Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

BJP announces alliance with AIADMK in Tamil Nadu1
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘ఏడీఎంకే అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం. పొత్తు కోసం ఏడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చ ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌ గా మారింది. తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయంఈ పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా కె పళనిస్వామి అని అమిత్‌ షా ప్రకటించారు. అమిత్‌ షా మాట్లాడుతూ.. 1998 నుంచి ఏఐఏడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పని చేశారు. ఎన్డీఏ భాగ్వస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. కచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

CM Chandrababu Naidu Shocking Comments On Schemes2
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’

ఏలూరు జిల్లా: గతేడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా కాల గర్భంలో కలిపేసే యత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే.. మరి చంద్రబాబేమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘అప్పులు పుట్టడం లేదు’’ అపి ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది’ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజవర్గం అగిరపల్ల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అప్పు తేవాలన్నా.. ఇచ్చేవాడులేడు.. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే.. డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు.అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అని ఒకవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు చంద్రబాబు.

Sonali Bendre Ditched Wig At Airport To Face Amid Cancer Treatment3
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన

కొన్నిపరిస్థితులు సమాజం ముందుకు రాలేని విధంగా చేస్తాయి. అవమానకరంగా ఉంటాయి. మన తప్పిదం కాకపోయినా..అభ్రతభావంతో ఉండాల్సి వస్తుంటుంది. కొన్ని అనారోగ్యాలు మనకు సోకాయి అని నోరువిప్పడానికే జంకేలా ఉంటాయి. ఒకవేళ్ల ఆ వ్యాధితో బాధపడుతున్నానంటే ..మనల్ని ఎలా చూస్తారన్న భయం, ఆందోళన వంటివి వెన్నాడుతూనే ఉంటాయి. పైగా వాటి కోసం తీసుకునే చికిత్సల కారణంగా మన రూపం మారుతుంది..ఐతే ఆ ఆకృతితో బయటకు రావాలన్నా..గట్స్‌ ఉండాలి. కానీ అలాంటి సమయంలోనే అసలైన అందం ప్రస్ఫుటంగా బయటకొస్తుందట. అదే అంటోంది బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే.బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్‌ సినిమాలతో ప్రేకక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న తార. టాలీవుడ్‌లో కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఆమె కేన్సర్‌తో పోరాడి గెలిచిన గ్రేట్‌ వారియర్‌ కూడా. ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు నాలుగో దశ మెటాస్టాటిక్ కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యాక..ట్రీట్‌మెంట్‌ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడూ..ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులను ఎదుర్కొనాల్సి ఉంది. అయితే కీమోథెరపీ కారణంగా జుట్టు ఉండదన్నవిషయం తెలిసిందే. అందువల్ల సోనాలి ముందుగానే ఆ టైంకి ధరించాల్సిన విగ్‌ తదితరాలను ఏర్పాటు చేసుకున్నారట. కానీ ట్రీట్‌మెంట్‌ కారణంగా వచ్చిన అలసట కారణంగా ఆ విగ్‌ ధరించే ఓపిక తనలో లేదట. వీల్‌ఛైర్‌లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారట. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని విలేకరుల ముందుకు బట్టతలతోనే వెళ్తా పర్లేదు అని చెప్పేశారట తన సన్నిహితులతో. అలానే వారి ముందుకు రాగానే అక్కడున్న ప్రతి జర్నలిస్ట్‌ చాలా అటెన్షన్‌తో తనకు సహకరించారట. సోనాలి అలానే వచ్చి.. వాళ్లు అడిగే ప్రశ్నలకు మాట్లాడుతుంటే..ఒక ఫోటోగ్రాఫర్‌ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ రూపం అని అన్నారట. అతనెవరో నాకు తెలియదుగానీ ఇప్పటికీ ఆ మాటలు మర్చిపోలేను అంటోంది సోనాలి. అప్పుడే నాకు తెలిసింది మనల్ని మనం అంగీకరిస్తే..ఆటోమేటిగ్గా సమాజం అంగీకరిస్తుంది. మనలోని బలానికి ప్రతీది తలవంచుతుంది అని ఆ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసిందని భావోద్వేగంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ల నుంచి అలాంటి స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. "అందులోనూ ఆ పరిస్థితుల్లో జాలి వంటివి నచ్చవు..కేవలం ధైర్యంగా మాట్లాడే మాటలే ఇష్టమవుతాయి. అంతేగాదు అక్కడున్నవాళ్లంతా ఆ వ్యాధితో చేసిన పోరాటానికి, ఓర్పుకి సెల్యూట్‌ చేయడం మరింత ధైర్యాన్నిచ్చింది. అంటే ఎప్పుడూ మన లుక్స్‌ కాదు అందాన్ని నిర్దేశించేవి..నిశబ్దంగా మనలో అంతర్లీనంగా ఉండే బలమే అసలైన అందం అని తెలుసుకున్నా." అని అంటోంది సోనాలి. అంతేగాదు వ్యాధుల కొరకు తీసుకునే చికిత్సలు కారణంగా వచ్చే మచ్చలు, శారీరక మార్పులు సిగ్గుపడే విషయాలు కావు..నయం అయ్యి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ వారియర్స్‌ అని అర్థం అంటోంది. అలాంటి సమయంలో తీసుకునే విశ్రాంతిని నిరుత్సాహంతో నింపొద్దు..మనస్సులో శాంతిని నెలకొల్పి..మరింత బలంతో ముందుకొచ్చే సమయంగా భావించాలని చెబుతోంది సోనాలి. (చదవండి: యూట్యూబ్ సెన్సేషన్‌ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..)

Moeen Ali To Replace Johnson, De Kock Out: KKRs Probable XI4
సీఎస్‌కేతో మ్యాచ్‌.. కేకేఆర్ స్టార్ ఓపెన‌ర్ పై వేటు! అత‌డి ఎంట్రీ?

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డ‌నుంది. గ‌త మ్యాచ్‌లో ల‌క్నోపై అనుహ్య ఓట‌మి చ‌విచూసిన కేకేఆర్‌.. ఇప్పుడు సీఎస్‌కేపై గెలిచి తిరిగి పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగనున్న‌ట్లు తెలుస్తోంది.వ‌రుస మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మ‌వుతున్న స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌పై వేటు వేయాల‌ని కేకేఆర్ మేనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. అత‌డి స్దానంలో అఫ్గానిస్తాన్ ఓపెన‌ర్ రెహ్మ‌తుల్లా గుర్బాజ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అదేవిధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు పేస‌ర్ స్పెన్స‌ర్ జాన్సెన్‌ను కూడా కేకేఆర్ ప‌క్క‌న పెట్ట‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించ‌నున్న నేప‌థ్యంలో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ మోయిన్ అలీని తుది జ‌ట్టులోకి తీసుకురావాల‌ని కేకేఆర్ కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్న‌ట్లు వినికిడి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో కోల్‌క‌తా 4 పాయింట్ల‌తో ఆరో స్ధానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ నుంచి వైదొల‌గ‌డంతో ధోని మ‌రోసారి చెన్నై జ‌ట్టును న‌డిపించనున్నాడు. సీఎస్‌కేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీల‌కం. ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన సూప‌ర్ కింగ్స్ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జ‌ట్టులో వ‌చ్చే ఛాన్స్ ఉంది.తుది జ‌ట్లు(అంచ‌నా)కేకేఆర్‌రెహ్మ‌తుల్లా గుర్బాజ్‌, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తిసీఎస్‌కేరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), ఆర్‌ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్చ‌ద‌వండి: PSL 2025: వ‌రుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి త‌ప్పుకున్న మ‌రో స్టార్ ప్లేయ‌ర్‌

Ysrcp Shyamala Fires On ITdp For Posting Derogatory5
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల

సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్‌లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు.

PM Narendra Modi Seeks Update On Varanasi Incident6
అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా

వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్‌ కమిషనర్‌ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్‌ కమిషనర్‌, డివిజనల్‌ కమిషనర్‌, డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్‌ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్‌ కమిషనర్‌.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, ఓ యువతిని కిడ్నాప్‌ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్‌ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే రోజు, పోలీసులు పాండేపూర్‌ వద్ద డ్రగ్స్‌ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్‌ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్‌ గంజ్, లాల్‌పూర్‌ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

How a Jharkhand Shopkeeper Ravi Kumar Turns Millionaire With Dream117
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్‌ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్‌ సమీపంలోని తెలియాబండ్‌ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్‌ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్‌ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్‌11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.ఏప్రిల్‌ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్‌ టైటానస్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్‌ ఖాన్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్‌ అయ్యింది. డ్రీమ్‌11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే.. అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్‌ అని తిట్టావ్‌ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.లోకల్‌ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్‌11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్‌ అనిపించుకున్నాడు.Disclaimer: ఈ ఆర్టికల్‌ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్‌, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు

US Justice Department Release Rana-Headley Conversation8
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా

న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్‌ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్‌ ఏ హైదర్‌(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇ‍చ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్‌ మైండ్‌ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్‌ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్‌ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్‌ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు. ముంబై దాడుల్లో భాగస్వాములుడేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ(దావూద్‌ గిలానీ), తహవూర్ హుసేన్‌‌ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్‌ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్‌ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి. ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్‌లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్‌ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్‌గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్‌ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్‌ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్‌ రాణాను తమకు అప్పగించాలని భారత్‌ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్‌ డిసస్టట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది.

TCS to delay salary hike Check what top management said after Q4 results9
జీతాల పెంపు ఇప్పుడు కాదు..

దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్‌వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.బలంగానే నియామకాలువేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది.

Akkada Ammayi Ikkada Abbayi Pradeep Movie Review And Rating Telugu10
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?

టైటిల్‌ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌నిర్మాత: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ఎడిటింగ్: కొడాటి పవన్‌ కల్యాణ్‌దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్‌–భరత్‌కథ, డైలాగ్స్‌: సందీప్‌ బొల్లాసంగీతం: రధన్‌సినిమాటోగ్రఫీ: ఎమ్‌ఎన్‌ బాల్‌రెడ్డివిడుదల: ఏప్రిల్‌ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్‌ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్‌ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌–భరత్‌ దర్శకత్వంలో మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్‌ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్‌ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్‌ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్‌ సుందర్‌) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్‌ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్‌ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్‌రూమ్‌లు నిర్మించాలని సర్పంచ్‌ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్‌ అయిన కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే దర్శకులు నితిన్‌–భరత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్‌ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్‌ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్‌ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్‌ అవుతుంది. ప‌ల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమ‌లో ప‌డ‌టం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని చెప్పచ్చు. క‌థాప‌రంగా సినిమాలో కొత్త‌ద‌నం లేక‌పోయినా గెట‌ప్ శ్రీను, స‌త్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తిసీన్‌లో ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాస‌లు గ‌ట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్‌ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్‌ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్‌ డైలాగ్స్‌, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్‌ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్‌ సీన్‌ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్‌.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెట‌ప్ శ్రీను, స‌త్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్‌ దీపిక తన పాత్రలో బాగా సెట్‌ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్ర‌దీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్‌ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత త‌డ‌బాటుకు లోన‌య్యాడ‌ని చెప్పవచ్చు. ప్రదీప్‌ తల్లిదండ్రులుగా మురళీధర్‌ గౌడ్‌,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్‌ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. సంగీతం, కెమెరామెన్‌ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్‌ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్‌, దీపిక, గెట‌ప్ శ్రీను, స‌త్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు..

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement