రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తన లోక్‌సభ సభ్యత్వానికి రేపే రాజీనామా చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుంరలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విభజనకు అనుసరించే పద్దతికి నిరసన తెలుపుతూ లోక్‌సభ స్పీకర్‌కు రేపు రాజీనామా లేఖను పంపుతానని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నిబద్ధత ఉందని చెప్పారు.