న్యూక్లియర్‌ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్‌ | Sakshi
Sakshi News home page

న్యూక్లియర్‌ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్‌

Published Mon, May 6 2024 2:39 PM

Russia President Vladimir Putin orders nuclear drills amid Ukraine war

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్‌ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో​ అణ్వాయుధాల డ్రిల్స్‌ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్‌ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.

న్యూక్లియర్ డ్రిల్స్‌ చేస్తున్న సమయంలో నాన్‌ స్ట్రాటజిక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్‌ స్ట్రాటిజిక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలను టెక్నికల్‌ వెపన్స్‌ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్‌ గుండా వీటిని ప్రయోగిస్తారు.

కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును  దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్‌ డ్రిల్స్‌ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్‌ డ్రిల్స్‌ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్‌ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement