Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Again questioning AP Police Actions in Kutami Prabhutvam1
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం(Red Book Constitution)తో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు... అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP) స్వీప్‌ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైఎస్సార్‌సీపీ కదా?. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై(Ramagiri SI) ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జిమీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది? అని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ, ప్రతి చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో అది పైకి లేస్తుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఉమ్మడి కర్నూలు కేడర్‌ను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ అన్నారు.

She Invited Trouble Allahabad High Court Again In Discussion2
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!

వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్‌ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్‌మేట్‌ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్‌ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్‌ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్‌ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్‌ హైకోర్టు బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా.

Tahawwur Rana Extradition Live Updates3
తహవూర్‌ రాణా అరెస్ట్‌.. తీహార్‌ జైలుకు తరలించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్‌లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్‌ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్‌ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 🚨 BIG BREAKING NEWS26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025తహవూర్‌ రాణాను విచారణ ఇలా ఉండనుంది26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు. తహవూర్‌ రాణాకు శిక్ష పడేది అప్పుడే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది. ఎవరి తహవూర్‌ రాణాపాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి.

TDP MLA Ganta Srinivasa Rao Verbal Abuse On Sanitary Inspector4
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్‌– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

Ambati Rayudu Hits Back At Trolls Over MS Dhoni Remarks5
నేను ఎప్ప‌టికీ ధోనీ ఫ్యాన్‌నే.. ఎవ‌రేమ‌నుకున్నా ఫ‌ర్వాలేదు: రాయుడు

టీమిండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు త‌న వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఇటీవ‌ల త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌-2025లో కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రాయుడు.. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ దిగ్గ‌జం ఎంఎస్ ధోనిని అతిగా ప్ర‌శంసిస్తున్నందుకు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు గుర‌వ‌తున్నాడు.గ‌తంలో సీఎస్‌కే ఆడిన రాయుడు.. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ధోని క్రీజులోకి వ‌స్తే చాలు పోగ‌డ్త‌ల‌తో ముంచెత్తున్నాడు. జట్టుతో, మ్యాచ్‌తో సంబంధం లేకుండా ధోనీ నామస్మరణలోనే అత‌డు మునిగిపోతున్నాడు. అత‌డి అతి కామెంట్రీ చాలా మందికి విసుగు తెప్పిస్తుంది. ఏప్రిల్ 8న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 18 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని క్రీజులోకి వ‌స్తున్న‌ప్పుడు అత‌డిని కత్తి పట్టుకున్న యోధుడితో రాయుడు పోల్చాడు. ధోనీ ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్నట్లు ఉంది. ఆ ఖడ్గం కచ్చితంగా ఫలితం సాధిస్తుంది అని రాయుడు వ్యాఖ్య‌నించాడు. ఆ త‌ర్వాత అత‌డి వ్యాఖ్య‌ల‌కు స‌హ‌చ‌ర హిందీ కామెంటేట‌ర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌంట‌రిచ్చాడు. ధోనీ క్రికెట్‌ ఆడటానికి వచ్చాడు. యుద్ధంలో పాల్గొనడానికి కాదు సిద్దూ త‌న ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అదేవిధంగా అభిమానులు కూడా రాయుడు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు.నేనెప్పటికీ త‌లా ఫ్యాన్‌నేత‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న ట్రోల్స్‌పై రాయుడు స్పందించాడు. ట్రోల్స్ చేస్తున్న వారికి రాయుడు ఎక్స్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. త‌ను ఎప్పుడూ ధోని ఫ్యాన్‌నే అని, ఎవ‌రేమ‌నుకున్నా ప‌ర్వాలేదు అని అంబ‌టి అన్నాడు"నేనెప్ప‌టికీ త‌లా అభిమానినే. ఎవ్వరేం అనుకున్నా, ఎవ్వరేం చేసినా సరే ఈ విషయంలో ఒక్క శాతం కూడా మార్పు రాదు. కాబ‌ట్టి పెయిడ్ పీఆర్ కోసం డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం ఆపేయండి. ఆ డ‌బ్బుల‌ను ఏదైనా ఛారిటీకి ఇవ్వండి. అలా చేస్తే ఎంతోమంది పేద‌ల‌కు సాయం చేసిన వారు అవుతార‌ని" ఎక్స్‌లో రాయుడు రాసుకొచ్చాడు.కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధోని.. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. అయితే ఈమ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి పాలైంది.I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025

Shocking Datails in Bihar Samastipur Sakshi Case6
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్‌.. తండ్రి కోపాగ్నికి బలి

నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్‌ సమస్తిపూర్‌(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్‌ కుమార్‌ సింగ్‌(Mukesh Singh Kumar) రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్‌పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్‌ సింగ్‌ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్‌ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్‌ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్‌ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్‌ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..

AP High Court Angry With Sullurpet Police Granted Relief to Posani7
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.

Jack Movie Review And Rating In Telugu8
Jack Movie Review: ‘జాక్‌’ మూవీ హిట్టా? ఫట్టా?

డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్‌ హిట్‌ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్‌’తో నేడు(ఏప్రిల్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్‌ జాక్‌ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్‌ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్‌ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్‌ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్‌ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్‌ డిటెక్టివ్‌ అఫిషాన్‌ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్‌ ఇండియా ప్రసాద్‌(నరేశ్‌). అఫిషాన్‌ బేగం భానుమతి పేరుతో జాక్‌కి దగ్గరై జాక్‌ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్‌ మనోజ్‌(ప్రకాశ్‌ రాజ్‌)ని కిడ్నాప్‌ చేస్తాడు జాక్‌. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్‌ గ్యాంగ్‌ని జాక్‌ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్‌ ‘రా’ ఏజెంట్‌ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్‌(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?నేనొక శిల్పానని దైవం తుళ్లునా?మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్‌లో బొమ్మరిల్లు భాస్కర్‌ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ తన స్టైల్‌ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్‌.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్‌ సీరియస్‌ సబ్జెక్ట్‌ ఎంచుకొని దానికి కామెడీ టచ్‌ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్‌ సెంటిమెంట్‌ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్‌ని మలిచాడు. ఫస్టాఫ్‌ అంతా ఫన్‌వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్‌గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్‌ సీన్‌ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్‌ ఎపిసోడ్‌ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్‌ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.ఎవరెలా చేశారంటే..డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్‌ ఉన్న జాక్‌ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్‌ కూడా చేశాడు. అయితే జాక్‌ మాటలు, బిహేవియర్‌ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్‌ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. ‘రా’ ఏజెంట్‌ మనోజ్‌గా ప్రకాశ్‌ రాజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మ‌ధ్య ఊగిస‌లాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

American Woman Experiences Periods For Over 1000 Days9
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్‌..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!

సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్‌ రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్‌ పీరియడ్‌ సైకిల్‌) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్‌​ యూజర్‌ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్‌ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్‌రెగ్యులర్‌గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్‌) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్‌ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్‌ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్‌ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

Apple Airlifts 600 Tons Of iPhones From India To US To Avoid Trump Tariffs Report10
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్‌ ఫ్లైట్‌లలో..!

విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్‌ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది.అమెరికా-చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్‌ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్‌ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్‌ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లుభారత్‌లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ యాపిల్‌ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్‌లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్‌ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement