సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలవడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1982 నుంచి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పోరాటం జరుగుతూ వస్తోందని.. అలాంటిది చంద్రబాబు, కాంగ్రెస్‌తో సావాసం చేయడం వారు జీర్ణించుకోలేకుండా ఉన్నారన్నారు.