రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలు పొందడానికి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఇందుకు పోలీసులు సైతం బరితెగించి సహకరిస్తుండటం నివ్వెర పరు స్తోంది. వైఎస్‌ఆర్ జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బీఫాంపై గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 521 మంది, టీడీపీ బీఫాంపై గెలుపొందిన వారు 300 మంది, కాంగ్రెస్ బీఫాంపై గెలుపొందిన వారు 10 మంది ఉన్నారు. ఈ లెక్కన ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ పోటీ చేయడం కూడా దండగ. అలాంటిది ఇక్కడ ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాపుల పర్వానికి తెరలేపింది.