ఎల్బీనగర్-అమీర్పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని.. మెట్రోరైలులో ప్రయాణించారు.