Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ex Minister Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu1
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్‌ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు

సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్‌లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.

YSRCP Leader Perni Nani Slams TDP And Janasena Over Waqf Act2
‘వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’

తాడేపల్లి : వక్ప్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(‍మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్లొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో‌ హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమతేరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదుమా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది42.78% కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది. అయినప్పటికీ జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం.2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లనను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు.

Union Minister Nitin Gadkari Announces Satellite Based Toll Collection Policy to Be Introduced Across the Country3
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!

టోల్ గేట్స్ వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి.. 2019లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ 'గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' (GNSS) తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.జీఎన్ఎస్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఇప్పటికే నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275, హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో అమలు చేశారు. దీనికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయింది. కాగా రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్త శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని గడ్కరీ ప్రకటించారు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత.. వాహనాలు టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఈ విధానం టోల్ వసూళ్ల ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా.. రియల్-టైమ్ లొకేషన్ ట్రాకింగ్ జరుగుతుంది. అంతే కాకుండా వాహనదారుడు ప్రతిరోజూ హైవే మీద 20 కిమీ వరకు టోల్-ఫ్రీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అంటే 20 కిమీ ప్రయాణానికి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది.

Melinda Gates Opens Up About Her Divorce It Was Necessary4
'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్‌..!

ప్రపంచ అపరకుభేరుడు, మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ దంపతులు అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్థి చెబుతూ విడిపోయారు. అయితే దీన్ని అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు బిల్‌గేట్స్‌. ఆ వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించలేదు మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెలిండా తన మాజీ భర్త బిల్‌గేట్స్‌ మాటలకు నేరుగా స్పందించకపోయినప్పటికీ..పరోక్షంగా సమాధానమిచ్చారు. "అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా అభివర్ణించారు. అయితే బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలపై మాట్లాడనని నిర్మోహటంగా చెప్పేశారు. ఎందుకంటే అతనికి తనకంటూ సొంత జీవితం ఉంది. ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అన్నారు." ఎందుకంటే ఆ సమయంలో తానెంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. వివాహం విడిచిపెడుతున్నప్పుడు..చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయన్నారు. 2014లో గేట్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అచ్చం అలాంటి భాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయని అన్నారు. అలాంటి సమయంలో వెంటనే ఇది సరైనది కాదా అని సానుకూలంగా ఆలోచించి..త్వరితగతిన బయటపడాలి లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. అలాగే ఇక్కడ భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదని కూడా చెప్పారు. ఇక్కడ తాను గుర్తించాల్సిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని అందువల్ల తనకు విడిపోవడం అనేది తప్పనిసరి అంటూ మెలిండా విడాకుల తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. కాగా, ఈ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్‌(22)లు ఉన్నారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్‌గేట్స్‌ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రముఖులు పిల్లలు సెటిల్‌ అయిపోయాక విడిపోతున్నారు. మాకు స్పేస్‌ కావాలని కొందరూ..ఇనాళ్లు తన ఉనికే కోల్పోయానని కొందరూ అంటున్నారు. అన్నేళ్లు కలిసి ఉండటానికి.. బాధ్యతలు, పిల్లలు వంటి తదితర కారణాలే గానీ ఎప్పుడో వాళ్ల మధ్య బంధం విచ్ఛిన్నమైందని, అందువల్లే ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదీఏమైనా..ఆ పరిస్థితి ఎదురవ్వక ముందే భాగస్వాముల్లో ఎవ్వరో ఒక్కరో దీన్ని గుర్తించి తమ బంధాన్ని కాపాడుకునే యత్నం చేయాలంటున్నారు. అలాగే మనతో సాగే సహచరులను నిర్లక్ష్యం చేస్తే..వాటి పర్వవసానం చివర్లో ఇలానే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి వయసులో కంటే వృద్ధాప్యంలోనే తోడు ఉండాలని ఆ సమయంలోనే.. అసలైన దాంపత్యం ఇరువురి నడుమ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్‌ సీక్రెట్‌: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?)

Cm Revanth Reddy Warning To Mlas5
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

China Tells Airlines To Suspend Boeing Jet Deliveries6
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్‌ ఆదేశాలు

బీజింగ్‌: అమెరికా-చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ (China–United States trade war) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు (Boeing) చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది. ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.🚨🇺🇸🇨🇳China orders its airlines to halt any further deliveries of Boeing $BA jets as the Trade War with the U.S. heats up.$BA stock is down 3% in reaction to the news. pic.twitter.com/7xjCI0Heru— Jesse Cohen (@JesseCohenInv) April 15, 2025

