అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. ఈ విషయంలో కేంద్రాన్ని లాగి రాజకీయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, బాధితులకు న్యాయం చేసేలా కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.