-
నీటి సంరక్షణ అందరి బాధ్యత
కౌటాల(సిర్పూర్): నీటిని సంరక్షించడం అందరి బాధ్యత అని సీడబ్ల్యూసీ కేంద్ర బృందం సభ్యులు సతీశ్‌కుమార్, మోహంత అన్నారు. కౌటాల గ్రామ పంచాయతీ 5వ జాతీయ జల అవార్డుకు ఎంపిక కావడంతో శుక్రవారం సీడబ్ల్యూసీ బృందం సభ్యులు కౌటాలలో పర్యటించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీవో కార్యాలయంలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామ శివారులోని ఫామ్ పాండ్, ఫిష్ పాండ్, అడవి ప్రాంతంలోని కందకాలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో నీటికొరత రాకుండా ఇంకుడు గుంతలు, నీటి నిల్వ కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. నీటి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎంపీవో పూర్ణిమ, మాజీ సర్పంచ్ వొజ్జల మౌనిశ్, పంచాయతీ కార్యదర్శులు సాయికృష్ణ, తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతతో పని చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పనుల అమలులో అధికారులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, ధరణిలో పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో దరఖాస్తుల పరిష్కా రం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ధరణి పోర్టల్, ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రైసు మిల్లులకు సకాలంలో రవాణా చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలో 685 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 37 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి, వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవో సురేశ్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
రెబ్బెన: మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా యూడైస్ నివేదిక ప్రకారం ప్ర భుత్వం 55 పాఠశాలలకు నిధులు మంజూ రు చేసింది. ఇప్పటివరకు కేవలం రాళ్లపేట, మాద్వాయిగూడ పాఠశాలల్లో మాత్రమే పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన చోట నెమ్మదిగా సాగుతున్నాయి. ఫ్లోరింగ్, మరుగుదొడ్ల మరమ్మతు, తాగునీటి కోసం నల్లాల బిగింపు వంటి పనులు చేపడుతున్నారు. చిలుకమర్రిగూడ పాఠశాలలో మరుగుదొడ్ల మరమ్మతులు అసంపూర్తిగానే ఉండగా ఫ్లోరింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. నంబాలలో పాఠశాల భవనం ప్లాస్టింగ్ పనులు చేపడుతున్నారు. రాజారాం, పోతపెల్లి పాఠశాలల భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. రాజారాం పాఠశాలలో మూత్రశాలల పనులు ప్రారంభం కాలేదు. -
యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నత పాఠశాలలో పంపిణీకి సిద్ధంగా ఉన్న దుస్తులు, పాఠ్యపుస్తకాలను శుక్రవారం డీఈవో అశోక్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 685 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,322 మంది బాలికలు, 22,926 మంది బాలురులకు అవసరమైన 1,96,031 మీటర్ల క్లాత్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 18 మండలాల వారీగా పంపిణీ చేసి, జూన్ 10లోగా పాఠశాలలకు అందించాలన్నారు. అలాగే అడ గ్రామ పంచాయతీలోని నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీపీవో భిక్షపతి, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీవో మౌనిక, పీవో చంద్రశేఖర్, కోఆర్డినేటర్ మధుకర్ తదితరులు ఉన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలికెరమెరి(ఆసిఫాబాద్): అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నాణ్యతతో ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పనులను శుక్రవారం డీఈవో అశోక్‌తో కలిసి పరిశీలించారు. ఫ్లోరింగ్ పగిలి, పైకప్పు ఉరుస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని తరగతి గదుల్లో కూడా మరమ్మతులు చేపట్టాలని హెచ్ఎం ఆడే ప్రకాశ్ కోరారు. నిధుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వీవో సంఘం సభ్యులతో మాట్లాడి సక్రమంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మార్సీ కార్యాలయాల నుంచి క్లాత్ తీసుకుని జూన్ 1లోగా విద్యార్థులకు యూనిఫాం అందించాలన్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసిన వారికి డబ్బులు రావడం లేదని, చేయని వారికి వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరుగుదొడ్లు నిర్మించి 15 ఏళ్లు పూర్తవుతున్నా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మంజూరైనట్లు చూపుతున్నా ఖాతాల్లో మాత్రం జమ కాలేదని వారు పేర్కొన్నారు. తక్షణం సమస్య పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఈజీఎస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్వో భరత్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, ఎంపీడీవో కృష్ణారావు, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీవో అంజద్ పాషా, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఏఈ నజీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ ఆదాయం మరింత పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డిపో మేనేజర్ విశ్వనాథ్ అన్నారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదా యం వచ్చిన నేపథ్యంలో సంస్థ ఎండీ సజ్జనా ర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిపో ఉద్యోగులు, కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆదాయం పెంచడంలో ఆర్టీ సీ కార్మికులు, ఉద్యోగుల శ్రమ ఎంతో దాగి ఉందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. మరింత ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్టీఐ సరియా, సిబ్బంది పాల్గొన్నారు. -
నిరుపయోగంగా మరుగుదొడ్లు
దహెగాం: మండలంలో 53 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండగా మన ఊరు– మనబడి కార్యక్రమం కింద మరమ్మతులు చేపట్టారు. ఇదే పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం పనులు ప్రారంభించినా పునాది దశలోనే ఉన్నాయి. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన వాటిని ప్రారంభించలేదు. లోహా, పార్వతిపేట, చినరాస్పెల్లి ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. జూన్‌లో పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు పాత సమస్యలు స్వాగతం పలికే అవకాశం ఉంది. -
‘చలో బస్ భవన్’ జయప్రదం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21న చేపట్టిన చ లో బస్ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం కార్మికులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చే యాలని, చట్టప్రకారం ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2013 కు సంబంధించి పీఆర్సీ బాండ్ల నగదు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖాళీ లు భర్తీ చేసి కార్మికులకు పనిభారం తగ్గించా లని, కారుణ్య నియామకాలు రెగ్యులర్ ప్రా తిపదిక భర్తీ చేయాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి దివాకర్, నాయకులు రాజన్న, అయుబ్, మల్లేశ్, తాజొద్దీన్, కార్మికులు పాల్గొన్నారు. -
పూర్తయ్యేనా..?
‘ఆదర్శ’ పనులు ● జిల్లాలో 685 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ● అమ్మ ఆదర్శ కమిటీలకు నిర్వహణ బాధ్యతలు ● జిల్లాకు రూ.25.50 కోట్లు మంజూరు ● బడుల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ● పలుచోట్ల నత్తనడకన సాగుతున్న వైనంకొనసా..గుతున్నాయి..ఆసిఫాబాద్‌రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పలుచోట్ల నెమ్మదిగా సాగుతున్నాయి. పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసిన చోట్ల మాత్రమే పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. మ రుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఇతర మరమ్మతులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండటంతో సకాలంలో పూర్తి కావడం అనుమానంగా మా రింది. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. తరచూ సమీక్ష నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై ‘సాక్షి’ విజిట్. 685 పాఠశాలల్లో పనులుగత ప్రభుత్వ హయాంలో మన ఊరు– మన బడి కార్యక్రమం కింద 251 పాఠశాలలను ఎంపిక చేసి రూ.75 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 78 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి కాగా.. 173 చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కా రు జిల్లాలోని 685 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు రూ.25.50 కోట్లు కేటా యించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోని స్వయం సహయక సంఘాల సభ్యులు ఈ పనులు చేపడుతున్నారు. 623 బడుల్లో తాగునీటి సౌకర్యం, 202 చోట్ల చిన్న తరహా మరమ్మతులు, 15 ఆర్బన్ స్కూళ్లలో నూతన మరుగుదొడ్లు, 140 గ్రామీణ పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు, 607 చోట్ల ఎలక్ట్రికల్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.1.67 కోట్ల నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. పనుల పూర్తి అనుమానమే..ఎలక్ట్రికల్ పనుల కోసం ఒక్కో రూంకు రూ.25 వేలు వెచ్చిస్తున్నారు. పది మంది విద్యార్థులకు ఒక నల్లా ఏర్పాటు చేయనున్నారు. కిటికీలు, తలుపులు, మరుగుదొడ్ల మరమ్మతులు తదితర పనులు చేపడుతున్నారు. పాత మరుగుదొడ్లలో మరమ్మతుల కోసం ఒక్కో టాయిలెట్‌కు రూ.35వేలు కేటా యించారు. మొత్తం ఈ పనులన్నీ జూన్ 10లోగా పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు కేటాయించిన పాఠశాలల్లో ఒక్కో గదిలో ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాగా.. మిగిలిన గదుల్లో విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. మిగితా అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావడం అనుమానంగా మారింది. నిధుల కొరతతోనూ కొన్నిచోట్ల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది.జూన్ 10లోగా పూర్తి చేస్తాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేసిన పనులకు రూ.1.16 కోట్లు విడుదల చేశాం. జూన్ 10లోగా అన్నిచోట్ల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – అశోక్, డీఈవో -
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తరఫున అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024– 25 సంవత్సరానికి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు 6 నుంచి 18 ఏళ్ల బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు జూలై 31లోగా https://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94914 60658 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఓపీ.. ఇక ఈజీ
● క్యూఆర్ కోడ్ స్కాన్‌తో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ● రోగులకు వేగంగా టోకెన్ నంబర్.. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి సేవలు ● సమయం ఆదా అవుతుందంటున్న వైద్యులుఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్(ఓపీ) రిజిస్ట్రేషన్ మరింత సులభతరం కానుంది. వైద్యం కోసం వచ్చే వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొనే అవసరం లేకుండా పదిరోజుల క్రితం క్యూఆర్ కోడ్ స్కానర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ సమయంలో ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రిలో రద్దీ..జిల్లాలోని ప్రజలకు వైద్యం కోసం ఉన్న ఏకైక ఆధారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రే.. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం తర్వాత ఈ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల నుంచి 300 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం మూడో ఫ్లోర్ పనులు కొనసాగుతున్నాయి. వైద్యం కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికే వస్తుంటారు. రోగులు ఓపీ రికార్డులో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి లైన్లతో నిరీక్షించాల్సి వచ్చేది. ముఖ్యంగా వర్షాకాలంతోపాటు విషజ్వరాలు ప్రబలిన సమయాల్లో ఇక్కడ తీవ్రమైన రద్దీ ఉంటుంది. జ్వరాలతో బాధపడే వారు ఓపీ కోసం నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులకు గురయ్యేవారు. కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి రోగులకు ఓపీ స్లిప్ ఇచ్చేందుకు కొంత సమయం పట్టేది. ఫోన్‌తో స్కాన్ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూఆర్ కోడ్ స్కానర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్ టోకెన్ నంబర్ వస్తుంది. ఆ సంఖ్యను రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద సిబ్బందికి చెబితే వెంటనే ఓపీ స్లిప్ అందిస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదయ్యే ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. -
రైతులకు నష్టం
కాంగ్రెస్ విధానాలతో ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, దీంతో అన్నదాతలకు నష్టం వాటిల్లుతోందని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంతర్రాష్ట్రీయ రహదారిపై నల్లబ్యాడ్జీలు, జెండాలతో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధు రూ.15,000 ఇస్తామని చెప్పి, గతంలో ఇచ్చిన రూ.10వేలు కూడా పూర్తిస్థాయిలో రైతులకు చె ల్లించడం లేదన్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తారని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటున్నారని పేర్కొన్నారు. 2024 ఆగస్టు 15వ తేదీనా.. లేదా 2025 ఆగస్టు 15వ తేదీనా స్పష్టం చేయాలని డి మాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాసంగిలో పండించిన దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిరసనతో జిల్లా కేంద్రంలో గంటవరకు ట్రాఫిక్ నిలిచి పోయింది. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ సర్పంచులు భీమేశ్, శ్రీనివాస్, కిష్టయ్య, నాయకులు సుప్రజ, నిసార్, కుమార్, వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో -
సెలవుల్లో పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేయాల ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో అశోక్‌తో కలిసి సంబంధిత అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024– 25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 685 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమై న తాగునీరు, విద్యుత్, బోర్‌వెల్స్, ఇతర మరమ్మతులు చేపట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేక మూ త్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా యూనిఫాంలు అందించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి భరత్, డీఆర్డీవో సురేందర్, ఇంజనీరింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
దరఖాస్తుల ఆహ్వానం ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతిష్టాత్మక కొండాలక్ష్మ ణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అర్హత గల చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహా య సంచాలకుడు ఎస్.చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల చేనేత కార్మికులు ఈ నెల 20లోగా https://handlooms. nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. ఆగస్టు 7న అవార్డుల ప్రదా నోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 18న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య ప్రణాళిక అధికారి అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తమ నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. -
జూన్ 8న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు జూన్ 8న జిల్లాలో జాతీ య లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో జూన్ 8న ఉదయం 10.30 గంట లకు నిర్వహించే లోక్‌అదాలత్ కార్యక్రమంలో క్రిమి నల్, సివిల్, భూసమస్యలు, వివాహం, కుటుంబ సమస్యలు, మోటర్ వాహనాల ప్రమాద కేసులు, చిట్‌ఫండ్, చెక్‌బౌన్స్ ఇతర అన్ని కేసులను ఇరుపక్షా ల మధ్య రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కాలం వృథా కాకుండా, ఆర్థికంగా కూడా కక్షిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్ మొదటి బెంచ్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్, రెండో బెంచ్‌లో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ్, మూడో బెంచ్‌లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి న్యాయాధికారులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణపై ఈ నెల 17న మధ్యాహ్నం కోర్టు భవన సముదాయంలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్, సెషన్స్ జడ్జి కోర్టు భవనంలో పోలీసు ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, డెంగీ జ్వరంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగీ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ అనే దోమకాటుతో వ్యాప్తి చెందుతుందన్నారు. ఇది చికెన్ గున్యా కంటే ఎక్కువగా శక్తిని హరిస్తుందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేకపోవటంతో నివారణ ఒక్కటే మార్గమన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమకాటు బారిన పడకుండా దోమతెరలు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆదర్శ’లో ప్రవేశాలు
● జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 320 ఇంటర్ సీట్లు ● వందమంది విద్యార్థినులకు హాస్టల్ వసతి ● ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధ్యాపకులుఆసిఫాబాద్రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు వేళైంది. 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఇంటర్మీడియేట్ ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ తెలంగాణ ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి. మోడల్ స్కూళ్లలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పది పాసైన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు స్కూళ్లు.. 320 సీట్లుజిల్లాలో రెండు తెలంగాణ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ పట్టణంతోపాటు సిర్పూర్(యూ)లోని కళాశాలలో సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. మొత్తం 320 సీట్లు భర్తీ చేయనున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక ఉంటుంది. వందమంది బాలికలకు హాస్టల్ వసతి కల్పించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు భోజన సదుపాయం కూడా ఉంటుంది. సీట్ల భర్తీ ఇలా..ఇంటర్మీడియట్‌కు సంబంధించి జిల్లాలోని రెండు మోడల్ స్కూళ్లలో 320 సీట్లు భర్తీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం లేకుండా ఈ నెల 25లోగా http s:// www.tsmodelsc hools.co m/ admissions/ లింక్ ద్వారా వివరాలు సమర్పించాలి. ఈ నెల 27న జాబితా విడుదల చేస్తారు. 29వ తేదీ నుంచి 31 వరకు ధ్రువపత్రాలు పరిశీలించి ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాం, కంప్యూటర్ విద్య, ఐఎఫ్‌పీ డిజిటల్ బోర్డులతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తారు. ఫలితాల్లో సత్తా..కొన్నేళ్లుగా ఇంటర్ వార్షిక ఫలితాల్లో మోడల్ పాఠశాల విద్యార్థులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 2021– 22 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో 28 మంది సెకండియర్ విద్యార్థులు 900లకు పైగా మార్కులు సాధించారు. 2022– 23లో 92 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది కూడా సెకండియర్ ఫలితాల్లో 35 మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు. అక్షయ, పూజిత 983 మార్కులతో జిల్లాలో టాపర్లుగా నిలిచారు. అలాగే నేషనల్ కం మెరిట్ స్కాలర్షిప్, జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సత్తా చాటుతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ప్రవేశాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ పీఎం శ్రీ పథకానికి ఎంపిక కావడంతో రానున్న రోజుల్లో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో కూడిన వసతులు అందుబాటులోకి రానున్నాయి.రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలు...కేటగిరి శాతం సీట్లు జనరల్ బాలికలు జనరల్ 50 20 13 07 ఎస్సీ 15 06 04 02 ఎస్టీ 06 02 01 01 బీసీ– ఏ 07 03 02 01 బీసీ– బీ 10 04 03 01 బీసీ– సీ 01 00 00 00 బీసీ– డీ 07 03 02 01 బీసీ– ఈ 04 02 02 00 -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు క్రీడల్లో రా ణించి ఉన్నతస్థాయికి ఎదగాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడా పాఠశాలలో గురువారం స మ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. డీటీడీవో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర, జాతీ య స్థాయి పోటీల్లో పాల్గొన్న 60 మంది బాలి కలు, 60 బాలికలను ఎంపిక చేసి 15 రోజులపాటు శిక్షణ అందిస్తున్నామన్నారు. క్రీడాకా రులు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఈ శిబి రం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవో క్షేత్రయ్య, హెచ్ఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
వేటగాళ్ల బరితెగింపు!
కౌటాల మండలం మొగడ్దగడ్లో ఎల్ములే జిత్రుకు చెందిన వ్యవసాయ ఎద్దు ఈ నెల 15న గ్రామ శివారులోని చెరువు వద్దకు మేతకు వెళ్లింది. మేత మేస్తుండగా నాటుబాంబు కొరకడంతో నోరు ఛిద్రమైంది. వేటగాళ్లు అడవి పందిని వేటాడేందుకు పెట్టిన నాటుబాంబు పేలి ఎద్దు దవడ భాగం పూర్తిగా దెబ్బతింది. రూ.50 వేల విలువైన వ్యవసాయ ఎద్దుకు తీవ్ర గాయాలు కావడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎద్దును రూ.5 వేలకు కబేళాలకు విక్రయించాడు. కౌటాల(సిర్పూర్): వేటగాళ్లు బరి తెగిస్తున్నారు. అడవి పందులు, ఇతర వన్యప్రాణుల వేటకు ఇష్టారీతిన నాటుబాంబులు వినియోగిస్తున్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి నీరు, ఆహారం కోసం పొలాల వైపు వచ్చే జంతువులను హతమారుస్తున్నారు. ఈ నాటుబాంబులు పశువులు, మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. గ్రామాల శివారు ప్రాంతాల్లోనే విచ్చలవిడిగా నాటుబాంబులు ఏర్పాటు చేస్తుండడంతో రైతులు వేసవి దుక్కులు దున్నేందుకు కూడా ఆందోళన చెందుతున్నారు. మొగడ్‌దగడ్ ఎద్దుకు తీవ్రగాయం కావడం వారిని మరింత భయంలోకి నెట్టింది. యథేచ్ఛగా వేట..జిల్లాలోని తిర్యాణి, కెరమెరి, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, దహెగాం, రెబ్బెన మండలాల్లో అధికంగా అటవీప్రాంతం విస్తరించి ఉంది. కొందరు గ్రూపులుగా ఏర్పడి అడవి పందులు, కొండగొర్రెలు, ఇతర వన్యప్రాణులను నాటుబాంబులతో వేటాడుతున్నారు. అడవి పందుల సంచరించే ప్రాంతాలను పసిగట్టి అవి తినే ఆహారంలో నాటుబాంబులు కలిపి అక్కడక్కడా పడేస్తున్నారు. అటవీ జంతువులు వాటిని కొరకగానే బాంబు పేలుతోంది. రక్తమోడుతూ కొంతదూరం పరిగెత్తి అడవుల్లో ప్రాణాలు వదులుతున్నాయి. కొన్నిచోట్ల వేటగాళ్లు కాపుకాచి అడవి పందులు బాంబు పేలుడుతో గాయపడగానే కత్తులతో చంపుతున్నారు. వీరిలో కొందరు గ్రామ శివారు ప్రాంతాల్లోని చెరువులు, పొలాలను అడ్డా గా చేసుకుని నాటుబాంబులు పెడుతున్నారు. మేత కు వెళ్లిన పశువులు నాటుబాంబులు పేలి మృత్యువాత పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి నాటు బాంబులను రహస్యంగా తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నట్లు సమాచారం. కరెంటు తీగలతో చిక్కులు..వేటగాళ్లు ఎక్కువగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నారు. పంట పొలాలు, చెరువులు, వాగులను అడ్డాగా ఏర్పాటు చేసుకుంటారు. కొన్నిసార్లు విద్యుత్ తీగలను గమనించకుండా రైతులు మృతి చెందిన సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అడవి పందుల మాంసాన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణులు విద్యుత్ తీగలకు చిక్కుకున్నప్పుడు సంబంధిత విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఫ్యూజులు పోతున్నాయి. ఎక్కడ వేట జరిగిందనే విషయం ట్రాన్స్‌కో సిబ్బందికి తెలిసే అవకాశముంది. ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో వేటగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదంవేటగాళ్లు అమర్చుతున్న నాటుబాంబులతో ప్రమాదం పొంచి ఉంది. పొలాల సమీపంలో ఏర్పాటు చేసిన నాటు బాంబులు కొన్నిసార్లు జంతువులు తినకుంటే ఎలుకలు రంధ్రాల్లోకి లాక్కెళ్లే అవకాశం ఉంది. ట్రాక్టర్లతో దుక్కి దున్నే క్రమంలో అవి పేలుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చిలో కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామంలోని జాడి విలాస్‌కు చెందిన వ్యవసాయ ఎద్దు గ్రామ శివారులో మేత మేస్తున్న క్రమంలో నాటు బాంబు పేలింది. రూ.40 వేల విలువైన ఎద్దు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఎద్దు సైతం నాటు బాంబు పేలి చనిపోయింది. ముఖ్యంగా కౌటాల మండలంలో వరుస సంఘటనలతో రైతులను తీ వ్రంగా నష్టపరుస్తున్నాయి. పోలీస్‌శాఖ, అటవీశాఖ అధికారులు స్పందించి వేటగాళ్లపై దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు. వేట నేరం అటవీ జంతువుల వేట చట్టరీత్యా నేరం. నాటు బాంబులతో చంపడం దారుణం. అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న గ్రామాల పరిధిలో వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. విద్యుత్ తీగల అమర్చినా చర్యలు తప్పవు. మొగడ్‌దగడ్ ఘటనపై గురువారం గ్రామంలో విచారణ చేపట్టాం. – ప్రభాకర్, ఎఫ్‌బీవో, కౌటాల చర్యలు తీసుకుంటాం నాటుబాంబు పేలి మొగడ్దగడ్లో ఎద్దు మృతి చెందడం చాలా బాధాకరం. వేటగాళ్లను గుర్తించి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. నాటుబాంబులు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారో తెలుసుకొని, విక్రయదారులపైనా కేసు నమోదు చేస్తాం. – మధుకర్, ఎస్సై, కౌటాల అడవి పందుల వేట కోసం నాటు బాంబులు, విద్యుత్ తీగలు గ్రామాల సమీప ప్రాంతాల్లోనే యథేచ్ఛగా వినియోగం నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు -
అక్రమాలకు ‘చెక్’.. పాత నేరస్తుల బైండోవర్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి పోలీసు శాఖ అక్రమ రవాణాపై నిఘా పెంచింది. అక్రమ రవాణాను అడ్డుకుంటూనే.. మరోవైపు పాత నేరస్తులపై దృష్టి సారించింది. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల్లో మార్గాల్లో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీస్ అధికారులతోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చెక్‌పోస్టుల్లో అత్యధికంగా 182 కేసుల్లో రూ.2.04 కోట్లు పట్టుకుని రాష్ట్రంలోనే జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. వీటితోపాటు రూ.6,54,878 విలువైన 1,315 లీటర్ల లిక్కర్ బాటిళ్లు, రూ.2,40,140 విలువైన 9.588 కేజీల గంజాయి, 14 గంజాయి మొక్కలు పట్టుకున్నారు. రూ.1.75 లక్షల విలువైన 17 మిక్సర్లు, 43 కూలర్లు సీజ్ చేశారు. నేర చరిత్ర కలిగిన వారిని ముందుగానే బైండోవర్ చేశారు. 311 కేసుల్లో గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారు ఉండగా, పాత నేరస్తులు 717 మందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బైండోవర్ చేశారు. 15 మంది వద్ద ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలను సీజ్ చేశారు. -
ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీ
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పలు పీఎంపీ, ఆర్ఎంపీ ఆస్పత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారుల బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పాలచెట్టు, మార్కెట్ ఏరియాల్లో రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయాలపై ఆరా తీశారు. అనుమతి లేకుండా వైద్యం అందించే పీఎంపీ, ఆర్ఎంపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. నమూనా పరీక్షలకు రిజిస్ట్రేషన్మంచిర్యాలటౌన్: టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలి మ్స్ నమూనా పరీక్షల కోసం అభ్యర్థులు రి జిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులకు నమూనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రూప్–1 నమూనా పరీక్షలను ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్ 1, 3 తేదీల్లో, సివిల్ సర్వీసెస్ నమూనా పరీక్షలను హైదరాబాద్‌లో ఈ నెల 23, 26, 28, 30, జూన్ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో https:// tsbcstudycircle. cgg. gov. in/ firstpage. do వెబ్సైట్ ద్వారా సమర్పించాలని, వివరాలకు 08732–221280 నంబరులో సంప్రదించాలని తెలిపారు. దాడి చేసిన పలువురిపై కేసుఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్‌వాడకు చెందిన జాదవ్ గోపాల్‌పై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. పిట్టల్‌వాడకు చెందిన జాదవ్ గోపాల్ బుధవారం దుర్గనగర్ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై పిట్టల్‌వాడకు వస్తుండగా 170 కాలనీకి చెందిన అజయ్ మహకాల్తో పాటు పలువురు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అజయ్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్లుప్తంగా
ఒకరి మృతికి కారకులైన ఇద్దరికి జైలుశిక్షభీమిని: కన్నెపెల్లి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీకి చెందిన చౌదరి వెంకన్న మృతికి కారకులైన ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంచిర్యాల కోర్టు జడ్జి తీర్పునిచ్చినట్లు కన్నెపెల్లి ఎస్సై గంగారం తెలిపారు. లింగాల గ్రామానికి చెందిన చౌదరి వెంకన్న భార్య లక్ష్మి దన్నూరి రాజుతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన వెంకన్న 25 మార్చి 2019లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు చౌదరి మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మదన్మోహన్, కోర్టు కానిస్టేబుల్ గట్టయ్య నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో చౌదరి లక్ష్మికి ఐదేళ్లు, దన్నూరి రాజుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు ఇరువురికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. పిడుగు పడి మహిళకు గాయాలురెబ్బెన: మండలంలోని కొండపల్లిలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు పనిచేస్తున్న మహిళపై పిడుగుపడడంతో గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లికి చెందిన సోన్లే యమూనాబాయి త మ ఇంటి ముందు ఉన్న బావి వద్ద పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పిడుగుపడడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టునెన్నెల: జెండా వెంకటాపూర్ గ్రామంలోని ఎస్కోరి కృష్ణవేణికి చెందిన కిరాణం షాపులో చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెంది దూట శశికాంత్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 2న రాత్రి దుకాణం తలుపులు గడ్డపారతో పగులగొట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించామన్నారు. వేలి ముద్రల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. సింగరేణి రిటైర్డు కార్మికుడు ఆత్మహత్యమందమర్రిరూరల్: ఉరేసుకుని సింగరేణి రిటైర్డు కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి బానయ్య (59) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడి భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన బానయ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
20న ఆలయ భూముల ‘కౌలు’ వేలం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీకేశవనాథస్వామి ఆలయ భూములను సంవత్సరంపాటు కౌలు కోసం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు బ్రాహ్మణవాడ కేశవనాథస్వామి ఆ లయ ఆవరణలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ ఈవో వేణుగోపాల్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ ఫొటోతోపాటు ధరావత్తు సొమ్ము రూ.50 వేల నగదు ముందుగానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలం ముగిసిన వెంటనే నగదును ఆలయానికి చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు. రూ.100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. -
భద్రత భేష్..!
అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం ● ఎస్పీ సురేశ్కుమార్ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో పోలీసులు, ప్రజలతోపాటు అందరి సహకారంతో ఎన్నికల నిర్వహణ విజయవంతమైందని ఎస్పీ సురేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో విధులు నిర్వర్తించామని పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడంతోపాటు మారుమూల పల్లెల్లోనూ కేంద్ర బలగాలతో కవాతులు చేసి ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను వివరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కౌటాల(సిర్పూర్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉండటం, గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎన్నికల సంఘం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తించింది. ఎండల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగినా జిల్లాలో మాత్రం 4 గంటల వరకే గడువు ఇచ్చారు. జిల్లా యంత్రాంగం కృషితో జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పార్లమెంట్ ఎన్నికల క్రతువు విజయవంతంగా ముగిసింది. పటిష్టమైన భద్రత కల్పించడంతో పోలీసుశాఖ సక్సెస్ అయ్యింది. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో.. జిల్లాలో గత అనుభవాల దృష్ట్యా పోలీసు శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే అనేక ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం, సిగ్నల్ సమస్యలు ఉండటంతో అనేక పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎస్పీ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో దాదాపు రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఎస్పీతోపాటు అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, 15 మంది ఎస్సైలు, 30కి మందికి పైగా ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు భద్రతలో పాలుపంచుకున్నారు. వీరితోపాటు 33 సీఆర్ఎస్ సెక్షన్లు, 295 ట్రైనింగ్ పీసీఎస్, టీఎస్ఎస్పీ 15 సెక్షన్లు, మరోవైపు కేంద్ర బలగాలు సైతం పోలింగ్ రోజు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుతోపాటు ముగ్గురి నుంచి ఐదుగురి వరకు మోహరించారు. ఓటర్లకు ముందస్తుగానే చైతన్యవంతం చేయడంతో కొన్ని బూత్‌ల్లో ఒక్కరే విధుల్లో ఉన్న సమస్యలు ఉత్పన్నం కాలేదు. జిల్లాల అగ్రనేతల పర్యటన సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రజలకు భరోసా.. బలగాలతో కవాతు ఎన్నికల్లో ఓటర్లకు భరోసా కల్పించేందుకు మండల కేంద్రాలు, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాల్లో సైతం కేంద్ర బలగాలతో కలిసి 23 ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించారు. కవాతు నిర్వహిస్తూ నిర్భయంగా ఓటు వేయాలని అవగాహన కల్పించారు. సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ గ్రూపులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. మావోయిస్టు, సమస్యాత్మక కేంద్రాలకు జిల్లా కేంద్రం వేగంగా చేరుకునేందుకు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పోలీస్ పరిశీలకులు రాజీవ్‌కుమార్ సక్సెనా సైతం పోలింగ్ రోజు పోలీస్ బందోబస్తును పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సత్ఫలితాలు ఇచ్చిన పోలీసుశాఖ ముందస్తు చర్యలు పెద్ద మొత్తంలో నగదు, మద్యం, గంజాయి సీజ్ సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ -
వాతావరణం
ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినా ఎండ తీవ్రత కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గోదాంకు రిజర్వ్ ఈవీఎంల తరలింపు ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: భారీ బందోబస్తు మధ్య రిజర్వ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాంకు తరలించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బుధవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పట్టణంలోని పీటీజీ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామన్నారు. అలాగే సిర్పూ ర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను కాగజ్‌నగర్ పట్టణంలోని సెయింట్ క్లారిట్ స్కూల్లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామని పేర్కొన్నారు. ఆయా చోట్ల నుంచి రిజర్వ్ ఈవీఎంలను బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల గోదాంకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఈవీఎం గోదాం వద్ద సీసీ కెమెరాల నిరంతరం పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సదయ్య బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సీఆర్పీసీ 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇతరులను రెచ్చగొట్టే ప్రయత్నాలు, ప్రకటనలు చేసినా చర్యలు తప్పవన్నారు. జైనూర్ మండల పరిధిలోని పోలీసులను మోహరించామని, బుధవారం కూడా దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మండల కేంద్రానికి ఇతర గ్రామాల వారు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వ్యక్తిగత కక్షలను ఆసరాగా తీసుకుని లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల ఫొటోలు, వీడియోలు కూడా ప్రచారం చేయడం చట్టవ్యతిరేకమన్నారు. ప్రజలు శాంతిభద్రతల రక్షణకు సహకరించాలని కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్‌గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement