్లు చేసిన అధికారులు, సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ పెడ్లర్స్‌ను పట్టుకున్నారు. దీంతో తెలంగాణకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కొరియర్స్, డెడ్ డ్రాప్ విధానాల్లో... సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న పెడ్లర్లు ఆన్లైన్లోనే నగదు చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ఆపై కొరియర్ పార్శిల్ చేయడం లేదా సప్లయర్‌ను పిలిపించుకొని మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ సప్లయర్లు సైతం నేరుగా కన్జ్యూమర్ని కలవట్లేదు. దీనికోసం డెడ్ డ్రాప్ విధానం అవలంభిస్తున్నారు. మాదకద్రవ్యాన్ని ఓ ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతం ఫొటో, లోకేషన్లను వారికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక కేసుల్లో కన్జ్యూమర్లు, కొన్ని కేసుల్లో సర్లయర్లు చిక్కుతున్నారు. పెడ్లర్స్ మాత్రం దొరక్కపోవడంతో ఆయా కేసుల్లో వాంటెడ్స్ పెరుగుతున్నారు. గత ఏడాది భారీగా పెరిగిన కేసులు... మాదకద్రవ్యాల కేసులు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2023 కంటే 2024లో గణనీయంగా పెరిగింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల సంఖ్య 1487గా, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2170గా ఉంది. గత ఏడాది ఇవి 3074, 5205కు పెరిగాయి. 2020–24 మధ్య ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7131 కేసులు నమోదు కాగా, వీటిలో 23,547 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 14,725 మంది మాత్రమే అరెస్టు కాగా, ఇప్పటికీ 8822 మంది పరారీలోనే ఉన్నారు. ఈ వాంటెడ్స్ కోసం టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలతోపాటు స్థానిక పోలీసులూ గాలిస్తున్నారు. ఆ ఐదుగురూ అత్యంత కీలకం రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో విస్తరించి ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పెడ్లర్స్, సర్లయర్స్లో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు కీలకమని టీజీఏఎన్‌బీ గుర్తించింది. వీరిలో డివైన్ ఎబుక సుజీపై ఎనిమిది, పీటర్ న్వాబున్వన్నా ఒకాఫర్, నికోలస్ ఒలుసోలా రోటిమీ, మార్క్ ఒవలబిలపై నాలుగు చొప్పున, అమోబి చుక్వుడి మూనాగోలుపై ఒక కేసు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆధారాలు లభించడంతో నిందితులుగా చేర్చామని అధికారులు చెప్తున్నారు. 2023–24ల్లో డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సూడాన్, కెన్యా, నైజీరియా, సోమాలియా, టాంజానియా, లైబీరియాలకు చెందిన 11 మందిని పోలీసులు నగరంలో గుర్తించి ఆయా దేశాలకు తిప్పిపంపారు.

సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్. వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)

WorldHealthDay ఇది రెండో రౌండ్, అయినా యుద్ధమే!
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap)

వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం)
ఫొటోలు


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (ఫోటోలు)


భద్రాచలంలో ఫ్రెండ్స్ వితికా, భార్గవితో నిహారిక కొణిదెల (ఫోటోలు)


వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన.. లింగమయ్య కుటుంబానికి పరామర్శ (చిత్రాలు)


తరగని అందం ప్రణీత సొంతం....కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ (ఫోటోలు)


పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న రంభ (ఫొటోలు)


వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


మ్యాడ్‌డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)


భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)


Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)


భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)
అంతర్జాతీయం

‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్‌గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్‌గేట్స్ ఈ సూచన చేశారు.భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్‌గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్‌గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..

Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఓ మూషికం సరికొత్త రికార్డ్లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డ్లన్నీ తిరగ రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ పని. తాజాగా రోనిన్ బాంబుల వేటలో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.అఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది. ఎలుక రోనిన్ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.రోనిన్ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్‌ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. రోనిన్కు ముందు మగావా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగావా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు.

Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు.
జాతీయం

మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.

ఇబ్బందుల్లో ఉన్నా.. అందుకే చోరీ చేస్తున్నా
ఖర్గావ్: ‘జుజర్ భాయ్.. నిండా అప్పుల్లో మునిగి ఉన్నా..అప్పులోళ్లు రోజూ వేధించుకు తింటున్నారు..వాళ్లతో వేగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దొంగతనం చేస్తున్నా..అదీ శ్రీరామ నవమి నాడు..! ఏమీ అనుకోకు, నీ డబ్బు మళ్లీ ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఇది నా వాగ్దానం’అంటూ ఓ మంచి దొంగ ఓ దుకాణం నుంచి రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ ఘటన చోటుచేసుకుంది. మరునాడు దుకాణం తెరిచిన జుజర్ అలీ బొహ్రాకు నగదు ఉంచిన బ్యాగులో ఈ లేఖ కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆయన విషయం పోలీసులకు తెలిపారు. చోరుడు ప్రింటెడ్ లేఖలో దుకాణం యజమానిని జుజర్ భాయ్ అంటూ మర్యాదగా సంబోధించాడని పోలీస్ ఎస్సై అర్షద్ ఖాన్ చెప్పారు. బ్యాగులో ఉంచిన రూ.2.84 లక్షలకు గాను అతడు రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లి, రూ.38వేలను లేఖతోపాటు బ్యాగులోనే వదిలివెళ్లాడని యజమాని తెలిపాడన్నారు. రామ నవమి పండగ నాడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నందుకు క్షమించాలని కూడా దుకాణం యజమానిని అతడు కోరినట్లు ఎస్సై వివరించారు. ‘నేనుండేది మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే. నాకు చాలా అప్పులున్నాయి. అప్పిచ్చిన వాళ్లు రోజూ నా ఇంటికి వస్తున్నారు. దొంగతనం చేయాలని నాకు ఏ మాత్రంలేదు. కానీ, గత్యంతరం లేదు. ఈ డబ్బుతో నాకు చాలా అవసరముంది. అయితే, అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తున్నా. మిగతాది బ్యాగులోనే వదిలిపెడ్తున్నా. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడిక మీరు నన్ను పోలీసులకు అప్పగించొచ్చు’అని అందులో వివరించాడు. అంతేకాదు, ఈ లేఖలో పేర్కొన్న ప్రతి విషయమూ సత్యమేనని స్పష్టం చేశాడన్నారు.

సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు.

వినియోగదారుల ఫోరం అరెస్ట్ వారెంట్ ఇవ్వజాలదు
కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)కింద వారెంట్ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.

మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు.

కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్..!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరచూ ఆమె ఇలాగే బయటకు వెళ్లి వస్తూంటుంది. కానీ, ఈసారి అలా జరగలేదు. దీంతో, కుటుంబసభ్యులు ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిలో కొందరు మైనర్లు అయినందున పోలీసులు వీరి పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. అయితే, బాధితురాలు కానీ, ఆమె కుటుంబం కానీ లైంగిక దాడి జరిగినట్లుగా ఏప్రిల్ 4న ఫిర్యాదు అందించలేదని డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. అత్యాచారం జరిగిందంటూ వారు ఈ నెల 6వ తేదీన మాత్రమే ఫిర్యాదు చేశారని, దర్యాప్తు పురోగతిలో ఉందని ఆయన వివరించారు.

సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.
వీడియోలు


వైఎస్ జగన్ మాతో చెప్పిన మాట


Raptadu Tour: వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్


వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు: Lella Appi Reddy


అమెరికాలో తానా కుంభకోణం 700 మంది ఉద్యోగులపై వేటు


YSR జిల్లా పులివెందులలో TDP నేతల బాహాబాహీ


మరో బీహార్ మాదిరిగా తయారైన ఏపీ రాష్ట్రం: YS Jagan


మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని YS జగన్ ట్వీట్


వడ్డీతో సహా తిరిగిస్తాం గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీసులకి జగన్ వార్నింగ్..


Raptadu Tour: వైఎస్ జగన్ హెలికాప్టర్ విజువల్స్


YS Jagan: లింగమయ్య హత్య కేసు నిందితులపై ఎందుకు కేసులు పెట్టలేదు