వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 87వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం కలిగిరి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కలిగిరి శివారు, కృష్ణారెడ్డిపాళెం, కుడుముల దిన్నెపాడు, తాళ్లపాడు క్రాస్, చిన్న అన్నలూరు, కొండాపురం మండలం మామిడాల పాళెం, జంగాలపల్లిలో గ్రామాల్లో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. ఇప్పటివరకూ ఆయన 1,168.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.