Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

CM Chandrababu Govt Bullying Cows Death In TTD1
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్‌మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొ­న్నారు. వైఎస్సార్‌సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్‌ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అప­చా­రాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్‌ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్‌ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్‌ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్‌చల్‌ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు.

US Freezes 2 2 Billion Funding for Harvard after University Defies2
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్‌

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్‌ సర్కారు హార్వాడ్‌ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్‌ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్‌ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్‌ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్‌ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్‌ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

BRS MLA Kotha Prabhakar Reddy Sensational Comments3
రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?

సాక్షి, దుబ్బాక: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Katy Perry And women launched Into space with Blue Origin4
అంతరిక్షంలోకి మహిళల టీమ్‌.. సింగర్‌ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..

అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్‌ కాబోయే భార్య లారెన్‌ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్‌ కింగ్, సినీ నిర్మాత కెరియన్‌ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్‌ ఆయేషా బోవ్‌ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అ‍యితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్‌ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్‌ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025

Reddys lab denied claims reports of layoffs5
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ స్పష్టత

ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 25 శాతం ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉందనే వార్తలపై తాజాగా సంస్థ అధికారికంగా స్పందించింది. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఇలా వస్తున్న వార్తలను ఖండించింది. ఇది అవాస్తవమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలేమీ తీసుకోలేదని వివరించింది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌.. ఎందుకంటే..ఖర్చులను తగ్గుంచుకోవడంలో భాగంగానే కంపెనీ లేఆప్స్ కార్యక్రమాన్ని చేపట్టనుందని ఇటీవల వార్తలొచ్చాయి. కంపెనీలోని రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఏడాదికి కోటి రూపాయల జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు ఆయా వార్తల్లో తెలిపారు. జాతీయ మీడియా సంస్థలతో సహా చాలా ప్రాంతీయ సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. దీనిపై కంపెనీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సంస్థలో సిబ్బంది తగ్గింపు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

Trump New Tariffs with Probe into Pharmaceuticals Semiconductors Imports6
ట్రంప్‌ టార్గెట్‌: ఇక ఔషధాలు, సెమీకండక్టర్ల వంతు

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్‌(Trump) తన పాలనలో ప్రత్యేక మార్క్‌ చూపిస్తున్నారు. తాజాగా ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కొత్త టారిఫ్‌లను విధించేదిశగా ట్రంప్‌ యోచిస్తున్నారని సమాచారం. ఇందుకోసం జాతీయ భద్రతపై వాటి ప్రభావంపై పరిశోధించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.ట్రంప్‌ సర్కారు ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కాత్త టారిఫ్‌లను(tariffs) నిర్ణయించాలన్న నిర్ణయాన్ని 1962 ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ ఆధారంగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చట్టం జాతీయ భద్రతకు అనుగుణంగా పలు ప్రధానమైన వస్తువులపై టారిఫ్‌లను విధించడానికి వీలు కల్పిస్తుంది. దీనిపై ట్రంప్‌ చేపట్టిన పరిశోధన విదేశీ ఉత్పత్తుల విషయంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై ట్రంప్‌ సర్కారు 21 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ గడువు విధించింది. ఔషధాలు, సెమీకండక్టర్ల టారిఫ్‌ల ప్రక్రియ అనేది గతంలో ప్రకటించిన పరస్పర సుంకాల విధానాలను అనుసరించి ఉంటుందని అంటున్నారు.ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాలనేవి దిగుమతి సుంకాలు(Import tariffs) గణీయంగా పెరిగేలా చేశాయి. వీటి కారణంగా నిరుద్యోగంతో పాటు ధరలు పెరగడంలాంటివి జరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. అయితే ట్రంప్‌ మాత్రం తన టారిఫ్‌లను దేశ ఆర్థిక, జాతీయ భద్రతా విధానాలలో ముఖ్యమైన భాగమని చెబుతున్నారు. ట్రంప్ సర్కారు తెలిపిన వివరాల ప్రకారం చైనాతోపాటు ఇతర దేశాల నుండి వచ్చే ఔషధాలు తదితర ఉత్పత్తులు అమెరికాలోని స్థానిక పరిశ్రమలకు హాని కలిగిస్తున్నాయి. అందుకే ఈ విధమైన టారిఫ్‌లు విధిస్తే అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి వీలవుతుందని ట్రంప్‌ భావిస్తున్నారు. కాగా డెమోక్రాట్‌లు, ఆర్థిక నిపుణులు ఈ ట్టారిఫ్‌లు గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీస్తాయని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు ఇది అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పత్తుల సంరక్షణకు దోహదపడుతుందని అంటున్నారు. ఈ టారిఫ్‌ విధానాల కారణంగా చైనాతో అమెరికా వాణిజ్య ఘర్షణలు మరింత తీవ్రం అ‍య్యే అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్‌

Allu Arjun Meet AP Deputy CM Pawan Kalyan7
పవన్‌ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్‌ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్‌ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు.

IPL 2025: Chennai Super Kings defeated the Lucknow Super Giants by 5 wickets8
IPL 2025: చెన్నై గెలిచిందోచ్‌...

మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్‌కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్‌ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్‌లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్‌ మార్‌‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్‌ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్‌ హాఫ్‌ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్‌రమ్‌ (6) అవుట్‌ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్‌ స్కోరర్‌ నికోలస్‌ పూరన్‌ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‌‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్‌ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‌‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్‌ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్‌ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్‌ 10 బంతుల్లో సింగిల్‌ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్‌ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్‌ ఓవర్లో భారీ షాట్‌ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్‌ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్‌ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్‌ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) త్రిపాఠి (బి) అహ్మద్‌ 6; మార్‌‡్ష (బి) జడేజా 30; పూరన్‌ (ఎల్బీ) (బి) కంబోజ్‌ 8; పంత్‌ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 22; సమద్‌ (రనౌట్‌) 20; మిల్లర్‌ (నాటౌట్‌) 0; శార్దుల్‌ (సి) రషీద్‌ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–38–1, అన్షుల్‌ కంబోజ్‌ 3–0–20–1, ఒవర్టన్‌ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్‌ అహ్మద్‌ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) పూరన్‌ (బి) అవేశ్‌ 27; రచిన్‌ (ఎల్బీ) (బి) మార్క్‌రమ్‌ 37; రాహుల్‌ త్రిపాఠి (సి అండ్‌ బి) రవి బిష్ణోయ్‌ 9; జడేజా (సి) మార్క్‌రమ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 7; శివమ్‌ దూబే (నాటౌట్‌) 43; విజయ్‌శంకర్‌ (సి) అవేశ్‌ (బి) దిగ్వేశ్‌ రాఠీ 9; ధోని (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–56–0, ఆకాశ్‌దీప్‌ 1–0–13–0, దిగ్వేశ్‌ రాఠీ 4–0–23–1, అవేశ్‌ ఖాన్‌ 3.3–0–32–1, రవి బిష్ణోయ్‌ 3–0–18–2, మార్క్‌రమ్‌ 4–0–25–1. ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X కోల్‌కతా వేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Chandrababu TDP govt surveillance on YSRCP leader YS Jagan in 2018-199
పెగాసస్‌ నిఘా నిజమే!

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ చెప్పిందే నిజ­మైంది. 2018–19లో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయ­కుల ఫోన్లపై చంద్ర­­బాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోప­ణలు నిజమేనని నిర్ధా­రణ అయింది. భారత్‌లో ఎంపిక చేసిన రాజ­కీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్‌ నం­బర్లపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌­ఎస్‌వో గ్రూప్‌ పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంత­కాలం క్రితం అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తాజాగా వెలు­గులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ బాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. స్పైవేర్‌ నిఘాలో రెండో స్థానంలో భారత్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ స్పైవేర్‌ను రూపొందించిన ఇజ్రా­యెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో, పెగాసస్‌ను ఉపయోగించిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.–2018–19లో భారత్‌లో వందమంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్‌ నంబర్లపై ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూ.58 కోట్లు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెల్లించాయి. –ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1,223 మందిపై నిఘా పెట్టింది. వారిలో వందమంది భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచింది.పెగాసస్‌ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్యభారత్‌: 100, బ్రిటన్‌: 82, మొరాకో: 69, పాకిస్థాన్‌: 58, ఇండోనేసియా: 54, ఇజ్రాయెల్‌: 51, స్పెయిన్‌: 12, నెదర్లాండ్స్‌: 11, హంగేరీ: 8, ఫ్రాన్స్‌: 7, యూకే: 2.అప్పట్లోనే వెల్లడించిన వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్‌ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, నాడు వైఎస్సార్‌సీపీ చెప్పింది నిజమేనని.. మెటా సంస్థ అఫిడవిట్‌ ద్వారా స్పష్టమైంది.అసెంబ్లీలోనే బయటపెట్టిన మమత2018–19లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్‌ను ఉపయోగించిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు కూడా మమతా తెలిపారు. బెంగాల్‌లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలతో.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్‌ ను ఉపయోగించినట్లు స్పష్టమైంది.

RLJP Pashupati Paras breaks NDA ties10
ఎన్డీఏకు షాక్‌.. కూటమి నుంచి ఆర్‌ఎల్‌జేపీ తెగదెంపులు

పట్నా: కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జేపీ) ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంది. సోమవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పరాస్‌ ఈ విషయం ప్రకటించారు. దివంగత రాం విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడే పరాస్‌.అయితే, పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌తో పొసగక లోక్‌ జనశక్తి పార్టీని వీడి బయటకు వచ్చిన పరాస్‌ 2021లో ఆర్‌ఎల్‌జేపీ ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ సారథ్యంలోని లోక్‌ జనశక్తి పార్టీ(రాం విలాస్‌)పార్టీకి ఐదు సీట్లు కేటాయించడంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పరాస్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరాస్‌ సొంత సీటు హజీపూర్‌ సహా ఆ ఐదు సీట్లనూ చిరాగ్‌ పార్టీ గెలుచుకుంది. ఎన్‌డీఏను అంటిపెట్టుకునే ఉన్నా ఆయన పార్టీకి ఇచ్చిన బంగ్లాను ప్రభుత్వం ఖాళీ చేయించి, చిరాగ్‌కు కేటాయించింది. ఈ పరిస్థితుల్లోనే పరాస్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement