Chandrababu Naidu government
-
మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..
-
కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్
-
జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం
-
కడప టీడీపీ నేతలకు బాబు మొండిచెయ్యి
-
ఎల్లో మీడియాకు మద్యం కిక్కు తగ్గేలా లేదు..
-
APలో సంక్షేమ పథకాలు తమ పార్టీ వారికే వర్తింపచేయాలని బాబు ప్లాన్
-
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: వైఎస్ జగన్
-
రేషన్ డోర్ డెలివరీని నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం
-
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థుల ఆగ్రహం
-
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా -
స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
-
LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం
-
Sudarshan Reddy: హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని పచ్చ ఖాకీలు
-
పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడిన TDP గుండాలు
-
మహానాడులో చంద్రబాబు ప్రకటన!
-
కల్తీసారా మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం
-
అచ్చోసిన అక్షరాలతో చంద్రబాబుకి చెంచాగిరి చేస్తోన్న ఈనాడు
-
బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబుపై మహిళలు ఫైర్
-
కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు
-
Nagarjuna Yadav: రైతులపై పగ.. పెట్టుబడి సాయం జీరో, రైతు భరోసా జీరో
-
KSR Paper Analysis: ఈరోజు ముఖ్యాంశాలు
-
వందల ఏళ్ల నాటి వృక్షాలు తొలిగించే ప్రయత్నం
-
‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప -
సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్
-
జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు
-
Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్
-
Ambati Rambabu: కేసులు పెట్టి వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతాం
-
చిన్న వర్షానికే .. మునిగిన అమరావతి
-
Varudu Kalyan: లిక్కర్ స్కాం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వమే
-
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు పనులు కేటాయించాలని మునిసిపల్ కమిషనర్‌ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.అంతకు ముందు సురేష్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్‌బాబు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడువునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్‌బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు
-
చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం
-
గుంటూరులోని విద్యా భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు
-
లిక్కర్ మాఫియా డాన్ 'చంద్రబాబే'
సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్ లిక్కర్లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్ హౌస్, హై ఓల్టేజ్ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి. -
ఎవరి కోసం ఈ ఒప్పందం?
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్: 98859 83526 -
కూలి పనికెళ్తే.. పురుగులమందు తాగి చనిపోయేలా చేసారు
-
ప్రశ్నించే గొంతును నొక్కేద్దామనుకోవడం పొరపాటు
సాక్షి ప్రతినిధి, కడప: ‘నియంతృత్వ పాలన ఈ దేశంలో ఎప్పుడూ మనుగడ సాగించలేదు. విపరీత జనాకర్షణ కలిగిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కారు. ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరిస్తూ ఆమెకు, ఆమె పార్టీకి గుణపాఠం చెప్పారు’ అని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో గనులు ధారాదత్తం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన వారినంతా అణిచివేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి గురయ్యారన్న విషయం వారికి తెలియంది కాదు. చరిత్ర ఎన్నిమార్లు గుణపాఠాలు నేర్పినా పాలకులు ఆ పంథా వీడడం లేదు. రాష్ట్రంలో గనులు, భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన వాళ్లకు ధారాదత్తం చేస్తోంది. ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో అధికారులు ఎంతమందికి శిక్ష పడిందో గమనించి కూడా గనులను అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం కన్పించడం లేదు...ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వమే వ్యవస్థను బలహీన పరుస్తోంది. తద్వారా రాబోయే ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వివిధ వర్గాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి గొంతుకగా నిలుస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ పత్రికా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు, పోలీసుల దురుసు ప్రవర్తన, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించడంపై ప్రజల పక్షంగా ‘సాక్షి’ నిలుస్తోంది. ఇలాంటివి మనస్సులో ఉంచుకొని మానసికంగా దెబ్బకొట్టే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను తొక్కిపెట్టారు. మరోవైపు పత్రికల గొంతు నొక్కే చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే పరిస్థితులకు ప్రభుత్వమే దిగడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రూ.9వేల కోట్లు అప్పు కోసం.. ప్రభుత్వానికి రూ.9 వేల కోట్ల అప్పు కోసం దాదాపు రూ.రెండు లక్షల కోట్ల విలువైన 436 రకాల ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు సిద్ధపడటం దురదృష్టకరం. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆ గనుల తవ్వకాలు చేపడితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చవచ్చు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా, చేయకపోయినా వారికున్న స్వేచ్ఛను హరించకుండా ఉంటే అదే పదివేలనిపిస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాటి పరిస్థితిని పాలకులు మరిపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించినప్పటికీ అప్రజాస్వామిక దాడులు ఆగడం లేదు. ఇది ఏమాత్రం సహేతుకం కాదు.నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరికాదునోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటి మీదకు వెళ్లి సోదాలు చేయడం సరికాదు. చట్టం పద్ధతులు, నిబంధనలు పాటించకుండా ఎడిటర్ ఇంట్లో తనిఖీలు చేయడాన్ని జర్నలిస్టులు అంతా ఖండిస్తున్నారు. మా నోరు నొక్కడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. తప్పు చేస్తే నోటీసులిచ్చి పిలిచి అడగాలి కానీ.. నోటీసులివ్వకుండా ముందుగానే సోదాలు చేయొద్దని కోర్టులు కూడా చెబుతున్నాయి. అయినా వీటిని పోలీసులు పాటించడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో పొగిడితే ఓకే... విమర్శిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. – తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్ కాలపరిమితి ముగిసినా రిలీవ్ చేయలేదు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిరెడ్‌బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్ కేసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. వికాట్ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్ చేసిన వికాట్.. భారతీ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్ పాడుతోంది. వైఎస్ జగన్ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్ జగన్ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్ జగన్ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్ ప్రాజెక్టులు, మీడియా, రియల్ ఎస్టేట్ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది. -
మార్గదర్శులను గుర్తించకుంటే జీతాలు కట్!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది! ‘జీరో పావర్టీ పీ–4’ కార్యక్రమం మార్గదర్శులను గుర్తించే బాధ్యతను గ్రామస్థాయిలో చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శుల నెత్తిన పెట్టి చేతులు దులుపుకొంటోంది. లేదంటే జీతాలు కట్ అంటూ బెదిరిస్తోంది. రాష్ట్రంలో 20 శాతం పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చి 2029 నాటికి జీరో పేదరికం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.పేదలకు సాయం చేసేవారిని మార్గదర్శులుగా, లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలుగా ప్రకటించారు. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు మార్గదర్శులను గుర్తించని పక్షంలో పంచాయతీ కార్యదర్శి జీతాలను నిలిపివేస్తామంటూ పలు జిల్లాల్లో అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంపీడీవోలు జారీ చేస్తున్న ఈ నోటీసులతో ఉద్యోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వం తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులపై మోపడం ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సాయంతో కూడుకున్న వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి చెబితే దాతలు ముందుకొస్తారా అని మండిపడుతున్నారు.రెండు నెలలు సర్వే హడావుడి..పీ–4 కార్యక్రమం పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జనవరి–ఫిబ్రవరిలో రెండు నెలలు పాటు ఇంటింటి సర్వేలంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. ఇక మార్చి ఉగాది రోజున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించి అన్ని నియోజకవర్గాల నుంచి పొదుపు మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. మరోవైపు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున పీ–4 సమన్వయకర్తలను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఖజానా నుంచి ఏడాదికి రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది.హామీలపై మభ్యపుచ్చేందుకే..పీ–4 కార్యక్రమం ద్వారా 30 లక్షల పేద కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి. ఒకవైపు ఇప్పటికే అమలవుతున్న పథకాలను నిలిపివేసి పేదల పొట్టగొడుతూ మరోవైపు పీ–4 పేరుతో మభ్యపుచ్చే యత్నాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల దత్తత పేరిట హడావుడి చేయడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్ఆర్) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు ‘ 98481 20105 -
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
సోదాలు అప్రజాస్వామికం
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఇలాంటి ఘటనలు లేవు పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు. నచ్చకపోతే అణగదొక్కుతారా? నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార బలంతో వేధింపులు దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట. ఏముంటాయి అక్షరాలు తప్ప ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి. -
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు
సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం. -
ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara
-
చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే
-
Chandra Sekhar Reddy: మద్యం కేసులో IAS లకు సంబంధం ఏమిటి?
-
రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్
-
నీ నటన సూపర్ బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్
-
వేధించే వారిని విడిచిపెట్టం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచి పెట్టేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులతోపాటు ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు అనైతిక చర్యలు ⇒ చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీపీ చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని ఇక్కడి నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతోపాటు మన పార్టీ ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి మున్సిపాలిటీలో 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. ⇒ అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు మనవాళ్లే. కేవలం నలుగురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలి. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో అత్యంత విలువలతో పని చేస్తున్నారు. మనం మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు... ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాం. ⇒ నాడు కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిచారు. అయినా వారిని లాక్కుని, ఆ చైర్మన్ పదవి పొందాలని చూడలేదు. అందుకే చివరకు అప్పుడు నేను మన తాడిపత్రి ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ గెలిచింది. మనం ఆనాడు అలా అంత విలువలతో కూడిన రాజకీయం చేస్తే.. ఇప్పుడు అదే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఊళ్లోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆయన, ఆయన అనుచరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ⇒ ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నా. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, నన్ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నా. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. వారికి అడుగడుగునా తోడుగా, అండగా నిలబడతాను. ప్రశ్నించకూడదనే నిరంకుశత్వం, డైవర్షన్ ⇒ ఈ రోజు సాక్ష్యాలతో సంబంధం లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. ఏ హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. ⇒ ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకో రోజు సినీ నటి కేసు. ఇలా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం జరుగుతుంది? నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, తమ రూ.36 వేలు ఏమయ్యాయని యువత అడుగుతారు. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి. వ్యవస్థలన్నీ నాశనం.. నిర్వీర్యం ⇒ ఈ రోజు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ప్రధానమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిరీ్వర్యం చేస్తున్నారు. స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా అమలు కావడం లేదు. మన ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందిన గవర్నమెంట్ బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ పక్కాగా విద్యా దీవెన ఇచ్చాం. అలాగే వసతి దీవెన కూడా పక్కాగా అమలు చేశాం. అందుకు విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు.. అలా ఏటా రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. వాటిని మనం ఇచ్చాం. ⇒ ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3,900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వసతి దీవెన లేనే లేదు. ⇒ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. దాన్ని మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. కానీ, కూటమి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా అస్సలు ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ⇒ రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈ రోజు దళారుల పాలయ్యాడు. టమాటా కిలోకు రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. అదే మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, రైతులకు నష్టం జరిగినా, వెంటనే అక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. ఆ సీజన్ ముగిసేలోగానే వారిని ఆదుకునే వాళ్లం. పరిహారం ఇచ్చే వాళ్లం. మనం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇచ్చాం. దాన్ని రూ.26 వేలకు పెంచి ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు. యథేచ్ఛగా అవినీతి ⇒ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం, అది కూడా 30 ఏళ్లు ఇచ్చేలా ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49 చొప్పున మనం ఒప్పందం చేసుకుంటే, అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60తో ఒప్పందం చేసుకుంది. ⇒ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని, ఇంకా లూలూ కంపెనీకి రూ.1,500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ⇒ ఊరూరా బెల్టుషాప్‌లు. మద్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. బాండ్ల పేరుతో కొత్త అవినీతి ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి మొదలుపెట్టారు. ఏపీఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా తాము కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇంత దారుణమైన అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు. మళ్లీ వచ్చేది మనమే.. సినిమా చూపిస్తాం చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఎవ్వరినీ వదిలిపెట్టబోం. ఈ రోజు వారు (చంద్రబాబు, పోలీసులు) దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆ రోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. పట్టుకుని తీసుకొచ్చి సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది. -
‘సాక్షి’పై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. -
మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..
-
ఎక్కడ దాక్కున్నా.. తీసుకొచ్చిమరీ... వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
రైతుల సమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించాలి- ప్రకాశ్ రెడ్డి
-
LIVE: జగన్ అంటే ఏంటో చూపిస్తా... వైఎస్ జగన్ వైల్డ్ ఫైర్
-
భ్రమరావతి మీద పెట్టిన శ్రద్ధ కొంచం రైతులపై కూడా పెట్టండి..
-
ఈసారి అధికారం మనదే: వైఎస్ జగన్
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభిమానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్ విద్యుత్ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజమ్‌గా రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’. -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
-
ప్రజల సొమ్ము గంగపాలు చెయ్యొద్దు!
కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని తప్పులనే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తోంది. తెలంగాణలో నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో భాగంగా అనేక బ్యారేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసి కేసీఆర్ ప్రారంభించారు. ఇదే అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నడుస్తూ 2027 నాటికి పోలవరం ప్రారంభిస్తామని డెడ్ లైన్ ప్రకటించడం ఆందోళనకరం. 2014లో తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే సాకుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీ–ఇంజ నీరింగ్, రీ–డిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి, 2019లో ప్రారంభించారు. 4 ఏళ్ల లోపే, అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 అక్టోబర్ 21న ఏడవ బ్లాకులోని కొన్ని పియర్లు ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. ఏడవ బ్లాక్‌లోని మొత్తం 11 పియర్లను కూల్చి నిర్మించడం తప్ప మరో గతి లేదని జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పేర్కొంది. మళ్లీ నిర్మించినా, మరో బ్లాక్ లోని పియర్ల గేట్లు కుంగిపోవనే గ్యారెంటీ లేదు. అన్నారం,సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా లీకేజీలు, సీపేజీలు బయటపడ్డాయి. ఎన్డీఎస్ఏ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం కుంగిన మేడిగడ్డను పరిశీలించింది. నీటిని నిలువ ఉంచితే ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలో పూర్తి నీటిని ఖాళీ చేయించాలని నాటి సీఎం కేసీఆర్‌కు చెప్పి ఖాళీ చేయించింది. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ మధ్యంతర నివేదిక సంవత్సరం క్రితమే వచ్చింది. ఇటీవలే వచ్చిన పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణంలో గత తెలంగాణ ప్రభుత్వం చేసిన అత్యంత ఘోరమైన తప్పుల నిగ్గు తేల్చింది. దీని ప్రకారం ఇంజ నీరింగ్ ప్రమాణాల ప్రకారం, పునాదులకు సంబంధించిన, ఏ రకమైన భూగర్భ పరీక్షలూ చేయకుండానే నిర్మాణం చేపట్టారు. బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీల నిర్మాణం జరిగింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారేజీలలో ప్రాజెక్టులలో మాదిరిగా భారీ ఎత్తున నీటిని నిలువ చేసింది ప్రభుత్వం. ఇలా చేయడం ప్రమాదకరం. భారీ నీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు దెబ్బతిన్నాయి. పునాదుల కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి, లీకేజీలు నిరంతరం సాగుతున్నాయి. ఆగమేఘాల మీద దోపిడే లక్ష్యంగా సాగిన, ఈ తప్పుడు డిజైన్ వల్ల ఇసుక కొట్టుకుపోవడం నిరంతరంగా సాగుతోంది. స్పిల్‌వే నిట్ట నిలువుగా మూడు ఫీట్ల వెడల్పుతో చీలి పోయి, రెండు చెక్కలైంది. భూమిలో ఐదు అడుగులు లోపలికి కుంగిపోయింది.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా పనికి రావని ఎన్డీఎస్ఏ పేర్కొంది. నీటి ఒత్తిడి ఎక్కు వైనందువల్ల సీకెండ్ ఫైల్స్ కూలిపోయాయనీ, బ్యారేజీ ఎగువ, దిగువ భాగాల్లో భారీ రంధ్రాలు పడ్డాయని తేల్చింది. మూడు బ్యారేజీలకు విస్తృత నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్క డితో ఆగదనీ, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఒక బ్లాక్‌ను కూల్చి పునర్ని ర్మాణం చేస్తే, మరొకటి మళ్లీ కుంగి కూల్చవలసిన ప్రమాదపు అంచులలోకి వెళ్లవచ్చని చెప్పింది. అంటే మూడు బ్యారేజీల నిర్మాణానికి ఖర్చు చేసిన 30 వేల కోట్లు గంగలో కలిసినట్లే. సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని, జియో ఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు చేసి, ఆధునిక హైడ్రాలిక్ నమూనాల (నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనా ల)ను ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. కానీ ఈ పరీక్షలన్నీ చేస్తే ఇంతకంటే ప్రమాదకర తప్పులన్నీ బయటపడతాయి. మూడు బ్యారేజీలలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ అసంబద్ధమైనది. మేడిగడ్డ ముగిసిన అధ్యాయం. పునరుద్ధరణ తెలంగాణను మళ్లీ అప్పుల విష వలయంలోకి ఈడ్చడమే! తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే దీనికి నిజమైన ఏకైక ప్రత్యామ్నాయం. దాన్ని వెంటనే చేపట్టాలి.ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కాళేశ్వరం మేడిగడ్డలో జరిగిన తప్పిదాన్నే పునరుక్తం చేయబోతున్నట్లని పిస్తోంది. పోలవరం పునాది అడుగున 460 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. మేడిగడ్డ లాంటి విపత్తు, పోలవరంలో జరగదని చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు హామీ ఇవ్వగలరా? పోలవరం ప్రాజెక్టు 2027కల్లా ప్రారంభమవుతుందని ప్రకటించడం ద్వారా ఇంజినీర్లను బాబు కూడా డమ్మీలను చేసినట్లే! ఎన్డీఎస్ఏ కాళేశ్వరం బ్యారే జీలపై తుది నివేదిక ఇచ్చింది. పోలవరంపై లోతైన రక్షణ నివేదికను ఎన్డీఎస్ఏ ఇవ్వగలదా? డయాఫ్రమ్ వాల్ కూలిన క్రమంపై ప్రఖ్యాత ఇంజనీర్లు, భూగర్భ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నిశితంగా పరిశోధించారు. చంద్రబాబు ఆ నివేదికలను వెల్లడించాలి.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు -
తి‘రోగ’మనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా కరవవుతోంది. వైద్య రంగంలో ఏఐ, డిజిటల్ నెర్వ్ సెంటర్‌తో అత్యాధునిక సేవలంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ప్రైవేట్‌లో చికిత్సలు చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వాస్పత్రులకు వెళితే అక్కడా జేబుకు చిల్లు పడుతోందని రోగులు లబోదిబోమంటున్నారు. చికిత్స సంగతి దేవుడెరుగు రోగనిర్ధాణ దశలోనే ప్రభుత్వాస్పత్రులు చతికిలపడుతున్నాయి.థైరాయిడ్, హెచ్‌బీఏ1సీ తదితర రక్త పరీక్షలతోపాటు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. బయట చేయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో రోగులపై వైద్య పరీక్షలకే పెనుభారం పడుతోంది. పరీక్షను బట్టి రూ.500 నుంచి రూ.10 వేలపై వరకు రోగులు సొంత ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. పీహెచ్సీ, ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో రూ. లక్షల నుంచి రూ.కోట్ల విలువ చేసే అధునాతన పరికరాలు ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. మైక్రోబయాలజీ ల్యాబ్‌లను రసాయనాల కొరత వేధిస్తోంది. ఉత్తరాంధ్ర వాసులకు తప్పని అవస్థలు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో వైద్య పరీక్షలు అరకొరగానే అందుతున్నాయి. ఇక్కడ ఒకే ఎంఆర్ఐ పరికరం ఉంది. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అందరికీ ఉచితంగా సేవలు అందడం లేదు. అత్యవసర సమయాల్లో రోగులు బయటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాల్సిన దుస్థితి. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మించినా.. ప్రజలకు ఉచితంగా సమగ్ర రోగనిర్ధారణ సేవల కల్పన కోసం గత ప్రభుత్వంలో సిటి డయగ్నోస్టిక్ సెంటర్‌ను విమ్స్ ప్రాంగణంలో నిర్మించారు. నిర్మాణం పూర్తయింది. పరికరాలు సమకూరిస్తే ఖరీదైన వైద్య పరీక్షలు ప్రజలకు అందుతాయి. అయితే కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పీహెచ్సీ, ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో నిర్ధేశించిన మేరకు అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఎక్కడా అందుబాటులో లేవు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో సీటీస్కాన్ పరికరంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి⇒ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలోని ల్యాబ్‌లో థైరాయిడ్, ఇతర రక్త పరీక్షలు చేయడం లేదు. ఈ పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి అంత దూరం వెళ్లలేని రోగులు స్థానికంగానే ప్రైవేట్ ల్యాబ్‌లలో డబ్బు పెట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. ⇒ గిద్దలూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గత ప్రభుత్వంలో అధునాతన రోగ నిర్ధారణ వనరులతో ఏర్పాటు చేసిన ఐసీహెచ్‌ఎల్ ప్రయోగ శాలలో ఆటోమేటెడ్ బయో కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటెడ్ హార్మోన్, యూరిన్ అనలైజర్, రియల్ టైం పీసీఆర్ సహా వివిధ రకాల అధునాతన పరికరాలు ఉన్నా.. సిబ్బంది లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయడం లేదు. ⇒ దర్శి ప్రభుత్వాస్పత్రిలో ఈఎన్టీ, ఆర్ధోపెడిక్ వైద్యులు ఉన్నా పరికరాలు లేక చికిత్స అందడం లేదు. డిజిటల్ ఎక్స్‌రే లేదు. ⇒ నంద్యాల జీజీహెచ్‌లో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. అ్రల్టాసౌండ్, సీటీ స్కాన్ సేవలు అందడం లేదు. ⇒ ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల సీహెచ్‌సీ ప్రయోగశాలలో సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ల్యాబ్‌కు తాళం పడింది. ⇒ ఏలూరు జీజీహెచ్‌లో థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల పరీక్షలను ఎక్కువగా బయటకే రాస్తున్నారు. ⇒ నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో స్కానింగ్ పరీక్షలను ఏరోజుకారోజు చేయడం లేదు.శ్లాట్ పద్ధతిలో రెండు, మూడురోజులకు చేస్తున్నారు. ముగ్గురు రేడియాలజిస్ట్‌లు ఉండాల్సి ఉండగా ఒకరు సెలవులో ఉన్నారు. ఒక్కోరోజు ఒక్కరే ఉంటున్నారు. థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల నిర్వహణకు రసాయనాల కొరత వేధిస్తోంది. హెచ్‌బీఏ1సీ పరీక్షలూ చేయడం లేదు. ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేవు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కె. సూర్యనారాయణ గత నెలలో భూ తగాదా నేపథ్యంలో ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డాడు. గ్రామానికి దగ్గరగా ఉండే విజయనగరం జీజీహెచ్ డెంటల్ విభాగానికి బాధితుడిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వైద్యుడు డెంటల్ ఎక్స్‌రే చేయించాలని సూచించారు. ఫిల్మ్‌లు లేకపోవడంతో ఇక్కడ ఎక్స్‌రే తీయలేమని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. థైరాయిడ్ పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్‌కు.. నరసరావుపేటకు చెందిన వెంకట లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పలు రకాల పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలోని ల్యాబ్‌కు వెళ్లగా థైరాయిడ్ పరీక్ష అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళితే అక్కడ ఉచితంగా చేస్తారని సూచించారు. థైరాయిడ్ పరీక్ష కోసం వ్యయప్రయాసలకోర్చి గుంటూరుకు వెళ్లలేక పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్‌లో డబ్బులు కట్టి ఆమె పరీక్ష చేయించుకున్నారు. -
మెగా పేరుతో ఎందుకీ దగా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవానికి జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ–2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూచనలు చేసింది. ఎన్సీటీఈ 2019 నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 15లో 2007 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదన్న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇచ్చిన సవరణ జీవో నంబర్ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్లయింది. దీనిపై జనరల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్రభుత్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Varudu Kalyani: కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది
-
అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు
-
అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా
-
చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఓపెన్ ఛాలెంజ్
-
కరెంట్ ఛార్జీలు పెంచబోమని.. అధికారంలోకి వచ్చాక పెంచారు: దేవినేని
-
Amarnath: 60 అడుగుల గోడకే దిక్కులేదు అమరావతి కడతాడంట!
-
నాడు జగన్‌పై విష ప్రచారాలు.. నేడు అవినీతి ఒప్పందాలు
-
సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలో చంద్రబాబు వక్రబుద్ధి
-
ఆర్ధిక పరిస్థితిపై మరోసారి చేతులెత్తేసిన తెలంగాణ సర్కార్
-
రే(హీ)టెక్కిన 'కరెంట్ కుంభకోణం'
సాక్షి, అమరావతి: అసలే చీకటి ఒప్పందం.. ఆపై అడ్డగోలు సమర్థన! విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కారు ఆమోద ముద్ర!! యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ నుంచి కారుచౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రూ.లక్ష కోట్ల భారమంటూ కూటమి నేతలు, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కొనేందుకు సిద్ధమై అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన–సౌర హైబ్రీడ్ ప్రాజెక్టు నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా, నాడు ఏపీఈఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపచేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల బాదుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాభేరి కార్యక్రమంలో సంతకాలను సేకరించారు. తక్కువ ధరకే రిలయన్స్ ‘బీబీబీ’.. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమరి్ధంచుకునేందుకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయతి్నంచారు. అది హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు అని.. బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ (బీబీబీ) విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ.3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకొచి్చంది. ఇదే బీబీబీ విధానంలో రోజూ నాలుగు గంటల పాటు పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్‌ను కాదని యూనిట్ రూ.4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ మీడియా దు్రష్పచారం.. రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కారుచౌకగా యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచే వచి్చంది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పిచింది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు దు్రష్పచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నిటినీ ఏపీఈఆర్సీ పటాపంచలు చేసింది. సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది. ఇప్పుడు యాక్సిస్‌కు భారీ ధర చెల్లిస్తూ టీడీపీ కూటమి సర్కారు చేసుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా కిమ్మనకపోవడం గమనార్హం. -
రైతులపై కూటమి నిర్లక్ష్యం YS జగన్ ఆగ్రహం
-
పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్
-
వైఎస్ జగన్ వెళ్లిన చోటుకి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు: అమర్నాథ్
-
పట్టాభిపురం పిఎస్ లో సీమరాజు, కిర్రాక్ ఆర్పీపై ఫిర్యాదు
-
Usha Sri : చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ఈ తప్పుడు కేసులు
-
వృద్ధులు,వికలాంగుల పెన్షనర్లపై టీడీపీ నేతలు కక్ష
-
కుట్టు స్కీమ్.. రూ. 150 కోట్ల స్కామ్!
తొలుత రూ.వంద కోట్లతో మాత్రమే ప్రతిపాదన..! ఆపై అంచనాలు అమాంతం రూ.257 కోట్లకు పెంపు..! టెండర్ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం..! అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులను భారీగా ఉన్నట్టు చూపించి.. అరకొరగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి పరికరాలు, మెషిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకొంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. కంకిపాడు నుంచి సాక్షి ప్రతినిధి: చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. బీసీలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలోనూ రూ.154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేసింది. రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దోపిడీకి తెగబడుతోంది. ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. ఇందులో ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా ఎంత అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశోధనలో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. – అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇది జరిగి 45 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలుకాలేదు. ఆ పేరుతో రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది.టెండర్ల దశ నుంచే మాయాజాలంటెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారని తెలిసిందే. కానీ, అందుకు విరుద్ధంగా.. తక్కువ కోట్ చేసినవారితో పాటు అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. విచిత్రం ఏమంటే.. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండడం. మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.ఎల్1కు 5 శాతమే పని.. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో.. ఎల్2, ఎల్3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు. ఈ రెండు సంస్థలు (ఎల్2, ఎల్3) సిండికేట్ కావడం మరో ట్విస్ట్.శిక్షణ ముసుగులో..ఒక్కో మహిళ (యూనిట్) శిక్షణకు రూ.21,798 కేటాయించారు. ఇందులో టైలరింగ్‌లో శిక్షణ, టైలరింగ్ కేంద్రానికి అద్దె, మహిళకు కుట్టు మిషన్, ఇతర పరికరాల పంపిణీ వంటివి ఉన్నాయి. ఒక్కో మహిళకు 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలి. రోజుకు 4 గంటలు చొప్పున 90 రోజులు, 6 గంటలు చొప్పున 60 రోజులు, 8 గంటలు చొప్పున 45 రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఎక్కడా ఇది అమలవడం లేదు. పైగా శిక్షణకు అవసరమైన టేప్, కత్తెర, స్కేల్ తదితర పరికరాల కిట్‌ను కూడా లబ్ధిదారులనే తెచ్చుకోమంటున్నారు.–కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలైన ఉషా, మెరిట్, సింగార్, పూజా తదితర కంపెనీలవి కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్లో తయారు చేసినవి అంటగడుతున్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లే మిగుల్చుకుంటున్నారు.–శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. కానీ, వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. శిక్షణ కేంద్రాల్లో మహిళలకు తాగు నీరు, బాత్రూమ్ కూడా లేవు. –శిక్షణ చాలాచోట్ల శిక్షణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. శిక్షకులు లేరనో.. లబ్ధిదారులు తగినంతమంది లేరనో చెబుతున్నారు. వాస్తవం ఏమంటే.. అరకొర సెంటర్లు ఏర్పాటు చేసి, అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు కథ నడిపిస్తున్నారు.ప్రముఖ సంస్థలను తోసిరాజని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టడం భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకోవడమేననే ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వ వైఫల్యం.. నిర్లక్ష్యానికి నిలువుటద్దం–సాక్షి క్షేత్ర స్థాయి పరిశీలనలో తేటతెల్లంకృష్ణా జిల్లా కంకిపాడులోని మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ కార్యాలయం పై అంతస్తులోని టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ 140 మందిని ఎంపిక చేసి ఉదయం 70, మధ్యాహ్నం 70 మందికి శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఏప్రిల్ 19న ఉదయం 11 గంటలకు వెళితే 16 మందే ఉన్నారు. మిషన్లు కూడా 20 మాత్రమే. బాగా పాతవైన ఇవి తుప్పుపట్టాయి. వచ్చినవారిలో ముగ్గురు అరగంటలోనే వెళ్లిపోయారు. మరో అరగంటకు 9 మంది వచ్చారు. శిక్షణ లేకపోవడంతో కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. కనీసం క్లాత్ కటింగ్‌కు బల్ల కూడా లేదు. కోలవెన్ను నుంచి రోజూ ఆటోలో వచ్చి వెళ్లడానికి రూ.వంద అవుతోందని పలువురు వాపోయారు. – కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 138 మందిని ఎంపిక చేసినట్టు చెబుతున్నా.. కనీసం కుట్టు మిషన్లు కూడా లేవు. ఈ సెంటర్‌కు ఒక శిక్షకురాలితో పాటు వచ్చింది ఇద్దరే. మచిలీపట్నంలో మరీ చిత్రం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క కేంద్రంలోనూ శిక్షణ మొదలులేదు.ఎమ్మెల్యే కార్యాలయంలోనే శిక్షణ కేంద్రం పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏకంగా తన కార్యాలయంలోనే దర్జీ శిక్షణ కేంద్రం పెట్టుకున్నారు. శిక్షణ ఇవ్వకున్నా ఎవరూ అడగరని, తమ పార్టీ వాళ్లకే ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వొచ్చని ఇలా చేశారని అంటున్నారు. కుట్టు శిక్షణ కేంద్రం ఎక్కడుందని పెనమలూరు ఎంపీడీవో బండి ప్రణవిని వివరణ కోరగా ఎమ్మెల్యే కార్యాలయంలో అని చెప్పడం గమనార్హం.రూ.257 కోట్లు స్కీ (స్కా)మ్ ఇలా.. –మొదట యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.257 కోట్లు ప్రతిపాదించారు–టెండర్లో యూనిట్‌కు రూ.21,500 వంతున 1,02,832 మంది మహిళలకు మొత్తం రూ.221,08,88,000–ఇందులో ఒక్కో కుట్టు మిషన్ రూ.4,300 లెక్కన: రూ.44,21,77,600–ఒక్కొక్కరికి శిక్షణ కోసం రూ.3 వేలు చొప్పున: రూ.30,84,96,000–ఒక్కొక్కరికి కుట్టు మిషన్, శిక్షణ కలిపి: రూ.7,300. ఈ ప్రకారం మొత్తం అయ్యేది 75,06,73,600.–రూ.221,08,88,000 కోట్లలో రూ.75,06,73,600 కోట్లు పోగా 146,02,14,400 స్కామ్ ఒక్క కుట్టు మిషన్‌కు ఏ సంస్థ ఎంతకు కోట్ చేసిందంటే..?–శ్రీ టెక్నాలజీ ఇండియా(ఎల్ఎల్పీ)–హైదరాబాద్ రూ.21,798–సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్–హైదరాబాద్ రూ.23,400–సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్–హైదరాబాద్ రూ.23,500మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి.. పంచుకుందాంనిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధంఒప్పందంలో లేకున్నా రూ.25 కోట్ల అడ్వాన్సులకు ప్రతిపాదనలుమంత్రి సంతకం మాత్రమే మిగిలింది.. తర్వాత పంచుకు తినడమే శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం దండుకునేందుకు సిద్ధంరాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్కీమ్‌కు సంబంధించి టెండర్ ఖరారై ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత రూ.60 కోట్ల అడ్వాన్సుల కోసం ప్రయత్నించి భంగపడిన కాంట్రాక్టర్లు తాజాగా రూ.25 కోట్లను రాబట్టుకోబోతున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు పొలిటికల్ బాస్‌కు రాయబారం పంపి అనుకున్నది సాధించారు. తద్వారా తమ వాటాల వసూలుకు ముఖ్య నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నారని సమాచారం. నీకింత.. నాకింత తరహాలో పంచుకోవడానికి కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేతలు సిద్ధమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులిస్తే తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు ససేమిరా అంటున్నా.. వారిని దారికి తెచ్చుకుని పని చక్కబెట్టడానికి ‘పొలిటికల్ బాస్’ సరే అన్నారని సమాచారం. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా..వాస్తవానికి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించేలా టెండర్లో పేర్కొన్నారు. అంటే.. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. పై నుంచి ఆమోదం లభించడంతో బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ఫైల్ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం రూల్ పొజిషన్‌కు సంబంధించి ఏ కామెంట్లు లేకుండానే యథాతథంగా మంత్రి సవితకు పంపారు. ఆమె సంతకం చేస్తే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇక నీకింత.. నాకింత అని పంచుకోవడమే అని పలు శాఖల సిబ్బంది చెబుతున్నారు. -
బుగ్గమఠం భూముల సర్వే పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు
-
పునఃనిర్మాణ సభతో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు
-
రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్
-
చంద్రబాబు వీడియో ప్లే చేసి.... ఏకిపారేసిన పుష్ప శ్రీవాణి
-
అమరావతిలో బాబు స్పీచ్ ఆసక్తిగా వింటున్న జనం
-
అమరావతి సభలో పాచిపోయిన భోజనం కూటమిపై మహిళలు ఫైర్
-
Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..
-
Narayana Swamy : పెళ్ళికి వెళ్లడంపై పెట్టిన శ్రద్ధ సింహాచలంలో 8మంది చనిపోతే ఉండదా?
-
AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు
-
కంచం లాగేశారు! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్ ఇచ్చినవి అన్నీ కొనసాగుతాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మబలికారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరుద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్ సిక్స్ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామనుకున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతున్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్వర్క్ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడుస్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజకవర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ప్రభుత్వమే చంపేసింది
అన్యోన్యంగా ఉండే ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..అలా వీరి ఆనందానికి తోడుగా యువతి తల్లి, మేనత్త కూడా బయల్దేరారు..సొంత కాళ్లపై నిలదొక్కుకున్న ఆ కుర్రాడు స్నేహితుడితో కలిసి వచ్చాడు.. కుమారులు స్థిరపడడంతో జీవితంలో నిశ్చింతగా ఉన్నాడు ఆ ఉద్యోగి....ఇలా చీకూచింత లేని వీరంతా అప్పన్న నిజరూపాన్ని దర్శించుకుని తరించాలని భావించారు. కానీ, గోడ మృత్యు రూపంలో ఎదురొచ్చింది. కూలి.. జీవితాలను కుప్పకూల్చింది.. ..తన ఇంటితో పాటు భర్త లేని చెల్లెలు కుటుంబానికి అండగా ఉంటున్న యువకుడిని బలిగొంది..కుమారుడికి రేపోమాపో పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి తీరని గుండెకోతను మిగిల్చింది..పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నప్పటికీ భర్తను చూసుకుంటూ ఉన్న భార్యను కుదేలు చేసింది.....ఇప్పుడు ఈ కుటుంబాల మాట ఒక్కటే.. అప్పన్నా ఇక మాకు దిక్కెవరు అని?మధురవాడ, డాబా గార్డెన్స్/ఆరిలోవ (విశాఖ)/అంబాజీపేట: ‘‘మా పిల్లలు, బంధువులను ప్రభుత్వమే చంపేసింది. చందనోత్సవం పుణ్యమా అని సర్కారు మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో నిరాశ నింపింది. ఎన్నికల్లో మా అబ్బాయి ఉమామహేశ్వరరావు బంధువులందరితో టీడీపీకి ఓటు వేయించాడు. చివరకు ఆ ప్రభుత్వమే నా కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’’ అని సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమామహేశ్వరరావు తండ్రి అప్పలనాయుడు, తల్లి శాంతి గుండెలు బాదుకుంటూ విలపించారు. ‘‘సింహాచలం కొండపై నాణ్యత లేని గోడ కట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మా వాళ్ల ప్రాణాలు తీయడానికే అక్కడ గోడ నిర్మించారు. అధికారులు, కాంట్రాక్టర్‌ను జైలుకు పంపాలి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది? గోడ పనుల్లో నాణ్యత చూడలేదా?’’ అని శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలేనికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (28) దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరికి 2022 నవంబరులో వివాహమైంది. ఉమా మహేశ్వరరావు హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో, శైలజ విశాఖ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగులు. అయితే, విశాఖలోని నివాసానికి సమీపంలో ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడినుంచే పనిచేస్తున్నారు. అన్యోన్యమైన ఈ జంటకు దైవ భక్తి ఎక్కువ. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. తరచూ టూర్లు వేస్తుంటారు. ఇటీవలే ఊటీ, కొడైకెనాల్, పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి వచ్చారు. వీకెండ్స్ కచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్తారు. బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో మహేష్, శైలజ సింహాచలం బయల్దేరారు. ఇది తెలిసి హెచ్‌బీ కాలనీలో ఉండే శైలజ తల్లి వెంకటరత్నం (45), మేనత్త గుజ్జారి మహాలక్ష్మి (60) కూడా వారితో పయనమయ్యారు. అప్పన్నను కళ్లారా చూసే తరుణం ఆసన్నం కాగా గోడ రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడి మరణ వార్త తెలిసి అప్పలనాయుడు, శాంతి హతాశులయ్యారు. తమ కుటుంబంలోని నలుగురిని ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడంటూ రోదించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు మంచి ఉద్యోగాలతో స్థిరపడుతున్న సమయంలో అర్థంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.రోడ్డునపడ్డ రెండు కుటుంబాలుఉమామహేశ్వరరావు కుటుంబంలో అతడే పెద్ద దిక్కు. మూడేళ్ల కిందట భర్తను కోల్పోయిన చెల్లి చంద్రకళ ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింట్లోనే ఉంటోంది. అలా రెండు కుటుంబాలకు ఇతడే ఆధారం. ఉమా మహేశ్వరరావు మృతితో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.పెళ్లి చేద్దామనుకుంటుండగా..‘‘విశాఖలో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ పాతిక మందికి ఉపాధి కల్పిస్తున్నా నాన్నా అని మా అబ్బాయి చెప్పేవాడు. దీనికి ఎంతో సంబరపడేవాడిని. వివాహం జరిపించాలనుకునే సమయంలో దేవుడు తీసుకుపోయాడంటూ’’ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు (28) తండ్రి వీర వెంకట సత్యనారాయణ బోరున విలపించాడు. దుర్గాస్వామి విశాఖ సీతమ్మపేటలో ఉంటూ.. సీతమ్మధారలో న్యూ డైమండ్ ఇంటీరియర్స్ దుకాణం నడుపుతున్నాడు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనానికి తమ ఊరికే చెందిన స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (33)తో కలిసి వెళ్లాడు. గోడ కూలిన ఘటనలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి‘‘సింహాచలంలో ఆ గోడ ఇప్పుడు ఎందుకు కట్టారో. నా భర్త ప్రాణాలు తీయడానికేనేమో? వారం క్రితమే నిర్మించారని అందరూ అంటున్నారు. అదీ సరిగా కట్టలేదట. అధికారులు ఏమయ్యారు. వారి నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నేను ఎలా బతకాలి’’ అని స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగం ఉద్యోగి, విశాఖ పాత అడవివరంనకు చెందిన ఎడ్ల వెంకటరావు భార్య మహాలక్ష్మి రోదించారు. పల్పెట్ ఆపరేటర్‌గా అందరితో కలివిడిగా ఉండే వెంకటరావు మృతి చెందడాన్ని సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. చందనోత్సవ స్వామి దర్శనానికి భార్యతో కలిసి వెళ్దామని అనుకున్నా.. చివరకు ఒక్కడే బయల్దేరారు. ‘‘ఒంటరిగా వెళ్లారు. మమ్మల్ని వదిలేశారంటూ’’ మహాలక్ష్మి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి అడవివరం దగ్గర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో హెల్త్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరీ ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉంటున్నారు. ఒకరు ఇంజనీర్ కాగా.. మరొకరు డాక్టర్. ఇటీవలే డాక్టర్‌కు వివాహం చేశారు. ఇక వెంకట్రావు సోదరుడు.. ‘‘ఎవరూ లేని నాకు అన్నయ్యే దిక్కు. ఆయన నన్ను వదిలిపోయాడంటూ’’ రోదిస్తూ సొమ్మసిల్లాడు.డాడీ.. నీ పేరిట అన్నదానం చేయిస్తా అన్నాడు..ఈశ్వర శేషారావు మెట్రో కమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. ఎదిగొచ్చిన కుమారుడు ఉద్యోగం చేసి ఆదుకుంటాడని అనుకుంటున్న సమయంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శేషారావు తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదించారు. ‘మంగళవారం రాత్రి ఫోన్ చేసి డాడీ.. నీ పేరిట సింహాచలం దేవస్థానంలో అన్నదానం చేస్తున్నా అని చెప్పాడు. తెల్లవారేసరికి మాకు దూరమయ్యాడు’ అని వాపోయారు.చందనోత్సవం ముందు పనులు చేయడమేంటి?ఏటా చందనోత్సవానికి వేలాదిమంది భక్తులు వస్తారని తెలుసు. అయినా దర్శనాల తేదీ దగ్గరగా ఉన్న సమయంలో పనులు చేయడం ఏమిటి? ఒకవేళ చేసినా ప్రమాదం ఉందని గ్రహిస్తే వేరే దారిలో భక్తులను పంపించాలి కదా. పోయిన ప్రాణాలను ఎవరు తెస్తారు? ఆ కుటుంబాలకు దిక్కెవరు?– ఐ.నరసయ్యమ్మ, ఉమామహేశ్వరరావు సమీప బంధువుభక్తిభావంతో మెలిగేవారుమహాలక్ష్మి ఎంతో భక్తిభావంతో మెలిగేవారు. అలాంటి వారి ఇంట ఇంత ఘోరమైన దుర్ఘటన జరగడం హృదయాన్ని కలిచివేస్తోంది.– పొట్నూరి సూర్యకుమారి, వెంకోజీపాలెంకళ్లముందు పెరిగిందిమధురవాడలో ఉంటున్న సాఫ్ట్వేర్ దంపతుల మృతుల్లో ఒకరైన శైలజ వెంకోజీపాలెం శెట్టిబలిజ వీధికి చెందిన పైలా కనకరావు, వెంకటరత్నం కుమార్తె. మా కళ్ల ముందు పుట్టి పెరిగిన అమ్మాయి. మూడేళ్ల క్రితమే పెళ్లయ్యింది. ఇంతలోనే ఇంత విషాదం జరిగింది. –అప్పలనర్సమ్మ, శెట్టిబలిజ వీధిప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం : సీపీఎంఇటీవల నిర్మించిన గోడ అత్యంత నాసిరకంగా ఉందని, చిన్న వర్షానికే కూలిపోయిందంటే ఇందులో ఎంత అవినీతి జరిగిందో అధికారులు, ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో అర్థమవుతోందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఘటన నుంచి ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదని.. ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. సింహాచలం చందనోత్సవం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు.రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : సీపీఐసింహాచలం చందనోత్సవం విశాఖ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిందని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసి, కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
చంద్రబాబు, పవన్ అడుగుపెట్టిన నుండి అపశృతులే
-
Simhachalam Incident: రూ. కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
-
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
విజయవాడ: సింహాచలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో. సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతో ప్రమాదం జరిగింది. మూడు, నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు. గోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారు. కొండవాల్లో కాంక్రీట్ వాల్ నిర్మించాలి. ఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు.చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేజీహెహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. కొండపై చాలా గోడలు ఉన్నాయి. అవి ఎందుకు పడుపోలేదు. నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది’ అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయింది . ప్రత్యర్ధుల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి కావాల్సిన పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది. తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్‌పై బురద చల్లాలని చూశారు. చందనోత్సవంలో అపశృతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.మంత్రులు,ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి. ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు , అధికారులు వ్యవహరిస్తున్నారు.వరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు. ఎంక్వైరీల పేరుతో ట్వీట్లు , ప్రకటనలు చేస్తే సరిపోతుందా?.ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ ప్రభుత్వానికి హిందూ ఆలయాల పట్ల, దైవ దర్శనాలకు వచ్చే భక్తుల పట్ల చిత్త శుద్ధి లేదు. ఐదుగురు మంత్రులు రివ్యూలు చేశామన్నారు.మీ రివ్యూలు టిక్కెట్ల పంపకాలు ..ప్రోటోకాల్ దర్శనాల కోసమేనా. భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. మేం పదే పదే హెచ్చరిస్తున్నా .. ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తులు చనిపోయారు. కాశీనాయన క్షేత్రాన్ని కూలదోశారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పడు సింహాచలం చందనోత్సవంలో భక్తులు చనిపోయారు. ఏపీలో దైవదర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా వెళతారనే నమ్మకం లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు ట్వీట్ కు దిమ్మదిరిగే కౌంటర్లు బయటపెట్టిన జర్నలిస్ట్ కృష్ణంరాజు
-
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్సీపీనే.అక్టోబర్‌లోగా బూత్ కమిటీలుమే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది. ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే పార్టీ.. పార్టీయే మీరుమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. ప్రజలకు మరింత చేరువవుదాంబాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతసాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటంచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట -పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం -
AP ఫైబర్ నెట్ క్లోజ్? రోడ్డున పడ్డ ఆపరేటర్లు
-
Amaravati: రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాల భూసేకరణ!
-
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్సీ, లైన్ల మరమ్మతులు, సబ్ స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్ కోసం..భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్ డిమాండ్ ప్రధాన సూచికగా భావిస్తుంటారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్ మహమ్మద్ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..
-
ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది: MLC లేళ్ల అప్పిరెడ్డి
-
లిక్కర్ కేసులో కుట్రలు తప్ప మరేమీ కనిపించడం లేదు: Manohar Reddy
-
జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో... ఎమ్మెల్సీ భరత్ కామెంట్స్
-
మూసివేత దిశగా ఫైబర్‌నెట్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలిగించి.. వారి జీవితాలను రోడ్డున పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో.. వారంతా ఏప్రిల్ 1నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్లి సరిదిద్దడానికి వినియోగించే ఆటోలకు 8 నెలలుగా చార్జీలు చెల్లించకపోవడంతో వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కనీసం ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించలేని పరిస్థితి. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలతో విసుగు చెందిన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గడిచిన 11 నెలల్లోనే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో సమాధానం చెప్పలేక లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ముగ్గురు ఎండీలు మార్పు.. చైర్మన్ రాజీనామాకూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయాన్ని సుమారు 3 నెలలపాటు సీజ్ చేశారు. 10 నెలల్లోనే ముగ్గురు ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్నెట్మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసి మరీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో టెరాసాఫ్ట్‌లో పనిచేసిన వారందరినీ ఉద్యోగంలోకి తీసుకుంది. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా గత ప్రభుత్వం నియామకాలంటూ 800 మందికిపైగా ఉద్యోగాల నుంచి తొలగించింది. సెటాప్ బాక్స్ పాడైపోతే కొత్త బాక్సులు ఇవ్వకపోవడం, ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించకపోతుండంటంతో వినియోగదారులు ఫైబర్ నెట్ సేవలకు దండంపెట్టి ప్రైవేటు సంస్థల కనెక్షన్లకు తరలిపోతున్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆపరేటర్లు లబోదిబోమంటున్నారునేటినుంచి విజయవాడలో ధర్నారాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైబర్‌నెట్ ఆపరేటర్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్‌లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని తీర్మానించుకున్నారు. తక్షణం సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు కొత్త బాక్సులు అందించడం, ఈఎంఐ చార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేట్లర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే టెక్నికల్ సిబ్బందికి జీతాలు అందజేసి తిరిగి విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చేవరకు విజయవాడను వదిలి వేళ్లే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేస్తోంది. -
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్ నేవీతో పాటు ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటుకు కూడా మార్కెట్ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్ విలువ మీద వార్షిక లీజు రెంటల్ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. -
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్ఆర్ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ (డెబిట్ సర్వీస్ రిజర్వ్ ఎకౌంట్) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్ లోపల.. బడ్జెట్ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్ ఇచ్చింది. అంటే.. డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ), వేజ్ అండ్ మీన్స్ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్ అధికారి అయిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్ కుమార్ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్ బాస్ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు ఘరానా మోసం కార్యక్రమం చేపట్టిన అభినయ్ రెడ్డి
-
మాకు అన్యాయం చేయొద్దు బాబుపై డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహం
-
DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
-
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు
-
436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు
-
బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది? బుగ్గన దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు ఆర్ధిక విధానాలపై YSRCP ఆందోళన
-
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్‌పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
కార్యకర్తలే తోలు తీస్తారు జాగ్రత్త.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
చంద్రబాబు మాత్రం 21 ఎకరాలు ఇస్తాడు: YS Jagan
-
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం: YS జగన్
-
LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan
-
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
Margani Bharat: కూటమి పాలనలో స్కీమ్ లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి
-
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా
-
ఊరూపేరు లేని ఉర్సా సంస్థకు 60 ఎకరాలు
-
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్‌బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
పంచుకుతినేందుకే ఉర్సా కంపెనీకి 60ఎకరాలు ఇచ్చారు
-
చేతకానప్పుడు హామీలు ఎందుకు ఇచ్చావు.. బాబుపై కామ్రేడ్ల ఫైర్
-
ఆడపిల్లలు తిరిగే చోట వైన్ షాప్ పెడతారా ?
-
MLC Arun Kumar: కూటమి ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తీవ్రమైంది
-
అధికారంలోకి వచ్చినా మతాల మధ్య చిచ్చు రాజేసేందుకు టిడిపి కుతంత్రం
-
మహిళలపై చేయి వేస్తే తోలు తీస్తామన్న పవన్ ఏం చేస్తున్నారు: బ్రహ్మనాయుడు
-
ట్వీట్ పెట్టి పారిపోవడం కాదు.. రోజా వార్నింగ్
-
RK Roja: పవన్ కళ్యాణ్... దమ్ముంటే రండి
-
గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటున్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాడు వైఎస్ జగన్ టారిఫ్ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్ పరిధిలో నివసించే ఎస్.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్ ఉన్నాయి. కరెంట్ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతుబట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. -
Bandaru Satyanarayana: విశాఖ కూటమిలో ప్రొటోకాల్ వివాదం
-
రాప్తాడు హెలికాప్టర్ ఘటనలో పైలెట్ కు నోటీసులు ఉషశ్రీ చరణ్ రియాక్షన్
-
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని కూటమి ప్రభుత్వం
-
Malladi Vishnu: కూటమి హయాంలోనే తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి
-
నమ్మి ఓట్లు వేస్తే, చంద్రబాబు, నితీశ్, ముస్లింలను మోసం చేశారు : మమత
-
తిరుమలలో మరోసారి బయటపడిన నిఘా వ్యవస్థ వైఫల్యం
-
CPI Ramakrishna: దోచిపెట్టి మళ్ళీ అడుక్కోవడం ఎందుకు?
-
Vadde Sobhanadreeswara: హైపర్ లూప్ రైలు అమెరికా, జపాన్ దేశాల్లోనే లేదు.. కానీ అమరావతికి తెస్తాడంట ..
-
TDP కార్యకర్త మల్లేష్ పట్ల దురుసగా ప్రవర్తించిన MLA రమణపూర్తి పీఏ
-
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం
సాక్షి, అమరావతి: ఎస్సీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గ్రూప్–1లో రెల్లితో సహా 12 ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు, గ్రూప్–2లో మాదిగలతో సహా 18 ఉప కులాలకు 6.5 శాతం, గ్రూప్–3లో మాలలతో సహా 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లను 200 రోస్టర్ పాయింట్లతో సహా రాష్ట్రం యూనిట్‌గా 26 జిల్లాల్లో అమలు చేయనున్నారు. జనాభా గణన అనంతరం జిల్లాల యూనిట్‌గా అమలు చేస్తారు. శాసనసభ భవనం రూ.617.33 కోట్లతో, హైకోర్టు భవనం రూ.766.05 కోట్లతో ఎల్–1 బిడ్డర్లకు అప్పగించేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం నిర్ణయాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, బాల వీరాంజనేయులు, అనితలు సంయుక్తంగా మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – ఆర్డినెన్స్ జారీ కాగానే ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ నోటిఫికేషన్.. స్కూళ్లు తెరిచే నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు.– తాత్కాలిక ఖరారు తేదీ మేరకు మే 2వ తేదీన ప్రధాన మంత్రి చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం.– చేపల వేట నిషేధ సమయంలో భాగంగా మత్స్యకారులకు ఈ నెల 26వ తేదీన రూ.20 వేలు చొప్పున సాయం.– ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.9,000 కోట్ల రుణ సమీకరణకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆమోదం. ఏపీఎండీసీ పబ్లిక్ కంపెనీగా మార్పు. – ఐటీ, డేటా సెంటర్లకు ఎకరం 99 పైసలకే భూమి కేటాయించాలని నిర్ణయం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపు. ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ విస్తరణకు ఆమోదం. – గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, నెల్లూరులో పారిశ్రామిక పార్కు, కొత్తవలసలో గ్రేహౌండ్స్ విభాగం, ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయం.– కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్. కొత్త మైనర్ మినరల్ విధానానికి గ్రీన్ సిగ్నల్రాష్ట్రంలో కొత్త మైనింగ్ విధానానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన విధానంలో 2022 మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ‘ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్’ ఆధారంగా పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ లీజులు ఏడాది మాత్రమే ఉంటాయి. గ్రానైట్, రోడ్ మెటల్ వంటి బిల్డింగ్ మెటీరియల్స్‌కు పాత దరఖాస్తు విధానం కొనసాగనుంది. సిలికా శాండ్, డోలమైట్ వంటి ఇండస్ట్రియల్ ఖనిజాలకు ఉత్పత్తితో అనుసంధానించిన ప్రీమియంతో వేలం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పట్టా, డీకేటీ, అటవీ భూములపై దరఖాస్తుల ద్వారా లీజుల మంజూరు కొనసాగుతుంది. డెడ్ రెంట్లు ఇక నుంచి త్రైమాసికంగా కాకుండా వార్షికంగా సీనరేజి ఫీజుపై సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసే గ్రానైట్, ఇండస్ట్రియల్ మినరల్ లీజులు 20 నుంచి 30 ఏళ్లకు పెంచారు. రోడ్ మెటల్ (క్యాప్టివ్ క్రషింగ్ యూనిట్ల కోసం) లీజులు 15 నుంచి 30 ఏళ్లకు, మిగిలిన ఖనిజాల కోసం 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. కొత్త విధానంలో టన్నేజి ఆధారంగా సీనరేజి ఫీజు వసూలు చేస్తారు. లీజు దరఖాస్తు నుంచి సర్దుబాటు, బదిలీ, పునరుద్ధరణ, ఫిర్యాదుల వరకు అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయనున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న లీజు వివాదాలను పరిష్కరించేందుకు ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్మెంట్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్వీ గోశాలపై తప్పుడు ప్రచారంఎస్వీ గోశాలపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మంత్రులు అనిత, రామానాయుడు అన్నారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షకు విద్యార్థులు వెళ్లేందుకు ఆలస్యం అయిందనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. -
Nandigam Suresh: నా తల్లి,భార్యను కాలితో తన్ని.. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా..
-
అదే బ్లడ్.. అదే బ్రీడ్.. పాత కుట్రకు మళ్లీ పదును!
-
చంద్రబాబు దళిత వ్యతిరేకి: సుధాకర్ బాబు
-
లక్ష ఎకరాలు అమరావతి రాజధానికా? లేక చంద్రబాబు రియల్ ఎస్టేట్ కా?
-
కూకటి వేళ్ళతో సహా పెకలిస్తాం.. బాబుకు నూర్ బాషా సంఘం మాస్ వార్నింగ్