చంద్రబాబు హమీలతో మోసపోయిన అన్ని వర్గాలూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల సమయంలో 600కు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ మాటలు నమ్మి నష్టపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, మహిళలు.. ఎవరైనా సరే ఉద్యమాలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే వారికి పూర్తి వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పారు. అందుకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కలిసి ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు.