జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్‌ను అక్కడి నుంచి ఎందుకు బరిలోకి దింపలేదని సినీ హీరో మంచు విష్ణువర్థన్‌బాబు ప్రశ్నించారు. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారని ఆయన అడిగారు. చంద్రగిరిని అభివృద్ధి చేస్తే.. అక్కడి నుంచే లోకేశ్‌ను పోటీకి పెట్టచ్చు కదా! అని ఆయన అన్నారు.