పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది.