చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.