India Tour Of Bangladesh 2025 For White Ball Series, Schedule Announced7
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్‌ 17న వన్డే సిరీస్‌.. 26న టీ20 సిరీస్‌ మొదలవుతాయి.వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్‌రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్‌మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్‌టీ20 సిరీస్‌ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్‌లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్‌లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్‌కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్‌ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది.ఇంగ్లండ్‌లో భారత పర్యటన షెడ్యూల్‌..తొలి టెస్ట్‌- జూన్‌ 20-24రెండో టెస్ట్‌- జులై 2-6మూడో టెస్ట్‌- జులై 10-14నాలుగో టెస్ట్‌- జులై 23-27ఐదో టెస్ట్‌- జులై 31-ఆగస్ట్‌ 3ఈ సిరీస్‌ తర్వాతే భారత్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్‌ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్‌ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది.వెస్టిండీస్‌ సిరీస్‌ షెడ్యూల్‌..తొలి టెస్ట్‌- అక్టోబర్‌ 2-6 (అహ్మదాబాద్‌)రెండో టెస్ట్‌- అక్టోబర్‌ 10-14 (కోల్‌కతా)ఈ సిరీస్‌ తర్వాత భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్‌ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీఅక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్‌ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్‌..తొలి టెస్ట్‌- నవంబర్‌ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్‌- నవంబర్‌ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్‌ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్‌ 3 (రాయ్‌పూర్‌)మూడో వన్డే- డిసెంబర్‌ 6 (వైజాగ్‌)తొలి టీ20- డిసెంబర్‌ 9 (కటక్‌)రెండో టీ20- డిసెంబర్‌ 11 (ఛండీఘడ్‌)మూడో టీ20- డిసెంబర్‌ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్‌ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్‌ 19 (అహ్మదాబాద్‌)

Vaishnavi Gowda and Anukool Mishra look ethereal in their engagement8
వ్యాపారవేత్తతో బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌ : ఫోటోలు వైరల్‌

ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్‌ పాపులర్‌ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. తన నిశ్చితార్థం చిత్రాలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అభినందనలు వెల్లువెత్తాయి. ‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వైష్ణవి గౌడ. సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్‌ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.ఈ నిశ్చితార్థ వేడుక కోసం, వైష్ణవి గౌడ భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ అండ్‌ గోల్డెన్‌ కలర్‌ లెహంగాలో అందంగా ముస్తాబైంది. సీక్విన్, బీడ్‌వర్క్, సున్నితమైన జరీతో కూడిన సంక్లిష్టంగా అలంకరించబడిన బ్లౌజ్ ధరించింది. ఇంకా పచ్చరంగు రాళ్ల స్టేట్‌మెంట్ చోకర్ నెక్లెస్‌ను కూడా జత చేసింది. ఇంకా మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకా, స్టేట్‌మెంట్ కడాతన లుక్‌ను మరింత ఎలివేట్‌ చేసింది. మరోవైపు అనుకూల్ మిశ్రా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఐవరీ షేర్వానీలో రాయల్‌ లుక్‌లో అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Vaisshnavi (@iamvaishnavioffl) వైష్ణవి గౌడ గురించి మరిన్ని వివరాలువైష్ణవి గౌడ 1995, ఫిబ్రవరి 20, 1995న జన్మించారు. ఆమె కన్నడ నటి అమూల్యకు ప్రాణ స్నేహితురాలు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్‌ డ్యాన్సర్‌. అంతేకాదు బెల్లీ డాన్సర్ కూడా. గత పదేళ్లకుపైగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. 2011లో 16 సంవత్సరాల చిన్న వయసులో వైష్ణవి తన మొదటి షో 'దేవి' చేసింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిని వై ష్ణవి వరుస ఆఫర్లను దక్కించుకుంది. అయితే, ఆమె 2013 షో 'అగ్నిశాక్షి' బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో కూడా పాల్గొంది.

Tamanna Bhatia Interesting Comments In Odela 2 Pre Release Event9
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది కేవలం ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ సారి లేడీ ఓరియంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఓదెల-2 ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.రిలీజ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరోయిన్‌ తమన్నా కూడా హాజరైంది. ఈ సందర్భంగా తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరో శర్వానంద్‌తో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టింది. కాగా..ఈ ఈవెంట్‌కు శర్వానంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తమన్నా మాట్లాడుతూ.. 'శర్వానంద్‌తో తాను ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇప్పటివరకు కలిసి పని చేయలేదు. సంపత్‌నంది గారితో మీరు నెక్ట్స్ సినిమా చేయాలని కోరుకుంటున్నా. త్వరలోనే మీతో కలిసి సినిమా చేయాలని ఉంది' అని అన్నారు. కాగా.. అశోక్ తేజ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Congress Leaders Counter On Kotha Prabhakar Reddy Comments10
‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్‌ వార్‌.. కాంగ్రెస్‌ రియాక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్‌ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్‌ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్‌ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్‌ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్‌, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement