ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల్లో 22 మంది ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి పెద్దల సభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కబోతోంది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులుండగా.. ఐదుగురు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి.. మరో ఐదుగురు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, 20 మంది స్థానిక సంస్థల కోటాలో, ఇంకో 20 మంది ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే 8 మందిని గవర్నర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తారు.